Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Επεισόδια: 908

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Δημιουργός

Touch A Life Foundation

Κατηγορία

Arts

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

10 Ιουλ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి తినాలి? ఎలా తినాలి? | Know Your Plate - 43 09.05.2025

మన ఆరోగ్యం, మనం తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది. అసలు మనం తినే ఆహారం హెల్దీగా ఉండాలంటే ఏమిచెయ్యాలి? ఏ వయసు వారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఆహారంతో పాటు వ్యాయామం అవసరమా? జపనీయులు సగటున 100 సంవత్సరాలు బ్రతుకుతారు. మరి దానికి గల కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఈ పాడ్కాస్ట్ ను పూర్తిగా వినండి.. ఆరోగ్యంగా ఉండండి. Our health depends...

చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేదం ఏమి చెప్తుంది | ఆయుర్వేదం ఆరోగ్యం - 65 07.05.2025

నేటి కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిలో చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి. శరీరం లోపల ఉండే భాగాలను రక్షించటం మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం చర్మం యొక్క ముఖ్యమైన పని. అయితే కాలానుగుణ మార్పుల వల్ల మాత్రమే కాదు, ఆహారపు అలవాట్ల వల్ల కూడా చాలా మంది కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి చర్మ సమస్యలకు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు మన ఆయుర్వేదం ఏమి చెప్తుంది? మానసిక ఆనందం చ...

విద్యార్థులకు ఆరోగ్యాన్ని అందిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ గుప్తా 05.05.2025

మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి శుభమ్ గుప్తా, ఎఐ ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీతో విద్యార్థుల పోషకాహార లోపాన్ని గుర్తించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు.పూర్తి వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి . IAS officer Shubham Gupta from Maharashtra used AI-based image recognition to detect and combat malnutrition among schoolgirls. Host : Geetha #TALRadioTelugu #AIForGood #MalnutritionAwareness #IASInspirat...

"మా అమ్మమ్మ గారు ఎప్పుడూ పుస్తకాలను చదువుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు .."-స్రవంతి గారు | మా ఊరు - 33 05.05.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా స్రవంతి గారి ముచ్చట్లు విందాం . తన కాలేజీ రోజులలో జరిగిన తమాషా సన్నివేశాలు, వాళ్ళ అమ్మమ్మ గారినుండి నేర్చుకున్న విషయాలు, కుటుంబ వివరాలు, తను ఇప్పుడు చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు.. ఇలా అన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు . As part of the "Maa Ooru" series, this week's podcast features Sravanti sharing fun college memories, lessons fr...

ఆరోగ్యకరమైన ఆహార విధానాలు | Know Your Plate - 42 02.05.2025

మన ఆరోగ్యం మనం తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఎలాంటి ఆహరం తీసుకోవాలి అన్నది, మనం ఉండే ప్రాంతం మరియు సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మనం తీసుకొనే రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము? ఇలాంటి అనేక విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సప్రగడ గారు ఈ ఎపిసోడ్ లో వివరించారు. Our health depends on the food we eat, which varies based on location and season. In this epis...

రక్తహీనత - లక్షణాలు , కారణాలు మరియు చికిత్స | ఆయుర్వేదం - ఆరోగ్యం 64 30.04.2025

శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తగినంతగా లేనప్పుడు రక్తహీనత అంటారు . ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం. ఇది మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ రక్త హీనతను ఎలా గుర్తించాలి? దీని నివారణకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో చక్కగా వివరిస్తున్నారు. Ane...

" 8 కిలో మీటర్ల దూరం ఎడ్ల బండి మీద వెళ్ళటం ఒక మధుర జ్ఞాపకం " - స్రవంతి వల్లంపాటి | మా ఊరు - 32 28.04.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మహబూబ్ నగర్ కు చెందిన స్రవంతి గారితో ముచ్చటిద్దాం.. తను పుట్టింది హైదరాబాద్ అయినా, ఎక్కువ జ్ఞాపకాలు మహబూబ్ నగర్ మరియు కొత్తూరు గ్రామాలతోనే ఉంది అంటున్నారు.. వేసవి సెలవులలో అమ్మమ్మ గారి ఊరు కొత్తూరు వెళ్ళేవాళ్ళము. అది ఒక మధురమైన జ్ఞాపకం. సుమారు 8 కిలోమీటర్లు ఎడ్లబండిపై వెళ్ళటం, పొలంలో నుండి నేరుగా వేరుశనగ కాయలు తీసుకొని తినటం, యేటి గట్టు దగ్గర చింత చెట్టు కింద ఆడుకోవటం,...

ఇంటికోసం ‘గ్రీన్​ క్లీనింగ్’! 25.04.2025

రోజూ చేసే ఇంటి క్లీనింగ్​ లో ఎన్నెన్ని కెమికల్స్​ వాడుతున్నారో తెలుసా? ఆ కెమికల్స్​ ఇంట్లో వాళ్ల ఆరోగ్యంతో పాటు, పర్యావరణం మీద కూడా ఎఫెక్ట్​ చూపెడుతున్నాయి.ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ గ్రీన్​ క్లీనింగ్​ మొదలుపెట్టాలి. అలాంటి కొన్ని విషయాలు చెప్పేదే ఈ గ్రీన్​ క్లీనింగ్​ పాడ్​కాస్ట్​. Everyday household cleaning involves many chemicals that harm both health and the environment. This podca...

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి ? | Know Your Plate - 41 25.04.2025

ప్రస్తుత కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది బరువు తగ్గడం కోసం, మరికొందరు ఫిట్‌నెస్‌ను కోసం, ఇంకొందరు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా చెయ్యాలి? దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీని వలన ఏమైనా నష్టాలు ఉన్నాయా? అసలు ఎలాంటి వారు ఈ డైట్ అనుసరించొచ్చు మొదలైన అనేక విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత...

ఇమ్యూనిటీ గురించి తెలియాల్సిన ముఖ్యమైన నిజాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం - 63 23.04.2025

ఇమ్యూనిటీ అంటే శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే సహజ రక్షణ వ్యవస్థ. ఇది బలంగా ఉంటే వైరస్లు, బ్యాక్టీరియా వంటివి కలిగించే వ్యాధులను తట్టుకుని నిలబడగలగటం సులభం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, మరియు మానసిక ప్రశాంతత ద్వారా మన ఇమ్యూనిటీని మెరుగుపర్చుకోవచ్చు. ఈ అంశంపై కొన్ని ముఖ్యమైన నిజాలను ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారి నుండి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Immunity is the body's natural defens...

చదవండి... చదివించండి... 23.04.2025

ఒక మంచి పుస్తకం చదివిన తరువాత బ్రెయిన్​ లో పెరిగే పవర్​ ని, గుండెని నింపేసే సంతృప్తిని, ముఖంలోకి చొచ్చుకు వచ్చే అంతులేని ఆనందాన్ని కనిపెట్టాలంటే... అది పుస్తక ప్రియులకే సాధ్యం అవుతుంది. అందుకే చదివే అలవాటుని... పుస్తకం చదివే అలవాటుని నీతోనే ఉంచుకోకుండా, నీలోనే దాచుకోకుండా నలుగురికీ పంచాలి. ఆ అలవాటుని అందరికీ అంటించాలి. అప్పుడే జ్ఞానంతో ఉన్న లోకాన్ని చూడొచ్చు. వరల్డ్​ బుక్​ డే సందర్భంగా ‘ఫుడ్​4థాట్...

"కొంత విరామం తర్వాత మళ్లీ నటిగా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను " - రమ్య రాఘవ్ | మా ఊరు - 31 21.04.2025

మా ఊరు కార్యక్రమంలో భాగంగా, ఈ వారం కూడా ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. రమ్య, రాఘవ్ ల పరిచయం ఎక్కడ అయ్యింది? నెదర్లాండ్స్ ఎప్పుడు వచ్చారు? యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మళ్ళీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినండి. In this week's episode of Maa Ooru, we delve into the inspirin...

"ఆప్త అందిస్తున్న అనేక సర్వీసులలో ప్రధానమైనది విద్యార్థులకి ఉపకారవేతనం " - Gopala Gudapati | స్పూర్తి కిరణాలు 21.04.2025

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఆప్త ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ గోపాల గూడపాటి గారిని కలుసుకుందాం. 2006 లో అమెరికా వెళ్లిన ఆయన, తన ఉద్యోగ బాధ్యతలతో పాటు, ఒక రేడియో హోస్ట్ గా, సిలికాన్ ఆంధ్ర మనబడి అధ్యాపకుడిగా ఎలా సేవలందించారు? అక్కడ నుండి APTA అధ్యక్షుడిగా ఎలా ఎదిగారు? అసలు ఈ నాయకత్వ లక్షణాలు ఎలా అలవడ్డాయి? వీరికి స్ఫూర్తి ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఈ పాడ్కాస్ట్ పంచుకుంటున్నారు. మరి...

Outside ఫుడ్ తినడం మానేయాలంటే ఏం చేయాలి ? | Know Your Plate -40 18.04.2025

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అయితే బయట రక రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపించేటప్పుడు వాటిని తినాలనిపించటం సహజం. కానీ ఇటువంటి ఆహారం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మరి ఈ బయట ఫుడ్ ను తినటం మానేయాలి అంటే మనం ఏమి చెయ్యాలి? ఒకవేళ తినాల్సి వస్తే, ఎలాంటి ఆహారాన్ని తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివ...

చెత్తను వేరు చేసి... భూమిని బాగు చేసి... 17.04.2025

ఇంట్లో చెత్తను తీసి బయటపడేస్తే చాలు... బయట అది ఎక్కడ పేరుకుపోయినా నో ప్రాబ్లమ్​ అనుకుంటే కుదరదు. ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ సీరియస్​గా ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఈ చెత్త భూమ్మీద కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన చెత్త పర్యావరణ ఆరోగ్యాన్నే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది! అందుకనే ఇంటి నుంచే పొడి, తడి చెత్తను వేరు చేసి, దాన్ని సరిగా వాడగలిగితే చెత్త బారిను...

మన నిత్య జీవన విధానమే ఆయుర్వేదం | ఆయుర్వేదం - ఆరోగ్యం 62 16.04.2025

ఆయుర్వేదం,వైద్య విధానం మాత్రమే కాదు , అది మన నిత్య జీవన విధానం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, డా|| అనుపమ ఉప్పులూరి గారు, Chief Doctor, Edvenswa Ayurveda, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదం అందిస్తున్న సూచనలు , సలహాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి. Ayurveda is more than medicine—it's a way of ethical living, says Dr. Anupama Uppuluri, Chief Doctor at Edvenswa Ayurveda. Listen to this podcast...

నిజమైన శత్రువు ఎవరు? 14.04.2025

మన ఎదుగుదలని అడ్డుకుంటున్నది మన చుట్టూ ఉన్న వాళ్లే అనుకునే మన భ్రమని చెరిపేస్తూ ... ఓ సాధారణ ఆఫీస్ సంఘటన మనలో నిజమైన శత్రువు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెబుతుంది. నిజానికి విజయానికి అడ్డుగా నిలిచేది మన బాహ్య పరిస్థితులు కాదు, మనలో మనమే అని బలంగా చెప్పే సందేశంతో... ఆత్మపరిశీలనకు నూతన దారులు చూపిస్తుంది. మీ ఆలోచనలలో మార్పు తీసుకువచ్చి, మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. A simple office incident challenges the...

"NTR గార్డెన్స్ కి వెళ్లడమంటే చాలా ఇష్టం " - రమ్య రాఘవ్ | మా ఊరు - 30 14.04.2025

ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మన అందరికీ సుపరిచితురాలు ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు, ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో తనకున్న అనుబంధం.. మొదట యాంకర్ గా తన కెరీర్ ఎలా ప్రారంభించారు? సినిమా అవకాశం ఎలా వచ్చింది? థియేటర్ ఆర్టిస్ట్ గా తనకున్న అనుభవం కెరీర్ కి ఎలా ఉపయోగపడింది? ఇలాంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి. Host : usha Guest : Ra...

కాఫీ కప్పు... తెచ్చింది ముప్పు 11.04.2025

డిస్పోజబుల్ కప్పులు వాడడం ఈజీ. కానీ ఆ తరువాత వాటి వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు మాత్రం చాలా భారీగానే ఉంటోంది. తాగి పారేసే ఆ కప్పుల వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఆ ప్రభావం పర్యావరణం మీద ఎలా పడుతోంది? వంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ వినండి. Using disposable cups is convenient, but their environmental impact is severe. This podcast explores the hidden dangers and environmental c...

నీరుంటేనే మనముంటాం 09.04.2025

నేలను తాకిన వర్షపు చినుకును పట్టి ఉంచితేనే... చేయడానికి పని, తినడానికి తిండి దొరుకుతుంది. అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయి. పేదరిక నిర్మూలన.. అదికూడా గ్రామీణ ప్రాంత ప్రజల పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. అంత లోతైన సంబంధం ఉంటుంది నీటికి, మనిషి జీవితానికి. భూమికి, మనిషికి జీవనాధారమైన అమూల్యమైన నీటి కరువు రాకుండా ఉండాలంటే చేయాల్సింది చాలా ఉంది. పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం అనేది మరీ ముఖ్యం. ఆ పనిచ...

"లోకం మెచ్చుకునేలా గెలవటం ఎలా ?" ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ 07.04.2025

మన గెలుపు ఎలా ఉంటే పదిమంది ఆ గెలుపు ని చూసి సంతోషిస్తారు ? ఈ చిన్న కథ ఆ సీక్రెట్ చెపుతుంది. చాలా సార్లు మన లక్ష్యాల వెంట పరిగెడుతూ గెలుస్తూ ఆనందిస్తుంటాం. అయితే అప్పుడు ఆ ఆనందం మన ఒక్కరికే పరిమితమవుతుంది. కానీ కొంత మంది గెలుపు ని చుట్టూ ఉన్న వారంతా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఆనందిస్తారు . ఎందుకు ? ఈ కథ వింటే లోకం తో శెభాష్ అనిపించుకునేలా గెలవటం ఎలాగో తెలుస్తుంది. This short story reveals the secret t...

"విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉండాలి " - మనోజ్ భట్ గారు | మా ఊరు - 29 07.04.2025

ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనోజ్ భట్ గారిని కలుసుకుందాం. ప్రస్తుతం ఈయన సియాటిల్ లో అర్చకులుగా ఉన్నారు. వేదపాఠశాలలో నియమాలు ఎలా వుంటాయి? అక్కడ చదువుకునేవారికి ఏఏ అంశాలు బోధిస్తారు? అక్కడ భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయి? ఇలాంటి మనకు తెలియని అనేక విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో విందాం. This week on "Maa Ooru" p...

A-Z on career after Engineering | Vijayeebhava 04.04.2025

Engineering isn’t a destination. It’s a time to mould our future and reach the desired destiny. There might be lot of challenges that need to be addressed during such occasion. Here is renowned management guru Prasad kaipa giving us valuable suggestions regarding every possible query that might arise in the mind of a student.

మన స్టైల్ భూమికి స్ట్రెస్ ఫ్యాషన్ ఫాలో అవుదాం ..కానీ బాధ్యత ని మర్చిపోవద్దు 04.04.2025

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 బిలియన్ బట్టలు తయారవుతున్నాయి.ఇది మన మానవ జనాభా కన్నా పది రెట్లు ఎక్కువ. తక్కువ ధర – తక్కువ నాణ్యత అనే ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ వల్ల ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.కానీ ఈ వేగం ప్రకృతి తట్టుకోలేని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తోంది.బట్టల తయారీ వల్ల జరిగే నీటి వృథా, నీటి కాలుష్యం, అలాగే భూమిలో కలవని బట్టల వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలు — ఇవన్నీ మన పర్యావరణాన్ని ప్...

పిల్లల బుక్ రీడింగ్ కోసం ఒక రోజు 02.04.2025

పిల్లల్లో బుక్ రీడింగ్ పట్ల ఆసక్తి పెంచడం కోసం, చదవటం అలవాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకుంటున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ గా. ప్రతి ఏడాది ఏప్రిల్ 2 న ఇంటర్నేషనల్ children's బుక్ రీడింగ్ డే చేస్తారు. ఈ రోజున రకరకాల ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ పెంచే ప్రయత్నం చేస్తూ ... కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు. April 2 is celebrated as International Children's Book Readi...

Άκου το podcast TALRadio Telugu στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS