Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Επεισόδια: 970

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com

Δημιουργός

Touch A Life Foundation

Κατηγορία

Arts

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

1 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

Passion.. Profession.. రెండిట్లోనూ గెలిచిన విహాన్ విదుర్! | Vijeta | Part - 2 26.05.2026

ఉద్యోగం ఒక వైపు… కల మరో వైపు… రెండింటినీ బ్యాలెన్స్ చేసిన కథే విహాన్ విదుర్ గారిది! గతవారం ఆయన ప్రయాణంలో… ఇండియాలో B.Tech పూర్తి చేసి అమెరికాలో IT రంగంలో Senior Lead‌గా స్థిరపడినా… సినిమాపై ఉన్న ప్యాషన్‌ను ఎలా కొనసాగించారో తెలుసుకున్నాం కదా! అలాగే Acting, Direction, Cinematography నేర్చుకుని… తన షార్ట్ ఫిల్మ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా తెచ్చుకున్నారో కూడా విన్నాం. ఇప్పుడు Part-2లో… ఆయన...

అడవి బిడ్డలకు అక్షర సాయం | స్ఫూర్తి కిరణాలు 25.05.2026

“ఒకప్పుడు చైల్డ్ లేబర్‌గా పనిచేశా… ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్న పిల్లలను ఆ పని నుంచి కాపాడి చదువు చెప్తున్నా!” ఇది People Helping Children సంస్థ ఫౌండర్ సంతోష్ బోగం గారి కథ! ఏటూరు నాగారంలో ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ నిర్వహిస్తూ… తమ కుటుంబాల్లోనే మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న ఫస్ట్ జనరేషన్ పిల్లలకు విద్య అందిస్తున్నారు వీళ్ళు. “ప్రతి పిల్లవాడికీ ఒక కల ఉంటుంది… ఆ కల నెరవేరాలంటే ముందుగా వారికి సురక్షిత...

"మా అమ్మమ్మ ఊరు చంద్రాయణగుట్టలో.. పండుగలు బాగా జరిగేవి!" | మా ఊరు - 73 25.05.2026

హైదరాబాద్‌లోని చిన్ననాటి జ్ఞాపకాల నుండి… ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే స్థాయికి చేరుకున్న తన ప్రయాణాన్ని ఈ వారం మా ఊరు పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు శశాంక్ తుమ్మనపల్లి గారు. స్కూల్ బస్ ప్రయాణాలు… వేసవి సెలవుల్లో కుటుంబంతో గడిపిన రోజులు… ఇండియాలో చూసిన ఎన్నో ప్రాంతాలు… చిన్నప్పటి సరదా జ్ఞాపకాల గురించి ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. అలాగే టెక్నాలజీ రంగంలో తన కెరీర్ ఎలా ప్రారంభమైంద...

చెట్లను పిల్లల్లా పెంచిన తల్లి సాలుమరద తిమ్మక్క! 23.05.2026

ప్రకృతినే ప్రాణంగా ప్రేమించిన వృక్షమాత… సాలుమరద తిమ్మక్క! కన్నడలో “సాలుమరద” అంటే వృక్షాల వరుస అని అర్థం. చెట్లనే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈమె కర్ణాటకలోని రామనగర జిల్లాకు చెందిన వారు. ఆమె జీవితంలో పిల్లలు లేరన్నదే ఒక బాధ మిగిలిపోయింది. కానీ ఆ బాధే తర్వాత ఒక గొప్ప మార్గంగా మారింది. మొక్కలను నాటి పెంచడం మొదలుపెట్టిన ఆమె, క్రమంగా ఆ మొక్కలనే తన సొంత బిడ్డలుగా భావించారు. అలా రోజులు కాదు… సంవత్సరాలు కాద...

తొబకాచి పన్నాగం! | Super Girls Series - 6 22.05.2026

ఆ ఊర్లోని పిల్లలను తొబకాచి ఏం చేశాడు? దాన్ని లచ్చిమి ఎలా ఎదుర్కొంది? అదొక కారుచీకటి చలిరాత్రి… పాతాళలోకంలోని ఓ భారీ కోటలో క్రూర రాక్షసుడు తొబకాచి భయంకరంగా నవ్వుతున్నాడు. “మానవ లోకంలోని పిల్లలందరూ జబ్బు పడిపోతే… హాహాహా!” అంటూ తన దుష్ట ప్రణాళికను బయటపెట్టాడు. అప్పుడే అతని సేనాధిపతి క్రిమి కీటకాసురుడు ముందుకొచ్చి, “ప్రభూ! మా క్రిములను ఊరంతా పంపిస్తాను. పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతారు!” అంటూ విర్రవ...

కాలేజ్ క్యాంటీన్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాకా .. | Spurthi Kiranalu 21.05.2026

అమెరికాలో లగ్జరీ లైఫ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఇంజనీర్ ఉద్యోగం.. వీటన్నింటినీ వదిలేసి, సమాజానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. వినిల్ రెడ్డి గారు! చిన్నప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను చూసి చలించిపోయిన ఆయన, కాలేజీ రోజుల్లో చిన్న డొనేషన్ బాక్సులతో తన సేవా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు అంతర్జాతీయ విమానయాన రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సహాయం చేయడం కోసం తెల్ల...

2 వారాలకు పైగా కడుపులో ఇబ్బందా? IBD కావచ్చు... | Special Interview 20.05.2026

ప్రతి సంవత్సరం May 19ను World IBD Awareness Dayగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. IBD అంటే Inflammatory Bowel Disease. ఇది కేవలం కడుపు సమస్య మాత్రమే కాదు… ఒక వ్యక్తి physical health, mental health, అలాగే daily lifestyle పై కూడా తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. ఈ మధ్యకాలంలో చాలామంది కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలు, అలసట వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఇవి సాధారణ సమస్యలే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చ...

Herbal Tea తో ఆరోగ్యం పదిలం! | ఆయుర్వేదం ఆరోగ్యం | Part - 1 20.05.2026

రోజూ మనం తాగే ఒక కప్పు టీ… మన ఆరోగ్యాన్ని కూడా మార్చగలదని మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో హెర్బల్ టీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవి కేవలం రిఫ్రెష్‌మెంట్ కోసం మాత్రమే కాదు… శరీరానికి సహజమైన ఆరోగ్యాన్ని అందించే మంచి అలవాటు కూడా. తులసి, అల్లం, పుదీనా, దాల్చిన చెక్క వంటి సహజ మూలికలతో తయారయ్యే హెర్బల్ టీలు… ఇమ్యూనిటీని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాల...

Passion.. Profession.. రెండిట్లోనూ గెలిచిన విహాన్ విదుర్! | Vijeta | Part - 1 19.05.2026

ఇండియాలో B.Tech పూర్తి చేసి…అమెరికాలో IT రంగంలో Senior Lead గా స్థిరపడినా…మనసు మాత్రం “సినిమా” అనే కలను వదల్లేదు! కల కోసం ఉద్యోగాన్ని కాదు…ఉద్యోగంతో పాటు కలను కూడా నడిపించాడు.. విహాన్ విదూర్. Lee Strasberg Theater & Film Institute లో Acting…New York Film Academy లో Direction & Cinematography నేర్చుకుని…తన short films తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. Dada Saheb Phalke Film Fest...

"విత్తనం మీద పెత్తనం చేయొద్దు" - Padma Koppula | Special Interview 18.05.2026

ఈరోజుల్లో పండ్లు, కూరగాయలు బాగా తింటున్నా కూడా… మనం ఆరోగ్యంగా ఉండట్లేదు.. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మన ముందుతరాల వారు స్వదేశీ విత్తనాలతో, సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం మాత్రమే తినేవారు. అందుకే వాళ్ల ఆరోగ్యం కూడా బలంగా ఉండేది. కానీ ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు, అధిక కెమికల్స్ వాడకం వల్ల నేల సారం తగ్గిపోతోంది… ఆహారపు నాణ్యత కూడా మారిపోతోంది. మన విత్తనాలను మనమే దాచుకుని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మర...

"నామాపురంలో మొదటి ఇంజనీర్ నేనే" - Satish Kanchukatla | మా ఊరు - 72 18.05.2026

“మా నాన్నే నాకు హీరో… నేను వేసే ప్రతి అడుగులో ఆయన తోడు ఎప్పుడూ ఉండేది!” అంటూ తన తండ్రిపై ఉన్న ప్రేమను ఎంతో భావోద్వేగంగా మనతో పంచుకున్నారు సతీష్ కంచుకట్ల గారు. తాను పుట్టి పెరిగిన నామాపురం గ్రామం గురించి… అక్కడి జ్ఞాపకాలు, పండుగలు, ఊరి మనుషుల మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్తూ.. అలాగే తమ ఊర్లో మొదటి ఇంజనీర్‌గా ఎదిగిన ప్రయాణంలో… తన నాన్న ఎలా ప్రోత్సహించారో, చదువు కోసం ఎంత కష్టపడ్డారో కూడా గుర్తు చేసుక...

ప్రతి నీటి చుక్క కోసం యుద్ధం! | WATER WARRIOR ఆబిద్ సుర్తీ కథ! 16.05.2026

మన ఇంట్లో లీక్ అయ్యే ట్యాప్‌ను చూసి…“కొన్ని చుక్కలే కదా!” అని చాలామంది వదిలేస్తారు.కానీ…ఆ ఒక్కో చుక్కలోనే భవిష్యత్తు నీటి సమస్యను చూసిన వ్యక్తి…“Water Warrior” ఆబిద్ సుర్తీ. 70 ఏళ్ల వయసులో కూడా…ఇంటి ఇంటికి తిరుగుతూఉచితంగా ట్యాప్ లీకేజీలు రిపేర్ చేసికోట్ల లీటర్ల నీటిని కాపాడిన ఆయన కథ…మనలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఈ podcast విన్న తర్వాత…మీ ఇంట్లోని ప్రతి ట్యాప్‌ను మీరు కూడా ఒక్కసారి చెక్ చేస...

సరోజ తుమ్ముల తుఫాన్ | Super Girls Series - 5 15.05.2026

"అన్నా, నాకు ఇవాళ స్కూల్ కి వెళ్లాలని లేదు" - అన్నయ్య తో అంది సరోజ. ప్రతిరోజు చక్కగా తయారై, సంతోషంగా స్కూల్ వెళ్లే సరోజ, ఒకరోజు మాత్రం అమ్మ ఎంత నిద్ర లేపినా లేవకుండా… సుస్తీగా పడుకొని ఉంది. తుమ్ములు, దగ్గులు వస్తున్నాయని వాళ్ళ అన్నతో చెప్పింది. ఆరోజు స్కూల్ కి వెళ్లాలని లేదని చాలా నీరసంగా ఉందని బాధ బాధపడింది. అసలు ఏమైంది ఆమెకు? అలా ఎందుకు జరిగింది? స్కూల్ కు ఎందుకు వెళ్లట్లేదు? మీకు కూడా...

థైరాయిడ్ సమస్యా ? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో... | ఆయుర్వేదం ఆరోగ్యం - 100 13.05.2026

Thyroid ఈ మధ్య కాలం లో అందరి నోట వినిపిస్తున్న సమస్య .. ఆయుర్వేదం తో ఈ సమస్య కి ఈజీ గా చెక్ పెట్టేయవచ్చు. ఇది మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్‌ను చూసుకునే ఒక ముఖ్యమైన గ్రంధి. మన ఎనర్జీ, నిద్ర, బరువు, జీర్ణక్రియ… ఇలా శరీరం సరిగ్గా పనిచేయడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందుకే థైరాయిడ్‌లో చిన్న సమస్య వచ్చినా… అలసట, హెయిర్ ఫాల్, బరువు పెరగడం లేదా తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు కన...

అమ్మ కోసం... మా మనసులో మాట! | Mother's day Special Show 11.05.2026

‘అమ్మ’ ఈ మాట వినగానే మనం ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోతాం.. కదా! చిన్నప్పుడు తినిపించిన గోరు ముద్దలు…బాలేనప్పుడు నిద్రపోకుండా చూసుకున్న రాత్రులు…మన కోసం తన ఇష్టాలను మౌనంగా వదులుకున్న క్షణాలు…ఇలా.. అమ్మ ప్రేమలో ప్రతి జ్ఞాపకం ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఈ Mother’s Day సందర్భంగా…మా అందరి అమ్మల గురించి, వాళ్ల ప్రేమ గురించి, వాళ్లు చేసిన చిన్న చిన్న త్యాగాల గురించి మీతో పంచుకునే ఒక ప్రత్యేకమైన రేడ...

"వల్లాల" గ్రామం నేర్పిన పాఠాలే నా విజయానికి మెట్లు | మా ఊరు - 71 11.05.2026

“మా నాన్నంటే నాకు చాలా ఇష్టం…అందుకే మా ఇంట్లో అందరి పేర్లు ఆయన పేరు వచ్చేలా పెట్టుకున్నాం…’ అంటూ తన తండ్రి మీద ఉన్న ప్రేమను మనతో పంచుకున్నారు… అలాగే తన బాల్యం గడిచిన వల్లాల గ్రామం గురించి ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇది ఈ వారం “మా ఊరు” ఎపిసోడ్‌లో జగన్ చిట్టిప్రోలు గారి కథ… ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తూ… C2S Technologies అనే సంస్థకు CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన కెరీర్ గురించి మాట...

HIV చిన్నారుల కోసం Desire Society ప్రయాణం | Special Interview 11.05.2026

Desire society గత 22 ఏళ్లకు పైగా HIV పిల్లల ఆరోగ్యం, ఆహారం సంరక్షణ బాధ్యతలు తీసుకుని వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నో వేలమంది పిల్లల జీవితాలని ప్రభావం చేసిన వీరి ప్రయత్నం, అందులో ఎదురైన సవాళ్లు, పిల్లల జీవితాల్లో వచ్చిన మార్పు వంటివి మనతో పంచుకుంటున్నారు DESIRE Society ఫౌండర్ రవిబాబు గారు. తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! For the past 22 years, DESIRE Society has been worki...

సుఖోమాజ్రీ మళ్ళీ ఎలా సుఖవంతంగా మారింది? | Super Girls Series - 4 08.05.2026

ఆ గ్రామ ప్రజలు నీటి కష్టాలను ఎలా దాటారో తెలుసా? హర్యానా రాష్ట్రంలోని సుఖోమాజ్రీ గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఉండేది. ఆ ఊర్లో అసలు చెట్లే ఉండేవి కాదు. దీంతో ప్రజలు చాలా కష్టాలు పడేవారు. కానీ, ఆ గ్రామ ప్రజలంతా ఒకదగ్గర కలిసి ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నారు…! అసలు వాళ్ళు కనుక్కున్న పరిష్కారం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఊరిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కద...

పీరియడ్ ప్రాబ్లమ్స్ కి Cycle Syncing తో చెక్! | Special Interview 07.05.2026

ఆడవాళ్లలో మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గటం, క్రేవింగ్స్ వీటన్నిటి వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా! దీనికి ప్రధాన కారణం.. మహిళల శరీరం ప్రతి నెలా హార్మోన్ల మార్పులతో కొనసాగడం. కానీ మనం చాలా సార్లు వాటిని గమనించం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్లే మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవల్స్ తగ్గడం, ఫుడ్ క్రేవింగ్స్ వంటివి జరుగుతుంటాయి. ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని, మన...

Inflammation అంటే ఏంటి ? ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 99 06.05.2026

Inflammation ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వింటున్న మాట .. ఇది కేవలం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే చిన్న వాపు మాత్రమే అనుకుంటే తప్పే ..   ఆ టైంలో మనకు తెలియకుండానే మన శరీరం లోపల కణాల స్థాయిలో మంట పెరుగుతుంటుంది. దీనినే డాక్టర్లు 'సైలెంట్ కిల్లర్' అంటారు! మరి దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందనే అంటున్నారు అనుపమ గారు! ఈ ఎపిసోడ్ లో అసలు  Inflammationఅంటే ఏంటి ? దానికి కార...

"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే!" - Sreeram Patibandla | Part -2 | Maa Ooru - 70 04.05.2026

ఆంధ్రా ప్యారీస్ మా ఊరే… అంటూ శ్రీరామ్ పాటిబండ్ల గారు వారి ఊరి విశేషాలను మొదటి ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు కదా.. ఈ రెండో ఎపిసోడ్‌లో తన అమెరికా జీవితం గురించి, అక్కడ సెటిల్ అయిన విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను మనతో పంచుకున్నారు! ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి, అమెరికాలో అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎలా సెటిల్ అయ్యారు? అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి? మన మూలాలను మర్చిపోకుండా, చుట్టూ ఉన్న వ...

గిరిజనుల కలలకి రెక్కలందిస్తున్న Butterfly Charitable Trust | Special Interview 04.05.2026

"ఒక రెండేళ్ల గిరిజన పాప మొదటి సారి లైట్ ని చూసినప్పుడు తన కళ్ళలో చూసిన సంతోషం నా జీవితానికి చాలు అనిపించింది" పూలవాగు కొమ్మ అనే గిరిజన గ్రామంలో మొదటిసారిగా సోలార్ విద్యుత్ ని అందించినపుడు కలిగిన ఈ అనుభవాన్ని చెప్తూ "Butterfly charitable trust " ఫౌండర్ నీలేష్ గారు చెప్పిన మాటలివి.. కనీస విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి, సోలార్ పవర్ గ్రిడ్ల ద్వారా వెలుగులు...

ఐనూ దారి కనిపెట్టింది | Super Girls Series - 3 01.05.2026

పిల్లల కోసం రేడియో కథలు! బారీసుకు గ్రామానికి కొత్త రోడ్డు వచ్చిందని ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ, ఒకరోజు ఆ ఊరికి వచ్చిన వరదల వల్ల ప్రజలంతా చాలా భయపడ్డారు.. ఐనూ మాత్రం ఆ వరదల నుండి ప్రజలందరినీ కాపాడాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది… తర్వాత ఏం జరిగిందో, ఐనూ అసలు ఆ ఊరిని ఎలా కాపాడిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? కథ మొత్తం వినండి! Katha.org తో కలిసి TALRadio అ...

సమస్య ఏదైనా "చేయూత" అందిస్తాం - Ravi Kumar | Special Interview 30.04.2026

ఆకలి, పేదరికం, ఒంటరితనం, అవిద్య.. ఇలా సమస్య ఏదైనా సరే, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి 'నేనున్నాను' అని ధైర్యం చెప్తోంది… చేయూత స్వచ్చంధ సంస్థ! అనాథ పిల్లల ముఖాల్లో వెలుగులు నింపుతూ, యువతను నిరాశ నిస్పృహల నుండి బయటపడేసి వారిలో ధైర్యం, నైతిక విలువలను పెంచుతోంది ఈ సంస్థ. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఎదుటివారికి చేయూతనివ్వడం వెనుక ఉన్న ఆ తృప్తి ఏంటి? సామాజిక సేవలో యువత పాత్ర ఎలా ఉండాల...

స్ట్రీట్ నుండి స్పాట్ లైట్ వరకు... డ్యాన్స్ తో మారిన తలరాతలు! 29.04.2026

డ్యాన్స్‌తో పేదరికాన్ని జయించొచ్చని మీకు తెలుసా? స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లలచే డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తూ వారి భవిష్యత్తును మారుస్తున్నారు వినయ్ శర్మ! 2016లో ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన “Dance Out of Poverty” కేవలం ఒక డ్యాన్స్ క్లాస్ గా మాత్రమే కాకుండా, వేలాది మంది పిల్లల ఆత్మవిశ్వాసానికి ఒక కేరాఫ్ అడ్రస్ గా మారింది. చదువుతో పాటు ఆర్ట్ (Art) కూడా మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? డ్యాన్స్ అనేది ఒక పే...

Άκου το podcast TALRadio Telugu στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS