Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
"నమ్మకం, నెట్వర్క్..ఈ రెండు విషయాలే లక్షిత ఫౌండేషన్ ను ముందుకు నడిపిస్తున్నాయి" - P.S.N మూర్తి గారు - Part 2 | స్ఫూర్తి కిరణాలు 28.07.2025 34:17
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గతవారం లక్షిత వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారితో మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా మూర్తి గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు లక్షితను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎక్కువమందికి ఎలా సాహయం అందించాలనుకుంటున్నారు అనే అంశాలతో పాటు, కమ్యూనిటీ గివింగ్ అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రజలకు, చిన్న చిన్న సాయాలు చేసి, ఎలా ఆనందం పొందొచ్చు? ఫైనాన్సియల్ లిటరసీ మీద...
"సమ్మర్ అనగానే బాగా గుర్తొచ్చేవి .. మామిడి పండ్లు, తాటి ముంజెలు "- దీప్తి మిర్యాల | మా ఊరు - 45 28.07.2025 33:25
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నల్గొండకు చెందిన దీప్తి గారిని కలుసుకుందాం. ఆమె ఊరి అందాలు, చిన్ననాటి స్నేహితుల సరదాలు, తమ్ముడితో జరిగే చిన్న చిన్న గొడవలు ఇలా చాలా విషయాలు మనతో పంచుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడిన ఈమె, అంతరించిపోతున్న చేనేతను చిరకాలం ఉండేలా చెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీప్తి గారికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. In this episode of "Maa Ooru," we meet D...
పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు Part -2 | TALTalks - 2 26.07.2025 32:04
చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా నిరూపించిన రఘురాం గారితో గత వారం మాట్లాడుకున్నాము కదా.. ఈ వారం కూడా రఘురాం గారితో సంభాషణ కొనసాగిద్దాము. అసలు ఈ రీడ్ ఇండియా సెలెబ్రేషన్స్ ఎప్పుడు, ఎలా ప్రారంభమయ్యింది? అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఎలా ఒప్పుకున్నారు? అసలు చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మనతో...
ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ వంటనూనె వాడాలి? ఎంత వాడాలి? - Part 1 | Know Your Plate - 54 25.07.2025 23:41
నూనె లేకుండా వంట చేయడం సాధ్యంకాదు. కానీ.. ఈ వంట నూనెతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. అందుకే వంట నూనెల ఎంపిక చాలా ముఖ్యమైనదని సూచిస్తారు నిపుణులు. మరి.. ఇంతకీ వంటకు ఏ నూనె వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి.. రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచిది అని కొంతమంది చెబుతారు.. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచివి అని ఇంకొంతమంది చెబుతారు.. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ నివృత్తి...
పొట్ట ఆరోగ్యమే.. మన ఆరోగ్యం..- Part 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 76 23.07.2025 25:19
ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా గతవారం పొట్ట ఆరోగ్యం, దానికి ఎలా సరిగా ఉంచుకోవాలి అనే విషయాలు మాట్లాడుకున్నాము కదా, అయితే ఈ వారం పొట్ట సరిగా లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు? అసలు ఈ సమస్య రాకుండా ఉండటానికి మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి మొదలైన విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు తెలియజేస్తున్నారు. వినండి మరి. As part of the Ay...
"ప్రతి రోజూ గుడి గంటతో నా రోజు ప్రారంభమయ్యేది" - పూజశ్రీ రంగనాథన్ | మా ఊరు - 44 21.07.2025 34:46
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం తమిళనాడు లోని హరూర్ గ్రామానికి చెందిన పూజశ్రీ రంగనాథన్ గారిని కలుసుకుందాం. ఒక మారుమూల గ్రామంలో, ఒక ప్రశాంత వాతావరణంలో పెరిగిన ఈమె, ప్రస్తుతం అమెరికాలో మేకోవర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.. అసలు ఈ ప్రయాణం ఎలా సాగింది? తన రోజు ఎలా మొదలయ్యేది, అప్పటి స్నేహితులు, చదువుకున్న స్కూల్ , ఫ్యామిలీ, పేరెంట్స్ ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు .. తప్పక వినండి As part of th...
"నమ్మకం , నెట్వర్క్ ..ఈ రెండు విషయాలే లక్షిత ను ముందుకు నడిపిస్తున్నాయి " - P.S.N మూర్తి గారు Part - 1 | స్ఫూర్తి కిరణాలు 21.07.2025 28:12
ప్రతీ మనిషి ఈ భూమి మీదకు రావటానికి ఒక కారణం ఉంటుంది.. దానిని మనం పూర్తి చేసిన తరువాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం.. అందుకే నేను బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ఈ లక్షిత ను స్థాపించాను అంటున్నారు.. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారు. ఈ సంస్థ ముఖ్యంగా విద్య, వైద్యం, పేదవాడి ఆకలి తీర్చడం.. ఈ మూడు అంశాలమీద దృష్టిపెట్టింది.. 5గురు బాలికల విద్యకు సహకరించడంతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 127 మంది బ...
పుస్తకాల పట్ల ప్రేమను ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చిన వ్యక్తి - రఘురాం అనంతోజు | TALTalks - 01 19.07.2025 30:56
పుస్తకాల పట్ల, చదవటం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఒక ఉద్యమంగా, ఉత్సవంగా మారింది.. అదే రీడ్ ఇండియా సెలబ్రేషన్స్. చదవడం అనే అలవాటు సామాన్య మానవులను సైతం లీడర్స్ గా మార్చుతుంది అని, ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘురాం అనంతోజు గారు. ఒక్కడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అంటే, ఆయన లక్ష్యం ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు.. ఈ సంస్థ...
కంటి నిండా నిద్ర ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 53 18.07.2025 33:57
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం ఉండాలి అంటారు.. అయితే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అసలు మన నిద్రకు ఉపకరించే హార్మోనులు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది? ఆహారమే కాదు మన అలవాట్లు కూడా మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.. మరి వీటన్నింటి గురించి ఈ పాడ్కాస్ట్ లో సవివరముగా తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. తప్పక వినండి. Good sleep...
పొట్ట ఆరోగ్యమే.. మన ఆరోగ్యం..- Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 75 16.07.2025 21:37
పొట్ట ఆరోగ్యంగా ఉండడం వల్ల శరీరంలోని చాలా సమస్యలను నివారించవచ్చు. జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యం ఇలాంటివి అన్నీ పొట్ట ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ గారు పొట్ట ఆరోగ్యానికి అవసరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులు, మరియు ఆరోగ్య సూత్రాలను ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు... తప్పక వినండి.. ఆరోగ్యమైన జీవితం కోసం మొదటగా మనం చూసుకోవలసిందేమిటో తెలుసుకోండి. Maintain...
మనం గెలవడం కోసం ..వేరొకరిని తగ్గించాల్సిన అవసరం లేదు.." - మయూష రెడ్డి Part- 2 | మా ఊరు - 43 14.07.2025 25:40
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారితో మాట్లాడదాం. అప్పటి కుటుంబ వ్యవస్థ, ఇప్పటి కుటుంబ వ్యవస్థ.. రెండింటికి ఉన్న తేడాలు ఏమిటి? ప్రస్తుత పరిస్థితులలో పిల్లలను పెంచడం, వాళ్ళను మంచిదారిలో నడిచేటట్లు చేయటం ఎలా? ఇలాంటి ఎన్నో విషయాలు, సరదా కబుర్లు, స్కూల్ లో జరిగిన అల్లరి సన్నివేశాలు.. ఇవన్నీ మీకోసం ఈ పాడ్కాస్ట్ లో.. In this episode of Maa Ooru, Mayusha Reddy from N...
"సమాజమే నా మొదటి ప్రాధాన్యత"- భవిత పండ్రంగి | Special Interview 12.07.2025 27:29
జీవితంలో ఎంత సంపాదించినా, సమాజంలో ఎవరికైనా సాహయం చేయటంలో ఉన్న సంతృప్తే వేరు.. అందుకే కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఈ దారిని ఎంచుకున్నాను అంటున్నారు.. భవిష్య సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ భవిత గారు. 2019వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థ, ముఖ్యంగా విద్య మరియు మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ చేస్తున్న మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాము. Bhavitha, founder of Bhavishya Sankalp Foundation, left her...
Healthy Lunch Box For Kids | Know Your Plate - 52 11.07.2025 41:16
ఈ వారం know your plate పాడ్కాస్ట్ లో పిల్లల లంచ్ బాక్స్ లో ఏమి పెట్టాలి అనేది మాట్లాడుకుందాం. పిల్లలు ఇష్టంగా తినగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి.. అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి? ఏ ఏ ఫుడ్ గ్రూప్స్ పెడితే, పిల్లలకు ఆరోగ్యంగా సాయంత్రం వరకు యాక్టీవ్ గా ఉండగలుగుతారు? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరిస్తున్నారు. తప్పక వినండి This week's Know Your Plate podcast explores healt...
అనారోగ్య సమయంలో నీరు ఎంతవరకు అవసరం ? - Part 2 | ఆయుర్వేదం - ఆరోగ్యం 74 09.07.2025 24:19
నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి?లాంటి విశేషాలు అన్నీ గతవారం ఎపిసోడ్ లో తెలుసుకున్నాం . అయితే ఈ వారం ఎపిసోడ్ లో అనారోగ్యంగా ఉన్నపుడు మంచి నీటి అవసరం ఎంత ఉంది? ఎలా తాగాలి? అనే విషయాల్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు వివరిస్తున్నారు .. తప్పక వినండి మరి.. In last week's episode, we explored the importance of proper water intake...
"నెల్లూరు అంటే గుర్తొచ్చేవి చేపల పులుసు, మలై కాజా" - మయూష రెడ్డి | మా ఊరు - 42 07.07.2025 31:24
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం నెల్లూరుకు చెందిన మయూష రెడ్డి గారిని కలుసుకుందాం. నెల్లూరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఫుడ్. గాంధీ బొమ్మ దగ్గర ఉన్న జైహింద్ షాప్ లో ఉన్న మలైకాజా, చేపల పులుసు, నెల్లూరు కారం దోశ ఇలా ఎన్నో ఉన్నాయి.. ఇక్కడ దేవాలయాలు, పండుగలకు కూడా ఎంతో ప్రత్యేకం. ఇలా వాళ్ళ ఊరు కు చెందిన అనేక విషయాలతో పాటు, తన కుటుంబం, పెళ్లి గురించి, తన జీవితాశయం గురించి చాలా విషయాలు మనతో పంచ...
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ? | Know Your Plate - 51 04.07.2025 38:33
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి, శీతాకాలంలో వేడినిచ్చే ఆహారాలు తీసుకోవాలి. వర్షాకాలంలో తేమ, గాలిలో తేడాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదం చేస్తాయి, కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. వీటి గురించి మరిన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రీత గారు ఈ పాడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. తప్పక వినండి Adapting our diet...
మన శరీరానికి నీటి ఆవశ్యకత ఎంతవరకు ఉంది ? - | ఆయుర్వేదం - ఆరోగ్యం 73 02.07.2025 24:30
నీళ్లు సరిగ్గా తాగితేనే ఆరోగ్యం అంటోంది ఆయుర్వేదం. అయితే ఈ నీరు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? గోరువెచ్చని నీళ్లు తాగడం వలన కలిగే లాభాలు ఏమిటి? భోజనం చేస్తున్న మధ్యలో నీళ్లు తాగవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు కలుగుతుంటాయి.. అయితే వీటన్నింటిని వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు మనతో ఉన్నారు.. ఈ పాడ్కాస్ట్ లో ఆ వివరాలన్నీ తెలియజేస్తున్నారు. Ayurveda emphasizes the importance of pr...
"Moral Values అన్నీ మా తాతయ్య నుండే నేర్చుకున్నాము" - శిరీష సిరిసిల్ల | మా ఊరు - 41 30.06.2025 39:01
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కరీంనగర్ కు చెందిన శిరీష గారిని కలుసుకుందాం. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులతో సరదా సన్నివేశాలు, కుటుంబంలో చూపించే ప్రేమానురాగాలు, భార్యాభర్తల బంధం, ఇలాంటి విషయాలే కాకుండా.. కరీంనగర్ లో.. రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ దగ్గర దొరికే బాదం మిల్క్, జిలేబీ.. సమోసా.. తెలంగాణలో చేసుకునే దావత్ ల గురించి ఇలా చాలా విషయాలు సరదా సరదాగా మనతో పంచుకున్నారు.. వినండి.. ఆనందించండి.. మ...
మైండ్ డిటాక్స్ చేయండి ఆరోగ్యంగా ఉండండి | Special Inteview With Dr.Sri Vidhya 30.06.2025 23:47
మన ఆలోచనలకి మొదలు ఎక్కడో చాలా సార్లు కనిపెట్టలేము, ఎందుకు నేను ఈ మధ్య ప్రతి విషయానికి చిరాకు పడుతున్నాను? ఎందుకు ఆనందం గా ఉండలేక పోతున్నాను? ఎవరితోనూ ఎందుకు కలవలేక పోతున్నాను? ఇలా మీకు అనిపిస్తుంటే, తప్పకుండా శ్రీ విద్య గారు చెప్పే మాటలు వినాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ట్రాప్ లో పడిపోతున్నాం అంటున్నారు శ్రీ విద్య గారు. ఎలా? పరిష్కారం ఏంటి? ఈ పాడ్కాస్ట్ వింటే...
తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి ! | Know Your Plate - 50 27.06.2025 27:16
ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. అయితే రకరకాల వ్యాయామాలు, డైట్ ప్లాన్స్ తో బరువు తగ్గినప్పటికీ, కొద్ది కాలంలోనే మళ్ళీ బరువు పెరిగిపోతున్నారు. అందుకే తగ్గిన బరువు ను నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. మరి ఈ తగ్గిన బరువు ను పెరగకుండా ఎలా చూసుకోవాలి? అసలు ఆలా బరువు పెరగటానికి గల కారణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత...
మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు - part 2 | ఆయుర్వేదం - ఆరోగ్యం 72 25.06.2025 24:25
గతవారం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు, వాటి పరిష్కారాలు గురించి మాట్లాడుకున్నాం కదా.. ఈ వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు.. దీనికి గల కారణాలు ఏమిటి? దీనిని ఎలా పరిష్కరించవచ్చు.. అలాగే మెనోపాజ్ లో వచ్చే సమస్యలు, కారణాలు, మరియు పరిష్కారాలు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల...
"జ్ఞాపకాలు చాలా ఉన్నాయి.. కానీ గుర్తులు మారిపోయాయి " - మణికనక రాజు | మా ఊరు - 40 23.06.2025 41:45
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం గంపలగూడెం గ్రామానికి చెందిన మణికనకరాజు గారిని కలుసుకుందాం. తన చిన్ననాటి స్నేహితులు, అల్లరి పనులు, స్నేహితులతోకలసి నేల టికెట్ కొనుక్కొని సినిమా చూడటం, శ్రీరామనవమి ఉత్సవాలు, జూనియర్ కాలేజీ కోసం చేసిన నిరాహారదీక్షలు, అమెరికాకు ఆ ఊరుకు ఉన్న అనుబంధం.. అంతేకాదు ముఖ్యంగా గంపలగూడెం అనగానే గుర్తొచ్చేది జమీందారు కోట. ఆ కోట కోసం చాలా కథలు చెప్పేవారు..మరి ఇలాంటి విషయాలన్నీ తె...
ఇన్లైన్ స్కేటింగ్ లో 400 మీటర్ల రికార్డ్ సాధించిన చిన్నారి సాన్విక | Special Interview with Ravi Teja & Navya 23.06.2025 14:02
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఈ 3 సంవత్సరాల సాన్వికకు అక్షరాలా వర్తిస్తుంది. విజయవాడకు చెందిన సాన్విక 2 సంవత్సరాల 8 నెలల వయసులో ఇన్లైన్ స్కేటింగ్‌లో 400 మీటర్ల రికార్డు సాధించి, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అసలు ఇది ఎలా సాధ్యమయింది? తనకు ఎప్పటినుండి స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించారు? అసలు స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమ...
"యోగా సాధన ద్వారా రోగమే కాదు.. రోగ మూలాలను కూడా తొలగించవచ్చు " - వి. హనుమాన్ | Yoga Day Special Interview 23.06.2025 26:19
యోగ సాధన ద్వారా రోగమే కాదు .. రోగ మూలాలను కూడా తొలగించవచ్చు అంటున్నారు YOGA CONSCIOUSNESS TRUST, హైదరాబాద్ శాఖ కార్యదర్శి శ్రీ వి. హనుమాన్ గారు. యోగ సాధన, యోగ క్రియల ద్వారా Lifestyle diseases ను కూడా నివారించవచ్చు అంటున్నారు.. అసలు ఈ యోగా ఏ వయసువారు చేయవచ్చు? రోజుకు ఎంత సమయం చెయ్యాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు .. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టాల్ రేడియ...
కళల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న పద్మ చేబ్రోలు | Special Interview 21.06.2025 41:36
కళలు నేర్చుకోవటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆ కళను నేర్చుకొని, దాని ద్వారా సమాజంలో ఎంతోకొంత మార్పును తేవాలనే కోరిక, తపన కొంతమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందినవారే, తెలుగు రాష్ట్రంలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన పద్మ చేబ్రోలు గారు. ఈమె చిన్ననాటి నుండి నృత్యం పై ఉన్న ఆసక్తి తో నేర్చుకొని, అమెరికా వెళ్ళాక కూడా అక్కడివారికి మన నృత్య సంప్రదాయాల్ని బోధిస్తూ, సమాజంలో చైతన్యాన్ని నింపే చిత్రాలు...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.