fr

Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

N'hésitez pas à visiter le site du podcast et à soutenir son créateur : podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Catégorie

Arts

Site du podcast

podcasters.spotify.com

Dernier épisode

3 nov. 2026

Où écouter ?

Les podcasts dans l'appli Replaio Radio Bientôt disponible

Les podcasts arrivent très bientôt dans l'appli. Installe-la dès maintenant et découvre en avant-première une toute nouvelle façon de vivre les podcasts

Télécharger sur Google Play Installe-la gratuitement Android près de 10 M de téléchargements · note de 4,7+ iOS bientôt

Épisodes

అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12 03.11.2026

ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం కావడంతో నడవలేక రోడ్డుపై ఉండటం చూశారు. వెంటనే తన పనిని పక్కనపెట్టి, రిక్షా తీసుకొచ్చి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన మందులు కూడా కొనిచ్చారు. చిన్న వయసులో తాను చేసిన ఈ సహాయమే తన జీవితాన్ని ఎంతో ప్రభావి...

మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86 02.11.2026

చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు. బాల్యంలో స్నేహితులతో గడిపిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అంటూ… వాళ్ళ ఊరు పాలకొల్లు గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ వారం మా ఊరు కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు… ప...

Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special 02.11.2026

ఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది! 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను తల్లుల నుంచి వేరు చేస్తున్న విధానాన్ని చూసి ఎంతో బాధ పడ్డారు. ఆ ఒక్క సంఘటనతో పాలు, పాల ఉత్పత్తులను కొనడమే మానేశారు. ఆ తర్వాత మాంసాహారానికి కూడా దూరమై, పూర్తిగా వీగన్‌గా మారిపోయారు. ఆరోగ్యం కోసం కాదు.. జంతువుల పట్ల ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నార...

ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk 02.11.2026

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి! ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా స్క్రీన్ ముందు గడపడం.. ఇవన్నీ మన రోజువారీ అలవాట్లలో భాగమైపోయాయి. కానీ మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర స్వభావానికి సరిపోయే ఆహారం తీసుకోవడం...

స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11 27.10.2026

“అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!” అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి గారు. 1996లో కేవలం ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు అండగా నిలిచే స్థాయికి చేరింది. నాచారంలోని సాధన స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే సంస్థ ద్వారా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు విద్య, ప్రత్యేక శిక్షణ, వివిధ థెరపీలను...

గురజాడ , రాయవరం రెండు ఊర్లతో ఉన్న అనుబంధం నాది! |మా ఊరు - 85 26.10.2026

చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు! గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ గ్రామాల్లో చదువుకుంటూ, ఎన్నో ప్రాంతాల జీవన విధానాలను దగ్గరగా చూసారు. ఆ అనుభవాలతోనే జీవితంలో ముందుకు సాగారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసి, తన కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. మరోవైపు, పిల్లల చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, వారు ఉన్నత చదువులు చదివ...

చిన్న పిల్లలలో సీజనల్ జ్వరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Health Talk 26.10.2026

సీజన్ మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు వస్తే ఏం చేయాలి? వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం సహజం. అయితే, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల కూడా తల్లిదండ్రులు అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అ...

ఆకలి నుంచి పుట్టిన ఆలోచన..లక్షల మంది కడుపు నింపుతోంది! | స్పూర్తి కిరణాలు 22.10.2026

ఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు! చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు ఎదుర్కోకూడదని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇప్పుడు రోజుకు 2,000 మందికి పైగా ఆకలి తీర్చే ప్రయత్నంగా మారింది. ఆయనే Don’t Waste Food ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లేశ్వరరావు గారు! పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర వేడుకల్లో చాలాసార్లు తినడానికి మిగిలిపోయిన ఆహారం వృధ...

నిజాయితే నా ధైర్యం ! | ఆంతరంగాలు - 10 21.10.2026

ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎంతోమందికి అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన భర్త ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఆయనకు అండగా నిలిచారు. చికిత్స చేయించినప్పటికీ భర్తను కోల్పోయారు. ఆ తర్వాత తన కూతురితో కలిసి ముందుకు సాగారు. ఒకరోజు ఓల్డేజ్ హోమ్‌లో ఉన్న వృద్ధుల పరిస్థితి ఆమెను ఆలోచింపజేసింది. ఆదరించేవారు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు అండగా నిలవాలనుకున్నారు. అలా 2003లో కి...

మైండ్‌సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk 21.10.2026

మనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం.. ఇలాంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి మన రోజును ఎల...

SIPs & మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా? |Smart Money Mindset - 13 15.10.2026

Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చాలామందికి Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ అసలు ఇవి సురక్షితమేనా? ఏ ఫండ్స్ ఎంచుకోవాలి? SIP ద్వారా పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే సందేహాలు ఉంటాయి. అందుకే.. ఈ వారం Smart Money Mindset – Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు Mutual Funds, SIPల గురించి మనతో...

కష్టాలని ఎదురించి .. పదిమందికి తోడుగా నిలిచిన అమ్మ | అంతరంగాలు - 9 14.10.2026

ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనను నమ్మిన వారందరికీ అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది.. ఆ తర్వాత కూడా చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఇంటర్, డిప్లొమా పూర్తి చేశారు భ్రమరాంబ గారు. ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను పెంచి, చదివించి, వారిని జీవితాల్లో స్థిరపడేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. కొడుకు దూరమయ్యాక.. కోడలు, మనవరాళ్ల బాధ్యతలను కూడా తన భ...

వరంగల్ యువకుడు .. ఆకాశవాణి నుంచి అమెరికా వరకు.. | మా ఊరు - 84 12.10.2026

కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే.. జీవితంలో ఎన్నో కొత్త దారులు కనిపిస్తాయి! వరంగల్‌లో చిన్న చిన్న అవకాశాలతో మొదలైన సదానందం గారి ప్రయాణం.. ఆకాశవాణి నుంచి టెలివిజన్ వరకు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నుంచి ఐటీ రంగం వరకు, వరంగల్ నుంచి అమెరికా వరకు సాగింది. చిన్నతనంలోనే ట్యూషన్లు చెప్పడం, ఆకాశవాణిలో పని చేయడం, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కెరీర్ మొదలుపెట్టి మేనేజర్‌గా ఎదగడం.. ఇలా ప్రతి దశలోనూ కొత్త విష...

పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? | Health Talk | World Hospice and Palliative Care Day Special 12.10.2026

అనారోగ్యంతో ఉన్నవారికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం! దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయంలో వారికి వ్యాధి నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తూనే, రోజువారీ జీవితాన్ని వీలైనంత సౌకర్యవంతంగా గడిపేలా చేయడమే Palliative Care యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతును అందించడం కూడా చాలా ముఖ్యం. మరి అసలు Palliati...

మధ్యతరగతి వాళ్లు రిచ్ అవ్వడానికి సింపుల్ టిప్స్ ! | Smart Money Mindset - 12 08.10.2026

జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం! చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తున్నామా? లేదా? అనేదే అసలు ప్రశ్న. అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Naval Ravikant ఆలోచనల ఆధారంగా సంపదను నిర్మించుకోవడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాల గురించి మనతో పంచుకున్నారు.. Financia...

రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula 08.10.2026

రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది! Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప...

సంగీతం గెలిపించిన జీవితం | అంతరంగాలు - 08 06.10.2026

సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది! చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ...

విశాఖపట్టణం లో మా స్కూల్ చాలా బావుంటుంది ! | మా ఊరు - 83 05.10.2026

మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి! అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్‌లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావర...

చిన్న పిల్లల బోన్ హెల్త్ - తప్పక తెలుసుకోవలిసిన విషయాలు ! | Health Talk 05.10.2026

పిల్లల ఎముకల విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం! పిల్లల ఎముకలు పెద్దవాళ్ల ఎముకలకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అవి ఎదుగుదల దశలో ఉండటంతో గాయాలను తట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆడుకునే సమయంలో పడిపోవడం, చేతులకు గాయాలు అవ్వడం, ఫ్రాక్చర్ లాంటి సందర్భాల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం అవసరం. ముఖ్యంగా పిల్లలను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని లాగడం వల్ల వచ్చే సమస్యల...

24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11 01.10.2026

జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి...

అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4 01.10.2026

10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు.. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు! చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వా...

చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు 01.10.2026

హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే? ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pedi...

గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07 29.09.2026

గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. క...

అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10 24.09.2026

లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగ...

మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6 22.09.2026

‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపై...

Écoute le podcast TALRadio Telugu sur Replaio

La radio et les podcasts dans une seule appli - gratuite, sans inscription. Installe-la dès aujourd'hui et ne rate pas le lancement

Télécharger sur Google Play

Replaio n'est pas éditeur de podcasts ; les noms des émissions, les visuels et l'audio appartiennent à leurs auteurs et sont diffusés via des flux RSS publics