Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 avsnitt

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Skapare

Touch A Life Foundation

Kategori

Arts

Poddens webbplats

podcasters.spotify.com

Senaste avsnittet

10 jul 2026

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

"సమస్య ఉన్న ప్రతి మహిళకి నేను తోడుంటా" - విజయలక్ష్మి | Special Interview 20.01.2026

ఎల్లప్పుడూ మహిళల ఆరోగ్యం కోసం, వారి సంక్షేమం కోసం ఆలోచిస్తూ.. మహిళల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి విజయలక్ష్మి గారు. చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలదని, సమస్యలను తీర్చగలదని నమ్మి, పెళ్లి అయినా తర్వాత LLB చదివి లాయర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈమె.. మహిళలు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గుర...

"ఆర్గాన్ డొనేషన్ కోసం మాట్లాడడానికి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు" - లలిత రఘురామ్ | Special Interview 19.01.2026

అవయవ దానం గురించి మన సమాజంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అపోహలూ! కానీ వాటన్నింటికీ సరైన సమాధానం చెబుతూ, ప్రాణదానం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ లలిత రఘురామ్ గారు. మనం తీసుకునే నిర్ణయం ఎంత ముఖ్యమైనదో… మనం వెళ్ళిపోతూ కూడా ఇంకొకరి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో వంటి విషయాలను, అలాగే అవయవ దానం గురించి మోహన్ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలను, వారి కార్యక్రమాలను గురించి ఈ ప...

"You 2.0: 2026లో మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండిలా" - బి. కృష్ణ భరత్ | Special Interview 16.01.2026

ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే మనం, ఒక్కోసారి మనల్ని మనం గెలవడం మర్చిపోతుంటాం. ఈ కొత్త ఏడాదిలో క్యాలెండర్ తో పాటు మన ఆలోచనలను కూడా మార్చుకుని, 'థ్యాంక్ ఫుల్ నెస్, డిజిటల్ డిటాక్స్, అంతరంగ ప్రయాణం' వంటి సూత్రాలతో మనలోని You 2.0 వర్షన్ ను ఆవిష్కరించుకోడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బి. కృష్ణభరత్ గారు ఎన్నో మంచి విషయాలను, సూచనలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పక వినండి… అస్సలు మిస్...

Lipi.Game: సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక సాంకేతికత | Special Interview with Sagar Anisinga Raju 12.01.2026

పురాణాలు, ఇతిహాసాల గురించి చెప్పే వీడియో గేమ్స్ వస్తే ఎలా ఉంటుంది? మొబైల్ చేతిలో ఉంటే ఫైటింగ్స్, కార్ రేసింగ్‌లే కాకుండా.. మన కళ్ళ ముందు మహాభారత, రామాయణ ఘట్టాలు ఆవిష్కృతమైతే? ఆటలు ఆడుతూనే ప్రాచీన విజ్ఞానాన్ని నేర్చుకోగలిగితే ఎంత బావుంటుందో కదా! ఇదిగో సరిగ్గా ఇలాంటి వినూత్న ఆలోచనతోనే పుట్టింది 'లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్'. వీడియో గేమ్స్ ద్వారా కేవలం వినోదం మాత్రమే కాకుండా, పిల్లలలకి భాష...

"సమస్యపై కాదు పరిష్కారంపై దృష్టి పెట్టాలి" - భవానీ శంకర్ | Special Interview 05.01.2026

ఎంతో మంది అంధులకు చేయుతనిచ్చి, వారి కోసమే తన జీవితాన్ని అంకితం చేసి, ఆసరా కల్పిస్తున్న గైడింగ్ లైట్ స్పందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు భవానీ శంకర్ గారితో సీనియర్ జర్నలిస్ట్ శోభా పేరిందేవి గారు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ పాడ్కాస్ట్. తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి! A special podcast interview where senior journalist Shobha Perindevi speaks with Bhavani Shankar, founder of Guiding Light Spandana F...

2026 హ్యాపీనెస్ కోసం డిజిటల్ డీటాక్స్ | Special Interview With Dr.GC Kavitha 02.01.2026

సంతోషం అనేది మనం వెతుక్కునేది కాదు.. మన అలవాట్లతో మనం నిర్మించుకునేది! మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనా విధానంలో, లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2026లో అడుగుపెడుతున్న ఈ సమయంలో.. కేవలం లక్ష్యాల వెంటే కాకుండా, మానసిక ప్రశాంతత వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2026లో యువత సంతోషంగా ఉండాలంటే మార్చుకోవాల్సిన అలవాట్లు ఏమిటి? పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే అంశాలపై మనతో ఎ...

B - Complex విటమిన్స్ అంటే ఏమిటి? వాటి ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ | Know Your Plate - 73, Part 1 26.12.2025

మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ అందాలన్నా, మెదడు చురుగ్గా పనిచేస్తూ జ్ఞాపకశక్తి పెంచుకోవాలన్నా... B-కాంప్లెక్స్ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో మరియు నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలన్నా B-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉండాల్సిందే! అందుకే, ప్రముఖ న్యూట...

విటమిన్ K - ఆవశ్యకత, లోపం, లభించే ఆహరం | Know Your Plate - 72 19.12.2025

మన శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ సక్రమంగా జరగాలన్నా, అలాగే మన ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ K ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మన శరీరంలో కాల్షియంను, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ K పుష్కలంగా ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం మరింత బావుంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిష...

"మన ప్రాచీన వంటలు, సంస్కృతిని కాపాడుకోవాలి" - America Bathakhani 15.12.2025

రుచికరమైన వంటలు, ముఖ్యంగా మన అమ్మమ్మల కాలం నాటి ప్రాచీన తెలుగు రుచులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? హైదరాబాద్‌లో పుట్టి, ఇప్పుడు అమెరికాలో ఉంటూ, తన వీడియోలతో Instagram Influencerగా లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న మన "America Bathakani" గారు... మరుగున పడిపోతున్న మన సంస్కృతి, వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె తన పుట్టిన ఊరి విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మ...

విటమిన్ - E ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 71 15.12.2025

మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలన్నా, అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా... విటమిన్ E ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కాపాడుతుంది, తద్వారా Ageing Signsను ఆలస్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని, కళ్ళను, మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది...

అంతరించిపోతున్న భాషలకు రక్షణ - బోలి చేతో 11.12.2025

భాష కేవలం మన భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదు... అది ఒక సమాజం యొక్క సంస్కృతికి, ఆచారాలకు, చరిత్రకు ప్రతిరూపం! ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేలకు పైగా భాషలు ఉన్నప్పటికీ, ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంటుంది. అందులో లిపి ఉన్న భాషలు కొన్ని, లిపి లేని భాషలు కొన్ని, అంతరించి పోతున్న భాషలు మరికొన్ని. మరి అటువంటి భాషలను రక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ బోలి చేతో! మరి ఈ సంస్థ భాషల కోసం చే...

"మా అమ్మమ్మ కన్నడ.. నాన్నమ్మ తెలుగు .. " - Nisha Reddy | మా ఊరు - 60 08.12.2025

కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గా తన కెరీర్ ను ప్రారంభించినా… తనకు ఇష్టమైన యోగా వైపు అడుగులు వేశారు. ఇపుడు అమెరికాలో యోగా ఇన్స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మందికి యోగాసనాలను నేర్పిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు నిషా రెడ్డి గారు. వీరిప్పుడు వారి చిన్ననాటి ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు పొద్దు పొద్దున్నే నాన్నమ్మ నిద్రలేపడాలు, ఊయలలూగిన జ్ఞాపకాలు, పండగలకు సరదాగా ఫ్రెండ్స్ తో గడిప...

విటమిన్ - C ఆవశ్యకత , లోపం, లభించే ఆహారం 05.12.2025

మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ - C ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ సి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది, ముఖ్యంగా సాధారణ జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండేలా చూసుకుంటే, మన ఆరోగ్యం మరింత మెరుగ్గా, చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్...

"చిన్నప్పుడు మా ఇల్లు సత్రం లాగా ఉండేది" - లావణ్య రాఘవరెడ్డి | మా ఊరు - 59 01.12.2025

చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకోవడం, ఫ్రెండ్స్, చుట్టాలు ఎప్పుడూ ఇంటికి రావడం… రాజమండ్రిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర పండుగలు జరుపుకోవడం, నెల్లూరు లో స్కూల్ డేస్ వంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తమ ఇల్లు ఒక 'సత్రం' లాగా కళకళలాడేదని గుర్తు చేసుకుంటున్నారు నెల్లూరుకు చెందిన లావణ్య రాఘవ రెడ్డి గారు. మరి మీరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలను, ఊరి విశేషాలను గుర్తుచేసుకోవడానికి తప్పకుండా ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ ను వ...

విటమిన్ A: ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 69 28.11.2025

విటమిన్ A కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ, పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా అవసరం. విటమిన్ A లోపం వల్ల కంటి చూపు సమస్యలు (రేచీకటి ), చర్మ సమస్యలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటివి సంభవించవచ్చు. ఈ వారం Know Your Plate పోడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు విటమిన్ A యొక్క ప్రాముఖ్యత గురించి, దాని లభ్యత గురించి, ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు… తప్పకుండా వినండి మరి .. Vitami...

పెద్దవారి కోసమే ఈ ఇల్లు! 19.11.2025

ఒంటరితనాన్ని దూరం చేసి, వృద్ధుల జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఒక మంచి ఇల్లు ఉంది… అదే ఖమ్మంలోని 'మహాత్మా గాంధీ డే కేర్ సెంటర్'! ఇక్కడికి ప్రతిరోజూ ఎంతో మంది పెద్దవారు వచ్చి, ఆటలాడుతూ, పాటలు పాడుతూ సరదాగా కాలం గడుపుతారు! ఒంటరితనం, అనారోగ్యం, కౌన్సిలింగ్, పెన్షన్ సాయం... వంటి ఎన్నో సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది! ఈ పాడ్కాస్ట్ వినండి… మీకే తెలుస్తుంది… అసలు ఆ ఇల్లు ప్రత్యేకత ఏంటో, వా...

"చిన్నప్పుడు అమ్మ సంతకం నేనే చేసేదాన్ని" - నూరి షహజాది | మా ఊరు - 58 17.11.2025

చిన్ననాటి స్కూల్ డేస్, క్రేజీ మెమొరీస్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో గడిపిన జ్ఞాపకాలు... ఇవన్నీ దాటి, ఏకంగా అమెరికాలో ఫిట్‌నెస్ కోచ్‌గా సెటిల్ అయ్యేదాకా తన జర్నీ మొత్తం ఫుల్ ఫీల్ గుడ్ వైబ్ తో మనతో పంచుకుంటున్నారు వైజాగ్ కు చెందిన, Founder Of Shape & Sculpt నూరి షహజాది గారు! లైఫ్‌లో ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంట్, మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలనే సూపర్‌ టిప్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్న ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్...

"అమెరికాలో మా పెళ్లి మరచిపోలేని అనుభూతి" - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 57 | Part - 2 10.11.2025

గతవారం మా ఊరు పాడ్కాస్ట్ లో సంగీతా రెడ్డి బొర్ర గారు వారి బాల్యం, స్నేహితులు, స్కూల్, కాలేజీ విషయాలు పంచుకున్నారు కదా.. ఇక ఈ వారం వారు అప్పట్లో పండగలు ఎలా చేసుకునే వారు.. ఇంకా అమెరికా లో వారి పెళ్లి గురించి... అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్ లోకి ఎలా వచ్చారు... వంటి బోలెడన్ని కబుర్లు మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి మరి...! Last week on our Maa Ooru podcast, Suneetha Reddy Borra shared stories f...

"నాన్న నల్ల కోటు తో కోర్ట్ ఆట ఆడుకోవడం మంచి జ్ఞాపకం " - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 56 03.11.2025

స్కూల్ డేస్.. తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! రిక్షాలో స్కూల్‌కి వెళ్లిన సరదా రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన మధుర క్షణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న ఆ అపురూపమైన బంధం... ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు వారి స్టడీస్ , ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు సియోటెల్ లో ఉంటున్న సంగీతా రెడ్డి గారు! మీరూ మీ బాల్య స్నేహితులను, ఆ అల్లరి రోజులను గుర్తు చేసుకుంటూ... ఆ నాస్టాల్జియా ట్రిప్‌ను ఎంజాయ్...

హెల్తీ వెయిట్ లాస్ కోసం ఆహారం, వ్యాయామం | Know Your Plate - 66 31.10.2025

ఈ మధ్య కాలం లో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మార్కెట్ లో ఉన్న ఎన్నో రకాల డైట్ ల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి? బరువు తగ్గడం కోసం చెబుతున్న వివిధ విషయాలలో నిజాలు , అపోహలు అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు చక్కగా వివరిస్తున్నారు .. మిస్ అవ్వకుండా వినండి. Many people try different...

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 29.10.2025

వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి మన పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గార...

వృద్ధుల సంతోషం కోసం ఓ స్టూడెంట్ మిషన్! 28.10.2025

ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt. India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్ వాక్ వంటివి చేయిస్తూ... పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మంచి పని చేయడానికి వయసుతో గానీ, టైమ్‌తో గానీ పనిలేదని నిరూపించిన ఈ యంగ్ టీమ్ చేస్తున్న ఈ స్ఫూర్తి క...

కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం | know your plate - 65 24.10.2025

కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి రక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ పాడ్కాస్ట్ లో, కంటి ఆరోగ్యాన్ని పెంచే అత్యంత ముఖ్యమైన ఆహారాలు ఏమిటి? అవి మన కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారి మాటల్లో...

సాత్విక ఆహారం - దాని ప్రాధాన్యత | ఆయుర్వేదం ఆరోగ్యం - 89 22.10.2025

సాత్విక ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం! ఒత్తిడి, ఆందోళన లేని ప్రశాంతమైన జీవితాన్ని, సొంతం చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే శక్తివంతమైన జీవన విధానమే సాత్విక ఆహారం. అసలు, సాత్విక ఆహారం అంటే ఏమిటి? దానిని ఎలా పాటించాలి? లాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో విరిస్తున్నారు. మిస్ అవ్వకుండా వినండి! మంచి ఆహారాన్ని గురించి తెలుసుకునే మంచి అవకాశమిది! Sa...

ఈ హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే బిల్ ఉండదు 21.10.2025

పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గారి హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే, బిల్లు పూర్తిగా జీరో!  అంతేకాదు, ఆనందంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి, పండగ చేసుకుంటారు. లింగ వివక్షను రూపుమాపడానికి డాక్టర్ రాఖ్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది! ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనలు మార్చిన ఈ నిజమైన హీరో కథ ఏంటి? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ మార్పు వెనుక ఉన్న కష్టాలు, ప్రేరణ ఏంటి? లాంటి మరి...

Lyssna på podden TALRadio Telugu i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden