Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com
Δημιουργός
Touch A Life Foundation
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
1 Οκτ 2026
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
"మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli 28.04.2026 45:46
మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే… మన చుట్టూ ఉన్న అందరు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ.. బాలల హక్కుల కోసం, తన జీవితాన్నే అంకితం చేశారు చందన మరిపల్లి గారు! ఒక పిల్లాడి రక్షణ వెనుక ఉండే సామాజిక బాధ్యతను ఎన్నో విధాలుగా వీరు సమాజంలోకి తీసుకెళ్తున్నారు. అసలు పిల్లల రక్షణ పరంగా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు.. జు...
"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69 27.04.2026 26:00
మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా.. మన ఊరి మట్టి వాసన ఇచ్చే సంతృప్తి మరెక్కడా దొరకదు కదా! సియాటెల్ లో ఉంటున్న శ్రీరామ్ పాటిబండ్ల గారు, తన సొంత ఊరు తెనాలిని ' ప్యారిస్'గా పిలుస్తారని ఎంతో గర్వంగా చెప్తూ, అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా మనతో పంచుకున్నారు. ఇంకా, వాళ్ళ ఊరి సంస్కృతి గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన మూలాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న...
మఖీలాల్ అనే ఒక ఈగ కథ! | Super Girls Series - 2 24.04.2026 8:45
పిల్లల కోసం రేడియో కథలు! అనగనగా… మక్కీపురి అనే ఒక ఊరు! ఆ ఊర్లో మక్కీలాల్ అనే ఈగను దైవంగా పూజించేవారు. కానీ.. ఆ ఊర్లోకి వచ్చిన ఒక యువ డాక్టర్ కు మాత్రం ఈ పద్ధతి నచ్చక ఆ ఈగలన్నింటినీ తరిమేయాలని అనుకున్నాడు! అప్పుడు, ఆ ఊరి ప్రజలు మాత్రం వాటి శాపానికి గురౌతామేమో అని చాలా భయపడ్డారు…! తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలుసుకోడానికి TALRadio వినండి! Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” ల...
మనసు ఫౌండేషన్ తో అక్షరం పదిలం.. మూడు కోట్ల పేజీల డిజిటలైజేషన్ | Special Interview 24.04.2026 29:44
పుస్తకం ఇస్తే ఫ్రీగా డిజిటలైజ్ చేసి, సాఫ్ట్ కాపీ ఇస్తారట వీళ్ళు! సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడులు కట్టించడమో.. అన్నదానాలు చేయడమో చేస్తుంటారు, కానీ అక్షరానికి ఆయుష్షు పోస్తూ, జ్ఞానాన్ని భద్రపరిచే ఒక వేదికను నిర్మిస్తున్న వీరి గురించి మీకు తెలుసా? అవును.. గత రెండు దశాబ్దాలుగా 'మనసు ఫౌండేషన్' వారు సుమారు 3 కోట్లకు పైగా అరుదైన పేజీలను డిజిటలైజ్ చేసి తెలుగు సాహిత్య సంపదను కాపాడు...
లివర్ సమస్యలా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవే ! | ఆయుర్వేదం ఆరోగ్యం - 98 22.04.2026 28:30
లివర్ ఆరోగ్యంగా ఉంటేనే.. మన ఆరోగ్యం బాగుంటుంది! కానీ ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల వల్ల చాలామంది లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అసలు లివర్ ని ఆరోగ్యంగా గా ఉంచుకోవడం ఎలా? ఆయుర్వేదంలో దీనికి ఉన్న పరిష్కారాలేంటి? అందుకు మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్ గా వివరించారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!...
"ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta 21.04.2026 43:43
అమెరికాలో డేటా బేస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి తెలుగు వారిని ఒక దగ్గర కలుపుతూ మన సంస్కృతిని, మన భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్న అరుణ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం 'విజేత' కార్యక్రమంలో! వృత్తిరీత్యా టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నా, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉంటూ మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈమె. అసలు ఆమె చేస్తున్న కార్యక్రమాలేంటో, ఈ భాషా సేవ వెనుక...
కోకిల యొక్క అద్భుతమైన కుండ | Super Girls Series - 1 17.04.2026 6:48
పిల్లల కోసం రేడియో కథలు…! ఒక ఊర్లో కోకిల అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒకరోజు ఒక అద్భుతమైన కుండను కొన్నది… ఆ కుండ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె జీవితమే అద్భుతంగా మారిపోయింది. మరి అసలు ఆ కుండ చేసిన మాయలేంటి? కోకిల జీవితాన్ని ఆ కుండ ఎలా మార్చింది? ఆ కుండ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ కథలో మనం తెలుసుకోవచ్చు… తప్పకుండా వినండి.. వినిపించండి.. అస్సలు మిస్ అవ్వకండి! Katha.org తో కలిసి TALRad...
ఇది కేవలం Walkathon మాత్రమే కాదు... పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక వేదిక! | Special Interview With Rider Josh 17.04.2026 18:38
ఈ రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలు, ఫోన్లు.. అంటూ నాలుగు గోడలకే పరిమితమైపోతున్నారు.. వారిలో శారీరక దృఢత్వం, వారి లక్ష్యం పట్ల సరైన అవగాహన తగ్గిపోతున్నాయనే ఆందోళన మనందరిలోనూ పెరిగిపోతుంది! కానీ, పిల్లల భవిష్యత్తు అంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడే వారు అద్భుతాలు సాధించగలరని నమ్ముతోంది 'రైడర్ జోష్ ఫౌండేషన్'. అందుకే, వారిలో ఆత్మవిశ...
"కాన్సెప్ట్ అర్ధం చేసుకోవటమే అసలైన చదువు" - Raghava, Sravani | Special Interview 13.04.2026 41:20
చదువు అంటే కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టడం, మార్కులు సాధించడం మాత్రమే కాదు.. విద్య మనలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మన ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు వాటిని నేర్చుకుంటున్నారా? అన్న ప్రశ్న నుండే ఏర్పడింది… 'Ignis careers' సంస్థ! ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు కోల్పోతున్న ఆ ‘లైఫ్ స్కిల్స్’ ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు క...
ఒక చిన్న సాయం… ప్రపంచాన్ని మార్చగలదా? - Deepak Gumaledar | Special Interview 09.04.2026 38:20
మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి, వాళ్ళ ముఖంలో కనిపించే ఆ చిరునవ్వుని చూసి ఆనందించారా? అయితే.. ఒక్కసారి మీరు Random Act of Kindness సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే! Project Vidya, Project Kreeda, Project Grooming, Project Animals… ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో విషయాల్లో తమ చుట్టూ ఉన్న సమాజానికి సహాయం చేస్తూ, సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ కూర్చ...
"చిరంజీవి గారి డాన్స్ కి వీరాభిమాని ని... " - ఉదయ్ శంకర్ | Part-2 | మా ఊరు - 68 06.04.2026 48:02
మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు. ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడా...
"Autism పిల్లలున్న తల్లిదండ్రులకు మేము ట్రైనింగ్ ఇస్తాము" - శారద రామ్ | Special Interview 03.04.2026 33:04
పిల్లలు పిలిచినా పలకకపోయినా, అందరిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నా.. అది వారి మొండితనం అనుకుంటుంటాం. కానీ, ఆ చిన్న చిన్న సంకేతాలే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆటిజం లక్షణాలు కావచ్చు! అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేక చాలామంది దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లలకు చిన్నప్పుడే సరైన థెరపీ ఇస్తే, వారిల...
వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలర్జీలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 97 01.04.2026 25:32
ప్రస్తుత కాలంలో వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు ముఖ్యంగా కాలం మారుతున్నప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అలర్జీస్. గాలి, నీరు, ఆహారం ఇలా రకరకాల కారణాల వల్ల అలర్జీస్ వస్తుంటాయి. అసలు అలర్జీ అంటే ఏంటి? ఎలా వస్తాయి? ఆయుర్వేదంలో వీటికి పరిష్కారాలు ఏంటి? అలాగే అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారు ఈ వారం మన ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో చక్కగా వివర...
"నా స్కూల్ స్నేహితులు చేసిన సాయం మరిచిపోలేనిది.." - Udaya Sankar - Part 1 | మా ఊరు - 67 30.03.2026 36:24
సొంత ఊరు అనగానే మనకు గుర్తొచ్చేవి.. పచ్చని పొలాలు, సందడి చేసే స్కూల్ రోజులు, ప్రాణస్నేహితులతో ఆడుకున్న ఆటలు! నిజానికి చిన్ననాటి స్నేహాలు చాలా బలంగా ఉంటాయి, అవి కాలం గడిచే కొద్దీ మన మనసులో అలాగే పదిలంగా నిలిచిపోతాయి. మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో ఉంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, తన ఫ్యామిలీ గురించి, వారి స్కూల్ జ్ఞాపకాలను గురించి ఈ ఎపిసోడ్‌లో మనతో పంచుక...
"భూమి మీద ఉండే ప్రతి ప్రాణి ముఖ్యమయినదే " -Pradeep Parakuth,Founder | Animal Warriors Conservation Society 30.03.2026 39:59
ప్రకృతిలో జంతువులు లేకపోతే మనుషులు జీవించడం సాధ్యం కాదు. మరి అలాంటి మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే… జంతువుల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.. 'Animal Warriors Conservation Society' వాళ్ళు. ఆపదలో ఉన్న జంతువులను వారు ఎలా కాపాడుతున్నారు? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు ప్రతి జీవి పట్ల మనం ఎందుకు ప్రేమతో ఉండాలి? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆ సంస్థ ఫౌండ...
చెట్లకి పునర్జన్మ ఇస్తున్న Tree Man of India | Special interview 26.03.2026 27:13
అభివృద్ధి పేరుతో.. ఇళ్లు కట్టుకుంటూ.. రోడ్లు వేసుకుంటూ.. అడ్డువచ్చిన చెట్లన్నింటినీ తొలగించడం గురించి మనం వింటూనే ఉంటాం! కానీ, అభివృద్ధి అంటే వినాశనం కాకూడదని.. పచ్చని చెట్లకు ప్రాణదానం చేస్తూ, వాటిని ఒక చోటు నుండి మరో చోటుకి సురక్షితంగా తరలిస్తూ (Tree Translocation) పునర్జన్మ నిస్తున్నారు… 'ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా' గా పేరుపొందిన వటా (VATA) ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ కృష్ణ గారు. పెద్ద పెద...
"మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66 23.03.2026 46:36
మన ఊరి పేరు వినగానే మనలో ఏదో తెలియని ఒకరకమైన ఆనందం కలుగుతుంది కదా! చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు, స్కూల్‌కి వెళ్లిన రోజులు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. అందుకే.. ప్రస్తుతం సియాటెల్ లో ఉంటున్నా, మన సంస్కృతిని మర్చిపోకుండా అక్కడి వారికి మన 'కోలాటం' నేర్పిస్తూ తెలుగుతనాన్ని చాటుతున్నారు Isha Dance Academy కి చెందిన కీర్తి లక్ష్మీ గారు. విదేశీ పక్షుల సందడితో కళకళలాడే పులికాట్...
"అందరికీ హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పటమే మా లక్ష్యం" - కిషోర్ | Special interview 23.03.2026 25:46
బైక్ రైడింగ్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కు వెళ్లడం మాత్రమే కాదు. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. మరి మనం బైక్ నడుపుతున్నపుడు ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా హెల్మెట్ ఎంచుకునేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? అసలైన సేఫ్టీ హెల్మెట్ అంటే ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్నెస్ డే' సందర్భంగా 'బైకర్స్ ఆఫ్ హైదరాబాద్' క్లబ్ కెప్టెన్ కిశోర్ గారు ఈ ప్రత్యేక...
"ఒకే రాత్రిలో నిర్మించిన పెద్ద కోనేరు మా ఊరి ప్రత్యేకత" - అనీల కామసాని | మా ఊరు - 65 16.03.2026 43:05
మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి స్థాయిలో ఉన్నా పుట్టి పెరిగిన ఊరు ఇచ్చే ఆత్మీయత ఎక్కడా దొరకదు. పుంగనూరు గ్రామం గురించి, అక్కడి ప్యాలెస్ లో తాను చదువుకున్న రోజుల గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనీల కామసాని గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. ఆమె బాల్య స్మృతుల గురించి, ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ తమ సొంత ఊరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. తప్పకుండా చూడ...
కాలేజ్ నుండి కార్పొరేట్ ప్రపంచంలోకి... ఎలా సిద్ధమవ్వాలి? | Special Interview with Key Run 16.03.2026 33:46
క్యాంపస్ లైఫ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ నుంచి కెరీర్ అనే బాధ్యతాయుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతి విద్యార్థిలోనూ ఎన్నో సందేహాలు, భయాలు ఉండటం సహజం. మరి స్టూడెంట్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీగా మారే క్రమంలో మనలో ఎలాంటి మార్పులు రావాలి? కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ కెరీర్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ Key Run గారు ఈ ప్రత్యేక ఇంటర్వ...
మొదటి 'నెలసరి' - శారీరక మార్పులు , ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 96 11.03.2026 27:10
అమ్మాయిల జీవితంలో మొదటి నెలసరి అనేది ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు పిల్లలను కొంత ఆందోళనకు గురిచేయడం సహజం. అసలు ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదం సూచించే ఆహార నియమాలు ఏంటి? ఎదుగుతున్న అమ్మాయిలకు ఈ సమయంలో తోడుగా ఉంటూ, వారిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి? వంటి ఎన్నో సందేహాలకు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చక్కని పరిష్కారాలను...
"తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 64 | Part - 2 09.03.2026 31:53
సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన ఎన్నో జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు గత వారం మనతో పంచుకున్నారు కదా! ఈ వారం తన పెళ్లి కబుర్లు, అమెరికాకు వెళ్లిన నాటి ముచ్చట్లు వంటి విషయాలను పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి “మా ఊరు” పాడ్కాస్ట్ ను.. అస్సలు మిస్ అవ్వకండి! From running a small shop i...
వీధి పిల్లలకు విద్యా వెలుగులనిస్తున్న ఇద్దరు మహిళలు | Special Interview 09.03.2026 28:36
చదువు మాత్రమే మన పరిస్థితులను మార్చగలదు. మన కలలను నిజం చేయగలదు.. అని బలంగా నమ్మిన సంస్థ ‘చోటు కి ఎడ్యుకేషన్’. ఒక చిన్న వీధిలో అతి తక్కువ ఖర్చుతో ఓ గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పుడు వంద మంది దాకా నిరుపేద పిల్లలకు పాఠాలు చెప్తోంది. మరి ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? భవిష్యత్తులో నిరుపేద పిల్లల కోసం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? వంటి ఎన్నో విషయాలను ఆ సంస్థ కో -...
మోనోపాజ్ పై అవగాహన ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 95 04.03.2026 31:31
మోనోపాజ్.. ఇది ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక సహజమైన మార్పు. కానీ, ఈ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చాలామందిని అయోమయానికి గురిచేస్తాయి. అసలు ఈ దశను ఆరోగ్యంగా, ప్రశాంతంగా దాటడం ఎలా? ఆయుర్వేదం ఈ మోనోపాజ్ గురించి ఏం చెబుతోంది? మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఈ హార్మోన్ల మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను ఎలా తగ్గిస్తాయి? వంటి ఎన్నో విలువైన...
"తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 63 02.03.2026 29:08
సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు ఈ వారం "మా ఊరు" పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! From running a small shop in his hometown and having fun with childhood friends to becoming a City Council Member in Bothell,...
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS