Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 episodes

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Author

Touch A Life Foundation

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

స్వాతంత్ర సైనికుడు సాహిత్య ప్రేమికుడు - జువ్వాడి గౌతమరావు | సాహితీ స్రవంతి - 58 17.02.2024

తెలుగునాట అరుదైన సాహితీమూర్తులలో జువ్వాడి గౌతమరావు ఒకరు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నేపధ్యం తనది. నాటి పరిస్థితులు సమాజం పట్ల, సామాన్యుల వెతల పట్ల పూర్తి అవగాహన కలిగించాయి. విశ్వనాధ వంటి సంప్రదాయ రచయితలను ఎంతగా అభిమానించారో, కాళోజీ వంటి అభ్యుదయ రచయితలను అంతే ప్రేమించారు. నాటి మేటి రచయితలందిరతో సాన్నిహిత్యంగా ఉంటూ, స్వయంగా రచయితగానూ వారి ప్రశంసలు అందుకున్నారు. ఈ విశిష్టమైన రచయిత గురించి మరిన్ని...

GERD సమస్యకు ఆహార పరిష్కారాలు! | Know Your Plate - 31 16.02.2024

ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఇది. చాలా తేలికగా అనిపించే ఈ పరిస్థితి నిజానికి ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తుంది. ఛాతీలో భరించలేని నొప్పి నుంచి పళ్లు దెబ్బతినడం GERD (Gastroesophageal reflux disease)తో వచ్చే లక్షణాలు ఎంతో వేదనకు గురిచేస్తాయి. చాలామంది ఈ సమస్యను దాటలేక, ఇక దాంతో బాధపడుతూనే కాలం గడిపేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమై సర్జరీ వరకూ వెళ్తుంటారు. అందుకే ఈ ఎపిసోడ్లో గ్యా...

పుట్టిన ఊరిని ప్రపంచం గుర్తించాలని! | రాధిక మంగిపూడి (రెండవ భాగం) | మన రచయితలు - 39 15.02.2024

మన రచయితలు సిరీస్లో భాగంగా ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడిగారితో జరుగుతున్న సంభాషణ ఇది. గత వారం తన సాహితీ ప్రయాణం గురించి ఎన్నో విశేషాలు పంచుకున్న రాధికగారు ఈ ఎపిసోడ్లో… సింగపూర్లో తెలుగు భాషను ప్రచారం చేసేందుకు జరిగిన ఆసక్తికరమైన విషయాలను చెప్పబోతున్నారు. అలాగే తన సొంత ఊరి గురించి మొదలుపెట్టిన ఓ ఫేస్ బుక్ గ్రూప్… వేల మనసుల్ని గెలుచుకున్న సామాజిక సేవగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం. Here is the sec...

జీవితాంతం నిలిచిపోయే వేడుక ఈ వేదిక | వంగూరి ఫౌండేషన్ 13.02.2024

వంగూరి చిట్టెన్ రాజుగారు అక్షరాన్ని ఆరాధించే వ్యక్తి. అమెరికాలోని తెలుగు జీవితాలు సునిశితమైన హాస్యంతో ప్రతిబింబిస్తూ… మంచి రచనలెన్నో చేశారు. సాటి రచయితలు ప్రోత్సహిస్తూ, ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. వంగూరి ఫౌండేషన్ ద్వారా సాహితీ సదస్సులను, భాషా వేదికలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన మజిలీని చేరుకుంటున్నారు. వంగూరి ఫౌండేషన్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 9,10 తేదీలలో కాక...

పొరుగుదేశంలో అక్షరం తోడయ్యింది | రాధిక మంగిపూడి | మన రచయితలు - 38 08.02.2024

రాధిక మంగిపూడి పేరు తెలుగు పాఠకులకు పరిచయమే. కేవలం కథలు, కవితల ద్వారానే కాకుండా పద్యాలతోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. సింగపూరులో ఉంటూ అక్కడి సాంస్కృతిక వేదికలతో కలిసి తెలుగు భాష, సంప్రదాయాల వ్యాప్తికి కృషి చేశారు. గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం పేరుతో తన కన్న ఊరి గురించీ ప్రచారం, సేవ చేస్తున్నారు. ఈ అరుదైన రచయిత్రితో సంభాషించే ప్రయత్నం చేసింది టాల్ రేడియో. Radhika Mangipudi is a known writer f...

తెలుగులో తొలి సినీ గేయ రచయిత | చందాల కేశవదాసు | సాహితీ స్రవంతి - 57 03.02.2024

చందాల కేశవదాసు పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిస్తే మాత్రం, తన ప్రతిభ స్ఫూర్తి రగిలిస్తుంది. సాహిత్యం పట్ల అంకితభావం ఉంటే, ఎన్ని అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు సాక్ష్యం కేశవదాసుగారు. అష్టావధానిగా ఆంధ్రనాట ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నాటకరంగంలో అడుగుపెట్టాక దానికి ప్రజాదరణను తీసుకువచ్చారు. వేషం వేయడమైనా, పద్యం రాయడమైనా తన తర్వాతే. ఇప్పటికీ చాలా నాటకాల్లో పాడే ప్రార్థనా గీతం దగ్గర్నుంచీ...

గతం గురించి తెలియకపోతే భవిష్యత్తు ఉండదు! | డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు 37 01.02.2024

ఓ 20 ఏళ్ల క్రితం వరకూ… పిల్లల జీవితంలో సాహిత్యం ఓ ముఖ్యమైన భాగంగా ఉండేది. అందులో చందమామ స్థానం గురించి చెప్పనక్కర్లేదు. ఆ చందమామను చదువుతూ, అందులోనే రచయితగా, ఉద్యోగిగా మారారు గంగిశెట్టి శివకుమార్ గారు. తర్వాతకాలంలో ఉపాధ్యాయునిగా ఉన్నా… బాలసాహిత్యం నేర్పిన విలువలకు అనుగుణంగా తన జీవితం కొనసాగించారు. పిల్లలకు సాహిత్యం ఎందుకు అవసరం, చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, ఓ దేశ చరిత్రలో బాలసాహిత్యం ప్రాధాన్యత ఏ...

తన పేరే ఓ చరిత్ర – కుష్వంత్ సింగ్! | సాహితీ స్రవంతి - 56 27.01.2024

కుష్వంత్ సింగ్ అంటే చాలా విషయాలే గుర్తుకొస్తాయి. తన విభజన జ్ఞాపకాలను ట్రైన్ టు పాకిస్తాన్ ద్వారా అక్షరబద్ధం చేసిన రచయిత స్ఫురిస్తాడు. ఇలస్ట్రేటడ్ వీక్లీతో సంచలనం సృష్టించిన జర్నలిస్టుగా పలకరిస్తాడు. తన జోక్స్ ద్వారా అశేష ప్రజానీకాన్నీ, కవితల ద్వారా సాహితీవేత్తలను ఆకట్టుకున్న ప్రతిభ కదలాడుతుంది. ఇలా తన నిండైన జీవితంలో నిభాయించిన ఎన్నో పాత్రలు కదలాడతాయి. అన్నింటా అడుగుపెట్టడమే కాకుండా, తనదైన ముద్ర వ...

పళ్లను బిగపెట్టినా, కొరికినా… నొప్పి, నష్టం తప్పవు! DenTAL Care - 7 27.01.2024

కొందరికి పళ్లు బిగపెట్టడం ఓ అలవాటు. చిన్నగా తోచే ఈ అలవాటు వెనుక ఓ ఉద్వేగం ఉండవచ్చు. అది చిగుళ్ల, పంటి సమస్యలకు దారి తీయవచ్చు. పళ్లు కొరకడం లాంటి మిగతా అలవాట్లూ ఇంతే! ఈవారం ఇదే సమస్య గురించి విశ్లేషించబోతున్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. కేవలం దంత వైద్యంలోనే కాకుండా, మానసిక శాస్త్రంలోనూ నైపుణ్యం ఉన్న హరీష్ గారి మాటలు వినితీరాల్సిందే! Clenching and biting of teeth isn’t just a habit. It might be the e...

కొడవటిగంటి నన్ను తీర్చిదిద్దారు! డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు - 35 25.01.2024

ఇప్పటి పిల్లలకు క్లాస్ పుస్తకాలు చదివేందుకే సమయం సరిపోవడం లేదు, ఇంక బాలసాహిత్యం చదివే అవకాశం ఎక్కడిది? అసలు అలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఏమిటి? అన్న ప్రశ్నలు పదేపదే వినిపిస్తున్నాయి. వాటికి జవాబు చెప్పడం కష్టం అనుకుంటే ఓసారి ఇలాంటి బాలసాహితీవేత్తల మాటలు వింటే చాలు. సాహిత్యం పాఠకుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. బాలసాహిత్యం ఎలా ఉండాలి. కొడవటిగంటి లాంటి ప్రముఖ సాహితీవేత్తలు బాలసాహిత్యం కోసం ఎందు...

నైపుణ్యానికి నిఘంటువు – కె.ఎ.అబ్బాస్ | సాహితీ స్రవంతి - 55 20.01.2024

బాలీవుడ్ తొలి రోజుల్లో తన స్క్రీన్ ప్లేతో, ఆ చిత్రసీమకు ప్రపంచ స్థాయి ఖ్యాతి తెచ్చినవాడు కె.ఎ.అబ్బాస్. సామాజిక సమస్యలు, భావోద్వేగాలకు కమర్షియల్ హంగులు జోడించిన అరుదైన రచయిత. అందుకే రాజ్ కపూర్ తన ముఖ్యమైన చిత్రాల బాధ్యతను అబ్బాస్ కి అప్పగించారు. తన కొడుకు రిషి కపూర్ ని లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు, అబ్బాస్ నే నమ్ముకున్నారు. పరదేశి నుంచి సాత్ హిందుస్తానీ వరకు అబ్బాస్ కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రా...

ఒక్క వ్యక్తిలో ఇంత ప్రతిభా! Kidar Nath Sharma | సాహితీ స్రవంతి - 54 13.01.2024

నీల్ కమల్ బాలీవుడ్ చరిత్రలో ఓ సంచలనం. రాజ్ కపూర్, మధుబాలకు బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ చిత్రానికి రచయిత, దర్శకుడు, నిర్మాత ఒకటే. తనే కిదార్ శర్మ. కిదార్ ఫలానా విభాగం అని తన నైపుణ్యాన్ని చూపలేదు. సెట్లో చిత్రాలు వేయడం దగ్గర నుంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, ఎడిటర్గా, ఛాయాగ్రాహకునిగా… 24 ఫ్రేమ్స్ అని మనం చెప్పుకొనే అన్ని విభాగాల్లోనూ అడుగుపెట్టారు. తనదైన ముద్ర వేశారు. ఈ అరుదైన బహుముఖ ప్రజ్ఞాశీలి గురిం...

పళ్ళ విషయం లో పొరపాట్లు | DenTAL Care - 6 13.01.2024

ఓ చిన్న అలవాటు చూసేందుకు పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. ఆ వ్యక్తికీ అంత ప్రమాదకంరగా తోచకపోవచ్చు. కానీ ఆ చిన్న అలవాటే… చాలా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇంతే కాదు! పళ్లకు సంబంధించిన మరెన్నో అలవాట్లు చిగుళ్లు, పళ్లను శాశ్వతంగా దెబ్బతినవచ్చు. నిజానికి ఈ అలవాట్ల వెనకాల మానసిక కారణాలు కూడా ఉంటాయి. వాటిని విస్మరిస్తే, సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే కేవలం దంతవైద్యుడిగానే కాకుండా, భావోద్వేగాల నిపుణ...

పాలు తాగడం అవసరమా! Know Your Plate 30 12.01.2024

తల్లిపాలతోనే మన ఆహారం మొదలవుతుంది. ఎదుగుతున్నా… పాలతోనే శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. శాకాహారులకు దక్కని కొన్ని పోషకాలు, పాల ద్వారాలనే లభిస్తాయి. అందుకే పాలు తాగితీరాల్సిందే అని చాలామంది నమ్మకం. ఇందులో వాస్తవం ఎంత? పోషకాలు అందేందుకు మరో మార్గం లేదా! ఇదే విషయం మీద ఈసారి నో యువర్ ప్లేట్ ఎపిసోడ్లో చర్చించే ప్రయత్నం జరిగింది. పాలు తాగడం గురించి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వినితీరాల్సిన మాటల...

సాహిత్యంతో జీవితం మారి తీరుతుంది! | జి.ఉమామహేశ్వర్ | మన రచయితలు 35 11.01.2024

కాలం మారిపోయింది. ఇతరులతో పోటీ పడుతూ పరుగులు తీయాల్సిందే. వేగంగా కదులుతున్న మార్పును చేజిక్కించుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు చదవాలి అంటే ఎవరికి మాత్రం రుచిస్తుంది. సాహిత్యం పట్ల అభిలాష ఎంత అభిలాష ఉన్నా… రచనలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది. ఇలాంటి అనుమానాలన్నింటిలోనూ ఉమామహేశ్వర్ గారి మాటలు వినాల్సిందే. పుస్తకాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇప్పటి రచనల్లో రావల్సిన మార్పు ఏమిటి, రచనలు...

సాహిత్యంలో అవార్డులు సినిమాల్లో రికార్డులు | జాన్ నిసార్ అక్తర్| సాహితీ స్రవంతి - 53 06.01.2024

బాలీవుడ్ చిత్రసీమను దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన అరుదైన గేయ రచయిత జాన్ నిసార్ అక్తర్. సాహిత్యంలో ఎలాంటి తర్ఫీదు లేకపోయినప్పటికీ గజల్స్ నుంచి సినీగీతాల వరకూ ఎలాంటి రంగంలో అయినా తనదైన ముద్రవేశారు అక్తర్. అలతి పదాలతో అద్భుతమైన భావాలను పలికించడం తన ప్రత్యేకత. ఇటు సాహిత్యంలోనూ అటు పాపులర్ గీతరచనలతో అసాధారణ ప్రతిభ కనబరిచిన అక్తర్, సాహిత్య అకాడమీ లాంటి ఎన్నో అరుదైన పురస్కారాలను అందుకున్నారు. తన గురించి మ...

పాలపళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు! | DenTAL Care – 5 06.01.2024

పంటి విషయంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలే తక్కువ. అలాంటిది ఇక పిల్లల విషయంలో చెప్పేదేముంది. నిజానికి వారి పళ్ల విషయంలోనే మరింత శ్రద్ధ ఉండాలి. లేకపోతే, అవి జీవితాతం వారిని ఇబ్బంది పెట్టవచ్చు. పళ్లు సరిగా ఎదగకపోవడం, వంకర పోవడం, పుచ్చిపోవడం లాంటి సవాలక్ష సమస్యలు పిల్లల పంటి విషయంలో ఎదురవుతూ ఉంటాయి. మనమే వాటిని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. సంరక్షణ, చికిత్సల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అందుకే ఈసారి చిన్నా...

2024లో ఆహార ప్రణాళిక | Know Your Plate - 29 05.01.2024

రోజురోజుకూ జీవనశైలిలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఒత్తిడి పెరుగుతోంది, సమయం తగ్గుతోంది. అదే సమయంలో తగినంత పోషకాహారమూ లభించడం లేదు. జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వల్లో, సమయానికి సరైన ఆహారం తినకపోవడం వల్లో… కారణాలు ఏవైతేనేం, ఒంట్లో సత్తువ తగ్గుతోంది. ఇకనైనా జాగ్రత్తపడదాం. ఈ కొత్త సంవత్సరంలో మన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి బాగుండేలా సమతుల ఆహారాన్ని తీసుకుందాం. మరెందుకాలస్యం! నో యువర్ ప్లేట్ లో సిరీస్ లోని ఈ సరి...

అనూహ్యమైన మార్పు , పోటీతత్వం...ఇప్పటి సమస్యలు - జి.ఉమా మహేశ్వర్ | మన రచయితలు 34 04.01.2024

జి.ఉమామహేశ్వర్ అంటే ఎన్నో విశిష్టమైన కథలు గుర్తుకొస్తాయి. ఆధునిక జీవనశైలి హోరులో కనిపించని, వినిపించని వెతలను ప్రస్ఫుటంగా తన కథల్లో చూపిస్తున్న రచయిత ఆయన. రాయలసీమ పాణ్యంలో మొదలైన ప్రయాణం తన ప్రయాణం వృత్తిపరంగా ఎన్నో మార్పులు చవిచూసింది. ప్రవృత్తిపరంగా తనలో ఉన్న రచయితను మరింత పదును పెట్టింది. ఇప్పటివరకూ మూడు కథా సంకలనాలు వెలువరించిన ఉమామహేశ్వర్ తాజా పుస్తకం నెమలీకలు – నెమరువేతలు కూడా పాఠకుల అభిమానా...

The Versatile Writer – Rajendra Krishan | సాహితీ స్రవంతి - 52 30.12.2023

నాలుగు దశాబ్దాల పాటు గేయ రచయితగా నిలదొక్కుకోవడం ఓ అద్భుతం. ఇక దాదాపు రాసిన ప్రతీ పాటా సూపర్ హిట్ గా మారడం మరో విశేషం. అలాంటి అరుదైన రచయిత రాజేంద్ర క్రిషన్. గాంధి చనిపోయినప్పుడు రాసిన విషాద గీతమైనా, అనార్కలి లాంటి ప్రేమకథకు అందించిన పాటలైనా, వేదాంతమైనా… ఎలాంటి గీతమైనా తన కలంతో ఓ ప్రత్యకతను సంతరించుకుంటుంది. Rajendra Krishan is a rare set of writers who has delivered great songs for more than four d...

పాలపళ్ల గురించి తెలియాల్సిన విషయాలు! | DenTAL Care - 4 30.12.2023

పాలపళ్లు ఊడిపోయి శాశ్వతంగా పళ్లు రావడం సహజంగానే కనిపించవచ్చు. అలాగని వీటికి సంబంధించిన సమస్యలను అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పటి ఆహారం, అలవాట్ల వల్ల చిన్నపిల్లల్లోనే పళ్లకు సంబంధించి ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే పీడియాట్రిక్ డెంటిస్ట్ ను సందర్శించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ఈవారం చిన్నారుల పళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ దంతవైద్యులు, హరీష్ తెన్నేటి గ...

2023లో మన ఆరోగ్యం, ఆహారం ఎలా ఉన్నాయో చూసుకుందామా? | Know Your Plate – 28 29.12.2023

ఆహారం గురించి ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. అలాగని ప్రతీ ముద్దను తరచి చూసుకోవాలని కాదు కానీ, ఏం తింటున్నాం, ఏం తినాలి అన్న అవగాహన, ఎరుక అయితే పెరగాలి. కారణం స్పష్టం. కదలనిమెదలని సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు చిన్నవయసులోనే పలకరిస్తున్నాయి. తినే ఆహారంలో కూడా ఎక్కువ శాతం రిఫైన్డ్, పాలిష్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ పోషకాహార నిపు...

Legendary Lyricist – Anand Bakshi | సాహితీ స్రవంతి - 51 23.12.2023

ఓ సినిమా హిట్ కావాలంటే అందులో మంచి కథ, కథనం, నటన ఉంటే సరిపోతుంది. కానీ ఆ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోవాలి అంటే మాత్రం అందులో ఎన్నో అంశాలు ప్రజలకు నచ్చాలి. వాటిలో గీతాలది ప్రత్యేక పాత్ర. అలాంటి ఎన్నో క్లాసిక్స్ కి అండగా నిలిచారు ఆనంద్ బక్షి. బారీ, ఆరాధన, సీత ఔర్ గీత, పర్ దేస్, తాల్, మొహబ్బతే, గదర్, షోలే… ఇలా బాలీవుడ్ చరిత్రలో ఎన్నదగిన ఎన్నో సినిమాల గీత రచయిత ఆనంద్. ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన...

నోటి దుర్వాసన అసౌకర్యం కాదు… అనారోగ్యం! | DenTAL Care - 3 23.12.2023

ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో నాలుగో వంతు మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. ఈ ఇబ్బంది రోజంతా ఉందంటే దాని అర్థం… నోటి ఆరోగ్యంలో సమస్య ఉందనే. అందుకనే దీన్ని ఓ అసౌకర్యంగా కాకుండా… అనారోగ్యానికి సూచనగా భావిస్తారు వైద్యులు. నోటి దుర్వాసన శారీరికంగా ఎలాగూ ఇబ్బంది పెడుతుంది. సామాజిక జీవనం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రస్తుత ఎపిసోడ్ లో ఈ పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ దంత...

రోగనిరోధకశక్తి పెంచుకోవడం ఎలా! | Know Your Plate - 27 22.12.2023

ఆరోగ్యం ఓ అదృష్టం కాదు. మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, దినచర్యలు మన ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే పెద్దలు ఆహారాన్ని ఓ ఔషధంగా పేర్కొన్నారు. అందులోని పోషకవిలువలే మన శక్తినీ, ఆయుష్షునీ నిర్ణయిస్తాయి. సమతుల ఆహారం ద్వారా పెరిగే రోగనిరోధకశక్తి ఎలాంటి సూక్ష్మక్రిములనైనా తట్టుకుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటుంది. అలాంటి ఆహారం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు. Food isn...

Listen to the TALRadio Telugu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.