Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Touch A Life Foundation
Categoria
Site do podcast
Último episódio
16 de nov de 2026
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? | Health Talk 16.11.2026 20:56
స్క్రీన్ చూస్తున్నప్పుడు మీ కళ్లను ఎన్ని సార్లు రెప్పవేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు.. మన రోజులో ఎక్కువ టైమ్ మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లతోనే గడిచిపోతోంది. ఇలా ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, మంట, ఎర్రబడటం, చూపు మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటినే Computer Vision Syndrome లేదా Digital Eye Strain అంటారు. అ...
ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు 12.11.2026 33:09
మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి! మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని కలిగిస్తాయి! అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమెకు కూడా అలాంటి ఆలోచనే కలిగింది. సమాజంలో తనలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది బాధితుల గురించి తెలుసుకున్నారు. కుటుంబ సహకారం లేకపోవడం, సమాజంలో చిన్నచూపు, ప్లాస్టిక్ సర్జరీపై సరైన అవగా...
అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 2 | అంతరంగాలు - 13 10.11.2026 36:02
తన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం! అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సాగిస్తున్న సేవా ప్రయాణం గురించి మొదటి ఎపిసోడ్‌లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఆమె వ్యక్తిగత జీవితం, సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. తక్కువ జీతం వచ్చిన రోజుల్లో కూడా నిరాడంబరంగా ప...
సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం నాకు ఒక ఎమోషన్! | మా ఊరు - 87 09.11.2026 33:37
అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు, కొంతకాలం విజయనగరంలో చదువుకున్నారు. వేసవి సెలవులు, దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం వెళ్లేవారట. ఆ ప్రయాణాల్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఉన్న అనుబంధం, రాజమండ్రి దగ్గర్లోని రుచికరమైన ఆహార పదార్థాలు.. ఇలా తన చిన్ననాటి ఎన్నో మధురమైన జ...
చిన్న పిల్లల దంతాలు - తెలుసుకోవాల్సిన విషయాలు! | Health Talk 09.11.2026 33:02
పిల్లల దంతాల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చిన్నప్పటి నుంచే పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రషింగ్ అలవాట్లు నేర్పించడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పాల దంతాల సంరక్షణ, పుచ్చుపళ్ల సమస్యలు, ఆహారపు అలవాట్ల ప్రభావం.. ఇలా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల దంత సంరక్షణ గురించి, పళ్ళు ఊడిపోయినపుడు తీసుకోవాల్సి...
అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12 03.11.2026 30:22
ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం కావడంతో నడవలేక రోడ్డుపై ఉండటం చూశారు. వెంటనే తన పనిని పక్కనపెట్టి, రిక్షా తీసుకొచ్చి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన మందులు కూడా కొనిచ్చారు. చిన్న వయసులో తాను చేసిన ఈ సహాయమే తన జీవితాన్ని ఎంతో ప్రభావి...
మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86 02.11.2026 30:36
చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు. బాల్యంలో స్నేహితులతో గడిపిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అంటూ… వాళ్ళ ఊరు పాలకొల్లు గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ వారం మా ఊరు కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు… ప...
Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special 02.11.2026 36:12
ఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది! 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను తల్లుల నుంచి వేరు చేస్తున్న విధానాన్ని చూసి ఎంతో బాధ పడ్డారు. ఆ ఒక్క సంఘటనతో పాలు, పాల ఉత్పత్తులను కొనడమే మానేశారు. ఆ తర్వాత మాంసాహారానికి కూడా దూరమై, పూర్తిగా వీగన్‌గా మారిపోయారు. ఆరోగ్యం కోసం కాదు.. జంతువుల పట్ల ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నార...
ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk 02.11.2026 25:16
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి! ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా స్క్రీన్ ముందు గడపడం.. ఇవన్నీ మన రోజువారీ అలవాట్లలో భాగమైపోయాయి. కానీ మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర స్వభావానికి సరిపోయే ఆహారం తీసుకోవడం...
స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11 27.10.2026 20:50
“అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!” అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి గారు. 1996లో కేవలం ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు అండగా నిలిచే స్థాయికి చేరింది. నాచారంలోని సాధన స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే సంస్థ ద్వారా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు విద్య, ప్రత్యేక శిక్షణ, వివిధ థెరపీలను...
గురజాడ , రాయవరం రెండు ఊర్లతో ఉన్న అనుబంధం నాది! |మా ఊరు - 85 26.10.2026 44:01
చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు! గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ గ్రామాల్లో చదువుకుంటూ, ఎన్నో ప్రాంతాల జీవన విధానాలను దగ్గరగా చూసారు. ఆ అనుభవాలతోనే జీవితంలో ముందుకు సాగారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసి, తన కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. మరోవైపు, పిల్లల చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, వారు ఉన్నత చదువులు చదివ...
చిన్న పిల్లలలో సీజనల్ జ్వరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Health Talk 26.10.2026 32:16
సీజన్ మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు వస్తే ఏం చేయాలి? వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం సహజం. అయితే, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల కూడా తల్లిదండ్రులు అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అ...
ఆకలి నుంచి పుట్టిన ఆలోచన..లక్షల మంది కడుపు నింపుతోంది! | స్పూర్తి కిరణాలు 22.10.2026 30:49
ఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు! చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు ఎదుర్కోకూడదని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇప్పుడు రోజుకు 2,000 మందికి పైగా ఆకలి తీర్చే ప్రయత్నంగా మారింది. ఆయనే Don’t Waste Food ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లేశ్వరరావు గారు! పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర వేడుకల్లో చాలాసార్లు తినడానికి మిగిలిపోయిన ఆహారం వృధ...
నిజాయితే నా ధైర్యం ! | ఆంతరంగాలు - 10 21.10.2026 39:44
ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎంతోమందికి అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన భర్త ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఆయనకు అండగా నిలిచారు. చికిత్స చేయించినప్పటికీ భర్తను కోల్పోయారు. ఆ తర్వాత తన కూతురితో కలిసి ముందుకు సాగారు. ఒకరోజు ఓల్డేజ్ హోమ్‌లో ఉన్న వృద్ధుల పరిస్థితి ఆమెను ఆలోచింపజేసింది. ఆదరించేవారు లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు అండగా నిలవాలనుకున్నారు. అలా 2003లో కి...
మైండ్‌సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk 21.10.2026 19:08
మనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం.. ఇలాంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి మన రోజును ఎల...
SIPs & మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా? |Smart Money Mindset - 13 15.10.2026 16:29
Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చాలామందికి Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ అసలు ఇవి సురక్షితమేనా? ఏ ఫండ్స్ ఎంచుకోవాలి? SIP ద్వారా పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే సందేహాలు ఉంటాయి. అందుకే.. ఈ వారం Smart Money Mindset – Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు Mutual Funds, SIPల గురించి మనతో...
కష్టాలని ఎదురించి .. పదిమందికి తోడుగా నిలిచిన అమ్మ | అంతరంగాలు - 9 14.10.2026 13:26
ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనను నమ్మిన వారందరికీ అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది.. ఆ తర్వాత కూడా చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఇంటర్, డిప్లొమా పూర్తి చేశారు భ్రమరాంబ గారు. ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను పెంచి, చదివించి, వారిని జీవితాల్లో స్థిరపడేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. కొడుకు దూరమయ్యాక.. కోడలు, మనవరాళ్ల బాధ్యతలను కూడా తన భ...
వరంగల్ యువకుడు .. ఆకాశవాణి నుంచి అమెరికా వరకు.. | మా ఊరు - 84 12.10.2026 44:06
కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే.. జీవితంలో ఎన్నో కొత్త దారులు కనిపిస్తాయి! వరంగల్‌లో చిన్న చిన్న అవకాశాలతో మొదలైన సదానందం గారి ప్రయాణం.. ఆకాశవాణి నుంచి టెలివిజన్ వరకు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నుంచి ఐటీ రంగం వరకు, వరంగల్ నుంచి అమెరికా వరకు సాగింది. చిన్నతనంలోనే ట్యూషన్లు చెప్పడం, ఆకాశవాణిలో పని చేయడం, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కెరీర్ మొదలుపెట్టి మేనేజర్‌గా ఎదగడం.. ఇలా ప్రతి దశలోనూ కొత్త విష...
పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? | Health Talk | World Hospice and Palliative Care Day Special 12.10.2026 35:05
అనారోగ్యంతో ఉన్నవారికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం! దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయంలో వారికి వ్యాధి నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తూనే, రోజువారీ జీవితాన్ని వీలైనంత సౌకర్యవంతంగా గడిపేలా చేయడమే Palliative Care యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతును అందించడం కూడా చాలా ముఖ్యం. మరి అసలు Palliati...
మధ్యతరగతి వాళ్లు రిచ్ అవ్వడానికి సింపుల్ టిప్స్ ! | Smart Money Mindset - 12 08.10.2026 12:35
జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం! చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తున్నామా? లేదా? అనేదే అసలు ప్రశ్న. అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Naval Ravikant ఆలోచనల ఆధారంగా సంపదను నిర్మించుకోవడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాల గురించి మనతో పంచుకున్నారు.. Financia...
రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula 08.10.2026 46:36
రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది! Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప...
సంగీతం గెలిపించిన జీవితం | అంతరంగాలు - 08 06.10.2026 15:25
సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది! చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ...
విశాఖపట్టణం లో మా స్కూల్ చాలా బావుంటుంది ! | మా ఊరు - 83 05.10.2026 34:30
మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి! అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్‌లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావర...
చిన్న పిల్లల బోన్ హెల్త్ - తప్పక తెలుసుకోవలిసిన విషయాలు ! | Health Talk 05.10.2026 38:24
పిల్లల ఎముకల విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం! పిల్లల ఎముకలు పెద్దవాళ్ల ఎముకలకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అవి ఎదుగుదల దశలో ఉండటంతో గాయాలను తట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆడుకునే సమయంలో పడిపోవడం, చేతులకు గాయాలు అవ్వడం, ఫ్రాక్చర్ లాంటి సందర్భాల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం అవసరం. ముఖ్యంగా పిల్లలను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని లాగడం వల్ల వచ్చే సమస్యల...
24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11 01.10.2026 12:18
జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి...
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos