Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 908 avsnitt

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Glöm inte att besöka poddens webbplats och stötta skaparen: podcasters.spotify.com

Skapare

Touch A Life Foundation

Kategori

Arts

Poddens webbplats

podcasters.spotify.com

Senaste avsnittet

10 jul 2026

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

విద్యార్థులకు ఉచితంగా కరాటే నేర్పుతున్న దామోదర్ నాయక్ | స్ఫూర్తి కిరణాలు 20.05.2024

కరాటే అంటే ఆత్మరక్షణ కోసం నేర్చుకునే విద్య అని చాలా మంది నమ్మకం. కానీ దామోదర్ నాయక్ గారిని కదిపితే కరాటేతో ఉన్న చాలా ఉపయోగాలు చెబుతారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం లాంటివన్నీ కరాటేతో అలవాడతాయని అంటారు. ఈ విద్యను నమ్మి ఊరుకోలేదు. దాన్ని అందరికీ ఉచితంగా అందించే ప్రయత్నంలో ఉన్నారు దామోదర్. పేద విద్యార్థులకు ఈ విద్యను అందిస్తే… వారి భవితను తీర్చిదిద్దడంలో అది సాయపడుతుందని నమ్ముతూ వందల మందికి కరా...

సలహా ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ! | O Manchi Mata - 11 17.05.2024

మన చేతికి ఉండే ఐదు వేళ్లే ఒకలాగ ఉండవు.. అలాంటిది ప్రతి ఒక్కరి స్వభావం ఒకేలాగ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు ఒకరి సమస్య ఒకరికి చాలా తేలికగా కనిపిస్తే.. మరొకరికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలానే కొంతమంది తమకు వచ్చిన కష్టాన్ని బయటకు చెప్పుకుంటే.. కొంతమంది తమలో తాము అణుచుకుంటారు తప్పా బయటకు చెప్పలేరు. అంతేకాదు ఇతరుల బాధలను ఓపికగా విని సలహా ఇచ్చేవారు కూడా ఉంటారు. అయితే ఇల...

అభ్యుదయం నుంచి ఆధ్యాత్మికం వరకు సాహిత్యంతో స్నేహం! | Dr. దేవులపల్లి పద్మజ | మన రచయితలు - 53 16.05.2024

ఓ చిన్న ప్రోత్సాహం, వ్యక్తి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? ఓ సూచన తన భవిష్యత్తును ఎలా మార్చేస్తుంది? సంస్కృతం రాజభాష మాత్రమే అన్న మాటలో నిజం ఎంత? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన జవాబు దొరికే సంభాషణ ఇది. రచయిత్రితో పాటుగా తెలుగు, సంస్కృత భాషల్లో ఉపాధ్యాయురాలైన దేవులపల్ల పద్మజగారితో ముఖాముఖిలో విందాం. భావ కవిత్వపు గొప్పదనం నుంచి ఓ మంచి రచనకు ఉండాల్సిన లక్షణం వరకు ఎన్నో ఆసక్తికరమైన కబుర్లు ఈనాటి...

కుటుంబానికీ ఓ రాజ్యాంగం కావాలి, అందులో ఏముండాలో తెలుసా ! | International Family Day Special 15.05.2024

ఈ ప్రపంచంలో చాలా విజయవంతమైన వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు నిర్వహించే వ్యాపారాల కంటే ఇవి లాభాలు సాధించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు. కానీ మధ్యలో ఏదో ఒక కలతతో అవి విచ్ఛిన్నం అవడం మనం చూస్తున్నాం. దాని వల్ల ఆ కుటుంబానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టమే. ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకునే ఆయుధమే కుటుంబ రాజ్యాంగం. ఇవి వ్యాపార కుటుంబాలకే కాదు… ఉమ్మడి కుటుంబాలకు...

ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫూర్తి కిరణాలు 13.05.2024

బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ప్రసాదరావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండవ భాగమిది. ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించినట్టు… ఈ సంస్థ ఉపాధి కల్పనను ఎలా సాధిస్తోంది? నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకా సమాజం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆలోచింపచేసే జవాబులు వినిపిస్తాయి. సామాన్యులకు కూడ...

మన విధి మన చేతుల్లోనే.. | ఓ మంచి మాట - 10 10.05.2024

మనం మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. ఈ జీవన క్రమంలో పక్కవాళ్ల నుండి మనకు వచ్చే సపోర్ట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కానీ మన జీవితం అనేది ఎక్కువ శాతం మనమీదే ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లను బట్టి కూడా ఉంటుంది. ఏదైనా జీవితంలో గొప్పగా సాధించాలంటే దానికి చిన్న చిన్న మంచి అలవాట్లను భాగస్వామ్యం చేసుకోవాలని.. మన రొటీన్ లైఫ్ లో వాటిని భాగం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అంతేకాద...

సస్టైనబుల్ ఈటింగ్ అంటే ? | Know Your Plate - 37 10.05.2024

సస్టైనబుల్ ఈటింగ్ - ఈ పదం ఈమధ్యకాలంలో చాలానే వింటున్నాము. ప్రకృతిలో వస్తున్న విపరీత మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల, మన ఆహార పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ దిశగా సాగే ఈ సంభాషణ మా శ్రోతలందరికి ఒక చక్కటి అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండ వినండి మీ TALRadio లో! Asritha Vissapragada, a nutritionist, advocates for sustainable eating, promoting prac...

ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని ఎదిగేలా చేస్తుంది - వీణ గుండవెల్లి | విజేత - 8 07.05.2024

"మన ఆలోచనలే మన భవిష్యత్తు. మన ఆలోచనా పరిధి ఎంత విస్తృతం అయితే మన ప్రగతి అంత వేగంగా జరుగుతుంది. ఒడిదుడుకులు, ఏ ప్రయాణం లో అయినా సహజం, అవి మనల్ని మరింత పట్టుదలతో ముందుకు వెళ్లేలా చేయాలే తప్ప, మనల్ని నిరుత్సాహ పరచకూడదు. ప్రోత్సాహం కోసం బయట వెదికేముందు, నిన్ను నువ్వు ఎలా ప్రోత్సహించుకుంటున్నావు అన్నది ముఖ్యం. మన లోపల తపన ఉంటే విజయం కష్టం కాదు. " ఒక విజేత నుంచి ఇటువంటి మాటలు వింటుంటే మన లక్ష్...

ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 1 | స్ఫూర్తి కిరణాలు 06.05.2024

ఓ 40 ఏళ్ల క్రితం సంగతి. కొంతమంది యువకులు సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశంతో బెజ్జిపురంలో ఓ యూత్‌ క్లబ్‌ స్థాపించారు. గాంధి కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తమ వంతుగా సాధించాలి అనుకున్నారు. సంస్థ చిన్నదే… కానీ ఆశయం గొప్పది. లక్ష్యం ఉన్నతమైంది. అందుకే ఒకో ఏడాది గడిచేకొద్దీ విద్య, వైద్యం… ఇలా అన్ని రంగాల్లోనూ వేల మంది జీవితాలను ప్రభావితం చేశారు. ప్రధానమంత్రి సైతం తన మన్‌ కి బాత్‌ కార్యక్రమంలో కేవలం నైపుణ్యం...

పరిపూర్ణమైన చిరునవ్వును అందించడానికి - అధునాతన దంత ఉపకరణాలు | DenTAL Care - 10 04.05.2024

మనిషికి అందాన్నిచ్చే వాటిలో దంతాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరిదైనా నవ్వు బాగున్నప్పుడు కానీ.. వాళ్ల దంతాలు బాగున్నప్పుడు కానీ ప్రశంసిస్తాం.. మంచి పళ్ల వరుస అని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తుంటాం. అయితే అందరికీ అందమైన దంతాలు ఉండాలని లేదు.. కొంతమంది దంతాలు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో అన్నింటికీ పరిష్కారాలు దొరుకుతున్నాయి. బ్రేసెస్, క్లిప్స్ ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి....

పండ్లకి మహారాజు మామిడి పండు ..ఎందుకో తెలుసా? | Know Your Plate - 36 03.05.2024

మామిడిపళ్ళల్లో ఎన్నో పోషకాలున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీనికి తోడు చాలామందికి బోలెడన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి. అసలు ఎలాంటి మామిడిపళ్ళు మంచివి, ఎలాంటి వారు తినొచ్చు, తినకూడదు, మొదలైనవి. ఐతే అవన్నీ ఇవాళ ఆశ్రిత గారి మాటల్లో తెలుసుకుందాం! తప్పక వినండి మీ TALRadio లో. Mangoes are rich in nutrients. It’s known to all. But there are also many doubts and concerns associated with mangoes,...

మానవ సంబంధాలు పెంచే బహుమతి | ఓ మంచిమాట - 9 03.05.2024

బహుమతి అంటే సాధారణంగా ఒకరి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను వస్తువు రూపంలో తెలియచేయడమే. ఒక్కోసారి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు కదా.. మనం కూడా ఇవ్వాలి కదా అంటూ ఇచ్చే గిఫ్ట్ లు కూడా ఉంటాయి. మరి బహుమతి అంటే కేవలం వస్తువు రూపంలో ఇచ్చేది మాత్రంగానో లేక ఏదో ఫార్మాల్టీ కోసం ఇచ్చేదానిలా మాత్రంగానో ఉండాలా? అంటే అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న బిజీ రోజుల్లో మనవాళ్ల కోసం కాస్త సమయాన్ని గడపడం కూడా మనం వారికి ఇచ్చే బహు...

సినీ రచయిత అంటే కథ, సంభాషణలే కాదు | ఆలూరి అరుణ్ కుమార్ - Part 2 |మన రచయితలు - 52 02.05.2024

మన రచయితలు శీర్షికలో భాగంగా ఆలూరి అరుణ్ కుమార్ గారితో జరిగిన సంభాషణలో రెండో భాగమిది. చదువుతూ చదువుతూ రచయితగా మారిన అరుణ్ కుమార్… సినిమాల పట్ల ఆసక్తితో వాటిని చూస్తూ విశ్లేషిస్తూ, తన అభిప్రాయాలతో పదిమందితో పంచుకోవడం మొదలుపెట్టారు. దాంతో షరతులు వర్తిస్తాయి, జయమ్మ పంచాయితీ లాంటి సినిమాలకు స్క్రిప్ట్ పరమైన సహకారం అందించే అవకాశం వచ్చింది. తనలాగే ఎంతోమంది రచయితలు సినిమాల్లో రాణించాలి అనుకుంటారు. మరి వార...

"సాధించాలి అనే తపన ఉంటే విజయం మనదే " - డా|| సుభద్ర వేదుల | విజేత - 7 30.04.2024

సుభద్ర వేదుల - సైన్స్ మరియు సాహిత్యం కలగలిపిన స్వచ్ఛమైన తెలుగు ఆడపడుచు. ఎన్నో ఒడిదుడుకులకోర్చి, ఎంతో ఏకాగ్రతతో, పట్టుదలతో తనకి ఎంతో ఇష్టమైన రెండు విభాగాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ వారం విజేత కార్యక్రమంలో ఎంతో స్ప్హూర్తిదాయకమైన తన ప్రయాణం గురించి తెలుసుకుందాం, మన జీవితంలో కూడా తన జీవిత పాఠాలను అమలుచుకుందాం! Subhadra Vedula - an adept in crafting clean Telugu, blending science and literature. Wi...

నిద్రే మన సెల్ఫ్ హీలర్ | ఓ మంచి మాట - 8 26.04.2024

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఎన్నో అద్యయనాల ద్వారా ఇప్పటికే ఇది నిరూపితమైనది కూడా. మనిషికి తగినంద నిద్ర ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్ర లేనప్పుడు దాని ప్రభావం కూడా మనిషి మీద ఎంతో ఉంటుంది. అలసట, ఓపిక ఉండకపోవడం ఇలా పలు అనారోగ్యాలు దరిచేరుతాయి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల కూడా ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మరి అలా కాకుండా నిద్ర లేమి నుం...

చదువుతూ చదువుతూ రచయితగా మారి ...ఇది ఆలూరి అరుణ్ కుమార్ కథ | మన రచయితలు - 51 25.04.2024

సాహిత్యంలో అరుణ్ కుమార్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదివారం అనుబంధంలో కథలు చదువుతూ, అక్షరాలతో అనుబంధం పెంచుచున్నారు. సినిమాలు చూస్తూ ఆ రంగంలోకి అడుగుపెట్టాలి అనుకున్నారు. అలా కథకుడిగా, స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మన రచయితలు కార్యక్రమంలో భాగంగా ఆయనతో మాటామంతీ. Here is an interesting conversation with Aluri Arun Kumar, an accidental writer who with his passion for...

అనుభవాల నుండి ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎలా? | Vijetha - 6 23.04.2024

పిల్లల పట్ల ఎలా మెలగాలి.. వారితో మంచి అనుబంధం ఎలా కలిగి ఉండాలో పేరెంట్స్ కు పాఠాలు చెప్పే పేరెంట్ ఎడ్యుకేటర్ డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారి జీవిత ప్రయాణం గురించి పలు విషయాలు ముందు వీడియోలో తెలుసుకున్నాాం. ఇక ఇప్పుడు మన జీవితంలో ఎదురయ్యే సందర్భాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు.. మన జీవితం ఇతరుల జీవితం పై ఏదైనా ప్రభావితం చూపిస్తుందాా.. తన జీవితంలో ఎదురయిన అనుభవాల నుండి ఆమె ఏం నేర్చుకున్నారు.. అనే ప్రశ...

కృతజ్ఞత కలిగి ఉండటం ఎలా? | ఓ మంచి మాట - 7 19.04.2024

కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మానవ సంస్కారం. కృతజ్ఞత అనేది పాజిటివ్ సంకేతం మాత్రమే కాదు.. ఇతరులకు మనం ఇచ్చే గౌరవం లాంటింది కూడా. ప్రతి మనిషికి దీవితంలో ఏదో ఒక సమస్య రావడం అనేది కామన్. అలానే ఆ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కూడా ఉంటుందనేది కూడా కామన్. ఒక్కోసారి అలా మన జీవితంలో మనం మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా, వస్తువుల ద్వారా ఎన్నో సహాయాలు పొందుంతుంటా. మనం పొందిన సహాయానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత భావాన్ని కలి...

బతుకుపోరును కథలుగా మార్చిన... చరణ్ పరిమి | మన రచయితలు - 50 18.04.2024

విశిష్టమైన రచయితలను పరిచయం చేసే క్రమంలో యువ రచయిత చరణ్‌ పరిమితో సంభాషణ ఇది. తండ్రి నుంచి చిత్రకళను నేర్చుకుని…. స్వయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న చరణ్‌, రచనారంగంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కథల సంకలనం కేరాఫ్‌ బావర్చి ఎన్నో పురస్కారాలను అందుకుంటోంది. సినీరంగంలోనూ విజయాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్న చరణ్‌ పరిమితో మాటామంతి. Here is an interesting conversation with Charan Parimi,...

అమ్మా నాన్నలకి పాఠాలు చెప్పే టీచర్ | డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ| విజేత - 5 16.04.2024

పిల్లలు సక్రమంగా పెరగాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుడ్ పేరెంటింగ్ అనేది పిల్లలకు చాలా అవసరం. మరి కేవలం పిల్లలకు మాత్రమే గుడ్ పేరెంటింగ్ అవసరమా? పిల్లలను ఎలా పెంచాలి.. పిల్లలతో ఎలా ఉండాలి.. పిల్లలతో ఎలా ప్రేమించబడాలి.. పిల్లలకు ఇష్టమయ్యేలా ఎలా ఉండాలి అని తల్లి దండ్రులకు కూడా తెలియాలని అంటున్నారు. పేరెంట్ ఎడ్యుకేటర్ డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు. మరి పేరెంట్ ఎ...

మీరు బాగా మాట్లాడాలి అంటే ముందు బాగా వినటం నేర్చుకోండి | ఓ మంచి మాట - 6 13.04.2024

కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మానవ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో చూస్తుంటాం. అలా అనీ అందరికీ ఒకే రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అనుకుంటే పొరపాటు. కొంత మంది నలుగురిలో చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతారు.. కానీ కొంతమందికి చాలా బెరుకుగా ఉంటుంది. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో నలుగురిలో మాట్లాడేదే కాదు.. ఒకరి తో మరొకరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న...

అడుగుపెట్టిన ప్రతిచోటా అరుదైన ప్రతిభ | మాణిక్యవల్లి రావు (USA) | విజేత - 4 10.04.2024

తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విశిష్ట వ్యక్తుల గురించి విజేత కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. అయితే ఈ వారం విజేతగా మన ముందుకు వచ్చారు మాణిక్యవల్లి గారు. ఆవిడ ఒక మంచి ఆర్టిస్ట్, టీచర్ గా ఎప్పుడు పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు, మంచి గాయనీమణి కూడా, రేడియో కార్యక్రమాలు కూడా చేస్తారు. వీటన్నిటితో పాటు తన చుట్టుపక్కల ఉండేవారికి ఏ అవసరం వచ్చినా నేను వున్నాను అని చేయూతగా నిలుస్తారు. అలాంటి మా...

Saying No Is A Luxury - ఓ మంచి మాట - 5 05.04.2024

అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని ఓ సామెత. చాలా సందర్భాల్లో మొహమాటంతోనో, జరగబోయే పని మీద అవగాహన లేకనో ముందుగానే తలాడించేస్తాం. తీరా ఒకో అడుగూ వేయలేక, ముందుకు పడక సతమతమవుతాం. లక్ష్యంతో పాటుగా విలువైన బంధాన్నీ కోల్పోతాం. అందుకే ఇప్పటి రోజుల్లో కుదరదు, వద్దు, కాదు, లేదు అని చెప్పడం కూడా కళగా భావిస్తున్నారు. ఈ విషయమై మరింత విశ్లేషణ, విలువైన సూచనలు అందిస్తున్నారు మన హోస్ట్ భారతిగారు. We often say y...

ఆర్థరైటిస్ కి ఆహార నియమాలు! | Know Your Plate - 35 05.04.2024

ఆర్థరైటిస్ అనేది కీళ్ళకి సంబంధించిన ఒక వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. ఈ వ్యాధి ఒకసారి వస్తే పూర్తిగా తగ్గిపోవడం అనేది సాధారణంగా జరగదు. ఐతే సరైన ఆహార నియమాలతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు, లేనివారికి రాకుండా కూడా జాగ్రత్తపడవచ్చు. ఈ విషయాలన్నీ మన ఆశ్రిత గారి మాటల్లో తెలుసుకుందాం.. Host: Jayaree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com #talradiot...

కథకు ఓ ప్రయోజనం ఉండాలి! బద్రి కూర్మారావు | మన రచయితలు 49 04.04.2024

వారం వారం విశిష్టమైన రచయితలతో జరుగుతున్న పరిచయంలో భాగంగా జానపద కళలు, సాహిత్యాలను ప్రచారం చేస్తున్న బద్రి కూర్మారావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. గత వారం తను జానపద కళల పట్ల ఆకర్షితులైన నేపధ్యం, వాటిని తన వ్యాసాల ద్వారా ప్రచారం చేస్తున్న తీరు చెప్పారు కూర్మారావుగారు. ఇక ఈ ఎపిసోడ్లో తను కథలు రాయడం వెనకాల ఉన్న స్ఫూర్తి, తన ప్రయాణం, కళాపీఠాల ద్వారా చేస్తున్న సేవ లాంటి మరెన్నో ఆసక్తికరమైన...

Lyssna på podden TALRadio Telugu i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden