Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

10 jul. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

కవి అయిన సినీకవి అనిపించుకోవాలి! | తిరునగరి శరత్ చంద్ర - Part - 2 | మన రచయితలు -34 05.10.2023

మన రచయితలు శీర్షిలో భాగంగా టాల్ పరిచయం చేస్తున్న మరో విశిష్టమైన రచయిత- తిరునగరి శరత్ చంద్ర. తండ్రి అడుగుజాడల్లో సాహిత్యంలో తొలి అడుగులు వేసిన శరత్ చంద్ర, భాష మీద మక్కువతో ఎం.ఎ తెలుగు చేసి అధ్యాపకులుగా స్థిరపడ్డారు. 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే ఆసక్తికరమైన అంశంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వందల కవితలు, వ్యాసాలతో పాటు సినిమా పాటలు కూడా రాసిన ఈ వర్ధమాన రచయిత మాటలు విందాం...

Exploring Various Diet Trends | Know Your Plate - 19 29.09.2023

మనం రోజువారీ తినే పదార్థాల్లో వేటి కలయిక సంపూర్ణ ఆహారం కిందకి వస్తుంది అనే విషయం మీద రకరకాల సిద్ధాంతలు వినిపిస్తాయి. వీటి గురించి ప్రచారం, వాదవివాదాలు సాగుతుంటాయి. ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. ఈ ముఖ్యమైన డైట్ ట్రెండ్స్ ఏమిటి? వాటిలో వేటిని పాటించాలి? అన్న అనుమానాలకు జవాబే ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్. తెలుసుకుని తీరాల్సిన సమాచారం ఇది. We often hear a lot about diet trends. One day we hear a trend much f...

మంచి సినిమాపాటను కూడా కవిత్వంగా భావించాలి | డా. తిరునగరి శరత్ చంద్ర - Part 1 | మన రచయితలు 33 28.09.2023

మన రచయితలు శీర్షిలో భాగంగా టాల్ పరిచయం చేస్తున్న మరో విశిష్టమైన రచయిత- తిరునగరి శరత్ చంద్ర. తండ్రి అడుగుజాడల్లో సాహిత్యంలో తొలి అడుగులు వేసిన శరత్ చంద్ర, భాష మీద మక్కువతో ఎం.ఎ తెలుగు చేసి అధ్యాపకులుగా స్థిరపడ్డారు. 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే ఆసక్తికరమైన అంశంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వందల కవితలు, వ్యాసాలతో పాటు సినిమా పాటలు కూడా రాసిన ఈ వర్ధమాన రచయిత మాటలు విందాం...

ఈ జాబ్ పోర్టల్… దివ్యాంగులకు మాత్రమే! 27.09.2023

దివ్యాంగులకు ఇప్పుడిప్పడే సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కానీ ఇంకా వారి సంఖ్య, నైపుణ్యాలకు తగిన అవకాశాలు ఉండటం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఒక వ్యక్తి, కేవలం దివ్యాంగుల కోసమే ఒక జాబ్ పోర్టల్ ఆరంభించారు. ఆ వ్యక్తి, తపన, ప్రయాణం, ప్రభావం విని తీరాల్సిందే. People with special needs though getting some opportunities are still lacking equal means to gain livelihoods and prove themselves. Here is an unique...

Inspiring Story of Pele | Life Mantra 26.09.2023

ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన ఆటగాడిగా పీలే అందరికీ పరిచయమే. బంతిని మంత్రదండంలా మార్చిన పీలే తన కెరీర్లో మానవమాత్రమైన ప్రతి విజయాన్నీ సాధించిచూపాడు. వ్యక్తిగతంగానూ కొన్ని విలువలకు కట్టుబడి, సాటి ఆటగాళ్లలో మేటిగా నిలిచాడు. ఎంతలా అంటే తన దేశం, పీలేను జాతీయ సంపదగా గుర్తించేంత. పీలే ప్రత్యేకత గురించి, తన ప్రతిభ వెనుక ఉన్న విజయసూత్రాల గురించి వినితీరాల్సిన మాటలివి. Pele is not...

తన ఆశయం… ఆకలి లేని ముంబై! 25.09.2023

వికాస్, అందరిలాగే కలల నగరం ముంబైకి చేరుకున్నాడు. మంచి ఉద్యోగం, భవిష్యత్తు మీద భరోసా. కానీ తన గురించి మాత్రమే ఆలోచించలేదు తను. తన కళ్ల ముందు కనిపిస్తున్న పేదలను గమనించాడు. వారి ఆకలి కేకలు తన మనసుకు వినిపించాయి. ఆకలి ఎరుగని ముంబై కోసం ఓ బృహత్ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇప్పటికే లక్షలమంది ఆకలిని తీరుస్తున్న ఈ ప్రణాళిక… ఆకలి మీద విజయం సాధించబోతోంది. Vikas Parchhanda used to be like any other middle cla...

Understanding Macro & Micro Nutrients | Know Your Plate - 18 22.09.2023

మన రోజువారీ పనులు చేసుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం ఉండాల్సిందే. ఆ ఆహారం నుంచి రెండు రకాలుగా మనకు పోషకాలు అందుతాయి. మైక్రో, మేక్రో! ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్ల మైక్రో న్యూట్రియంట్స్ కిందకి వస్తే… మినరల్స్, విటమిన్స్ లాంటి కొద్దిమొత్తంలో అయినా మనకు అవసరపడుతూ మేక్రో న్యూట్రియంట్స్ కిందకి వస్తాయి. ఈ రెండు రకాల పోషకాల గురించి, వాటి ఉపయోగం గురించి, వాటిని అందుకునే మార్గాల గురించి మరిన్ని వివరాలు...

మతిమరపు గురించి మర్చిపోకూడని మాటలు! | Kathalu Kaburlu 22.09.2023

అల్జీమర్స్! చిన్నపాటి మతిమరుపుగా మొదలై మన ఉనికినే కబళించే సమస్య. అల్జీమర్స్ కి చికిత్స లేదు. రాకుండానూ ఆపలేం అని చాలామంది అభిప్రాయం. కానీ ఓ ఎనిమిది జాగ్రత్తలను కనుక తీసుకుంటే, అల్జీమర్స్ ను వాయిదా వేయవచ్చనీ, వచ్చినా దాని ఉధృతి తగ్గించవచ్చనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్స్ తో పాటు, అనారోగ్యాలన్నింటినీ దూరం చేసే ఆ ఎనిమిది మార్గాలు ఏమిటి? అసలు అల్జీమర్స్ ఎందుకు వస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర...

అనువాద సాహిత్యంలో రెట్టింపు కష్టం ఉంటుంది | పెరుగు రామకృష్ణ - Part 2 | మన రచయితలు 32 21.09.2023

పెరుగు రామకృష్ణ… సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకుని, ఇటు సృజన, అటు ఉద్యోగ జీవితాలలో సమాంతరంగా విజయం సాధించిన వ్యక్తి. స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయ వేదికల మీద కవితలు ప్రదర్శించారు. ఆయనతో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. అనువాదం మీద, మెరుగైన రచనలు చేయడం మీదా, అందర్జాతీయ కవిత్వం మీదా ఆసక్తికరమైన సంభాషణ ఇది. We are speaking with renowned poet Perugu Ramakrishna, who has not only created noted poetry in...

రైతుకు కష్టం వస్తే కొండంత సాయం - ఇది ఓబులేసు కథ 20.09.2023

ఓబులేసు. తనదీ అందరిలాంటి జీవితమే! ఓ చిన్న వ్యాపారం. దాని నుంచి వచ్చే ఆదాయం. జీవితం చిన్నదే. కానీ మనసు మాత్రమ పెద్దది. రైతుల కోసం ఓబులేసు చేసే ప్రయత్నం, వారిని ఆదుకునేందుకు, అడుగు ముందుకు వేయించేందుకు తన శ్రమ గురించి నిజంగా విని తీరాల్సిందే. Obulesu of Andhra Pradesh seems to be a normal person with a humble livelihood. However, his love for the farmers and passion to help them is indeed worth list...

సృజనతో విజయం సాధ్యం | పల్లవి చంద్రముఖి | స్త్రీశక్తి - 10 19.09.2023

పల్లవి చంద్రముఖి. బొమ్మలు తయారుచేయడం, రెప్లికాలు రూపొందించడం అంటే తనకు ఆసక్తి. దానిని కేవలం హాబీగా మాత్రమే ఆపలేదు. ఓ వృత్తిగా మలుచుకున్నారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చాలామంది మహిళలలకు ఇలాంటి అభిరుచులు ఉంటాయి. వాటిని వాణిజ్యంగా మలుచుకుని, తమ కాళ్ల మీద ఎలా నిలబడవచ్చో… పల్లవి కథ వింటే అర్థం అవుతుంది. Pallavi Chandramukhi is a creative artist who is specialized in Replica & Handmade doll...

మన కథను మనం అల్లుకోవడమే జీవితం | అపర్ణ మల్లాది | స్ఫూర్తి కిరణాలు 19.09.2023

అపర్ణ మల్లాది పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రచయితగా, దర్శకురాలిగా వెబ్ సిరీస్, చిత్రాలకు పనిచేశారు. తన చిత్రాలు అంతర్జాతీయ వేదికల మీద నిలబడి మన ప్రతిభను చాటాయి. తను ఒక కథను చెప్పడం మాత్రమే కాదు… దాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. తన మాటలు వింటుంటేనే, ఏ విషయాన్నయినా కథలా అందంగా చెప్పడం ఎలాగో తెలుస్తుంది. బహుశా జీవితాన్ని ఓ సాహసగాథలా భావించడం వల్లేమో, అపర్ణ ఎన్నో సవాళ్లను అలవోకగా ఎదుర్కొన్నారు...

Health Eating In Budget | Know Your Plate - 17 15.09.2023

మనం ఎంత ఆహారం తీసుకున్నామన్నది కాదు… అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి అన్నదే కీలకం. పోషకాలే లేకపోతే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఈ విషయంలో చాలామందికి ఓ అభిప్రాయం ఉంది. పోషకాలు ఉండే ఆహారం చాలా ఖర్చుతో ఉంటుందని! ఇది కేవలం అపోహే అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. అంతేకాదు. అందుబాటులోని బడ్జెట్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. There is a ge...

సృజన ఒత్తిడి కాదు... ఓ ఉపశమనం | పెరుగు రామకృష్ణ -Part 1 | మన రచయితలు - 31 14.09.2023

పెరుగు రామకృష్ణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన పేరు. మంచి కవిగా, అంతర్జాతీయ వేదికల మీద రచనలు ప్రకటించిన వ్యక్తిగా రామకృష్ణ గారిది విజయవంతమైన ప్రయాణం. అయితే దారి వెనుక చాలా శ్రమే ఉంది. సాహిత్యం అంటే అభిలాష దగ్గర నుంచీ, మంచి కవిత్వాన్ని సృజించి, విదేశీ కవులతో స్నేహబంధాలు నిలుపుకొనే వరకూ… ఆయన ప్రస్థానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన రచయితలు శీర్షికలో భాగంగా రామకృష్ణగారితో సంభాషణ. Perugu Ramakrishna...

వయసు 66 ఏళ్లు… పేదల చదువు కోసం సైకిల్‌ యాత్రలు! 13.09.2023

కొవిడ్‌ వల్ల చాలా బడులు మూతపడటం మనందరికీ తెలుసు. పట్నాల్లో నివసించేవారు దీన్ని ఆన్లైన్‌ ద్వారా పరిష్కరించుకున్నారు. లాక్‌ డౌన్‌ ముగిశాక, తమ రోజువారీ సిద్ధమైపోయారు. కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆన్లైన్‌ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. అంతేకాదు! తల్లిదండ్రులతో పనులకు వెళ్తూ, శాశ్వతంగా చదువు నుంచి తప్పుకున్నారు. ఈ సమస్య మీద గగన్‌ యుద్ధం చేస్తున్నారు. అదేమిటో తెలియాలంటే ఈ పాడ్‌ కాస్ట్‌ వినాల...

గ్రామీణ యువతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా మారుస్తున్న శ్రీధర్ వెంబు | Life Mantra 12.09.2023

సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతోమంది విజేతలను మనం చూసి ఉంటాం. కానీ శ్రీధర్ వెంబు జీవితం మాత్రం అసాధారణం. విదేశాల్లో అందరూ కలలుగనే కెరీర్ వదిలేసి, భారతదేశానికి తిరిగి వచ్చేశారు శ్రీధర్. సాంకేతిక విద్యను మారుమూల ప్రాంతాలను అందించేందుకు జోహో స్కూల్స్ స్థాపించారు. ఈ కోర్సుల ద్వారా ఎంపికైన విద్యార్థులను ఏకంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం ఇచ్చారు. ఈ అరుదైన వ్యక్తి కథను వినితీరాల్సిందే! This is the story of S...

ఖైదీల పిల్లల కోసం ఓ దంపతుల ప్రయత్నం! 11.09.2023

తెలిసోతెలియకో చేసే తప్పుకు చట్టం శిక్ష విధిస్తుంది. ఆ శిక్షను అనుభవించేవారు ఎంద వేదన పడతారో, వాటి కుటుంబమూ అంతే కష్టపడుతుంది. ఇక చక్కగా చదువుకోవాల్సిన పిల్లల గురించి చెప్పేదేముంది. ఈ ఆలోచన ఓ వ్యక్తిని నిలువనీయలేదు. అలాంటి పిల్లల కోసం ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. వందలమంది పిల్లల జీవితంలో వెలుగు నింపుతూ, వారి భవితకు అండగా నిలబడ్డారు. ఆయనకు తన భార్య కూడా అండగా నిలబడటం విశేషం. ఈ అరుదైన దంపత...

ఆహారానికి మొటిమలకి ఏమిటి సంబంధం? | Know Your Plate-16 08.09.2023

హార్మోన్ల మార్పుతో మొదలయ్యే మొటిమలు శారీరికంగా, మానసికంగా ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయి. వీటిని తగ్గించేందుకు వాడే మందుల వల్ల పెద్దగా ప్రభావం లేకపోగా, ఇతరత్రా సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. అవేంట...

విమర్శ సాహిత్యాన్ని మెరుగుపరుస్తుంది! |తలుపూరు వెంకట రామకృష్ణ Part-2 | మన రచయితలు - 30 07.09.2023

కాలం మారిపోయింది. మనందరి జీవనశైలీ మారిపోయింది. వాటితో పాటు… పిల్లల సమస్యలు, అవసరాలు కూడా మారాయి. వాటికి అనుగుణంగా బాలసాహిత్యాన్ని సృజిస్తున్నారు తలుపూరు వెంకట రామకృష్ణగారు. పర్యావరణ స్పృహ నుంచి డిస్లెక్సియా వరకూ అరుదైన అంశాలతో రచనలు చేస్తున్నారు. కథలు, గేయాలతో పాటు వైజ్ఞానిక వ్యాసాలనూ బాలలకు అందిస్తున్నారు. ఈ అరుదైన బాలసాహితీవేత్తతో టాల్ రేడియో ముఖాముఖి ఇది. Children literature isn’t just about fu...

Why Is Krishna, The World Teacher? | Smart To Wise - 13 07.09.2023

చాలామంది దృష్టిలో కృష్ణుడు కేవలం ఓ పౌరాణిక పాత్ర మాత్రమే కాదు. చిన్నతనం నుంచి మహాభారత యుద్ధం వరకూ తన చర్యలు, మాటలు జీవితానికి సంబంధించి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. సవాళ్లను ఎదుర్కోవడం, ఒత్తిడిని తట్టుకుని నిర్ణయం తీసుకోవడం, బంధాలను నియంత్రించుకోవడం లాంటి అంశాలు ఇప్పటి జీవితానికి కూడా కచ్చితంగా అన్వయించుకునేలా ఉంటాయి ఆ మాటలు. ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు శ్రీ ప్రసాద్ కైప గారి విశ్లేషణలో అలాంటి విలువైన అ...

ఆన్లైన్ రంగంలో ఆశ్చర్యపరిచే విజయం - Karan Bajaj | Life Mantra 06.09.2023

ఉన్నతమైన చదువు, ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగం. ఇదీ కరణ్ బజాజ్ నేపధ్యం. అయినా తను ఎందుకో తృప్తిపడలేదు. అందరికీ సాంకేతిక విద్య అందాలనే ఆలోచనను, ఓ వ్యాపారసూత్రంగా మార్చాడు. వైట్ హ్యాట్ జూనియర్ ద్వారా కోడింగ్ శిక్షణ అందరికీ అందేలా సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పట్లో అదో సంచలనం. స్టార్టప్స్ రూపొందించడంలో ఆయన చెప్పే సులువులు ఎంతోమందికి విజయాన్ని పరిచయం చేశాయి. ఈ అరుదైన కథ మీకోసం. Prestigious degree from...

మహిళల లైఫ్ ‘సైకిల్’ మార్చేస్తున్న Greenpeace 05.09.2023

పురుషులు, స్త్రీలు అన్ని రంగాల్లో సమానమే అని చెబుతున్నా… కొన్ని చోట్ల స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికీ మహిళలు తమ ఉపాధి కోసం నడుచుకుంటూ వెళ్లడమో, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మీద ఆధారపడటమో కనిపిస్తుంది. ఈ సమస్యను సవాలుగా తీసుకుంది గ్రీన్ పీస్ సంస్థ. అదే సమయంలో పర్యావరణనికి కూడా ఉపయోగపడే ఓ పరిష్కారాన్ని కనుగొంది. We keep hearing about gender equality. However there are many fields in which, gen...

ఓ ముగ్గురు మిత్రుల విజయగాథ Story Behind Sharechat & Moj | Life Mantra 04.09.2023

సోషల్ మీడియా లేని జీవితాన్ని ఊహించడం కష్టం. వినోదానికైనా, విజ్ఞానానికైనా… సామాజిక మాధ్యమాల వైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. సోషల్ మీడియా అంటే గుర్తుకువచ్చే బడా సంస్థల మధ్య అడుగుపెట్టారు ఓ ముగ్గురు ఐఐటి గ్రాడ్యుయేట్స్. 15 స్థానిక భాషల్లో కోట్ల మందికి ఇష్టమైన షేర్ చాట్, మోజ్ యాప్స్ తో విజయం సాధించారు. ఇది వినితీరాల్సిన కథ! It’s hard to believe our tech life without social media. From entertainment t...

Nutrition For Post Menopausal Women | Know Your Plate-15 01.09.2023

మెనోపాజ్ వయసురీత్యా ఏర్పడే దశ మాత్రమే కాదు. మెనోపాజ్ సమయంలో హార్మోన్ల చర్యలు, ఎన్నో మార్పులకు దారి తీస్తాయి. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలూ తలెత్తవచ్చు. వీటన్నింటినీ తట్టుకునేందుకు మన ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. Menopause isn’t just a state of li...

నమ్మకాన్ని గెల్చుకుని వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యంగా… Ghadi Detergent 01.09.2023

ఓ 30 ఏళ్ల క్రితం మురళీధర్ అనే పెద్దాయన ఘడీ పేరుతో ఓ డిటర్జంట్ ఉత్పత్తి మొదలుపెట్టారు. అప్పటికే ఆ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్ ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకున్నాయి. అంతర్జాతీయ బ్రాండుల పోటీని తట్టుకుని… ముందు వాడి చూడండి తర్వాతే నమ్మండి అంటూ దూకుడుగా తన ఉత్పత్తిని ప్రచారం చేసింది ఘడి. కోట్ల టర్నోవర్ తో, 25 వేల మంది సభ్యులతో విజయవంతమైన ప్రయాణం చేస్తోంది. ఆ విజయం వెనకాల ఉన్న ఆసక్తికరమైన రహస్యా...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds