New City Church

The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: newcity-telugu.podbean.com

Autor

New City Church

Kategoria

Religion

Strona podcastu

newcity-telugu.podbean.com

Ostatni odcinek

28 wrz 2026

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,8 iOS niedługo

Odcinki

[Bilingual] Knowing the Power of His Resurrection (Easter Sunday) 06.04.2026
[Bilingual] Forgiven & Healed - క్షమించబడుట మరియు స్వస్థపరచబడుట (Good Friday) 06.04.2026

మీరు క్షమించబడినవారైతే, మీరు స్వస్థత పొందినవారు కూడా. ఈ శుభ శుక్రవార స్వస్థతారాధన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్షమాపణ మరియు స్వస్థత మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. యేసు ప్రభువు మీ కొరకు శాపముగా ఎందుకు మారాడో, మీకు బదులుగా సిలువపై ఆయన ఏమి భరించాడో మీరిక్కడ తెలుసుకుంటారు. మహా వైద్యుడైన యేసునకు అసాధ్యం అనేది ఏమీ లేదు. మీ సమస్యపై కాకుండా, ఆయనపై మీ దృష్టిని...

A New Commandment - ఒక కొత్త ఆజ్ఞ 30.03.2026

మీరు యేసు క్రీస్తునకు శిష్యులా? అయితే మీరు ప్రేమకు శిష్యులైయుండాలి. సంబంధాలు అనే అంశాన్ని కొనసాగిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనము క్రీస్తు శిష్యులుగా ఎలా గుర్తింపబడతామో, ప్రేమలో నడవడం ఎందుకు ముఖ్యమో, మరియు కుటుంబంలో, సంఘంలో, జీవితంలోని ప్రతి రంగములో ప్రేమలో నడచుటకు మనం ఉద్దేశపూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే విషయాలను ఈ సందేశములో మనతో పంచుకుంటున్నారు. ఈ రోజు నుంచి, మీ జీ...

Jesus the Triumphant King - యేసు జయించిన రాజు 30.03.2026

యేసు ఎవరు? ఆయన విజయం ఏమి సాధించింది? ఈ మట్టలాదివార సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, యేసు క్రీస్తు ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా నిర్వర్తించిన మూడు రకములైన పరిచర్యలను గురించి, ఆయన పూర్తి చేసిన కార్యము యొక్క సంపూర్ణతను గురించి మనకు వెల్లడిస్తున్నారు. మన కొరకు క్రీస్తు ఎలా నిత్య జీవాన్ని అందించుటకు మరియు పాప మరణాల మీద విజయాన్ని మనకై సంపాదించిపెట్టుటకు వచ్చాడో పాస్టర్ గారు వివరిస్తు...

God's Wisdom for Relationships - సంబంధాలు ఎలా కట్టుకోవాలి? 16.03.2026

దేవుని ఙ్ఞానానుసారముగా సంబంధాలను కట్టుకోవడమంటే ఏమిటి? ఈ ప్రేరణాత్మకమైన వర్తమానములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు లేఖనానుసార సూత్రాల ద్వారా విశ్వాసులు ఆరోగ్యకరమైన మరియు అర్థవంతమైన సంబంధాలను ఎలా కట్టుకోవాలో మనకు బోధిస్తున్నారు. ఇతరులతో మనము సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో జ్ఞానం, వివేచన, మరియు దైవిక స్వభావం కలిగియుండుట ఎంత ముఖ్యమో పాస్టర్ గారు వివరంగా తెలియజేస్తున్నారు. ఈ సందేశము మీరు సంబంధ...

Are you a Friend of God? - దేవునితో స్నేహం 09.03.2026

దేవుడు కేవలం మీ రక్షకునిగా, స్వస్థపరచువానిగా లేదా సమకూర్చువానిగా మాత్రమే ఉండాలని కోరడం లేదు; ఆయన మీ స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాడు. ఈ సందేశములో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు  దేవునితో స్నేహాన్ని కలిగియుండే మనకున్న అద్భుతమైన ఆధిక్యతను మనకు పరిచయం చేస్తున్నారు. కేవలం దేవుని గురించి తెలుసుకోవడం నుండి ముందుకు సాగి, ఆయనతో నిజంగా ఎలా నడవాలో మనమిక్కడ నేర్చుకుంటాము. అబ్రాహాము, మోషే, మరియు యోహాను జీవి...

The Blessing of Godly Associations - దైవిక సహవాసములో ఉన్న ఆశీర్వాదము 02.03.2026

నీవెవరితో అయితే కలిసి నడుస్తావనేది, నీవు చేరుకునే గమ్యాన్ని నిర్ణయిస్తుంది.   సహవాసాలపై మనకు జ్ఞానోదయాన్ని కలిగించే ఈ ప్రసంగంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసి జీవితంలో దైవిక సహవాసాల ప్రాముఖ్యత మరియు ప్రభావం గురించి బోధిస్తున్నారు. సరైన సంబంధాలు నీ విశ్వాసాన్ని ఎలా బలోపేతం చేయగలవో, నీ స్వభావాన్ని ఎలా పదును పెట్టగలవో మరియు నీకై దేవునికున్న ఉద్దేశ్యంలో ఎదుగుటకు నిన్ను సరైన స్థితి...

Possessing the Promised Land - వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట 24.02.2026

నేడు విశ్వాసిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుట అంటే ఏమిటి? న్యూ సిటీ సంఘ 9వ వార్షికోత్సవాన, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధించిన జీవితాలను మార్చే ఈ సందేశములో, ‘వాగ్దాన దేశము’ అనేది ఒక భౌతిక స్థలం కంటే మించినదని, అది క్రీస్తులో దేవుని వాగ్దానాల పరిపూర్ణతను సూచిస్తుందని వారు మనకు వెల్లడిస్తున్నారు. విశ్వాసులు వాగ్దానాలను కేవలము తెలుసుకొనుట నుండి విశ్వాసముతో వాటిలో చురుకుగా నడచుటకు ఎ...

Overcoming Mental Attacks - మానసిక దాడులను జయించుట 16.02.2026

ఆందోళన, నిరాశ, గుర్తింపు సంక్షోభం, ఆత్మన్యూనతాభావం, రెండు వ్యతిరేక వ్యక్తిత్వాలు కలిగియుండే రుగ్మత, ఆత్మహత్య ధోరణులు, విషాద ఘటనానంతరం కలిగే మానసిక ఒత్తిడి, ధ్యాన లోపము మరియు అతి చురుకుదనము అనే రుగ్మత - శతృవును గుర్తించి, దానిపై గురి పెట్టండి. దేవుడు తన సైనికులైన క్రైస్తవులు మంచి మనస్సు మరియు ఆధిపత్యమున్న స్థానం కలిగియుండాలని కోరుకుంటున్నాడు. 'మానసిక దాడులను జయించుట' అనే ఈ వర్తమానములో, పాస్టర్ బెంజ...

Waiting Without Answers - ప్రార్థనకు జవాబు రానప్పుడు 10.02.2026

వేచి ఉండటం భారంగా అనిపిస్తున్నదా? జవాబు ఆలస్యమైందని నిరుత్సాహంగా ఉన్నారా? ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తుంది. ‘ప్రార్థనకు జవాబు రానప్పుడు’ అనే ఈ సందేశంలో పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, వేచిచూస్తున్న సమయంలో కూడా దేవుడు మనలోను మన చుట్టూను పనిచేస్తున్నాడని తెలియజేస్తారు.  యోసేపు, ఎలిజబెత్ మరియు ఇతరుల జీవితాల ద్వారా ఓర్పు మరియు విశ్వాసాన్ని నేర్పుతారు. “ఎంతకాలం ప్రభువా?” అన్నది “వందనాలు ప్రభువా!”గా మారినప...

The Truth about Generational Curses - శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము 02.02.2026

తరతరాలుగా వచ్చే శాపాలు నిజమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు ఇప్పటికీ తమ పూర్వీకుల పాపాల ప్రభావానికి గురవుతున్నారా? మనలను దీర్ఘంగా ఆలోచింపజేసే ‘శాపముల గురించి మీరు తెలుసుకోవలసిన సత్యము’ అనే ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తరతరాలుగా వస్తున్న శాపాలు మరియు క్రీస్తులో విశ్వాసుల తాము కలిగియున్న స్థానం గురించి మనకు తఱౘుగా కలిగే  ప్రశ్నలు మరియు సందేహాలను ప్రస్తావిస్తున్నారు...

How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి 28.01.2026

మీ జీవితాన్ని పూర్తిగా మార్చవేయగల ఆ ఒక్క పుస్తకమేమిటి? ‘దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి?' అనే ఈ అత్యంత ముఖ్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనల్ని కొన్ని ప్రాథమిక విషయాల గుండా తీసుకువెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకమైన బైబిల్‌ను అధ్యయనం చేయవలసిన గొప్ప ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నారు. ఈ వర్తమానములో, మీరు బైబిల్లోని విషయాలు, దానిని అధ్యయనం చేయ...

The Power of the Renewed Mind - నూతనపరచబడిన మనస్సు యొక్క ప్రభావము 19.01.2026

నూతన పరచబడిన మనస్సుతో నూతన నిబంధన కింద జీవించుట అంటే ఏమిటి? ‘నూతన పరచబడిన మనస్సు యొక్క ప్రభావము’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు అంతరంగములో నుంచి వచ్చేదే నిజమైన మార్పు అని, ఈ మార్పు బాహ్య పరిస్థితులు, ఒత్తిడుల వలన కాక అంతరంగములో మనమేమైయున్నామో, దానిని బట్టి, మన ఆలోచనలు, ఎంపికలు, జీవనశైలి మారుట ద్వారా కలుగుతుందని వివరిస్తున్నారు.  ఈ సందేశములో పాస్టర్ గారు మనస్...

[Bilingual] New Year Service 16.01.2026

ఈ నూతన సంవత్సర వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుని వాక్యాన్ని వినుటకు చెవులున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి అభివృద్ధికి మరియు వారికి నిర్దేశించబడిన దాన్నంతా స్వాధీనపరచుకొనుటకు దేవుని వాక్యం పోషించే కీలక పాత్రను పునరుద్ఘాటిస్తున్నారు. వారు నూతన నిబంధనలో దేవుడు మనల్ని రాజులుగాను, యాజకులనుగాను చేసినందున అన్ని నిర్ణయాలు తీసుకొనుటకు మరియు దేవుని రాజ్యాన్ని ముందుకు నడిపించుటకు మ...

[Bilingual] New Year's Eve Service 13.01.2026

ఈ వాచ్ నైట్ ఆరాధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, గత సంవత్సరములో దేవుని విశ్వాస్యతను తలపోసుకుంటూ, దేవుని సహాయముతో ఈ నూతన సంవత్సరములో విశ్వాసులమైన మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహించి, మరియు 2026వ సంవత్సరానికైన దేవుని వాక్యాన్ని విడుదల చేశారు. మన జీవితాల్లోనికి మనమనుమతించే స్వరాలను గురించి మనకు మనమే కొన్ని కీలకమైన ప్రశ్నలను వేసుకుంటూ, ఉద్దేశ్యపూర్వకంగా దేవుని స్వరాన్ని వినుట...

How to Receive Revelation Knowledge from the Word? - ప్రత్యక్ష జ్ఞానము ఎలా పొందుకోవాలి? 12.01.2026

మీ జీవితములో మీరు మీ వేగముతో ముందుకు సాగుతున్నారా లేక దేవుని వేగముతో ముందుకు సాగుతున్నారా? ఈ పాడ్‌కాస్ట్‌లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ముందుకు సాగి, దేవుడు మన కొరకు ఉంచిన వాటన్నిటినీ స్వాధీనపరచుకొనుటకు ప్రతి క్రైస్తవుడు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. వట్టి సమాచారం కంటే ప్రత్యక్ష జ్ఞానం పొందుకొనుట యొక్క శ్రేష్ఠతను, అది ఏ విధంగా మన జీవితములోనికి...

Principles for Advancing & Possessing - ముందుకు సాగి స్వాధీనపరచుకొనుటకు సూత్రములు 05.01.2026

ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి? 2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన మనకొరకు ఉంచిన వాటన్నిటినీ మనము సొంతం చేసుకోవడానికి మనలను బలపరిచే ఆత్మీయ సూత్రాలను పంచుకుంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల, స్పష్టత మరియు నిరంతర అభివృద్ధికి మూలమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుట యొక్క కీలకమైన ప...

Receiving the Fullness of Christ - క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా? 29.12.2025

క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని వివరిస్తున్నారు. వారు ప్రతి విశ్వాసి జీవితములో పాపము నిర్మూలించబడిందని వెల్లడిస్తూ నూతన నిబంధన క్రింద మన రక్షణ నిమిత్తము శాశ్వతంగా పూర్తి వెల చెల్లించిన క్రీస్తు రక్తము యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతున్నారు. ...

[Bilingual] Grand Christmas Miracle Service 27.12.2025

అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి తెలుపుతున్నారు.  క్రీస్తు శతృవు యొక్క కార్యాల మీద విజయాన్నెలా పొందాడో తెలుసుకొని, మీ ఆరోగ్యము, కుటుంబము, ఆర్ధిక విషయాలు, వృత్తి, పరిచర్య ఇంకా మరిన్ని రంగాలలో అద్భుతాలను చూచుటకు విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరించండి! మ...

Created for the Miraculous - అద్భుతములు 22.12.2025

అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన జీవితాల్లోని కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైనవిగా ఉండకూడదు కానీ ప్రతి రోజూ విశ్వాసులు తమ జీవితాల్లోని ప్రతి రంగములో అనుభవిస్తూ ఉండాల్సినవైయుండాలని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తున్నార...

Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి 16.12.2025

మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా?  ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే. ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పను...

Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు 08.12.2025

స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు.  ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్...

The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము 03.12.2025

మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ...

Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై 27.11.2025

ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు.  ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూ...

The Judgement Seat of Christ - క్రీస్తు న్యాయపీఠం 19.11.2025

క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా? పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన నిబంధన విశ్వాసులు దేవుని బహుమానాలు మాత్రమే కాదు కానీ, క్రీస్తు న్యాయపీఠము వద్ద మన కొరకు వేచియున్న ప్రతిఫలాలను పొందుకొనే జీవితాన్ని జీవించే బాధ్యత మనకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు  మీ ప్రతి మంచి పనికి...

Słuchaj podcastu The New City Church Podcast - Telugu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS