Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Επεισόδια: 970

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com

Δημιουργός

Touch A Life Foundation

Κατηγορία

Arts

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

1 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

ఉద్యోగ బాధ్యత ఒకవైపు .. సామాజిక బాధ్యత మరో వైపు | Charcha With Real Leaders - 05 23.06.2026

ఉద్యోగం జీవితానికి… సేవ సమాజానికి..." అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఆదిత్య కృష్ణ గారు! ఒకవైపు Infosysలో IT Engineer‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు Volunteer Leader‌గా వేలాది మందికి అండగా నిలుస్తున్నారు. గత మూడేళ్లలో స్నేహితులతో కలిసి దాదాపు 34,000 మందికి సహాయం చేశారు... 2026లో Infosys ప్రతిష్టాత్మక AFE Awardను సొంతం చేసుకున్నారు. "మనిషి సంపాదించేది డబ్బు మాత్రమే కాదు.....

నాన్న కాబోతున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకొండి ! | Health Talk with Dr.Shilpi Reddy 22.06.2026

నాన్న కావాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! Pregnancy టైంలో తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి! భార్య ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం నుంచి… ఆమెకు emotional support ఇవ్వడం వరకు… కాబోయే ప్రతి తండ్రి ఈ విషయాలు తెలుసుకోవాలి! పురుషుల lifestyle ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆ టైమ్ లో భర్త భార్యతో ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ఎన్నో ఉ...

నాన్నకు ప్రేమతో... | CHARCHA With Real Leaders - 4 | Fathers Day Special 19.06.2026

నాన్న కోసం దాచిన డబ్బు... ఈరోజు ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడుతుంది! తన మొదటి జీతంతో నాన్న కోరిక తీర్చాలనుకుంది ఓ కూతురు... ఆ కల నెరవేరేలోపే తండ్రిని కోల్పోయింది! కానీ ఆ బాధలోనే ఆగిపోకుండా... నాన్న కలలను సేవగా మార్చి, ఆయన పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లల చదువులకు అండగా నిలుస్తూ... చేసే ప్రతి మంచిపనిలో, ప్రతి చిన్నారి చిరు నవ్వులో తన నాన్నను చూసుకుంటుంది! ఇద...

హాస్యం... సందేశం.. ఇదే ఈయన రచనల ప్రత్యేకం | మన రచయితలు | Season - 2 | Episode - 1 18.06.2026

ఇంజెక్షన్‌తో ఇచ్చే 'అనస్తేషియా' గురించి అందరికీ తెలుసు... కానీ మాటలతో ఇచ్చే అనస్తేషియా గురించి మీకు తెలుసా? ఈ డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ మాత్రమే కాదు... సమాజాన్ని కదిలించే కలం కూడా ఉంటుంది! అనస్తేషియా అన్న పదాన్ని కూడా కవితాత్మకంగా మార్చి, ‘సమ్మోహన వైద్య శాస్త్రం’ అని పేరు పెట్టిన విలక్షణ రచయిత.. డా. మూర్తి జొన్నలగడ్డ గారు! చిన్నప్పటి నుంచి పుస్తకాలనే ఆట వస్తువులుగా మార్చుకున్న ఆయన ప్రయాణం...

ఆరోగ్యానికి తోడు, కుటుంబానికి అండ | Special Interview | Dyadic Health 18.06.2026

"మన ఆరోగ్యం మనపైనే కాదు... మన చుట్టూ ఉన్న బంధాలపై కూడా ఆధారపడి ఉంటుంది!" ఇది ఒక డాక్టర్ చెప్పిన మాట కాదు... 25 ఏళ్లకు పైగా ఐటీ రంగంలో ఉంటూ, AT&T, Freddie Mac వంటి గ్లోబల్ కంపెనీల్లో పనిచేసిన ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ శ్రీధర్ నాగులవంచ గారు గుర్తించిన నిజం! "మనుషులు మందులతో కోలుకుంటున్నారు సరే... కానీ బంధాల వల్ల ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు?" అన్న ఒకే ఒక్క ప్రశ్న ఆయనను వెంటా...

ఆయుర్వేదంతో చర్మ సౌందర్యం | ఆయుర్వేదం ఆరోగ్యం - 103 17.06.2026

“సరైన నిద్ర, మంచి ఆహారం ఉంటే చాలు.. మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!” మన ఆహారం, జీవనశైలి, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలు చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సహజమైన పద్ధతుల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి… అంటూ ఇలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. చర్మ సమస్యలు రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆయుర్వేదం సూచించే చ...

పేపర్లో వార్త చదివి.. జీవితాలు మారుస్తున్న వ్యక్తి! | CHARCHA With Real Leaders - 3 16.06.2026

ప్రతిరోజూ పేపర్‌లో ఎన్నో వార్తలు వస్తుంటాయి... కానీ వాటిలోని సమస్యను చూసి వెంటనే స్పందించే మనుషులు చాలా అరుదు! అలాంటి అరుదైన సమాజ సేవకుడే రఘు అరికపూడి గారు! South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో... సామాజిక సేవకులు రఘు అరికపూడి గారి ప్రయాణం వారి మాటల్లోనే మీకోసం! ఉద్యోగం చేస్తూనే తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు...

కృష్ణమ్మ, దుర్గమ్మ, బెజవాడ ఎక్కడ ఉన్నా గుర్తొస్తాయి! | మా ఊరు - 76 15.06.2026

“చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి... మనం మన ఊరికి ఎంత దూరంలో ఉన్నా మన మనసు మాత్రం మన ఊర్లోనే ఉంటుంది!” అంటూ... ఈ వారం 'మా ఊరు' పాడ్కాస్ట్ లో... విజయవాడకు చెందిన తార శాలిని గారు తమ ఊర్లో గడిపిన ఎన్నో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. సత్యనారాయణపురం వీధులు, స్కూల్ రోజులు, నలుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి గడిపిన అందమైన క్షణాలు, తల్లిదండ్రులు నేర్పిన విలువలు, అప్పటి విజయవాడ సంస...

ఒక్క క్లిక్.. లక్షల డోనర్లు.. ఎన్నో ప్రాణాలు.. | స్ఫూర్తి కిరణాలు | World Blood Donor Day Special 15.06.2026

“ఒక్కసారి రక్తదానం చేస్తే... కొన్ని వందల జీవితాలను కాపాడినవాళ్ళం అవుతాం!” సరైన సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటాయి… అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తమ రక్తాన్ని దానం చేసి, వారి ప్రాణాలను కాపాడుతుంటారు. అలాంటి ఎంతో మందిని ఒక దగ్గరకు చేర్చి, అవసరమైన వారికి రక్తం అందేలా చూస్తోంది Friends2Support సంస్థ! World Blood Donor Day సందర్భంగా ఆ సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను మనతో ప...

చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన జీవితం | Dr. Pradeep Vajja | TALHealth Talks 15.06.2026

“అలవాట్లు చిన్నవే అయినా… అవే ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి!” ప్రస్తుతం మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సమయానికి తినకపోవడం, తరచుగా జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి ఎక్కువ కావడం ఈ అలవాట్లన్నీ నెమ్మదిగా మన శరీరంలో డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ వంటి సమస్యలకు కారణమవుతాయి. కానీ ఈ బిజీ లైఫ్‌లో కూడా ఆరోగ్యంగా, ఎక్కువకాలం ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? అనారోగ్య లక్షణాలను ముందుగానే ఎలా గుర్తించాలి?...

Height కాదు ఆత్మ విశ్వాసమే నా గుర్తింపు! | CHARCHA with Real Leaders - 2 12.06.2026

కొంతమంది పరిస్థితులను చూసి, వెనకడుగు వేస్తారు... మరి కొంతమంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుంటారు! సరిగ్గా ఇలానే ఆలోచించి, సమస్యలు మనల్ని ఆపలేవు... మనపై మనకు ఉన్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది… అంటూ ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… కల్యాణి గారు. South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో....

బిజీలైఫ్ ని హెల్తీ లైఫ్ గా మార్చుకోండిలా! | TALHealth Talk 12.06.2026

రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని… ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం మర్చిపోతున్నారా? సమయానికి తినకపోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం మీ రోజువారీ అలావాటుగా మారిందా? అయితే ఇది మీ కోసమే! ప్రస్తుతం మన జీవనశైలి చాలా మెకానికల్‌గా మారిపోయింది. సమయానికి ఆహారం తినకపోవడం, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ బిజీ లైఫ్‌లో...

ఎవరైనా తప్పిపోయారా? మా దగ్గరకు రండి... | స్ఫూర్తి కిరణాలు 11.06.2026

ప్రతి మిస్సింగ్ కేస్‌కు ఒక సమాధానం ఉండాలి….  మిస్ అయిన ప్రతి వ్యక్తి తిరిగి కుటుంబాన్ని చేరాలి…  అనే లక్ష్యంతో గత 34 ఏళ్లుగా నిరంతరం పనిచేస్తున్న ఒక వ్యక్తి కథ ఇది…! TAL Radio నిర్వహిస్తున్న ఈ వారం “స్ఫూర్తి కిరణాలు” పాడ్కాస్ట్ లో మనతో ఉన్నారు… Satya Harichandra Foundation వ్యవస్థాపకులు కనుగుల రాజేశ్వర్ రావు గారు.  మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు… కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ… వీటన్ని...

అవసరం ఉన్న చోట అభయ ఫౌండేషన్ ఉంటుంది! | Charcha With Real Leaders - 1 09.06.2026

"ఈరోజే మనది… రేపు మనది కాదు" అంటూ తన జీవితాన్నే, సమాజ సేవకు అంకితం చేశారు ఈయన! South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న “Charcha With Real Leaders” మొట్టమొదటి కార్యక్రమంలో... 'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు బాలచంద్ర సుంకు గారు మన మనసుల్ని హత్తుకునే ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు! ఒక వైపు కంపెనీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు 1,20,000 మందికి పైగా దు...

"వైజాగ్ బీచ్ లో మురి మిక్చర్ నా ఫెవరెట్!" | మా ఊరు - 75 08.06.2026

“మన ఊరి జ్ఞాపకాలు… మనతో పాటు జీవితాంతం ప్రయాణిస్తాయి!” అంటూ… విజయవాడలో గడిపిన చిన్ననాటి రోజులు, మామిడి చెట్ల నీడలో ఆటలు, విశాఖ బీచ్‌లో గడిపిన క్షణాలు… ఇవన్నీ ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.. ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో సుష్మిత రాజకొండ గారు! విజయవాడ నుంచి సియాటెల్ వరకు… IT, banking, real estate, Microsoft వంటి ఎన్నో రంగాల్లో ఆమె చేసిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం....

ప్రకృతి కోసం... లైఫ్ స్టైల్ మార్చుకుందామా? | Special Interview | World Environment Day 08.06.2026

ప్రకృతిని కాపాడటమంటే... మొక్కలు నాటితే సరిపోతుందా?ప్లాస్టిక్‌కు బదులుగా క్లాత్ బ్యాగ్ లు వాడటం... తడి, పొడి చెత్తలను వేరు చేయడం… నీటిని పొదుపుగా వాడుకోవడం… ఇలాంటి… మన రోజువారీ చిన్న చిన్న అలవాట్లే.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని నిరూపిస్తున్నారు… ప్రముఖ పర్యావరణ కార్యకర్త సురేష్ గుప్తా గారు. నిరంతరం ప్రకృతి పరిరక్షణ కోసమే కృషి చేస్తున్న ఆయన… మాటలతోనే కాదు, తన జీవన విధానంతోనే మార్పు ఎలా ఉంటుందో...

సైక్లింగ్: ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం | World Bicycle Day Special | స్ఫూర్తి కిరణాలు 04.06.2026

జీవితం ఆగిపోయింది అనుకున్న రోజు... అతని ప్రయాణం మొదలైంది! కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి బయటపడేందుకు సైకిల్ ఎక్కాడు రంజిత్. మొదట అది కేవలం ఒక రైడ్ మాత్రమే. కానీ అదే రైడ్‌ అతని జీవితాన్ని ఒక సరికొత్త దిశలో నడిపించింది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన ఆ ప్రయాణం, ఈరోజు 20 దేశాలు, 40,000+ కిలోమీటర్లు, వేల అనుభవాలు, లక్షల మంది అభిమానుల వరకు చేరుకుంది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగ...

90's Nostalgia With Touch A Life Team 03.06.2026

సమ్మర్ హాలిడేస్ అంటే... మీకు మొదట గుర్తొచ్చేది ఏంటి?చెరువులో ఈత నేర్చుకోవడం...ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడటం...అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళి, ఆడుకోవడం...చెట్లెక్కి పండ్లు కోయడం...అమ్మమ్మ చేతి ఆవకాయ రుచి చూడడం...ఇవే కదా !90's కిడ్స్‌కు ఇవి కేవలం జ్ఞాపకాలే కాదు... జీవితాంతం మరిచిపోలేని మంచి అనుభూతులు!ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో మన శ్రోతలు కొంతమంది తమ చిన్ననాటి సమ్మర్ హాలిడేస్ జ్ఞాపకాలను మనతో పంచుకు...

సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు... మన బాధ్యత! | Eco Studio | Special Interview 01.06.2026

ప్రకృతి ఇచ్చిన వనరులను మనం ఎలా వాడుతున్నాం? ఈ ప్రశ్నే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది! సౌకర్యం కోసం కాకుండా… భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. లాభం కోసం కాకుండా… పర్యావరణం కోసం నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు వెళ్తుంది… EcoStudio India! సస్టైనబుల్ డిజైన్, గ్రీన్ ఇన్నోవేషన్, ఈకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ వంటి అంశాల్లో సరికొత్త మార్గాన్ని చూపిస్తున్న సంస్థ ఇది. ఈ ఇంటర్వ్యూలో ఫౌండర్ వైష్ణవి గారు పర్యావరణం...

అస్థిత్వం: ఉనికిని కాపాడే ఉద్యమం! | స్ఫూర్తి కిరణాలు 01.06.2026

“భాష కేవలం భావ ప్రసారం కోసం ఉపయోగించే సాధనం మాత్రమే కాదు… అది మన అస్థిత్వం!” అనే ఆలోచనను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్న సంస్థ ‘అస్తిత్వం’! తెలుగులో మాట్లాడడాన్ని ప్రోత్సహించడం నుంచి… పిల్లలు, మహిళలు, యువతలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు నిర్వహించడం వరకు… ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని అందరికీ తెలిపేలా తమవంతు ప్రయత్నం చేస్తోంది ఈ సంస్థ. వ్యాస రచన, డిబేట్, డ్రాయింగ్ క...

"మార్కాపురం తిరునాళ్ళు నాకు చాలా ఇష్టం!" | మా ఊరు - 74 01.06.2026

“వేసవి సెలవులు వచ్చాయంటే చాలు… అమ్మమ్మ ఊరు, కజిన్స్‌తో ఆటలు, తిరునాళ్ల సందడి… ఇవన్నీ ఇప్పటికీ మనసులోనే ఉన్నాయి…” అంటూ తన బాల్య జ్ఞాపకాలను ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు... సౌజన్య గారు! ప్రకాశం జిల్లా మార్కాపురం గురించి మాట్లాడుతూ… అక్కడి టెంపుల్స్ గురించి, తిరునాళ్ల గురించి, చెప్తూ.. చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తూ...

ఈమె కథ వింటే ఒక మొక్క నాటాలనిపిస్తుంది | కొల్లాక్కాయిల్ దేవకీ అమ్మ 30.05.2026

బాధను మరవడానికి మొక్కలు నాటింది.. ఇప్పుడదే అడవిగా మారింది! పర్యావరణం మీద ప్రేమ ఉంటే చాలు, వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు కేరళకు చెందిన కొల్లకాయిల్ దేవకీ అమ్మ.... 80 ఏళ్ల వయసులో, వణుకుతున్న చేతులతో కాకుండా, మొక్కలు నాటాలనే గట్టి పట్టుదలతో ఆమె చేస్తున్న పనిని చూస్తుంటే ఎవరికైనా ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది, ప్రకృతి మీద ఆమెకున్న ఆ అపారమైన ప్రేమకి అప్రయత్నంగానే మన త...

చిట్టి పొట్టి క్రిములు | Super Girls Series - 7 29.05.2026

మన కంటికి కనిపించని శత్రువులు ఎవరో తెలుసా? వాళ్లు ఎలా వస్తారు? మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తారు? మరి వాళ్లను ఆపే సూపర్ పవర్ ఏంటి? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఈ కథ మీరూ వినాల్సిందే.. మీ పిల్లలకూ వినిపించాల్సిందే..! జెర్మ్స్ అంటే ఏంటి, శుభ్రత ఎందుకు అవసరం, సబ్బు ఎలా పని చేస్తుంది, ఇమ్యూనిటీ ఎందుకు ముఖ్యం… వంటి ఎన్నో విషయాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిన అందమైన కథ ఇది! ఒక వైపు చిట్టి పొట్ట...

పిల్లలు మాట్లాడితే మార్పు మొదలవుతుంది | Special Interview | School Radio 28.05.2026

“పిల్లలు మాట్లాడరు” అనేది సమస్య కాదు… “వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు” అనేదే అసలు సమస్య! అందుకే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు, ఆత్మవిశ్వాసానికి ఒక వేదికగా మారుతోంది School Radio. 10,000+ విద్యార్థులు, టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి… 7,000+ unique voices‌ను ప్రపంచానికి వినిపిస్తూ… 22 రాష్ట్రాల్లో పిల్లల ఆలోచనలకు ఒక వేదికగా మారింది ఈ రేడియో. రేడియోలో మాట్లాడడం నేర్పించే ప్రయత్నం మాత్రమే కాదు ఇది… భ...

Herbal Tea తో ఆరోగ్యం పదిలం | ఆయుర్వేదం ఆరోగ్యం - 102 | Part - 2 27.05.2026

మనం రోజూ తాగే టీ… ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మొదటి పాడ్కాస్ట్ లో తెలుసుకున్నాం కదా!హెర్బల్ టీ అంటే ఏంటి? తులసి, అల్లం, పుదీనా, దాల్చిన చెక్క వంటి సహజ మూలికలతో చేసే టీలు శరీరానికి ఎలా ఉపయోగపడతాయి? ఇమ్యూనిటీ, జీర్ణక్రియలు మెరుగుపడడం కోసం అవి ఎలా సహాయపడతాయి? వంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు చాలా క్లియర్‌గా వివరించారు. ఇప్పుడు Part-2లో…ఎవరెవరు ఏ హెర్బల్ టీ త...

Άκου το podcast TALRadio Telugu στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS