Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

8 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

పల్లె అందాలు - తీరని ముచ్చట్లు - శ్రీమతి నళిని నారాయణ |మా ఊరు - 49 25.08.2025

పల్లెటూరు అంటేనే పంట పొలాలు, పిల్లల ఆటలు, బతుకమ్మ పాటలు, స్కూల్లో పాఠాలు… వంటివి అన్నీ గుర్తొస్తాయి కదా! స్వచ్ఛమైన మనసులతో, కల్మషం లేని మనుషులు ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవడం... లేత మనసులతో, చిలిపి ఆలోచనలతో చిన్నపిల్లందరూ ఒకదగ్గర కలిసి ఆడుకోవడం వంటివి అన్నీ చూస్తే… ఎంత ముచ్చటగా ఉంటుందో కదా! అచ్చం అటువంటి జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ నళిని నారాయణ గారు ‘మా ఊరు’ కార్యక్రమంలో మనందరినీ మళ్ళీ ఒకసారి మన చిన...

కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక | రాజేష్ సౌందరరాజన్ Part -1 | TALTalks 23.08.2025

ఈ రోజుల్లో చదువు అంటే కేవలం మంచి మార్కులు, గ్రేడ్లు మాత్రమే కాదు. పిల్లల్లో దాగి ఉన్న క్రియేటివిటీని, వారి ఊహాశక్తిని వెలికితీయడం కూడా చాలా ముఖ్యం. ఈ ప్రతిభను వెలికి తీయడానికే 'కథ' సంస్థ ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా నిర్వహించే 'కథా ఉత్సవ్' పిల్లలను రచయితలుగా, కవులుగా మార్చడానికి, వారిలోని కథలు రాసే శక్తిని ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. మరి మీరు కూడా ఈ కథ ఉ...

గ్రీన్ టీ, హెర్బల్ టీ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 58 | TALRadio Telugu 22.08.2025

ఉదయం లేవగానే... కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉందా? అయితే ఇది మీ కోసమే…! ఈ రోజుల్లో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. కాబట్టి చాలామంది టీ లవర్స్ గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ రెండింటిలో ఏది మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది? వాటిని ఎలా తీసుకుంటే పూర్తి పోషకాలు లభిస్తాయి? వంటి ప్రశ్నలు మనలో మెదులుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ… ఎన్నో విషయాలను మనతో పంచుకు...

డిజిటల్ యుగంలోని ఆరోగ్య సమస్యలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 80 20.08.2025

ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాక కంప్యూటర్ లేదా లాప్టాప్ ముందే కూర్చుంటున్నారా? విరామం తీసుకోకుండా అదేపనిగా స్క్రీన్ ను చూస్తూనే ఉన్నారా? డిజిటల్ పరికరాలు లేకుండా రోజు గడవట్లేదా? అయితే జాగ్రత్త…! డిజిటల్ ప్రపంచంలో పని ఒత్తిడితో కూడిన మన జీవనశైలి, శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలకు సరైన సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే అనుపమ ఉప్పలూరి గారి ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ ను తప...

జ్ఞాపకాల గని - మన పల్లెటూరు - బాచరాజు కాంతారావు గారు |మా ఊరు - 48 18.08.2025

బావుల్లో ఈత కొట్టడం, పచ్చటి పొలాల మధ్య ఆడుకోవడం, చుట్టాలు రాసిన ఉత్తరాలు చదవడం… వంటివి వినగానే మనకు వెంబడే గుర్తొచ్చేది అందమైన పల్లెటూరు. అప్పటి బడి, అప్పటి పోస్టాఫీస్... అప్పటి పండుగలు, అప్పటి కుటుంబం… అప్పటి స్నేహితులు ఇవన్నీ మన పల్లెటూరి జ్ఞాపకాలను తట్టి లేపుతాయి కదా..! మరి అటువంటి జ్ఞాపకాలను మళ్ళీ నెమరేసుకుందాం అనుకుంటున్నారా? అయితే బాచరాజు కాంతారావు గారు "మా ఊరు" పాడ్కాస్ట్ లో వీటన్...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఆహార ధాన్యాలు - సంపూర్ణ ధాన్యాలు Vs. శుద్ధి చేసిన ధాన్యాలు Part 2 | Know Your Plate - 57 15.08.2025

మీరు ఏ రకమైన రైస్ తీసుకుంటున్నారు? బ్రౌన్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బ్లాక్ రైస్, బాస్మతి... ఇలా రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నా, వాటిలో ఏది ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తుందో మీకు తెలుసా? ఏ రైస్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి? రోజూ తినడానికి ఏది బెస్ట్? వంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారి సూచనలను ఈ పాడ్కాస్ట్ లో వినండి. Explore the nutritional differences betwee...

వర్షాకాలపు వ్యాధులకు చెక్ పెట్టే ఆహార నియమాలు, ఆయుర్వేద మార్గాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 79 13.08.2025

వర్షాకాలం అంటే అందరికీ ఆనందంగానే ఉంటుంది, కానీ వాటితో పాటు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. మరి, ఈ సమస్యలను అధిగమించి వర్షాకాలాన్ని ఆనందంగా గడపడం ఎలా? అంటు వ్యాధులు ప్రభలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలుగా కొన్ని సులభమైన, సమర్థవంతమైన పరిష్కారాలను సూచిస్తున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పలూరి గారు. మీరు కూడా ఈ జాగ్రత్తల...

ప్రతిభకు పదును పెట్టండి - వంటల్లో సూర్యలక్ష్మి గారి చిట్కాలు- సూర్యలక్ష్మి గారు Part 2 | విజేత 12.08.2025

ప్రతి ఒక్కరి లో ఏదో ఒక ప్రత్యేకమైన నైవుణ్యం ఉంటుంది. దానిని బయటకు తీసినపుడే ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించగలుగుతాం. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ముందుకు ప్రయాణించినపుడే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంటూ… మనకున్న ప్రతిభను వంటల ద్వారా ఎలా బయటపెట్టాలి? ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడంలో మన ఆలోచనలను ఎలా ఉపయోగించాలి? వంటి విషయాలను ఈ పాడ్కాస్ట్ లో సూర్యలక్ష్మి గారు వివరిస్తు...

సంతృప్తికి కొత్త నిర్వచనం: గ్రామీణ జీవనం - శ్రీ వాకా నారాయణరెడ్డి గారు | మా ఊరు - 47 11.08.2025

పల్లెటూర్లు కేవలం ప్రకృతికి ప్రతిరూపాలు మాత్రమే కాదు ... అవి జీవిత పాఠాలను, లోతైన అనుబంధాలను, స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను కూడా కలిగి ఉంటాయి. పల్లె అందాలు, ఆచారాలు, స్వచ్ఛమైన అనుభవాలు అందరి మనస్సులను పులకింపజేస్తాయి. మట్టి పరిమళాల నుంచి మానవ సంబంధాల గొప్పతనం వరకు, స్వచ్ఛమైన ప్రేమను, ఆప్యాయతను పల్లె సంస్కృతిలో భాగంగా చూసిన ప్రముఖ రచయిత వాకా నారాయణ రెడ్డి గారు తమ హృదయంలోని మధురమైన జ్ఞాపకాలను ఈ పాడ్కా...

నైపుణ్యంతో సాగు, టెక్నాలజితో మార్పు - డా|| జి. వి. రామాంజనేయులు గారు Part 2 | TALTalks 09.08.2025

పాత పద్ధతులు వాడటం వల్ల వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయా? కొత్త వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి లాభాలు ఎలా పొందాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఆధునిక టెక్నాలజీ గురించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి, రైతుల ఆర్థిక భద్రత గురించి ఇలా ఇంకా ఎన్నో విషయాల గురించి డా. రామాంజనేయులు గారు చెప్పిన అద్భుతమైన సూచనలు ఈ పాడ్కాస్ట్ లో వినండి. This podcast features Dr. Ramamjaneyulu sharing valuable tips on modern technol...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఆహార ధాన్యాలు సంపూర్ణ ధాన్యాలు Vs. శుద్ధి చేసిన ధాన్యాలు - Part 1 | Know Your Plate - 56 08.08.2025

రోజూ తినే ఆహారంలో చిన్న మార్పులే... ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తాయి! శుద్ధి చేసిన ధాన్యాలకు, సంపూర్ణ ధాన్యాలకు తేడా ఏమిటి? శుద్ధి చేసిన ధాన్యాల స్థానంలో సంపూర్ణ ధాన్యాలు ఎందుకు అవసరం? సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చక్కగా వివరించారు. తప్పక వినండి.. మీ ఆరోగ్య ప్రయాణంలో ఒక మంచి ముందడుగుగా నిలి...

పిల్లల్లో రోగనిరోధక శక్తి - ఆయుర్వేద పద్ధతులు | ఆయుర్వేదం-ఆరోగ్యం 78 06.08.2025

వ్యాధులను దూరంగా ఉంచడానికి బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఎంతో ముఖ్యం. మరి ఈ రోగనిరోధక శక్తి చిన్న పిల్లలలో పెరగటానికి ఆయుర్వేదం ఏమి చెప్తుంది? ఎలాంటి జీవనశైలి అవలంబించాలి? తల్లిపాల వలన వచ్చే లాభాలుఏమిటి? ఏ వయసు వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఎలాంటి చిట్కాలు పాటించటం ద్వారా పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు అనే విషయాలు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నా...

"చిన్నప్పటి నుండి ఏదో చెయ్యాలనే తపన ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది" - సూర్య లక్ష్మి | విజేత 05.08.2025

చిన్నతనం నుండి తనకంటూ స్వంత గుర్తింపు ఉండాలని కలలుకంటూ, తనకు తెలిసిన వంట తోనే ఏదైనా చేద్దాం అని ప్రయత్నించి, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఆరోగ్యకరమైన శాఖాహార వంటకాలు (Healthy Vegetarian Recipes) ఎలా చెయ్యాలో శిక్షణ ఇస్తూ, పలు టీవీ చానెల్స్ లో ఎక్స్పర్ట్ గా వ్యవహరిస్తూ తన జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకున్న సూర్య లక్ష్మి గారి స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Drive...

"నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందరూ వాడాలన్నదే నా ఉద్దేశ్యం" - శ్రీమతి వాకా మాణిక్యం గారు |మా ఊరు - 46 04.08.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒంగోలు పరిసర ప్రాంతమైన వెంగముక్కపాలెం గ్రామానికి చెందిన మాణిక్యం గారితో మాట్లాడుకుందాం. ఆమె ఒక వ్యవసాయ కుటుంబానికి కోడలిగా వెళ్లి, వ్యవసాయం నేర్చుకున్నారు. అలాగే ప్రకృతిపై ప్రేమను పెంచుకొని, మా గృహిణి పేరిట సహజ సిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నారు. ఈమె చిన్ననాటి ప్రయాణం, అసలు ఈ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయా...

రైతే రాజు.. ఇప్పటికీ.. ఎప్పటికీ - డా|| జి. వి. రామాంజనేయులు గారు Part - 1 | TALTalks 02.08.2025

రైతులు మరియు వారి వ్యవసాయం సుస్థిరంగా కొనసాగాలంటే — ఆర్థిక సుస్థిరత, పర్యావరణ సుస్థిరత రెండూ అత్యంత ముఖ్యమైనవి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని ప్రారంభించామని చెబుతున్నారు డా. రామాంజనేయులు గారు. ఆహార భద్రత దేశానికి ఎంత ముఖ్యమో, రైతుల ఆర్థిక భద్రత కూడా అంతే కీలకమని భావించే ఆయన, వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు మరియు ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా సేంద్రియ...

వంటనూనెలు తరచుగా మార్చుతూ ఉండటం మంచిదా? కాదా? Part 2 | Know Your Plate - 55 01.08.2025

Know Your Plate కార్యక్రమంలో భాగంగా గతవారం మనం వంట నూనెలపై చర్చించాం కదా… ఈ వారం కూడా అదే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. చాలామంది ఒకే రకం వంట నూనెని ఎప్పుడూ వాడుతూ ఉంటారు. మరికొంతమంది తరచూ నూనె మార్చుతూ ఉంటారు. మరి ఇందులో ఏది శ్రేయస్కరం? అలాగే రెండు లేక మూడు రకాల నూనెలను కలిపి వాడటం మంచిదేనా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పోడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు....

స్త్రీలలో నెలసరి సమస్యలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 77 30.07.2025

మహిళలకు నెలసరి అనేది ప్రతి నెలా వచ్చి 3 నుండి 7 రోజుల వరకు ఉంటాయి. ప్రతి మహిళకు 30 నుండి 35 సంవత్సరాల పాటు ఈ నెలసరి వస్తూవుంటుంది. కానీ ఈ నెలసరి సమయంలో, అధిక రక్తస్రావం, నొప్పి ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు.. తప్పక వినండి.. అవగాహన పెంచుకోండి Menstr...

"నమ్మకం, నెట్వర్క్..ఈ రెండు విషయాలే లక్షిత ఫౌండేషన్ ను ముందుకు నడిపిస్తున్నాయి" - P.S.N మూర్తి గారు - Part 2 | స్ఫూర్తి కిరణాలు 28.07.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గతవారం లక్షిత వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారితో మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా మూర్తి గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు లక్షితను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎక్కువమందికి ఎలా సాహయం అందించాలనుకుంటున్నారు అనే అంశాలతో పాటు, కమ్యూనిటీ గివింగ్ అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రజలకు, చిన్న చిన్న సాయాలు చేసి, ఎలా ఆనందం పొందొచ్చు? ఫైనాన్సియల్ లిటరసీ మీద...

"సమ్మర్ అనగానే బాగా గుర్తొచ్చేవి .. మామిడి పండ్లు, తాటి ముంజెలు "- దీప్తి మిర్యాల | మా ఊరు - 45 28.07.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నల్గొండకు చెందిన దీప్తి గారిని కలుసుకుందాం. ఆమె ఊరి అందాలు, చిన్ననాటి స్నేహితుల సరదాలు, తమ్ముడితో జరిగే చిన్న చిన్న గొడవలు ఇలా చాలా విషయాలు మనతో పంచుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడిన ఈమె, అంతరించిపోతున్న చేనేతను చిరకాలం ఉండేలా చెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీప్తి గారికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. In this episode of "Maa Ooru," we meet D...

పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు Part -2 | TALTalks - 2 26.07.2025

చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా నిరూపించిన రఘురాం గారితో గత వారం మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా రఘురాం గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు ఈ రీడ్ ఇండియా సెలెబ్రేషన్స్ ఎప్పుడు, ఎలా ప్రారంభమయ్యింది? అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు? అసలు చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో...

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ వంటనూనె వాడాలి? ఎంత వాడాలి? - Part 1 | Know Your Plate - 54 25.07.2025

నూనె లేకుండా వంట చేయడం సాధ్యంకాదు. కానీ.. ఈ వంట నూనెతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. అందుకే వంట నూనెల ఎంపిక చాలా ముఖ్యమైనదని సూచిస్తారు నిపుణులు. మరి.. ఇంతకీ వంటకు ఏ నూనె వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి.. రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచిది అని కొంతమంది చెబుతారు.. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచివి అని ఇంకొంతమంది చెబుతారు.. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ నివృత్తి...

పొట్ట ఆరోగ్యమే.. మన ఆరోగ్యం..- Part 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 76 23.07.2025

ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా గతవారం పొట్ట ఆరోగ్యం, దానికి ఎలా సరిగా ఉంచుకోవాలి అనే విషయాలు మాట్లాడుకున్నాము కదా, అయితే ఈ వారం పొట్ట సరిగా లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? అసలు ఈ సమస్య రాకుండా ఉండటానికి మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి మొదలైన విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు తెలియజేస్తున్నారు. వినండి మరి. As part of the Ay...

"ప్రతి రోజూ గుడి గంటతో నా రోజు ప్రారంభమయ్యేది" - పూజశ్రీ రంగనాథన్ | మా ఊరు - 44 21.07.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం తమిళనాడు లోని హరూర్ గ్రామానికి చెందిన పూజశ్రీ రంగనాథన్ గారిని కలుసుకుందాం. ఒక మారుమూల గ్రామంలో, ఒక ప్రశాంత వాతావరణంలో పెరిగిన ఈమె, ప్రస్తుతం అమెరికాలో మేకోవర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.. అసలు ఈ ప్రయాణం ఎలా సాగింది? తన రోజు ఎలా మొదలయ్యేది, అప్పటి స్నేహితులు, చదువుకున్న స్కూల్ , ఫ్యామిలీ, పేరెంట్స్ ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు .. తప్పక వినండి As part of th...

"నమ్మకం , నెట్వర్క్ ..ఈ రెండు విషయాలే లక్షిత ను ముందుకు నడిపిస్తున్నాయి " - P.S.N మూర్తి గారు Part - 1 | స్ఫూర్తి కిరణాలు 21.07.2025

ప్రతీ మనిషి ఈ భూమి మీదకు రావటానికి ఒక కారణం ఉంటుంది.. దానిని మనం పూర్తి చేసిన తరువాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం.. అందుకే నేను బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ఈ లక్షిత ను స్థాపించాను అంటున్నారు.. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారు. ఈ సంస్థ ముఖ్యంగా విద్య, వైద్యం, పేదవాడి ఆకలి తీర్చడం.. ఈ మూడు అంశాలమీద దృష్టిపెట్టింది.. 5గురు బాలికల విద్యకు సహకరించడంతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 127 మంది బ...

పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు | TALTalks - 01 19.07.2025

పుస్తకాల పట్ల, చదవటం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఒక ఉద్యమంగా, ఉత్సవంగా మారింది.. అదే రీడ్ ఇండియా సెలబ్రేషన్స్. చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘురాం అనంతోజు గారు. ఒక్కడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అంటే, ఆయన లక్ష్యం ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు.. ఈ సంస్థ...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds