New City Church
The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in
No dejes de visitar la web del podcast y apoyar a su creador: newcity-telugu.podbean.com
Autor
New City Church
Categoría
Web del podcast
Último episodio
28 de sep. de 2026
¿Dónde escuchar?
Podcasts en la app Replaio Radio Muy prontoLos podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts
Episodios
Total Transformation - పరిపూర్ణ రూపాంతరం 28.09.2026 56:44
మీ ఆలోచనా విధానాన్ని ఏది తీర్చిదిద్దుతోంది? దేవుని వాక్యమా లేదా లోక స్వరమా? ఈ పరివర్తనను కలిగించే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నిజమైన పరివర్తన మనస్సు మారుటతో ప్రారంభమవుతుందని వెల్లడిస్తున్నారు. రోమీయులకు 12:1–2 మరియు ఇతర లేఖనాల ఆధారంగా, మన ఆలోచనలు మన ఊహలను, నమ్మకాలను, నిర్ణయాలను, క్రియలను, అలవాట్లను, చివరకు మన జీవన విధానాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఆయన వివరిస్తున్నారు. మీ ఆలో...
Faith that Speaks - విశ్వాసం మాట్లాడును 24.09.2026 57:05
మీరు వినేది మీ నమ్మకాన్ని రూపొందిస్తుంది. మీరు నమ్మేది చివరికి మీరు ఏమి మాట్లాడతారు, ఎలా జీవిస్తారు అనేదాన్ని నిర్ణయిస్తుంది. ఈ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు సువార్తను వినడం ద్వారా విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో, అలాగే, విశ్వాస మూలముగా నీతిమంతులైన వారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాకుండా, దేవుని వాక్యంతో ఏకీభవిస్తూ ఎలా మాట్లాడుతారో తెలియజేస్తున్నా...
Walking In The Light - వాక్యపు వెలుగు 22.09.2026 51:39
మీరు జీవిస్తున్న క్రైస్తవ జీవితంతో మీరు విసుగు చెందియున్నారా? దేవునికి సంబంధించిన కార్యాలలో నమ్మకంగా పాల్గొంటూ, క్రమంగా సంఘానికి హాజరవుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఇవ్వడంలో మరియు సంఘ పరిచర్యలో సేవ చేస్తూ ఉన్నప్పటికీ, ఇవన్నీ చివరికి ప్రయోజనం లేకుండా పోతున్నాయేమో అని మీరు అనుకోవడం ప్రారంభించారా? బైబిలు ఆధారాలను చూపిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, మోసం మనలో ఈ నిరాశకు ఎలా కారణమవుతుందో...
Righteousness Revealed - నీవు దేవుని నీతివై ఉన్నావు 08.09.2026 1:01:43
మళ్లీ మళ్లీ అదే పాపంలో పడిపోతూ, ఇక ఎప్పటికీ దాని నుండి విడుదల ఉండదేమో అన్నట్లుగా అనిపిస్తుందా? మీరు ఎదురుచూస్తున్న విడుదల, మీరు ఇప్పటికే క్రీస్తులో ఎవరైయున్నారో అర్థం చేసుకోవడం నుంచే ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు నీతి గురించిన సత్యాన్ని బయలుపరుస్తూ, దేవుని వాక్యంలోని సత్యం మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండే పాపపు చక్రాల నుండి మిమ్మల్ని పూర్తిగా, ఒక్కసారిగా విడుదల చ...
How to Receive Your Harvest - నీ పంటను ఎలా పొందుకోవాలి 01.09.2026 1:08:11
ప్రతి పంట ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. మీరు నాటే విత్తనం ఎటువంటిదో, చివరకు మీరు కోయబోయే పంట కూడా అలాంటిదే అయి ఉంటుంది. ఈ విలువైన బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పంటకు సంబంధించిన మూడు ముఖ్యమైన సూత్రాలను వివరిస్తున్నారు: మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు, మీరు విత్తిన దాని కంటే ఎక్కువగా కోస్తారు, మరియు మీరు విత్తిన తర్వాతనే కోస్తారు. విత్తనం, విత్తేవాడు, నేల అనే ఉదాహరణల ద్వారా, దేవు...
Made To Look Like Christ - నీలో ఉన్నవాడు (Pastor Arpitha Komanapalli) 17.08.2026 1:03:43
అదే సమస్యతో మీరు పదేపదే పోరాడుతూ ఉన్నారా? మీరు ఎవరిని పోలి ఉన్నారో తెలుసుకోవడం ద్వారా ఆ పోరాటాన్ని ఆపగలరని మీకు తెలుసా? నూతన సృష్టి వాస్తవాల శ్రేణిలో భాగంగా, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, తన ప్రతి బిడ్డ ఎలా యేసును పోలి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, సరైన ఆలోచన సరైన జీవనానికి ఎలా పునాది అవుతుందో, మీ మాటలు మీ జీవితాన్ని ఎలా మలుస్తాయో, అలాగే మీలో నివసిస్తున్న గొప్పవాడైన క్రీస్తును పోలి నడవడానికి మ...
Made New - నూతన సృష్టి (Pastor Arpitha Komanapalli) 10.08.2026 1:00:39
దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో, అంటే నూతన సృష్టిగా, మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రారంభించినప్పుడు మీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ పరివర్తనాత్మక బోధనలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు క్రీస్తులో విశ్వాసికి ఉన్న నూతన గుర్తింపు యొక్క వాస్తవాన్ని వివరిస్తున్నారు. నూతన నిబంధనలోని సత్యం ద్వారా, దేవునిచే సృష్టించబడినవారిగా, ఆత్మ ద్వారా జన్మించినవారిగా ఉండటం అంటే ఏమిటో, అలాగే నూతన సృష్టిగా దేవున...
Are You Worried? - చింతించుచున్నావా? (Pastor Arpitha Komanapalli) 29.07.2026 1:16:53
ఈ మధ్యకాలంలో చింత మీ నిరంతర సహచారిణిగా ఉంటూ ఉందా? ఈ ప్రోత్సాహకరమైన సందేశంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, చింత అనేది ఒక విశ్వాసి జీవనశైలిగా ఉండుటకు ఉద్దేశించబడలేదని బోధిసున్నారు. మీ పరిస్థితులను పెద్దవిగా చూడటానికి బదులుగా దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలో ఇక్కడ తెలుసుకోండి. చింతను జయించి, మీ పరలోక తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారనే ధైర్యంతో జీవించడానికి సహాయపడే ఆచరణాత్మకమైన బైబిలు సూత...
Speaking in Tongues - Reasons and Benefits - అన్య భాషలలో మాటలాడుట (కారణములు మరియు ప్రయోజనములు) 21.07.2026 1:03:17
దేవుడు విశ్వాసులకు అన్య భాషలలో మాట్లాడే వరాన్ని ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో ఙ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కొందరు విశ్వాసులు ఎందుకు భాషలలో మాట్లాడడానికి దూరంగా ఉంటారో వివరించి, భాషలలో మాట్లాడుటకు సంబంధించిన బైబిలు ఆధారమైన కారణాలను మరియు ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. ఈ అమూల్యమైన వరాన్ని స్వీకరించి, మీ పరలోక తండ్రితో మీ సంబంధాన్ని మరింతగా బలపరచ...
Be Filled With The Holy Spirit - పరిశుద్ధాత్మ చేత నింపబడుట 16.07.2026 48:10
మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ అంతర్నివాసం మరియు నింపుదల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తున్నారు. దేవుని అతీతమైన శక్తిలో ఎలా నడవాలో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు సంబంధించిన రెండు కీలక సత్యాలను, అలాగే అన్యభాషలలో ప్రార్థించేందుకు పరిశుద్ధాత్మ ఎలా వాక్ శక్తి అనుగ్రహిస్తాడో ఇక్కడ తెలుసుకోండి. మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యానికి మీరు...
The Spirit of Grace - కృప గల ఆత్మ 29.06.2026 1:07:16
పరిశుద్ధాత్మ – కృప గల ఆత్మ మీరు యేసును ప్రేమిస్తున్నారు కానీ మీ జీవితంలో సాక్ష్యం, విడుదల, ఆనందం, సమాధానం, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, ప్రార్థనకు, మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి శక్తి లేన్నట్లు అనిపిస్తుందా? అయితే ఈ ఒక్క సత్యాన్ని గ్రహించడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. పరిశుద్ధాత్మపై కొనసాగుతున్న ఈ సిరీస్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ప్రతి విశ్వాసికి అత్యంత అవసర...
Guaranteed Victory through the Holy Spirit - పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట 15.06.2026 57:47
మీరు ప్రతి ఒక్క సారి విజయంలోనే నడచుటకు మీకు సహాయం చేసే వారు ఒకరు ఉన్నారని మీకు తెలుసా? ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, విశ్వాసులు పరిశుద్ధాత్మతో మరింత లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎలా నిరంతర విజయాన్ని అనుభవించగలరో వెల్లడిస్తున్నారు. ఈ సందేశం ద్వారా మీరు పరిశుద్ధాత్మ సన్నిధిని గుర్తించడం, ఆయన నడిపింపును విశ్వసించడం, ఆయన ప్రేరేపణలకు విధేయత చూపించడం నేర్చుకొని దేవ...
Anointed for Guaranteed Victory - నిశ్చయమైన విజయం కోసం అభిషేకింపబడినవారు 10.06.2026 1:03:30
మీరు జీవితంలో అన్ని వైపుల నుండి దాడులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తూ, బయటపడే మార్గమే కనిపించని స్థితిలో ఉన్నారా? మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారా? మీకు సమాధానం ఇక్కడ ఉంది! ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, దేవుడు తన పిల్లలు విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ఎంతగా కోరుకుంటున్నాడో తెలియజేస్తున్నారు. అలాగే, దేవుడు మన కొరకు సిద్ధపరచిన విజయవంతమైన జీవిత...
I Will Pour Out My Spirit - అంత్యకాల అభిషేకము (Pastor Arpitha Komanapalli) 29.05.2026 1:10:44
మీ క్రైస్తవ జీవితంలో శక్తిలేకుండా జీవిస్తున్నారని అనిపిస్తున్నదా? ఈ పెంతెకొస్తు ఆదివారాన, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి స్పష్టమైన, లేఖనాధారిత బోధనను అందిస్తున్నారు. మీరు తిరిగి జన్మించిన విశ్వాసిగా దేవునిని మరింత లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నా, లేదా జీవితంలోని పోరాటాలపై విజయాన్ని కోరుతున్న వ్యక్తి అయినా, మీరు పరిశుద్ధాత్మను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వర్తమానములో,...
The Father's Promise - The Holy Spirit తండ్రి వాగ్దానం - పరిశుద్ధాత్మ 19.05.2026 1:08:18
మీరు నిజంగా శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా? ఈ వర్తమానములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేశాడో, మరియు ఇప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మకు సంబంధించి విశ్వాసులకున్న వాస్తవికత ఏమిటో వివరిస్తున్నారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కొంత కాలం మాత్రమే మనుష్యుల మీదకు దిగి వచ్చే వాడు; కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసిలో ఆయన ఇప్పుడు...
Supernatural Financial Increase - అతీతమైన ఆర్ధిక అభివృద్ధి 11.05.2026 1:10:35
నిజమైన సమృద్ధికి దారితీసేది ఏమిటి? తన పిల్లల కొరకు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, దేవుని చిత్తం ఏమిటో ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. వారు మొదట మన మనస్సు వర్థిల్లుట పునాదిగా అవసరమని బోధిస్తూ, దేవునికి మరియు ఆయన మన జీవితాల్లో ఉంచిన నాయకులకు మనలను మనము పూర్తిగా సమర్పించుకొనుట ద్వారా, అలాగే ఇచ్చుట విషయంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టుట ద్వారా, దేవుడు మన కొరక...
Faith for Breakthrough - విడుదల కలుగజేయు విశ్వాసము 05.05.2026 52:52
మీ జీవితములో అడ్డంకులను దాటి, దేవుని వంటి ఫలితాలను చూడటానికి, సహాయపడే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి? మీ సందిగ్ధాన్నంతా తీర్చే ఈ వర్తమానంలో, విశ్వాసులు దేవుని వాక్యంతో తమ జీవితాలను ఎలా నిర్మించుకొని, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర రంగంలోనైనా గొప్ప విడుదలను ఎలా పొందుకోవచ్చో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశములో బోధిస్తున్నారు. విశ్వాసులు పరిమితులను దాటి, దేవుని వాగ్దా...
Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము 28.04.2026 56:26
దైవికముగా పిల్లలను పెంచుటకు మీకు జ్ఞానము ఉన్నదా? మీ కుటుంబ నేపథ్యమేదైనా, ప్రతి తల్లి, తండ్రి, సంరక్షకులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన 7 వాక్యాధారిత సూత్రాలతో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ఈ సందేశములో మనలను సిద్ధపరుస్తున్నారు. పిల్లల పెంపకానికి ప్రధానాంశాలను, ఒక బిడ్డను శిక్షణ చేయుటలో పలు విధానాలను వారు మనతో పంచుకుంటూ, మనము ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ప్రశ్నలతో చివరిగా ముగిస్తారు. మీరు తల్...
The Precious Blood of Jesus - అమూల్యమైన యేసు రక్తము (మన స్వాస్థ్యమునకు మూలం) 21.04.2026 51:21
యేసు రక్తం ఎందుకు ఎంతో అమూల్యమైనది? అది మన స్వాస్థ్యమునకు ఎందుకు మూలం? ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి విశ్వాసి జీవితంలో దాని ముఖ్య పాత్రను వివరిసున్నారు. యేసు రక్తం ఎందుకు అమూల్యమైనదో ఏడు శక్తివంతమైన కారణాలను పాస్టర్ గారు పంచుకుంటూ ఆ రక్తం మన కొరకు ఏమి సాధించింది, నూతన నిబంధనలో మన కొరకు ఏమి సంపాదించిందో వెల్లడిసున్నారు. ఈ సందేశం ద్వా...
Our Inheritance in Christ - క్రీస్తులో మన స్వాస్థ్యము 13.04.2026 1:01:58
దేవుని నుంచి మీకొక స్వాస్థ్యము ఉందని మీకు తెలుసా? విశ్వాసులందరికీ కనువిప్పు కలిగించే ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులో, ప్రతి దేవుని బిడ్డకున్న స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నారు. మన కళ్ళు తెరువబడే అవసరతను గురించి, శతృవు చేత కొందరు అంధులుగానే ఎలా మిగిలిపోతున్నారో మరియు ఇప్పటికే మనదైయున్న ఈ గొప్ప, మహిమకర స్వాస్థ్యములో మనమెలా నడవాలో పాస్టర్ గారు వివరిస్తున్నారు. మీ...
Podcasts similares
Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos