Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
"ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని మరింత ఎదిగేలా చేస్తుంది " - కవిత గూడపాటి | విజేత - 4 02.04.2024 42:41
విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేసే విజేత సిరీస్లో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్ కవిత గూడపాటి గారితో మాట్లాడబోతున్నాం. కుటుంబ వ్యాపార సలహాదారుగా, లీడర్ షిప్ కోచ్ గా, మార్గదర్శిగా తను ఎన్నో సమస్యలకు పరిష్కారాలందించారు. ఎన్నో సవాళ్లను అధిగమించేలా చేశారు. మరి తన సమస్యల్ని ఎలా దాటారు, తన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, సవాళ్ల గురించి తన అభిప్రాయం ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ సంభా...
దీప్తి ఆకెళ్ల… తన పేరే ఒక బ్రాండ్! | TALent - 2 01.04.2024 33:04
వారం వారం విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేస్తున్న TALent సిరీస్లో భాగంగా మరో విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. సోషల్ ఇన్ ఫ్లూయన్సర్ గా దీప్తి ఆకెళ్ల పేరు చాలామందికి పరిచయమే. తన ఫుడ్ వ్లాగ్స్ ద్వారా వేలమంది అనుచరులనే సంపాదించుకున్నారు. ఇక తన సంస్థ పికిల్స్ అండ్ పొడిస్ గత ఎనిమిదేళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. మరి తన ప్రయాణం, ప్రయత్నం వెనుక ఉన్న స్ఫూర్తిని తెలుసుకుందామా! Here is yet another inte...
How to Control Anger | ఓ మంచి మాట - 4 29.03.2024 9:07
కోపం ఓ విషవలయం. అది మనసును పాడుచేస్తుంది, బంధాలను దెబ్బతీస్తుంది. చాలా సందర్భాల్లో, జీవితాల్ని తారుమారు చేసేస్తుంది. అలాగని కోపాన్ని నియంత్రించుకుందాం అంటే… మన ఉద్వేగాన్ని తెలిపేది ఎలా! అందుకే Anger Management అన్నది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన నైపుణ్యంగా మారిపోయింది. కోపం అనే ఉద్వేగపు మూలాన్ని తెలుసుకుని, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో చెబుతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు. విని తీరాల్సిన మాటలివ...
నిద్ర - ఆహారం | Know Your Plate - 34 29.03.2024 24:10
మనం తీసుకునే ఆహారానికీ, నిద్రకీ కచ్చితమైన సంబంధం ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని ఆహార పదార్థాలు మన నిద్రను దూరం చేస్తే, మరికొన్ని గాఢనిద్రను అందిస్తాయి. ఇది కేవలం నమ్మకమో, సంప్రదాయ వైద్యం చెప్పిన మాటో కాదు… సైన్స్ చేస్తున్న సూచన. ఇప్పటి తరం రోజువారీ ఒత్తిడి, సమస్యల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం నిద్ర. దాన్ని కాపాడుకునేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో సూచిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణ...
కళలను అక్షరాలతో బతికించే ప్రయత్నం! | బద్రి కూర్మారావు | మన రచయితలు - 48 28.03.2024 21:20
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బద్రి కూర్మారావు తన వ్యాసాల ద్వారా చాలామందికి పరిచయమే. చిన్నప్పుడు తను చూసిన జానపద కళలు క్రమంగా అంతరించిపోవడం చూసి అందరిలా బాధపడుతూ ఊరుకోలేదు. కాలంతో సహజమే అని సర్దుకోలేదు. తన వంతుగా ఏం చేయవచ్చా అని ఆలోచించారు. వ్యాసాలు, పుస్తకాలు, కళాపీఠాలు… ఇలా ఎన్నో విధాలుగా జానపద కళలను ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు జానపద కథలను సేకరిస్తూ, సామాజిక సమస్యల మీద కథలు రాస్తూ సాహిత్యానికి గ...
మలుపులే మజిలీలు విలువలే విజయాలు | రమేష్ కుమార్ షా - Part 2 | విజేత - 3 26.03.2024 30:37
ప్రముఖ పారిశ్రామికవేత్త రమేష్ కుమార్ షాగారితో టాల్ జరిపిన సంభాషణలోని రెండో భాగమిది. తను వ్యాపారంలో విజయం సాధించడం వెనుక ఉన్న అసాధారణ ప్రయాణాన్ని ఇందులో పంచుకుంటున్నారు. అవకాశాలను వెతుక్కుతూ దూరతీరాలకు చేరడం, ప్రతి రంగంలోనూ తొలి అడుగులు వేయడం లాంటి రహస్యాలను మనకు చెబుతున్నారు. సమాజం పట్ల ఓ పౌరునిగా, వ్యాపారస్తునిగా తన బాధ్యతను ఎలా నిర్వర్తించారో కూడా మనం వినవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆద...
రైతుగా మారి… వ్యాపారిగా ఎదిగి. ఇది ఓ ‘విజయ’గాథ! | Special Interview 25.03.2024 36:33
స్త్రీపురుషులు ఇద్దరూ సమానమే అయినా, ఇప్పటికీ కనిపించని ఓ వివక్ష ఉంటుంది. మహిళల్ని పొలంలో కూలీలుగా అంగీకరించే సమాజం, వారిని రైతులుగా గుర్తించదు. ఈ పరిమితులు దాటి ఆదర్శ రైతుగా నిలదొక్కుకున్నారు విజయ. ఎవరు ఎన్ని మాటలన్నా, సేంద్రియ వ్యవసాయంలో అరుదైన విజయాలు సాధించారు. ఒంటరి మహిళగా, తన కాళ్ల మీద నిలబడ్డారు. అక్కడితో ఆగలేదు. తన వ్యాపార దక్షతతోనూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏ రంగంలో అయినా విజయం సా...
How To Programme Your Thoughts | ఓ మంచి మాట - 3 22.03.2024 8:46
ఆలోచనలు అసంకల్పితంగా వచ్చినట్టు కనిపిస్తాయి. కానీ ప్రతి ఆలోచన వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, అనూహ్యమైన రసాయనిక చర్యలు పని చేస్తాయి, అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. గతకాలపు భయాలు, వర్తమాన పరిస్థితులు, భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశిస్తాయి. మరి మనం కోరుకున్న విధంగా జీవితం, పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండాలంటే అందుకు ముఖ్యమైన ఆలోచనలను ఎలా నియంత్రించుకోవడం! ఈ ఎపిసోడ్ లో వినండి. Our thoughts aren't just invol...
మంచితనంలో పెట్టుబడి |రమేష్ కుమార్ షా | విజేత - 2 19.03.2024 34:47
రమేష్ కుమార్ షా... ఓ అరుదైన పారిశ్రామికవేత్త. తన RK గ్రూప్ ద్వారా ఎన్నో రంగాల్లో స్థిరమైన విజయాలు సాధిస్తున్నారు. అంతేనా! హార్వర్డ్ బిజినెస్ స్కూళ్లో తన మిత్రులందరినీ కలిపి HBS Angels India పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి సేవ చేస్తున్నారు. ఇంతకీ తన విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అలుపెరగని తన ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? సమ...
జ్ఞాపకంగా మారిన దృశ్యం | కెమెరామెన్ మీర్ | TALent - 1 18.03.2024 44:13
మీర్ పేరు తెలుగువారికి కొత్తేమీ కాదు. ఓ అబ్బురం కూడా. దూరదర్శన్ రోజుల నుంచే తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం. ఎలాంటి దృశ్యాన్నయినా అందంగా, బంధంగా మార్చగల అరుదైన నిపుణుడు. కేవలం ఛాయాగ్రాహకునిగా మాత్రమే కాదు. ఎడిటర్, ప్రొడ్యూసర్, డైరక్టర్… ఇలా ప్రతీ రంగంలోనూ తనదైన ముద్రవేసుకున్న ప్రతిభావంతుడు. ఎంతో శ్రమతో, వ్యయంతో కూడిని CG Works ని అలవోకగా చేసేస్తారని ప్రసిద్ధి. నటులతో, బుల్లితెరతో, వెండితెరతో పర...
ఒగ్గుకథను లోకానికి వినిపించిన స్వరం - మిద్దె రాములు | సాహితీ స్రవంతి - 62 16.03.2024 30:23
తెలుగునాట కళలలో అరుదైన సంప్రదాయం ఒగ్గు కళ. మాధ్యమాలు మారుతున్న నేపధ్యంలో ఇతర కళలతో పాటు, ఒగ్గు కథ ప్రాభవం కూడా తగ్గింది. ఇలాంటి సమయంలో ఒగ్గు కథకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయడమే కాకుండా, తనదైన శైలిలో కథ చెప్పినవారు మిద్దె రాములు. కుటుంబరీత్యా ఒగ్గు కళాకారుడు కాకున్నా, దాని మీద ప్రేమతో కళను నేర్చుకున్న సృజనశీలి. దేశవిదేశాల్లో కళను చాటిన ధన్యజీవి. ఈ అపురూపమైన వ్యక్తిత్వం గురించి నేటి తరం విన...
How to Manage Stress | ఓ మంచి మాట -2 15.03.2024 8:33
అలలు ఎందుకు ఎగిసిపడేందుకు కూడా కారణం… ఒత్తిడే! కానీ ఆ అలలను దాటగలిగితే, ఎంతటి బడబాగ్నినైనా ప్రశాంతంగా తట్టుకునే సంద్రం కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. చిన్న చిన్న విషయాలు కూడా ఒత్తిడి కలిగించవచ్చు. కానీ వాటిని తట్టుకోవడం ఎలాగో తెలిస్తే, బతుకును పరిపూర్ణంగా ఆస్వాదించగలం. ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఎలాగో చెబుతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు. Stress has become an ingredient of modern life. Our career,...
రచయిత ఎదిగేలా… విమర్శ ఉండాలి! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 47 14.03.2024 22:59
యువ రచయిత కె.వి.మన్ ప్రీతమ్ తో జరిగిన సంభాషణలో ఇది రెండో భాగం. చాలా ప్రశ్నలే ఇందులో వినిపిస్తాయి. ఇప్పటి తరంలో విమర్శ తగ్గిపోతోందా, దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉంది, అసలు విమర్శ ఎలా ఉండాలి, ఆన్లైన్‌లో రచనలు చేయడం వల్ల కథల్లో నాణ్యత తగ్గిపోతోంది అనేదానికి తన అభిప్రాయం, అసలు తను రచనల కోసం రోజువారీ సమయాన్ని ఎలా కేటాయిస్తారు, ఒక కథ రాయాలనుకున్నాక దాని వెనకాల ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది… లాంటి ఎన్నో ఆసక్...
ప్రతి సంభాషణ ఓ జీవితపాఠం – అంజలి | విజేత - 1 12.03.2024 30:45
తెలుగులో ఇంటర్వ్యూలను ఆసక్తిగా గమనించేవారికి అంజలిగారి పేరు సుపరిచితం. పేరు విని గుర్తుపట్టకపోయినా, తన రూపం చూస్తే ఎన్నో యూట్యూబ్ ఇంటర్వ్యూలు గుర్తుకు వచ్చేస్తాయి. తెలియని వ్యక్తుల గురించి తెలుసుకుని తీరాల్సిన జీవిత అనుభవాలు, తెలిసిన వ్యక్తుల నుంచి తెలియని బతుకు పాఠాలు తన ప్రశ్నలతో రాబట్టగల మంచి యాంకర్ అంజలి. మరి తన ప్రయాణం వెనుక ఉన్న మజిలీలు ఏమిటి? తన ఇంటర్వ్యూల నుంచి తనే తెలుసుకున్నదేమిటి? రండ...
సెన్సిటివిటి గురించి అసలైన నిజాలు | DenTAL Care - 9 09.03.2024 16:21
మీ పళ్లు సెన్సిటివ్ గా ఉంటే ఫలానా పేస్ట్ వాడండి అంటూ టీవీ పెట్టగానే ప్రకటనలు కనిపిస్తాయి. సెన్సిటివిటీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంతేనా! సెన్సిటివిటీ అనేది పంటి పైపొర ఎనామిల్ పాడవడం వల్ల ఏర్పడే సమస్య మాత్రమేనా. ఒకవేళ సెన్సిటివిటీ వస్తే అది జీవితాంతం ఉండాల్సిందేనా. సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది దగ్గర నుంచీ అది వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ ప్రతీ అంశమూ తెలుసుకునే ప్రయత్నం ఇది! Is sen...
సంస్కృతభాషలో ఓ కవి విజయం - శ్రీభాష్యం విజయసారథి | సాహితీ స్రవంతి - 61 09.03.2024 28:38
సంస్కృత భాషలో రచనలు చేసిన ఆధునిక కవులు చాలా అరుదు. అలాంటి వ్యక్తి శ్రీభాష్యం విజయసారథి. నూటయాభైకి పైగా గ్రంథాలు రాసిన విజయసారథి, ఎంత సంప్రదాయవాదో అంతటి ఆధునికుడు. కాళోజీ వంటి ప్రముఖుల సాన్నిహిత్యంలో రాటుతేలినవారు. తను రాసి మందాకిని సంస్కృత కావ్యం, సంస్కృతం తెలిసినవారందరికీ పరిచయం. తన రచనలతో అపూర్వమైన బిరుదులతో పాటు, పద్మశ్రీ సైతం అందుకున్న విజయసారథిగారి గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు. Sribhash...
వేసవిలో చల్లగా గడపండి ఈ ఆహారాలతో | Know Your Plate - 33 08.03.2024 25:32
వేసవి కాలం ఎండ నుంచి ఎలాగొలా తప్పించుకుంటాం. కానీ ఆ వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఎలా తప్పించుకోవడం. ఒంట్లో నీరు ఏమాత్రం తగ్గినా, పనిలో పడి ఆ సంగతి గమనించకపోయినా సమస్యలు తప్పవు. ఇక ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉంటే ఈ డైహైడ్రేషన్ తరహా ఎండాకాలపు సమస్యలు మరింత తీవ్రంగా వేధిస్తాయి. ఒకోసారి ఆసుపత్రి పాలు చేస్తాయి. అందుకే ఎండాకాలం ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా, రోజువారీ పనులను ఉత్సాహంగా కొనసాగించేందుకు కొ...
సంకల్ప సిద్ధి | ఓ మంచి మాట - 1 08.03.2024 8:26
ప్రతిసారీ కొత్త సంవత్సరం రావడం ఆలస్యం… మన జీవితాన్ని గాడిన పెట్టుకునేందుకు, బలహీనతలను తగ్గించుకుని బలాలను పెంచుకునేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందించేస్తాం. కొన్నాళ్ల పాటు చాలా పట్టుదలగా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అమలుపరుస్తాం కూడా. కానీ రోజులు గడిచేకొద్దీ షరా మామూలే. పాత జీవితం, పాత పద్ధతులే. అలా కాకుండా మనం అనుకున్న సంకల్పాలని సులువుగా నెరవేర్చడం ఎలాగో ఈ ఎపిసోడ్లో మనతో పంచుకోబోతున్నారు వ్యక్తిత్వ వి...
జీవితం మీద అవగాహన సాహిత్యం పట్ల స్పష్టత! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 46 07.03.2024 24:17
మన రచయితలు సిరీస్లో భాగంగా ఈసారి మనం కె.వి. మన్ ప్రీతమ్ ను కలుసుకోబోతున్నాం. సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తూనే, మంచి సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు మన్ ప్రీతమ్. రాసింది కొద్ది కథలే అయినా… మంచి కథలను రాసే యువరచయితగా సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఇప్పటి తరం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ, సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలు రాస్తున్న తనతో మాటామంతి. K.V.Manpreetam is well known among Telugu...
ఇద్దరు మిత్రులు సంగీతాన్ని ఏలిన కథ… శంకర్ జైకిషన్ | సాహితీ స్రవంతి - 60 02.03.2024 21:34
శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశి… ఈ పేరు చెబితే ఎవరని అడుగుతారు. కానీ శంకర్ జైకిషన్ అంటే ఆ పేరు, దాంతో పాటే వందలాది పాటలూ గుర్తుకొచ్చేస్తాయి. హైదరాబాద్ ప్రాంతంలో పుట్టిన శంకర్ నీ, గుజరాత్ కి చెందిన జైకిషన్ నీ సంగీతమే కలిపింది. అదే ముందుకు నడిపింది. ఆవారా, బర్సాత్ లాంటి వందలాది సినిమాలకు అద్భుతమైన హిట్ గీతాలతో ప్రాణం అద్దిని ఈ జంటలో ఒకరు చనిపోయినా… మరొకరు శంకర్— జైకిషన్ పేరుతోనే సంగీతాన్ని అ...
ఎగ్జామ్స్ టైంలో పిల్లల ఆరోగ్యం సంరక్షించండి ఇలా | Know Your Plate - 32 01.03.2024 29:35
పరీక్షల సమయంలో పిల్లలు చదువు మీద దృష్టి పెడితే, తల్లిదండ్రులు వారి చదువుతో పాటు ఆహారం గురించి కూడా ఆలోచిస్తారు. పరీక్షల సమయంలో పిల్లలు చురుగ్గా ఉండేందుకు, ఉత్సాహంగా రాసేందుకు, ఓపికగా చదివేందుకు కావల్సిన సత్తువను, పోషకాలను అందించే ఆహారం గురించి తెలుసుకునే ప్రయత్నమిది. ప్రముఖ పోషకాహార నిపుణులు ఆశ్రిత విస్సాప్రగడ గారి నుంచి ఈ విశేషాలు తెలుసుకుందాం. Exams aren’t just for students. Exams for kids often...
నేను తెలుసుకున్న జీవితం ఇదే! సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 41 29.02.2024 27:41
మన రచయితలు శీర్షికలో భాగంగా ప్రముఖ రచయిత సురేంద్ర రొడ్డగారితో సంభాషణ ఇది. సాహిత్యం… ఉపాధ్యాయుడిగా తనకు ఎలా ఉపయోగపడిందో ఇందులో చెబుతారు. అక్షరంతో దోస్తీ కడితే లోకం ఎలా మారిపోతుందో సూచిస్తారు. మంచి రచనల పట్ల తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. తనని ఎవరూ ప్రోత్సహించడం లేదనీ, ఎవరూ తలకెత్తుకోవడం లేదనీ బాధపడేవారికి అరుదైన మార్గం చూపిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అటు పాఠకులు, ఇటు రచయితలు తప్పక వినాల్సిన పాడ్ క...
ధ్వని చేసే కలం, ధ్వజమెత్తిన గళం… దాశరథి కృష్ణమాచార్య | సాహితీ స్రవంతి - 59 24.02.2024 19:01
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆదిలోనే నినదించిన కవి. సామాన్య జీవుల కోసం కలాన్ని గళంగా మార్చిన యోధుడు. ఒకవైపు పదునైన కవిత్వాన్ని రాస్తూనే, మరోవైపు ప్రేక్షకులను మైమరపించే సినీ ప్రేమ గీతాలు రాసిన అరుదైన రచయిత. అగ్నిధార, రుద్రవీణ లాంటి కవితలే కాదు… గాలిబ్ గీతాలు లాంటి అనువాదాలూ చేశారు. జయదేవ కృతులకు వ్యాఖ్యానం, ఆత్మకథ… ఇలా ప్రతి రచనాంగంలోనూ తనదైన ప్రతిభ కనబరిచారు. ఈ అరుదైన రచయిత గురించి తల్చుకునే ప్రయ...
నాన్న పచ్చి అబద్ధాలకోరు… ఎందుకంటే | సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 40 22.02.2024 32:05
సురేంద్ర రొడ్డ. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి… అంచెలంచెలుగా ఎదిగేందుకు తన పట్టుదలకు అండగా, సాహిత్యం కూడా ఉపయోగపడింది. అక్షరం మంచిచెడులు నేర్పి, బతుకు పాఠాలు నేర్పింది. వాటిని తిరిగి సమాజంతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సురేంద్ర. నాన్న పచ్చి అబద్ధాలకోరు లాంటి వినూత్నమైన కవితలు, కథలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన రచయితలు సిరీస్లో భాగంగా సురేంద్రగారితో...
పళ్లకు, ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధం ఏమిటి? | DenTAL Care - 8 17.02.2024 27:56
నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, పళ్ల మీద గార… ఇవన్నీ సాధారణ సమస్యలుగానే ఉండవచ్చు. కానీ అవి ఇతర సమస్యలకు కూడా దారి తీస్తాయని చాలామందికి తెలియదు. మధుమేహం నుంచి గుండెసమస్యలు వరకు పంటి సమస్యలు ఇతర అనారోగ్యాలని దారితీస్తాయి. ఈ విషయమై మరిన్ని వివరాలు అందిస్తున్నారు ప్రముఖ దంతవైద్యులు హరీష్ తెన్నేటిగారు. Dental problems such as plaque, gum bleeding, bad breath doesn’t just affect teeth. Poor oral health is...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.