Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Episoade: 978

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: podcasters.spotify.com

Autor

Touch A Life Foundation

Categorie

Arts

Site-ul podcastului

podcasters.spotify.com

Cel mai nou episod

14 oct. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

బాహ్య ఆరోగ్యం - భాష ఆరోగ్యం | Dr. G. V. Poornachand | అంతరంగాలు - 4 07.09.2026

మన ఆహారం… మన భాష… మన సంస్కృతి! వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటూ… ఈ వారం “అంతరంగాలు” కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఆహార చరిత్ర పరిశోధకుడు డా. జి.వి. పూర్ణచంద్ గారు మన ఆహార సంస్కృతి గురించి, మారుతున్న ఆహారపు అలవాట్ల గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు. మన పూర్వీకుల ఆహారంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయి? తెలుగు భా...

డబ్బును ఆకర్షించడానికి జపనీస్ టెక్నిక్స్! | Smart Money Mindset Telugu - 7 03.09.2026

డబ్బు సంపాదించేటప్పుడు సంతోషంగా ఉండాలి… ఖర్చు చేసేటప్పుడు కృతజ్ఞతగా ఉండాలి! - ఇదే జపనీస్ Happy Money ఫిలాసఫీ! ఎంత సంపాదించినా సరిపోకపోవడం, డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం, మనీ విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురవడం… ఇలా మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మన ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటూ…డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించడం, ఖర్చు చేసేటప్పుడు కూడా కృతజ్...

చదువుతో పాటు సేవ... క్యాన్సర్ బాధితులకు అండగా విద్యార్థులు! | Sreenidhi Cancer Foundation | స్ఫూర్తి కిరణాలు 03.09.2026

చదువు, కాలేజ్, అసైన్‌మెంట్స్, పరీక్షలు… ఇలా విద్యార్థి జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉన్నా, సమాజం కోసం కూడా ఏదైనా చేయాలని ఆలోచించారు కొంత మంది విద్యార్థులు. ఆ ఆలోచనే.. 2016లో Sreenidhi Cancer Foundationగా మారింది. అప్పటి నుంచి క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలుస్తూ, యువతను సేవా కార్యక్రమాల్లో భాగం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు…! బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్స్‌, స్టెమ్‌ సెల్‌ డొనేషన్‌, క్యాన్సర...

చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81 31.08.2026

మన ఊరు మారొచ్చు… మనం దూరంగా వెళ్లొచ్చు… కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి! అలాంటి మధురమైన జ్ఞాపకాలతో పాటు… ఎన్నో విజయాలు, బాధ్యతలు, అనుభవాలతో సాగిన తన జీవిత ప్రయాణాన్ని ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు రమ్య దీపిక గారు. గుంటూరులో మొదలైన బాల్యం, స్నేహితులతో కలిసి పెరిగిన రోజులు, చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత… మొదటిసారి తన కుటుంబంలో ఉద్యోగం చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్...

విజయం కోసం EAGLE మైండ్ సెట్! | Smart Money Mindset Telugu - 6 27.08.2026

మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నారా? లేదా వాటినే మీ ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు… జీవితంలో సమస్యలు రావడం సహజమే. కానీ ఆ సమస్యలకు మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. పరిమితమైన ఆలోచనా విధానంతో సమస్యలను చూసి భయపడటం కంటే… Eagle Mindset‌తో వాటిని ఎదుర్కొని, వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం నేర్చుకోవాల...

జీవితం నేర్పిన పాఠాలే... ఆమె కథలకు ప్రేరణ! | మన రచయితలు | Season - 2 | Episode - 11 27.08.2026

ఒకవైపు కథలు… మరోవైపు కవితలు…! రచయిత్రిగా, కవయిత్రిగా, చిత్రకారిణిగా… ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు సుమలత గారు! చిన్నప్పటి నుంచే తెలుగు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం అలా అలవాటయ్యాయి. చిన్న వయసులోనే మొదలైన ఈ ఆసక్తి… తర్వాత కథలు రాసేలా చేసింది. మన చుట్టూ జరిగే సంఘటనలు, మనుషుల జీవితాలు ఆమె కథల్లో కనిపిస్తుంటాయి. అంతేకాదు... తెలుగు భాషపై ఉన్న ఇష్టంతో రేడియో క...

సేవకు చిరునామాగా రాధిక చారిటబుల్ ట్రస్ట్ | స్ఫూర్తి కిరణాలు 27.08.2026

చిన్ననాటి నుంచే సమాజంలో కనిపించిన అసమానతలు, అవసరాలు ఆమె మనసులో ఎన్నో ఆలోచనలకు బీజం వేశాయి. ఆ ఆలోచనలే తర్వాత Radhika Charitable Trust రూపంలో ఒక సేవా ప్రయాణంగా మారాయి. మహిళలు, పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రయాణం… కాలానుగుణంగా ఆరోగ్యం, విద్య, ఆహారం, ప్రాథమిక అవసరాలు, క్యాన్సర్‌ బాధితులు, లెప్రసీతో బాధపడుతున్నవారు, ట్రాన్స్‌జెండర్‌ సమాజం వరకు విస్తరించింది. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను కాపాడే మందులను ఉచితంగా అం...

సలాం సైనికా ! పరమవీర చక్ర వీరులకు మహిళా రచయితల కవితా నివాళి | అంతరంగాలు- 3 25.08.2026

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కథలను మనకు పరిచయం చేస్తూ… వారి త్యాగాలను ‘సలాం సైనికా’ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు ‘అక్షరయాన్’ సంస్థ వారు ! సాహిత్యం అంటే కేవలం కథలు, కవితలు రాయడం కాదు… సమాజం కోసం కూడా రాయాలనే ఆలోచనతో 40 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. మహిళా రచయితలకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ‘అక్షరయాన్’ సంస్థను ప్రారంభించి, ఎంతో మంది మహిళా రచయితలను ప్రోత్సహిస్తున్నారు. మహిళల సమస్యల...

తిరుపతిలో మా కాలేజ్ యూనిఫామ్ సెలెక్ట్ చేసింది నేనే ! | మా ఊరు - 80 24.08.2026

“చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటాయి… మన ఊరిని వదిలి ఎంత దూరం వెళ్లినా, మనసు మాత్రం ఆ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది!” అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో రేవతి గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబ అనుబంధాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. తిరుపతిలో గడిపిన బాల్యం, అన్నాచెల్లెళ్లతో కలిసి పెరిగిన రోజులు, వేసవి సెలవుల్లో సరదాగా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి గడిపిన క్షణాలు… వంటి...

జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి సింపుల్ టెక్నిక్స్! | Special Interview 24.08.2026

కొత్తవారిని పరిచయం చేసుకున్న వెంటనే పేర్లు మర్చిపోవడం… బైక్ కీస్ ఎక్కడ పెట్టామో వెతుక్కోవడం… మాట్లాడుతుండగా చెప్పాల్సిన విషయం మర్చిపోవడం… ఇవన్నీ మనలో చాలామంది రోజూ ఎదుర్కొనే సమస్యలే. అందుకే మన మెమరీ పవర్ ను పెంచుకోవడానికి మెదడుకు ఇచ్చే ట్రైనింగ్ చాలా ముఖ్యం అంటున్నారు… ప్రముఖ Memory Coach & Trainer జాన్సీ రాణి గారు! ఈ ఎపిసోడ్ లో అసలు మన మెమరీ ఎలా పనిచేస్తుంది? మనం ఎందుకు మర్చిపోతాం? మెమరీని పె...

మెప్పు కోసం కాదు... సంతృప్తి కోసం రాయాలి! | మన రచయితలు | Season - 2 | Episode - 10 20.08.2026

ఒకవైపు శాస్త్రం… మరోవైపు సాహిత్యం…! ఇలా వివిధ రంగాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ప్రతి రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు పారానంది అరవింద రావు గారు! చిన్నప్పటి నుంచే కవిత్వంపై ఉన్న ఆసక్తితో… ఒకవైపు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తూనే, మరోవైపు తెలుగులో కవితలు, కథలు, గజల్స్ రాస్తూ తన సాహిత్య ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఉంటూనే సాహిత్యంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ… ‘మనస...

ప్రతి ఫోటో సామాజిక మార్పు కోసం! | World Photography Day Special | స్ఫూర్తి కిరణాలు 20.08.2026

కొన్ని కథల్ని మాటల్లో చెప్పలేం… కానీ ఒక్క ఫోటోలో చూపించొచ్చు! అలాంటి వాటిలో కొన్ని ఫోటోలు మాత్రమే… ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసి, మంచి మార్పుకు దారితీస్తాయి!ఫోటోగ్రఫీకి ఉన్న ఈ ప్రత్యేకతను అర్థం చేసుకుని… తన కెమెరా ద్వారా సమాజంలోని ఎన్నో కథలను, సమస్యలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, ఫిల్మ్‌మేకర్, National Geographic Explorer హర్ష వడ్లమాని గారు! ఆరోగ్యం, వలసలు, వ్యవసాయం, పర్యా...

కొన్ని త్యాగాలు చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు! | Smart Money Mindset Telugu - 5 20.08.2026

కోటీశ్వరులు అవ్వాలంటే కొన్ని త్యాగాలు చెయ్యాల్సిందే! మనలో చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు… దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎలా పొదుపు చేస్తున్నాం, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే… రేపటి మన ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేస్తాయి. అందుకే… ఈ పాడ్‌కాస్ట్‌లో Wealth Creation క...

ఆత్మ విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఉంటే చాలు... విజయం మీదే! | శ్రీమతి అభినందన భవాని | అంతరంగాలు - 2 18.08.2026

తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు… తనతో పాటు ఎంతోమంది జీవితాలను మార్చారు! పరిస్థితులు ఎలా ఉన్నా… ఆత్మవిశ్వాసంతో తన దారిని తానే నిర్మించుకున్నారు… శ్రీమతి అభినందన భవాని గారు! ఈ “అంతరంగాలు” కార్యక్రమంలో… తన జీవితంలో ఎదురైన సవాళ్లు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన తీరు, 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవా ప్రయాణం గురించి, అభినందన సంస్థ చేస్తున్న పనుల గురించి, అప్నా ఘర్ ద్వారా పిల్లలకు విద్య, వసతి అం...

అందమైన నవ్వుతో ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమే! | Dr. Srinivas Nayak | Health Talk 17.08.2026

చిరునవ్వు… మన వ్యక్తిత్వానికి అందాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది! అలాంటి చిరునవ్వుకు కారణమైన దంతాల ఆరోగ్యాన్ని మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. పంటి నొప్పి వచ్చినప్పుడే డెంటిస్ట్‌ను కలుస్తుంటారు. కానీ పళ్ల మధ్య ఆహారం ఇరుక్కోవడం, చల్లగా లేదా వేడిగా ఏదైనా తిన్నప్పుడు సెన్సిటివిటీ రావడం, బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లాంటి చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయక...

నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వెళ్లి... ఇంగ్లీష్ నవలా రచయితగా! | Hema Macherla | మన రచయితలు | Season - 2 | Episode - 9 13.08.2026

ఇంగ్లీష్ ఏ మాత్రం రాని ఆమె... అదే భాషలో నవలలు రాసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు! వరంగల్ జిల్లా ఆత్మకూరులో పుట్టి పెరిగిన హేమా మాచర్ల గారు... చిన్నప్పటి నుంచే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రచన వైపు అడుగులు వేశారు. తెలుగులో కథలు రాస్తూ మొదలైన ఆమె రచనా ప్రయాణం... పెళ్లి తర్వాత లండన్‌కు వెళ్లడంతో పూర్తిగా మలుపు తిరిగింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో... పిల్లల పుస్తకాలు, నవలలు చదువుతూ, డిక్షనరీ సాయంతో...

పిల్లలకి ప్రకృతి పాఠాలు... భవిష్యత్తుకు భరోసా! | Meghana Musunuri | స్ఫూర్తి కిరణాలు 13.08.2026

పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు… చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడం కూడా నేర్పాలి! అనే ఆలోచనతో… చదువుతో పాటు, పేరెంటింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పని చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు… మేఘన ముసునూరి గారు! ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకురాలిగా, బోధివృక్ష ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్‌గా… అలాగే Save Water and Nature (SWAN) ద్వారా పిల్లల్లో పర్యావరణంపై అవగాహన...

సంగీతం, సాహిత్యం, సామాజిక సేవ... ఇదే నా అంతరంగం! | శ్రీమతి హైమవతి భీమన్న | అంతరంగాలు - 1 11.08.2026

గొప్ప రచయితను అందరూ గుర్తుంచుకుంటారు... కానీ వారి రచనలను తరతరాలకు చేరవేయడానికి జీవితాన్ని అంకితం చేసిన ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా? వారే... పద్మశ్రీ బోయి భీమన్న గారి సతీమణి, రచయిత్రి, కవయిత్రి హైమావతి భీమన్న గారు! ఈ మన “అంతరంగాలు” కార్యక్రమంలో భాగంగా ఆమె తన సాహిత్య ప్రయాణం గురించి, ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి, భీమన్న గారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థాపించిన భీమన్న సాహిత్య ఫౌండ...

Breastfeeding కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు! | Dr. Preethi Urandur | Health Talk 10.08.2026

తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. కానీ పాలు ఇవ్వడం అనేది ఒక్క తల్లి బాధ్యత మాత్రమే కాదు. కుటుంబ సహకారం, వైద్యుల సూచనలు, పబ్లిక్ ప్లేసెస్ లో ఉండే సౌకర్యాలు, సమాజం నుంచి లభించే మద్దతు... ఇవన్నీ తల్లి తన బిడ్డకు పాలివ్వడాన్ని సులభతరం చేస్తాయి. అందుకే ఈ Health Talk పాడ్కాస్ట్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి గారు తల్లిపాలపై ఉన్న అపోహల గురించి, తల్లులు ఎదుర్కొనే సవాళ్లు, శాస్త్రీయంగా న...

ఆటిజం పిల్లల కోసం ఓ అమ్మ చూపిన ప్రత్యేక ప్రపంచం! | స్ఫూర్తి కిరణాలు 07.08.2026

తన బిడ్డ కోసం మొదలైన ప్రయాణం... ఇప్పుడు ఎంతో పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది! ఒక తల్లిగా తన కుమారుడికి ఆటిజం ఉందని తెలుసుకున్న తర్వాత... ఎన్నో సవాళ్లు, ఒంటరితనం, కష్టాలను ఎదుర్కొన్నారు డాక్టర్ అనురాధ గారు. కానీ ఆ అనుభవాలనే ఆసరాగా మార్చుకొని... తనలాంటి కుటుంబాలకు తోడుగా ఉండాలనే సంకల్పంతో Bridging Brains సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆటిజం, న్యూరోడైవర్జెంట్ పిల్లలకు ఆటలు, ఆర్ట్స్ &amp...

రాయటం నా ఊపిరి - తెలుగు నా ప్రాణం | సత్యం మందపాటి | మన రచయితలు | Season - 2 | Episode - 8 06.08.2026

చదివే అలవాటు... ఒక సాధారణ విద్యార్థిని సైతం ప్రముఖ రచయితగా మారుస్తుంది! ప్రముఖ రచయిత సత్యం మండపాటి గారి జీవితం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... అమెరికాలో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే... ఎంత బిజీ ఉద్యోగ జీవితంలో ఉన్నా, తెలుగు సాహిత్యంపై ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. కథలు, నవలలు, వ్యాస...

పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారి మనసును తెలుసుకుందాం! | Learning Curve Foundation | Sumathi Swapna | స్ఫూర్తి కిరణాలు 06.08.2026

పిల్లలకు మార్కులు మాత్రమే కాదు... మనసును అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం! అనే లక్ష్యంతో... పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది… Learning Curve Foundation! ఈ సంస్థ చదువుతో పాటు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వంటి జీవిత నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. Social & Emotional Learning ద్వారా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు త...

ఆలోచనలు మార్చుకుంటే ఆర్ధిక అభివృద్ధి సులభం! | Smart Money Mindset Telugu - 4 06.08.2026

డబ్బు సంపాదించడం కంటే... డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం! ఒకే ఉద్యోగం... ఒకే జీతం... అయినా కొందరు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం అదే స్థాయిలో ఉంటుంటారు. దీనికి కారణం కేవలం ఆదాయం కాదు... మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం! అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్‌లో… అసలు Wealth Mindset అంటే ఏమిటి? Scarcity Mindset నుంచి ఎలా బయటపడాలి? డబ్బు గురించి ఎ...

మన్యం బిడ్డల కలలు వికసించే చోటు! | Bheem Children's Happiness Centre | స్ఫూర్తి కిరణాలు 05.08.2026

చదువు తన జీవితాన్ని మార్చింది... ఇప్పుడు అతను వందల మంది గిరిజన పిల్లల జీవితాలను మారుస్తున్నాడు! ఒకప్పుడు గిరిజన గ్రామంలోని గుడిసె పాఠశాలలో చదువుకున్న సంతోష్ ఎస్రం గారు... తనలాంటి పిల్లలకు కూడా మంచి చదువు అందాలని కలలు కన్నారు. ఆ ఆలోచనే ఇప్పుడు Bheem Children's Happiness Centre రూపంలో వందలాది గిరిజన పిల్లలకు ఆశగా మారింది. ఈ కేంద్రం ద్వారా మారుమూల గిరిజన పిల్లలకు చదువు చెప్పడం, వారిలో ఆత్మవిశ్వాసాన్న...

మీ మనసు చెప్పేది వినండి! | Dr. Konganti Prashanth | Health Talk 03.08.2026

మీరు చివరిసారి మనస్ఫూర్తిగా నవ్వి, ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది? ఈరోజుల్లో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. మరి ఇవి సాధారణ పరిస్థితులేనా? లేక మన మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే అనుకోవాలా? ఈ TAL Health Talks ఎపిసోడ్‌లో రము సైకియాట్రిస్ట్ డా. కొంగంటి ప్రశాంత్ గారు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ముఖ...

Ascultă podcastul TALRadio Telugu în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice