Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 episódios

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Touch A Life Foundation

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Leadership skills of Krishna & it's relevance to youth and leaders today | Smart To Wise-12 03.08.2023

నాయకత్వం ఒక హోదా మాత్రమే కాదు, ఓ బాధ్యత. సమిష్టి లక్ష్యం వైపు అందరినీ నడిపించే కర్తవ్యం. భిన్నమైన మనస్తత్వాలను సామరస్యంగా కలుపుకుంటూ, గమ్యం దిశగా సాగే ప్రయాణం. ఆ బరువును మోయడం అంత తేలిక కాదు. మరి నాయకుడు కావాలంటే ఎలా, నిజమైన నాయకుడి లక్షణం ఏమిటి, మనలో వాటిని పెంపొందించుకోవడం ఎలా… ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు కోసం ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైప గారిని అడిగాము. వారి విశ్లేషణ విని తీరాల్సింద...

అతని ఆశయం… దేశానికి గర్వకారణం అయింది! Inspiring Story of TVS | Life Mantra-18 02.08.2023

T.V సుందరం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ TVS అన్న పేరు మాత్రం ఇంటింటికీ పరిచయమే! ఆటోమొబైల్ అంటే విదేశీ దిగుమతులే అనే రోజుల్లో… ఆ రంగంలో ఓ సంస్థను ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపించారు సుందరం. వేల కోట్ల వ్యాపార సంస్థగా, వేలమందికి ఉపాధి కల్పించే కంపెనీగా దాన్ని రూపొందించారు. కుటుంబం అంతా కలిపి నడిపే conglomerate కంపెనీలకు ఆదర్శంగా నిలిపారు. ఈ విజయం వెనుక అనూహ్యమైన శ్రమ ఉంది. సాటిలేని పోరాట...

బలహీనత అంటూ ఏది ఉండదు అని చెప్పే కథ! 01.08.2023

ఈ ప్రకృతి ప్రతి ఒక్కరికీ, తన జీవితాన్ని గడిపేందుకు కావల్సినంత నైపుణ్యం ఇస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే పట్టుదల అందిస్తుంది. కానీ చాలాసార్లు మనకు అందుబాటులో లేని వనరు గురించి ఆలోచిస్తుంటాం. ఇతరులతో పోల్చుకుని దురదృష్టవంతులం అని భావిస్తుంటాం. అలాంటి ఆలోచన వచ్చిన ప్రతిసారీ వినితీరాల్సిన కథ ఇది. ఇది ఓ కుర్రవాడికి తన గురువు అందించిన పాఠం కాదు… ఓ జీవిత సూత్రం! Nature would provide enough grit a...

7 Habits For Healthy Mind 31.07.2023

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా సూచనలే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే సంతోషం, ప్రశాంతత లేకపోతే ఎంత సంపాదించినా, ఏ హోదాలో ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా వృధానే కదా! అందుకే మానసిక ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. వారి సూచనల నుంచి ఒక 7 మార్గాలను మీ ముందు ఉంచుతున్నాం. Everything in life seems to be futile if our mind...

ఆదివాసి పిల్లలను అంతర్జాతీయ క్రీడల్లో నిలబెట్టాలి | Spurthi Kiranalu 31.07.2023

అడవిబిడ్డల్లో సహజంగానే క్రీడానైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి. బల్లెం విసరడం, విల్లు వదలడం, పరుగుతీయడం… లాంటి ఆటల్లో వాళ్లకు వారే సాటి. ఈ నైపుణ్యాలను మనం గుర్తిస్తే. వారు అంతర్జాతీయ స్థాయికి చేరేందుకు తగిన సహకారం ఇస్తే, అద్భుతాలు జరుగుతాయి కదా అని ఆలోచించారు వంశీధర్ కాళిదాసుగారు. తనకంటూ భిన్నమైన వృత్తి ఉన్నప్పటికీ, ఆదివాసుల కోసం Children of The Forest పేరుతో ఒక సంస్థను స్థాపించారు. అసాధరణమైన వారి లక్ష్య...

ఒడిషా సినిమా దిశ మార్చిన కవులు! | సాహితీ స్రవంతి -38 29.07.2023

సినిమాకు వాణిజ్యపరమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మొదటి నుంచీ దాన్ని ఓ వ్యాపారంలో భాగంగానే చూసేవారు. అందులో కనిపించే నటన, వినిపించే సాహిత్యానికి కళాత్మక విలువలు ఉండవని నమ్మేవారు. కానీ కొంతమంది కవులు, రచయితలు… సినీ సాహిత్యాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగులో అయినా ఒడిషాలో అయినా ఇలాంటి మినహాయింపులు కనిపిస్తాయి. ఒడిషా చిత్రసీమ విలువ పెంచిన జయంత్ మహాపాత్ర, సచ్చిదానంద్, సీతాకాంత్ మహాపాత్రలను ఈ స...

పడిలేచిన కెరటం | సముద్రఖని Story | Life Mantra - 17 28.07.2023

సముద్రఖని ఇప్పుడు అందరికీ తెలిసిన నటుడే. అలవైకుంఠపురం నుంచి బ్రో వరకు తన పేరు మారుమోగిపోతోంది. తన నటన ఎంత వైవిధ్యమో… జీవితమూ అంతే. నటుడిగా నిలబడేందుకు, ఈ స్థాయికి చేరుకునేందుకు… తను దాటిన సవాళ్లు, తట్టుకున్న కష్టాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Celluloid isn’t just a single story. It’s a place where people from different lives would come together… and they too have their own stories. One such pe...

Diet For Diabetes | Know Your Plate - 11 28.07.2023

డయాబెటిస్ ఓ సమస్య మాత్రమే కాదు. మరెన్నో అనారోగ్యాలకు దారితీసే తోవ. మధుమేహం వచ్చాక లేదా రాకుండే ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఏది నమ్మాలి, దేన్ని పాటించాలి అన్నది నిశ్చయించడం కష్టం. అందుకే ఈవారం ప్రముఖ పోషకాహార నిపుణురాలు, ఆశ్రితగారిని ఈ విషయం అడిగాము. దానికి వారు ఇచ్చిన విశ్లేషణ, పాటిస్తే మధుమేహం అదుపులో ఉన్నట్టే! Diabetes isn’t just a p...

What Is Dharma & How It Fulfills Our Life | Smart To Wise - 11 27.07.2023

ధర్మం… ప్రవచనాల్లో కనిపించేది, పురాణాల్లో వినిపించేది మాత్రమే కాదు. విలువలకు కట్టుబాటు. లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతానికి ఆదిమరూపం. కానీ దాని గురించి స్పష్టత తక్కువ. ఏమిటీ ధర్మం! దాన్ని ఎందుకు ఆచరించాలి? అనే అనుమానాలు. అందుకే ఈవారం Smart To Wise కార్యక్రమంలో ప్రసాద్ కైపగారి ముందు ఈ సంశయాలను ఉంచాము. భారతీయ ఆలోచనా విధానం గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన ప్రసాద్ గారు ఈ విషయమైన చెప్పిన విశ్లేషణ వి...

ఆటలు, అమ్మపాలతో పాటు… బాలసాహిత్యమూ అవసరమే! | నారంశెట్టి ( మొదటిభాగం) | మన రచయితలు-24 27.07.2023

బాలసాహిత్యం… ఒక కాలక్షేపం మాత్రమే కాదు. పిల్లల ఊహలకు రెక్కలిచ్చే మంత్రం. వారిలో విలువలు పెంచే మార్గదర్శి. సలహాలు అందించే నేస్తం. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువులతో సమానంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దే అక్షరం. దాని విలువ గ్రహించిన నారంశెట్టి ఉమామహేశ్వరరావుగా, ఓ పక్క ఉన్నతోద్యోగం చేస్తూనే వందల కథలు, వ్యాసాలు, గేయాలు సృజించారు. సాహిత్య అకాడెమీ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మాటలు కనుక వి...

జగమంత కుటుంబం తనది… Vinayak Lohani 26.07.2023

వినాయక్ లోహాని తండ్రి IAS, తనేమో ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చదివారు. ఆ తర్వాత ఐఐఎమ్ కలకత్తాలో ఎంబీఏ. ఆర్థికంగా అద్భుతమైన కెరీర్ నడిపించేందుకు ఇవి సరిపోతాయి. కానీ వివేకానందుని స్ఫూర్తితో ఆయన అనాథశ్రమాన్ని స్థాపించారు. వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తన స్ఫూర్తి, చేసిన ప్రయాణం నిజంగా ఓ సాహస గాథను తలపిస్తాయి. Vinayak Lohani has comes from a background where his father is an IAS and V...

టచ్ స్టోన్ కథ వింటే ఆశ మనల్ని ఎంత మోసం చేస్తుందో తెలుస్తుంది 25.07.2023

అనగనగా ఓ టచ్ స్టోన్. అది చేతికి చిక్కితే ఇక తిరుగు ఉండదు. ఆ నిజం తెలిసిన దంపతులు, దాన్ని వెతికే పనిలో పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే…! ఈ కథ వినాల్సిందే. ఆలోచన లేని అలవాటు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందో, అత్యాశ ఏ తీరానికి చేరుస్తుందో చెప్పే ఈ కథ మన జీవితాల్నే మార్చేస్తుంది. Here is a wonderful story of a couple who came to know about the all powerful Touch Stone and way to achieve it. Did they ge...

దటీజ్‌ సీతాలక్ష్మి | పిల్లల తలరాతలు మారుస్తున్న టీచర్ 24.07.2023

సాటి మనుషుల సమస్యల పట్ల సానుభూతి ఉంటే… మార్పు తేవాలి అన్న ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనకు నిబద్ధత తోడైతే, అదే అద్భుతాలు చేయిస్తుంది. అందుకు ఉదాహరణే తమిళనాడుకు చెందిన ఈ టీచర్. తన బాధ్యత చదువు చెప్పడం మాత్రమే అనుకోలేదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం అనుకుంది. వారి చదువు, బాగోగులు, భవిత కోసం ఆలోచించింది. అటు తను పనిచేస్తున్న బడినీ, ఇటు అందులోని విద్యార్థులనూ కూడా ఒద్దికగా మార్చేసింది. ఇంతకీ సీతాలక్ష్...

తన ప్రతి సినిమా ఓ క్లాసిక్! | బాసు చటర్జీ | సాహితీ స్రవంతి - 37 22.07.2023

మధ్య తరగతి జీవితాలను, భావోద్వేగాలను వెండి తెర మీద చూపిన ప్రతిభావంతుడు బాసు ఛటర్జీ. 1960 తర్వాత... హిందీ చిత్రసీమ ఏలిన దర్శకుడు. ఇప్పటికీ తన పేరు చెబితే చోటీ సీ బాత్ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన గురించి మరిన్ని విశేషాలు. Basu Chatterjee is a renowned director who depicted middle class lives and human emotions. He is one of the directors who added value to Hindi movie industry after 1960s. H...

విజయాన్ని వాయిదా వేయకండి! 21.07.2023

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఉన్నతంగా జీవించాలనీ, క్రమశిక్షణతో గడపాలనీ ఉంటుంది. కానీ వాయిదా వేయడం అనే లక్షణం… మన ఆశయాలను తలకిందులు చేస్తుంది. మన విలువను తగ్గించేస్తుంది. చిన్నగా తోచే ఈ బలహీనతను ఒప్పుకోలేక, దాటలేక… కాలాన్ని వృధా చేసుకునేవారు ఎంతోమంది. అందుకే ఈ వాయిదా వేయడాన్ని ఎలా మానుకోవాలో, నిపుణుల సలహా ఆధారంగా చెప్పే ప్రయత్నమిది. Procrastination might seem to be a small and no...

Nutritional Care For PCOD | Know Your Plate - 10 21.07.2023

PCOD హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే సమస్య. జన్యుపరమైన కారణం ఇందుకు కీలకం. PCOD ఇతరత్రా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కాబట్టి, ఈ పరిస్థితి ఉందని తెలిసినప్పుడు కంగారుపడటం సహజం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, దాని ఫలితాలను కూడా నియంత్రించవచ్చు. అందులో ఆహారం కీలకం. PCOD ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి… లాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మనకు చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిప...

Work with Grace - Finding Calmness, Dedication, and Focus! | Smart To Wise - 10 20.07.2023

పని ముఖ్యం, దాని ఫలితమూ ముఖ్యమే! కానీ అంతకంటే ముఖ్యమైన విషయం… ఆ పనిని ప్రశాంతంగా చేయగలగడం. ఏకాగ్రత సడలకుండా, ఒత్తిడికి లోనవకుండా రోజువారీ పనుల దగ్గర నుంచీ కెరీర్ లక్ష్యాల వరకూ పూర్తి చేయడం. నూటికి నూరు శాతం దృష్టి పెడుతూనే ప్రశాంతంగా పనిచేయడం అనేది అసాధ్యం అనుకుంటారు చాలామంది. ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైప గారు మాత్రం అది సాధ్యమే అని చెబుతున్నారో. ఎలాగో కూడా మార్గం చూపిస్తున్నారు. Working...

అధ్యయనంతోనే మంచి రచనలు సాధ్యం | మంథా భానుమతి | మన రచయితలు 23 20.07.2023

మంథా భానుమతి. సాహిత్యం పట్ల తనకు ఉన్న ఆసక్తి కేవలం పుస్తకాలు చదవడంతో ఆగిపోలేదు. ఉన్నత చదువులు, ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో తలమునకలై ఉన్నా ఆ ఆసక్తి వీడలేదు. అందుకే రిటైర్మెంట్ తర్వాత విస్తృతంగా రాయసాగారు. కథ, నవల, పద్య సాహిత్యం మీద తనదైన ముద్ర వేశారు. కష్టసాధ్యంగా తోచే చారిత్రక రచనలు చేయడంలో ప్రత్యకత నిరూపించుకున్నారు. నిరంతర అధ్యయనం, క్రియాశీలతే మంచి జీవితానికైనా, రచనకైనా ముఖ్యం అని చెబుతున్న భానుమ...

జీవితాన్ని మార్చేసే ఐడియాల కోసం! 19.07.2023

ఓ ఐడియా జీవితాన్నే కాదు… లోకాన్నే మార్చేయవచ్చు. కానీ అలాంటి ఉపాయం స్ఫురించేదెలా! మన సృజన కాస్త పదునుపెడితే అద్భుతమైన ఆలోచనలు వస్తాయనీ, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనీ చెబుతున్నారు నిపుణులు. అందుకోసం కొన్ని ఉపాయాలు కూడా సూచిస్తున్నారు. అవేంటో ఓసారి విందామా. Being creative isn’t just based on our genes or growth. Creativity can be nurtured and sharpened through some habits and certain process...

Starbucks విజయం వెనుక ఓ భారతీయుడు - లక్ష్మణ్ నరసింహన్! 18.07.2023

స్టార్ బక్స్… కాఫీ రంగంలో తిరుగులేని పేరు. వేల కోట్ల ఆ బిజినెస్ నష్టాల్లో నడుస్తున్నప్పుడు, దాన్ని సరిదిద్దేందుకు ఎంచుకున్న వ్యక్తి- లక్ష్మణ్ నరసింహన్. లక్షణ్ గతం అంతా సంచలనాలే. నష్టం తప్ప మరో మార్గం లేదనుకున్న సమయంలో తను అద్భుతమైన విజయాలు సాధించి చూపారు. ఇంతకీ ప్రత్యేకత ఏమిటి. తన విజయం నేర్పే నైపుణ్యం ఏమిటి? ఈ పాడ్ కాస్ట్ ద్వారా తెలుసుకుందాం. Laxman Narasimhan has created history by becoming CEO...

అతను అడవిని సృష్టించాడు | Forest Man of Kerala 17.07.2023

ఓ మనిషి అడవిని సృష్టించగలడా! అబ్దుల్ కరీం గురించి వింటే అది సాధ్యమే అనిపిస్తుంది. అందరూ పిచ్చివాడనుకున్నా, కుటుంబం సైతం వారించినా… పచ్చదనం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు అబ్దుల్. ఇంతకీ ఎవరీ అబ్దుల్. తను చేసిన పని ఏంటి. దేశమే తలతిప్పి చూపేందుకు తన ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది. తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ వినాల్సిందే! Can an ordinary man with limited financial resources could create a fore...

మధ్యతరగతి జీవితాల మీద వెండితెర వెలుగు | Sahithi Sravanthi - 36 15.07.2023

హృషి దా గా పిల్చుకునే హృషికేశ్ ముఖర్జీ… చరిత్రలో నిల్చిపోయే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆనంద్, గుడ్డి, నమక్ హరామ్ లాంటి ఆయన సినిమాలు కేవలం హిట్స్ మాత్రమే కాదు… ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్స్ గా నిలిచాయి. ఎడిటర్, రచయితగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్న… ఈ అరుదైన దర్శకుడి గురించి ఈ వారం సాహితీ స్రవంతిలో విందాం. Hrishikesh Mukherjee fondly called as Hrishi Da is one of the legendary directors from...

హాసిన్‌ జీవితం ఎందరికో స్ఫూర్తి 14.07.2023

జీవితం మనం ఏదైనా సాధించగలిగేందుకు కావల్సినంత నైపుణ్యం, తెలివి ఇస్తుంది. కాకపోతే మనమే చాలాసార్లు బద్ధికించేస్తూ ఉంటే. ఏదో ఒక సాకు చెప్పి, పట్టు సడలించేస్తుంటాం. పరాజయం కోసం ముందుగానే సవాలక్ష కారణాలు వెతికేస్తాం. కానీ కొంతమందిని గమనించినప్పుడు, చాలా ప్రేరణ కలుగుతుంది. బలహీనతల్ని పక్కకి నెట్టి, మనం కూడా అద్భుతం సాధించాలనిపిస్తుంది. అదిలో అలాంటి ఓ వ్యక్తి కథే ఇది. ఇంతకీ తన ప్రత్యేకత ఏమిటి. తన గురించి...

సాహిత్యం సమాజానికి అండగా ఉండాలి | కె.ఎన్.మల్లీశ్వరి (రెండో భాగం) | మన రచయితలు - 22 13.07.2023

కథ, నవల, విమర్శ, కాలం, సంపాదకత్వం… వీటిలో ఏదో ఒక రచనా ప్రక్రియలో పట్టు సాధించడం అభినందించదగ్గ విషయం. కానీ అన్నింటా తనదైన ముద్ర వేసుకోవడం అరుదు. ఆ ప్రత్యేకత అందుకున్న రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరి గారు. సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న మల్లీశ్వరిగారు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ద్వారా సామాజిక సమస్యల మీద నినదించేందుకు కూడా సాహితీరంగాన్ని ప్రభావితం చేస్తున్నారు. వారితో టాల్ రేడియో జరిపిన సంభాషణ...

Balancing Your Career and Personal Lives | Smart To Wise-9 13.07.2023

రోజురోజుకూ టెక్నీలజీ పెరుగుతోంది, రకరకాల సౌకర్యాలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటు మన అవసరాలూ పెరుగుతున్నాయి. వాటిని నెరవేర్చేందుకు నిరంతరం పరుగు తీయాల్సిన పరిస్థితి. కెరీర్ ఓ రణరంగంలా మారిన ఇలాంటి సందర్భంలో… పని ఒత్తిడి తప్పకుండా మన మనసు మీదా, బంధాల మీదా పడుతుంది. కెరీర్ ఎదుగుతూ ఉంటే కుటుంబ జీవనం పలచబడిపోతుంటుంది. ఇలా జరగకుండా మన ఉద్యోగాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా! ప...

Ouça o podcast TALRadio Telugu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos