Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Touch A Life Foundation
Categorie
Website van de podcast
Nieuwste aflevering
8 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
"మన ప్రాచీన వంటలు, సంస్కృతిని కాపాడుకోవాలి" - America Bathakhani 15.12.2025 31:49
రుచికరమైన వంటలు, ముఖ్యంగా మన అమ్మమ్మల కాలం నాటి ప్రాచీన తెలుగు రుచులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? హైదరాబాద్‌లో పుట్టి, ఇప్పుడు అమెరికాలో ఉంటూ, తన వీడియోలతో Instagram Influencerగా లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న మన "America Bathakani" గారు... మరుగున పడిపోతున్న మన సంస్కృతి, వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె తన పుట్టిన ఊరి విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మ...
విటమిన్ - E ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 71 15.12.2025 22:06
మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలన్నా, అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా... విటమిన్ E ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కాపాడుతుంది, తద్వారా Ageing Signsను ఆలస్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని, కళ్ళను, మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది...
అంతరించిపోతున్న భాషలకు రక్షణ - బోలి చేతో 11.12.2025 27:56
భాష కేవలం మన భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదు... అది ఒక సమాజం యొక్క సంస్కృతికి, ఆచారాలకు, చరిత్రకు ప్రతిరూపం! ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేలకు పైగా భాషలు ఉన్నప్పటికీ, ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంటుంది. అందులో లిపి ఉన్న భాషలు కొన్ని, లిపి లేని భాషలు కొన్ని, అంతరించి పోతున్న భాషలు మరికొన్ని. మరి అటువంటి భాషలను రక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ బోలి చేతో! మరి ఈ సంస్థ భాషల కోసం చే...
"మా అమ్మమ్మ కన్నడ.. నాన్నమ్మ తెలుగు .. " - Nisha Reddy | మా ఊరు - 60 08.12.2025 38:32
కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గా తన కెరీర్ ను ప్రారంభించినా… తనకు ఇష్టమైన యోగా వైపు అడుగులు వేశారు. ఇపుడు అమెరికాలో యోగా ఇన్స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మందికి యోగాసనాలను నేర్పిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు నిషా రెడ్డి గారు. వీరిప్పుడు వారి చిన్ననాటి ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు పొద్దు పొద్దున్నే నాన్నమ్మ నిద్రలేపడాలు, ఊయలలూగిన జ్ఞాపకాలు, పండగలకు సరదాగా ఫ్రెండ్స్ తో గడిప...
విటమిన్ - C ఆవశ్యకత , లోపం, లభించే ఆహారం 05.12.2025 27:18
మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ - C ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ సి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది, ముఖ్యంగా సాధారణ జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండేలా చూసుకుంటే, మన ఆరోగ్యం మరింత మెరుగ్గా, చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్...
"చిన్నప్పుడు మా ఇల్లు సత్రం లాగా ఉండేది" - లావణ్య రాఘవరెడ్డి | మా ఊరు - 59 01.12.2025 36:19
చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకోవడం, ఫ్రెండ్స్, చుట్టాలు ఎప్పుడూ ఇంటికి రావడం… రాజమండ్రిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర పండుగలు జరుపుకోవడం, నెల్లూరు లో స్కూల్ డేస్ వంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తమ ఇల్లు ఒక 'సత్రం' లాగా కళకళలాడేదని గుర్తు చేసుకుంటున్నారు నెల్లూరుకు చెందిన లావణ్య రాఘవ రెడ్డి గారు. మరి మీరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలను, ఊరి విశేషాలను గుర్తుచేసుకోవడానికి తప్పకుండా ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ ను వ...
విటమిన్ A: ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 69 28.11.2025 34:31
విటమిన్ A కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ, పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా అవసరం. విటమిన్ A లోపం వల్ల కంటి చూపు సమస్యలు (రేచీకటి ), చర్మ సమస్యలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటివి సంభవించవచ్చు. ఈ వారం Know Your Plate పోడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు విటమిన్ A యొక్క ప్రాముఖ్యత గురించి, దాని లభ్యత గురించి, ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు… తప్పకుండా వినండి మరి .. Vitami...
పెద్దవారి కోసమే ఈ ఇల్లు! 19.11.2025 3:28
ఒంటరితనాన్ని దూరం చేసి, వృద్ధుల జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఒక మంచి ఇల్లు ఉంది… అదే ఖమ్మంలోని 'మహాత్మా గాంధీ డే కేర్ సెంటర్'! ఇక్కడికి ప్రతిరోజూ ఎంతో మంది పెద్దవారు వచ్చి, ఆటలాడుతూ, పాటలు పాడుతూ సరదాగా కాలం గడుపుతారు! ఒంటరితనం, అనారోగ్యం, కౌన్సిలింగ్, పెన్షన్ సాయం... వంటి ఎన్నో సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది! ఈ పాడ్కాస్ట్ వినండి… మీకే తెలుస్తుంది… అసలు ఆ ఇల్లు ప్రత్యేకత ఏంటో, వా...
"చిన్నప్పుడు అమ్మ సంతకం నేనే చేసేదాన్ని" - నూరి షహజాది | మా ఊరు - 58 17.11.2025 32:57
చిన్ననాటి స్కూల్ డేస్, క్రేజీ మెమొరీస్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో గడిపిన జ్ఞాపకాలు... ఇవన్నీ దాటి, ఏకంగా అమెరికాలో ఫిట్‌నెస్ కోచ్‌గా సెటిల్ అయ్యేదాకా తన జర్నీ మొత్తం ఫుల్ ఫీల్ గుడ్ వైబ్ తో మనతో పంచుకుంటున్నారు వైజాగ్ కు చెందిన, Founder Of Shape & Sculpt నూరి షహజాది గారు! లైఫ్‌లో ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంట్, మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలనే సూపర్ టిప్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్న ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్...
"అమెరికాలో మా పెళ్లి మరచిపోలేని అనుభూతి" - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 57 | Part - 2 10.11.2025 25:54
గతవారం మా ఊరు పాడ్కాస్ట్ లో సంగీతా రెడ్డి బొర్ర గారు వారి బాల్యం, స్నేహితులు, స్కూల్, కాలేజీ విషయాలు పంచుకున్నారు కదా.. ఇక ఈ వారం వారు అప్పట్లో పండగలు ఎలా చేసుకునే వారు.. ఇంకా అమెరికా లో వారి పెళ్లి గురించి... అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్ లోకి ఎలా వచ్చారు... వంటి బోలెడన్ని కబుర్లు మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి మరి...! Last week on our Maa Ooru podcast, Suneetha Reddy Borra shared stories f...
"నాన్న నల్ల కోటు తో కోర్ట్ ఆట ఆడుకోవడం మంచి జ్ఞాపకం " - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 56 03.11.2025 34:04
స్కూల్ డేస్.. తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! రిక్షాలో స్కూల్‌కి వెళ్లిన సరదా రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన మధుర క్షణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న ఆ అపురూపమైన బంధం... ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు వారి స్టడీస్ , ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు సియోటెల్ లో ఉంటున్న సంగీతా రెడ్డి గారు! మీరూ మీ బాల్య స్నేహితులను, ఆ అల్లరి రోజులను గుర్తు చేసుకుంటూ... ఆ నాస్టాల్జియా ట్రిప్‌ను ఎంజాయ్...
హెల్తీ వెయిట్ లాస్ కోసం ఆహారం, వ్యాయామం | Know Your Plate - 66 31.10.2025 36:08
ఈ మధ్య కాలం లో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మార్కెట్ లో ఉన్న ఎన్నో రకాల డైట్ ల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి? బరువు తగ్గడం కోసం చెబుతున్న వివిధ విషయాలలో నిజాలు , అపోహలు అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు చక్కగా వివరిస్తున్నారు .. మిస్ అవ్వకుండా వినండి. Many people try different...
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 29.10.2025 22:03
వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి మన పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గార...
వృద్ధుల సంతోషం కోసం ఓ స్టూడెంట్ మిషన్! 28.10.2025 2:37
ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt. India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్ వాక్ వంటివి చేయిస్తూ... పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మంచి పని చేయడానికి వయసుతో గానీ, టైమ్‌తో గానీ పనిలేదని నిరూపించిన ఈ యంగ్ టీమ్ చేస్తున్న ఈ స్ఫూర్తి క...
కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం | know your plate - 65 24.10.2025 29:36
కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి రక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ పాడ్కాస్ట్ లో, కంటి ఆరోగ్యాన్ని పెంచే అత్యంత ముఖ్యమైన ఆహారాలు ఏమిటి? అవి మన కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారి మాటల్లో...
సాత్విక ఆహారం - దాని ప్రాధాన్యత | ఆయుర్వేదం ఆరోగ్యం - 89 22.10.2025 24:56
సాత్విక ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం! ఒత్తిడి, ఆందోళన లేని ప్రశాంతమైన జీవితాన్ని, సొంతం చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే శక్తివంతమైన జీవన విధానమే సాత్విక ఆహారం. అసలు, సాత్విక ఆహారం అంటే ఏమిటి? దానిని ఎలా పాటించాలి? లాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో విరిస్తున్నారు. మిస్ అవ్వకుండా వినండి! మంచి ఆహారాన్ని గురించి తెలుసుకునే మంచి అవకాశమిది! Sa...
ఈ హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే బిల్ ఉండదు 21.10.2025 2:58
పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గారి హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే, బిల్లు పూర్తిగా జీరో! అంతేకాదు, ఆనందంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి, పండగ చేసుకుంటారు. లింగ వివక్షను రూపుమాపడానికి డాక్టర్ రాఖ్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది! ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనలు మార్చిన ఈ నిజమైన హీరో కథ ఏంటి? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ మార్పు వెనుక ఉన్న కష్టాలు, ప్రేరణ ఏంటి? లాంటి మరి...
మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 88 15.10.2025 20:45
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్...
ప్లాస్టిక్ ప్యాకింగ్ బంద్: పర్యావరణాన్ని కాపాడుతున్న Aecoz కథ! 14.10.2025 3:37
కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, బెంగళూరు యువతరం ప్రారంభించిన 'Aecoz' బయోడిగ్రేడబుల్ స్టార్టప్... కేవలం రూ. 5.2 కోట్ల టర్నోవరే కాదు, ఏకంగా 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది! వీరు తయారు చేసిన ప్యాకేజింగ్ కవర్లు 98% కరిగిపోతాయని నిరూపితమైంది. వీరు హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా లీక్-ప్రూఫ్ కప్పులు, కంటైనర్లను పేపర్‌తో తయారు చేసి అందిస్తున్నారు. అద్భుతమైన వీరి ఈ విజయం గురించి మరిన్ని వ...
అడవిని తలపించే యూనివర్సిటీ ఇది! 09.10.2025 2:32
యూనివర్సిటీ అంటే బిల్డింగ్‌లు, లైబ్రరీలేనా? లేదండీ! మహారాష్ట్రలోని ఈ AI యూనివర్సిటీ గురించి వింటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది! 50 ఎకరాల్లో 90% చెట్లతో, రీసైకిల్డ్ వస్తువులతో నిర్మించిన ఈ క్యాంపస్... మన దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో నేర్పే ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈ పాడ్కాస్ట్ లో వినండి! This AI University in Maharashtra is redefining what ed...
మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 87 08.10.2025 19:56
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్...
రైతు భవిష్యత్తు మార్చే యువకుల ఆవిష్కారం 07.10.2025 3:00
రైతు కుటుంబాల నుండి వచ్చిన ముగ్గురు యువకులు, నీటి కొరతను తగ్గించడానికి పండ్ల వ్యర్థాల నుండి 'ఫసల్ అమృత్' అనే ఒక సరికొత్త హైడ్రోజెల్ పౌడర్‌ను కనిపెట్టారు. ఈ ఆవిష్కరణ నీటి వాడకాన్ని 40% తగ్గిస్తుంది. పంట దిగుబడిని 20% వరకు పెంచుతూ, వ్యర్థాలను ఎరువుగా మారుస్తుంది. యువతరం సాధించిన ఈ గేమ్-ఛేంజింగ్ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి! Three young i...
ఆర్కే బీచ్ తో చాలా అనుబంధం ఉంది | మా ఊరు - 55 06.10.2025 29:08
స్నేహితులతో కలిసి సినిమాల్లో హీరోలా నటించిన అల్లరి బాల్యం, స్కూల్లో ఆటలు, పాటలు, అల్లర్లతో గడిపిన ప్రతి నిమిషం... ఇవన్నీ మన పల్లెటూరి పాత జ్ఞాపకాలే. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలతో తన చిన్ననాటి పల్లెటూరి అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్ గారు. మరి మీరు కూడా ఈ ఎపిసోడ్ విని మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి! సరదాగా మీ గత ఆలోచనల అనుభవాల్లోకి వెళ్లి ర...
మలబద్ధకం - నివారణ | Know Your Plate - 64 03.10.2025 31:45
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చాలమందికి పెద్ద సమస్యగా మారింది , మనం తినే ఆహారం లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు , అలాగే ఈ పాడ్కాస్ట్ లో ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి,,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు వినండి మరి .. Constipation has become a common problem for many people th...
వెనకటి తరానికి - భవిష్యత్ తరానికి మధ్య వారధులు సీనియర్ సిటిజన్స్ | Dr.గురజాడ శోభా పేరిందేవి 02.10.2025 42:17
జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే... పెద్దల మాటలు తప్పకుండా వినాలి! ఈ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్య సమస్యల గురించి, వారి ఇష్టాయిష్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశంపై పీహెచ్.డి సాధించిన తొలి తెలుగు మహిళ గురజాడ శోభా పేరిందేవి గారితో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం! ఆమె చూపిన దారి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ స్పెషల్ పాడ్కాస్ట్ ను మీరూ వినండి…! అస్సలు మిస్ అవ్వకండి! On...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds