Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 1000 episodios

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

No dejes de visitar la web del podcast y apoyar a su creador: podcasters.spotify.com

Autor

Touch A Life Foundation

Categoría

Arts

Web del podcast

podcasters.spotify.com

Último episodio

26 de nov. de 2026

¿Dónde escuchar?

Podcasts en la app Replaio Radio Muy pronto

Los podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts

Descárgala en Google Play Instálala gratis Android 10 M+ de descargas · valoración de 4,7+ iOS muy pronto

Episodios

ఇద్దరు స్నేహితులు మొదలుపెట్టిన సేవా ప్రయాణం ! SJ Foundation | స్పూర్తి కిరణాలు 26.11.2026

సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా తప్పక ఉంటుంది అంటూ పని చేస్తుంది… SJ Foundation! హైదరాబాద్‌కు చెందిన SJ Foundation విద్య, మహిళల అభివృద్ధి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ వంటి ఎన్నో రంగాల్లో పనిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, ఆట స్ధలాలు ఏర్పాటు చేయడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేయడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి ఎన్నో కార్య...

మానవత్వమే అన్నింటికంటే గొప్పది! | అంతరంగాలు - 15 24.11.2026

మతాలు వేరైనా.. మనమంతా ఒక్కటే! మనుషులందరి శ్రేయస్సే ముఖ్యం! అని నమ్మిన షేక్ సుభానీ గారు.. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలతో పాటు బైబిల్, ఖురాన్ వంటి వివిధ పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. ఒక్క సంప్రదాయానికే పరిమితం కాకుండా, భిన్నమైన విషయాలను తెలుసుకుంటూ.. వాటిలోని మంచి విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుంచే తల్లి నేర్పిన విలువలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభావ...

పండుగ వస్తే చాలు ఊరంతా ఒకే చోట ఉండేది! | మా ఊరు - 88 23.11.2026

పండగలు వచ్చాయంటే చాలు.. ఊరంతా ఒకేచోట చేరేది! చిన్ననాటి ఆ సందడే వేరు! సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ ఊరికి వెళ్లడం, బంధువులందరినీ కలుసుకోవడం, కజిన్స్‌తో కలిసి సరదాగా గడపడం.. ఆ రోజుల్లో ఉండే ఆనందమే ప్రత్యేకం. సాయంత్రం వేళల్లో కలుసుకోవడం, పండగల సమయంలో ఊరంతా సందడిగా మారడం.. ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అంటూ.. వాళ్ళ అమ్మమ్మ ఊరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. అక్కడి కుటుంబ సభ్య...

సైబర్ నేరాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? | Special Interview 23.11.2026

స్మార్ట్‌ఫోన్ వాడటం మాత్రమే కాదు.. దాన్ని జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి! ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా, డిజిటల్ సేవలు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. వీటితో పాటు సైబర్ నేరాలు కూడా పెరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క చిన్న పొరపాటు వల్ల మన డబ్బు, పర్సనల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్...

పాముల పట్ల భయం కాదు.. అవగాహన పెంచుకుందాం! | స్పూర్తి కిరణాలు 19.11.2026

పాములను కాపాడటమే కాదు.. వాటి పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని కూడా తొలగిస్తున్నారు! ఈ లక్ష్యంతోనే 1995లో హైదరాబాద్‌లో Friends of Snakes Society ప్రారంభమైంది. అప్పటి నుంచి పాములను సురక్షితంగా కాపాడటంతో పాటు, ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇళ్లలోకి, ఇతర ప్రాంతాల్లోకి వచ్చిన పాములను సురక్షితంగా బయటకు తీసి అడవుల్లో వదిలిపెట్టడంతో పాటు, ప్రజలకు పాములపై అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్...

70 ఏళ్ల వయసులో కూడా సమాజ సేవ ! | అంతరంగాలు - 14 17.11.2026

చదువు, క్రమశిక్షణ, కుటుంబం.. ఇవే ఆయన ఎదుగుదలలో ఎంతో కీలకంగా మారాయి! క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ అధికారి తండ్రి.. పిల్లల ఎదుగుదలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తల్లి. అలాంటి కుటుంబంలో పెరిగిన కృష్ణమణి గారికి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల నుంచి మంచి విలువలు, ప్రోత్సాహం లభించాయి. ఒకవైపు ఆయన సోదరులు దేశ రక్షణ రంగంలో పనిచేస్తుంటే.. మరోవైపు ఆయన టీచింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకుని ఎంతోమందిని విద్యావంతుల్ని చేశారు....

డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? | Health Talk 16.11.2026

స్క్రీన్ చూస్తున్నప్పుడు మీ కళ్లను ఎన్ని సార్లు రెప్పవేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు.. మన రోజులో ఎక్కువ టైమ్ మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లతోనే గడిచిపోతోంది. ఇలా ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, మంట, ఎర్రబడటం, చూపు మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటినే Computer Vision Syndrome లేదా Digital Eye Strain అంటారు. అ...

ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు 12.11.2026

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి! మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని కలిగిస్తాయి! అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమెకు కూడా అలాంటి ఆలోచనే కలిగింది. సమాజంలో తనలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది బాధితుల గురించి తెలుసుకున్నారు. కుటుంబ సహకారం లేకపోవడం, సమాజంలో చిన్నచూపు, ప్లాస్టిక్ సర్జరీపై సరైన అవగా...

అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 2 | అంతరంగాలు - 13 10.11.2026

తన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం! అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సాగిస్తున్న సేవా ప్రయాణం గురించి మొదటి ఎపిసోడ్‌లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఆమె వ్యక్తిగత జీవితం, సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. తక్కువ జీతం వచ్చిన రోజుల్లో కూడా నిరాడంబరంగా ప...

సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం నాకు ఒక ఎమోషన్! | మా ఊరు - 87 09.11.2026

అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు, కొంతకాలం విజయనగరంలో చదువుకున్నారు. వేసవి సెలవులు, దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం వెళ్లేవారట. ఆ ప్రయాణాల్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఉన్న అనుబంధం, రాజమండ్రి దగ్గర్లోని రుచికరమైన ఆహార పదార్థాలు.. ఇలా తన చిన్ననాటి ఎన్నో మధురమైన జ...

చిన్న పిల్లల దంతాలు - తెలుసుకోవాల్సిన విషయాలు! | Health Talk 09.11.2026

పిల్లల దంతాల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చిన్నప్పటి నుంచే పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రషింగ్ అలవాట్లు నేర్పించడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పాల దంతాల సంరక్షణ, పుచ్చుపళ్ల సమస్యలు, ఆహారపు అలవాట్ల ప్రభావం.. ఇలా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల దంత సంరక్షణ గురించి, పళ్ళు ఊడిపోయినపుడు తీసుకోవాల్సి...

అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12 03.11.2026

ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం కావడంతో నడవలేక రోడ్డుపై ఉండటం చూశారు. వెంటనే తన పనిని పక్కనపెట్టి, రిక్షా తీసుకొచ్చి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన మందులు కూడా కొనిచ్చారు. చిన్న వయసులో తాను చేసిన ఈ సహాయమే తన జీవితాన్ని ఎంతో ప్రభావి...

మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86 02.11.2026

చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు. బాల్యంలో స్నేహితులతో గడిపిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అంటూ… వాళ్ళ ఊరు పాలకొల్లు గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ వారం మా ఊరు కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు… ప...

Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special 02.11.2026

ఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది! 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను తల్లుల నుంచి వేరు చేస్తున్న విధానాన్ని చూసి ఎంతో బాధ పడ్డారు. ఆ ఒక్క సంఘటనతో పాలు, పాల ఉత్పత్తులను కొనడమే మానేశారు. ఆ తర్వాత మాంసాహారానికి కూడా దూరమై, పూర్తిగా వీగన్‌గా మారిపోయారు. ఆరోగ్యం కోసం కాదు.. జంతువుల పట్ల ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నార...

ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk 02.11.2026

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి! ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా స్క్రీన్ ముందు గడపడం.. ఇవన్నీ మన రోజువారీ అలవాట్లలో భాగమైపోయాయి. కానీ మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర స్వభావానికి సరిపోయే ఆహారం తీసుకోవడం...

స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11 27.10.2026

“అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!” అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి గారు. 1996లో కేవలం ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు అండగా నిలిచే స్థాయికి చేరింది. నాచారంలోని సాధన స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే సంస్థ ద్వారా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు విద్య, ప్రత్యేక శిక్షణ, వివిధ థెరపీలను...

గురజాడ , రాయవరం రెండు ఊర్లతో ఉన్న అనుబంధం నాది! |మా ఊరు - 85 26.10.2026

చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు! గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ గ్రామాల్లో చదువుకుంటూ, ఎన్నో ప్రాంతాల జీవన విధానాలను దగ్గరగా చూసారు. ఆ అనుభవాలతోనే జీవితంలో ముందుకు సాగారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసి, తన కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. మరోవైపు, పిల్లల చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, వారు ఉన్నత చదువులు చదివ...

చిన్న పిల్లలలో సీజనల్ జ్వరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Health Talk 26.10.2026

సీజన్ మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు వస్తే ఏం చేయాలి? వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం సహజం. అయితే, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల కూడా తల్లిదండ్రులు అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అ...

ఆకలి నుంచి పుట్టిన ఆలోచన..లక్షల మంది కడుపు నింపుతోంది! | స్పూర్తి కిరణాలు 22.10.2026

ఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు! చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు ఎదుర్కోకూడదని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇప్పుడు రోజుకు 2,000 మందికి పైగా ఆకలి తీర్చే ప్రయత్నంగా మారింది. ఆయనే Don’t Waste Food ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లేశ్వరరావు గారు! పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర వేడుకల్లో చాలాసార్లు తినడానికి మిగిలిపోయిన ఆహారం వృధ...

నిజాయితే నా ధైర్యం ! | ఆంతరంగాలు - 10 21.10.2026

ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎంతోమందికి అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన భర్త ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఆయనకు అండగా నిలిచారు. చికిత్స చేయించినప్పటికీ భర్తను కోల్పోయారు. ఆ తర్వాత తన కూతురితో కలిసి ముందుకు సాగారు. ఒకరోజు ఓల్డేజ్ హోమ్‌లో ఉన్న వృద్ధుల పరిస్థితి ఆమెను ఆలోచింపజేసింది. ఆదరించేవారు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు అండగా నిలవాలనుకున్నారు. అలా 2003లో కి...

మైండ్‌సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk 21.10.2026

మనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం.. ఇలాంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి మన రోజును ఎల...

SIPs & మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా? |Smart Money Mindset - 13 15.10.2026

Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చాలామందికి Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ అసలు ఇవి సురక్షితమేనా? ఏ ఫండ్స్ ఎంచుకోవాలి? SIP ద్వారా పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే సందేహాలు ఉంటాయి. అందుకే.. ఈ వారం Smart Money Mindset – Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు Mutual Funds, SIPల గురించి మనతో...

కష్టాలని ఎదురించి .. పదిమందికి తోడుగా నిలిచిన అమ్మ | అంతరంగాలు - 9 14.10.2026

ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనను నమ్మిన వారందరికీ అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది.. ఆ తర్వాత కూడా చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఇంటర్, డిప్లొమా పూర్తి చేశారు భ్రమరాంబ గారు. ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను పెంచి, చదివించి, వారిని జీవితాల్లో స్థిరపడేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. కొడుకు దూరమయ్యాక.. కోడలు, మనవరాళ్ల బాధ్యతలను కూడా తన భ...

వరంగల్ యువకుడు .. ఆకాశవాణి నుంచి అమెరికా వరకు.. | మా ఊరు - 84 12.10.2026

కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే.. జీవితంలో ఎన్నో కొత్త దారులు కనిపిస్తాయి! వరంగల్‌లో చిన్న చిన్న అవకాశాలతో మొదలైన సదానందం గారి ప్రయాణం.. ఆకాశవాణి నుంచి టెలివిజన్ వరకు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నుంచి ఐటీ రంగం వరకు, వరంగల్ నుంచి అమెరికా వరకు సాగింది. చిన్నతనంలోనే ట్యూషన్లు చెప్పడం, ఆకాశవాణిలో పని చేయడం, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కెరీర్ మొదలుపెట్టి మేనేజర్‌గా ఎదగడం.. ఇలా ప్రతి దశలోనూ కొత్త విష...

పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? | Health Talk | World Hospice and Palliative Care Day Special 12.10.2026

అనారోగ్యంతో ఉన్నవారికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం! దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయంలో వారికి వ్యాధి నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తూనే, రోజువారీ జీవితాన్ని వీలైనంత సౌకర్యవంతంగా గడిపేలా చేయడమే Palliative Care యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతును అందించడం కూడా చాలా ముఖ్యం. మరి అసలు Palliati...

Escucha el podcast TALRadio Telugu en Replaio

Radio y podcasts en una sola app - gratis y sin registro. Instálala hoy y no te pierdas el estreno

Descárgala en Google Play

Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos