Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" శ్రేయోభిలాషి అమ్మ ! " - రచయిత పి. లక్ష్మీ శారద . కానమోకు కథావచనం ! 05.07.2020 23:29
" కానమోకు కధా వచనం " ద్వారా సమకాలీన అంశాలతో ఆలోచింప చేసే విషయాలు, కధ లు , మనసుకు తాకేలాగా ఉండేవి, ఆయా వాటిల్లో ,ఘటనల్లో , సందర్భాల్లో , మనలను మనం వెతుక్కునేట్లు ఉండే వాటిని , మాత్రమే మీ కానమోకు కధా వచనం ద్వారా వినిపించడం చేస్తుంటాను!. నేటి కధ " శ్రేయోభిలాషి అమ్మ " , రచయిత పి.లక్ష్మి శారద , చిన్న కధ కు జోడింపుగా బోనస్ అంశంగా పర్వత మూర్తి గారి " వ్యవస్థీకృత జాడ్యాల వికృత రూపం" అనే పౌర భద్రత గురించి...
" కార్మిక వర్గం - సమాజం, 4వ భాగం ముగింపు" - పి.ప్రసాద్ , కానమోకు కథావచనం !. 03.07.2020 59:59
పి.ప్రసాద్ గారి ,సుదీర్ఘ వ్యాస పరంపర మొత్తం 4 భాగాలుగా , " కార్మిక వర్గం - సమాజం" విశ్లేషణను కానమోకు కథావచనం ద్వారా వినిపించడం జరిగింది.
" కార్మిక వర్గం - సమాజం 3వ భాగం " - రచయిత పి.ప్రసాద్, కానమోకు కధా వచనం ! 02.07.2020 54:25
పి.ప్రసాద్ గారు IFTU నాయకులుగా శ్రామిక వర్గం, కార్మిక సంఘాల బాధ్యత, నేటి సమాజం ,తీరుతెన్నులు, కరోనా నేపథ్యంలో అసంఘటిత కార్మిక వర్గం ,తిరుగు వలసల తీరు, లపై వివరణాత్మక వ్యాసాల పరంపర ను ఇప్పటికి 3 భాగాలుగా , కానమోకు కధా వచనం ద్వారా వినిపించడం జరిగింది.ఇక మరో భాగంతో వినిపించి ముగిస్తాను!.
" విస్మృత నవలా కారిణి కృపా బాయి " - కానమోకు కధా వచనం !. 02.07.2020 20:36
సంగిశెట్టి శ్రీనివాస్ గారి వ్యాసా0గం , అయిన " విస్మృత నవలా కారిణి కృపా బాయి " జీవన రేఖ ను, ఈ కానమోకు కధా వచనం ద్వారా , మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం ,అనే స్పూర్తికి నిదర్శనంగా వినిపిస్తూ....
" యోగా ఒక మాయా జాలం - ఇందులో శాస్త్రీయత హుళ్లక్కే! "- కానమోకు కధా వచనం . 01.07.2020 14:37
"జ్ఞాన సాధన పేరుతో మెదడు ను తిమ్మిరెక్కించి భ్రమల్లో తేలిపోయి దివ్య లోకాల సందర్శనం అంటూ దైవ దర్శనమైనదనే భ్రమలో జనానికి తప్పుడు సమాచారం ఇచ్చేవారిని పిచ్చి వాళ్ళ కింద జమ కట్టాలి !" అని బయాలజీ ప్రొఫెసర్ ,మరియు సాహితీ వేత్త అయిన డాక్టర్ దేవరాజు మహారాజు గారి చే విరచిత మైన వ్యాసా0శం ను , కానమోకు కధా వచనం లో విందాం!.
" శాస్త్రీయ వైఖరులకు నేడు తిలోదకాలు" - రచయిత ఎస్.ఆర్.మహరాజ్, కానమోకు కధా వచనం లో.... 28.06.2020 6:56
నేటి సంక్షోభం లోనూ వీడని మూఢత్వం మనదేశంలో గమనించవచ్చు. "కరోనాదేవి" మహమ్మారి ని దేవత గా కొలవడం మొదలుపెట్టి , 400 గొర్రెలను బలి ఇచ్చారట .అందుకే దేశ పార్లమెంట్ లో ఒక చట్టాన్ని తెచ్చేందుకు దేశంలోని, హేతువాదులు, నాస్తికులు , " మూఢ నమ్మకాలు కు వ్యతిరేక చట్టం" కొరకు ఉద్యమించాలి!. అని కానమోకు కధా వచనం ద్వారా విజ్ఞప్తి .
" ఆత్యయిక స్థితికి 45 ఏళ్ళు"- అనిసెట్టి శాయి కుమార్ ,వ్యా సాం శం ను కానమోకు కధా వచనం లో ..... 25.06.2020 9:52
ఆ నాటి ఎమర్జెన్సీ విధించే నాటికి ఆ 1975 నాటికి ఈ " అ. శా. కు " పూర్తి " టీనేజ్" దాటి "" ట్వీస్" లో అడుగిడిన స్వేచ్ఛా పిపాసి !. కాబట్టి ఆ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశ ,కాల, వ్యక్తుల, నిర్బంధం, ఏవిధంగా ఉందో ఆయన కళ్ళతో చూసిన అనుభవంతో , నేడు ఈ తరానికి , వాస్తవానికి ఆనాటి టీనేజ్ తరానికి( 1975) గూడా " ఇందిర ఈజ్ ఇండియా" నియంతృత్వ శక్తి పై సంపూర్తి అవగాహన కోసం 45 ఏళ్ళ నాటి " ఇందిర సర్జెన్సీ" ని ఈనాడు తన భ...
" కొవ్వు ... కరిగించేద్దాం !. ". మోహన వచనం పరిజ్ఞా న హితబాండం , కోసం కానమోకు కధా వచనం లో.... 21.06.2020 20:32
"చదవ దగు నెవ్వరు వ్రాసిన , తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింప బూనిన అదియే పరిజ్ఞా న హిత బాండం మవుపో ! మహిలో మోహన వచనమై విరాజిల్లు ! ". ఆ క్రమంలో " కొవ్వు కరిగించేద్దాం!." అనే ఆరోగ్య పరిజ్ఞా న విషయాన్ని , మీ కానమోకు కధా వచనం ద్వారా వినండి!.
" నేనూ నల్లగా ఉంటే బాగుండేదేమో!" .- కధా రచయిత గంటి వేంకట రమేష్ , కానమోకు కధా వచనం లో వినిపిస్తూ. 21.06.2020 25:05
స్త్రీ వాదం, పురుషాధిక్యత, లు గురించి కేవలం ఆ స్త్రీలు మాత్రమే రాయాలని, చర్చించాలని , సిద్దాంతీ కరించే మహిళా మణులు అధికం గా ఉన్న ఈ రోజుల్లో విశాల మానవతా వాదం ఉన్న పురుష పుంగవులు గూడా ఎందరో నేడు స్త్రీ వాదంను , పురుషాధిక్యత ను నిరసిస్తూ తమ రచనలను చేస్తూ స్త్రీలపట్ల గౌరవాభిమానాలు వ్యక్తం చేస్తూ, సమానత్వంను కోరే ఎందరో పురుషు లలో , స్త్రీ సమస్యలపట్ల స్త్రీలే పోరాడాలనే ,పరిష్కరించుకోవాల నే అసమ కోణం , అ...
" పెద్ద కొడుకు " అనే ఈ కధ ను వారణాసి భానుమూర్తి వ్రాశారు. కానమోకు కధా వచనం లో.... 20.06.2020 17:53
వారణాసి భానుమూర్తి గారు , చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వారు . ఎన్నో కథలు వ్రాసి ఉన్నారు. ఈ " పెద్ద కొడుకు " అనే కధ ద్వారా స్వార్ధ పరులైన సంతానం వలన , ఒకదశలో రైల్వే స్టేషన్ లో యాచన చేస్తూ బతుకీడుస్తున్న, అభాగ్యుడికి వాళ్ళ ఊరి కరణం గారబ్బయి అనుకోకుండా తటస్థ పడి , తన గురించి తెలుసుకుని , దయార్ద్ర హృదయంతో పట్టుపట్టి చేసిన సహాయం మూలంగా తిరిగి తన పాత వ్యవసాయ జీవితం ఆరంభించి కృతజ్ఞతతో ఆ సహాయం చేసిన ఆ...
" కాఫీ పెట్ట వూ ....." అనే చిన్న కథ , రచయిత పేరు తెలియదు. కానమోకు కధా వచనం లో వినిపిస్తూ.... 19.06.2020 14:08
కానమోకు కధా వచనం శ్రోతలకు , 300 వ అంశంగా ఈ చిన్న కథ " కాఫీ పెట్టవూ...." ను వినిపిస్తూ, ఇప్పటిదాకా అన్ని అంశాలను విని ఆదరించిన శ్రోతలు, మిత్రులకు కృతజ్ఞతలతో గూడిన ధన్యవాదాలు ను మీ కానమోకు వినమ్రంగా తెలియ చేసుకుంటూ....
" క్షమ " అనే చిన్న కథ ను రంగ నాయకమ్మ గారు 50 ఏండ్ల క్రితం వ్రాసినది. కానమోకు కధా వచనం లో..... 17.06.2020 8:02
అహం కారం, పొగరు, కోపం ,ఇలాటి లక్షణాలున్న వ్యక్తులు అనాలోచితంగా చేసే పనులు వలన తమ సొంత వారికి సైతం జీవితంలో కోలుకోలేని తీవ్ర నష్టం కలిగించడం తర్వాత వేదన చెందడం ఈ "క్షమ" అనే చిన్న కథలో రచయిత్రి రంగ నాయకమ్మ 50 ఏండ్ల క్రితం వ్రాసిన దానిని ఇప్పుడు మీకు కానమోకు కధా వచనం లో వినిపిస్తూ....
" అభివృద్ధి - మార్క్సిస్టు దృక్పథం " - ప్రొ. ఆర్.ఎస్. రావు గారి వ్యాసం ను ,కానమోకు కధా వచ నం లో ... 17.06.2020 24:05
ప్రొ. ఆర్.ఎస్.రావు గారి 9 వ వర్ధంతి జూన్ 17, సందర్భంగా ఆయన , సంస్మరణ లో ఆయన వ్యాసం ను , కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ .....
" వందేళ్ళ పూర్వపు మన సంస్కర్త లు -పరిచయం " - సంగిశెట్టి శ్రీనివాస్ గారి సౌజన్యంతో ,కానమోకు కథావచనం 16.06.2020 32:54
"చదువదగు నెవ్వరు వ్రాసిన , తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింప బూనిన అదియే పరిజ్ఞా న హితబాండం మవుపో మహిలో మోహన వచనమై విరాజిల్లు !." - ఆ లక్ష్యం గా ఈ 100 ఏండ్ల నాటి మన సంస్కర్తలు గురించి సంగి శెట్టి శ్రీనివాస్ ,చే విరచిత "ముఖ పుస్తుక " లోని అంశాన్ని మీ కానమోకు వినిపిస్తూ....
" అధిక నిర్బంధ కాలం లో వి.వి. జీవితం !?". - ఎన్.వేణు వెలువరించినది , కానమోకు కధా వచనం లో.... 15.06.2020 32:52
జీవితంలో అధిక కాలం జైలు నిర్బంధం లో గడుపుతున్న విప్లవ కవి వరవరరావు , జీవితం గురించి ఎన్. వేణు వెలువరించిన వెలుగుల స్వరం ,కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ...
" వద్దు వద్దు ... భయ పడొద్దు...! ". - కానమోకు కధా వచనం . 14.06.2020 19:31
ఒక సంఘటన జరిగినప్పుడో ఒక దృశ్యాన్ని చూచినప్పుడో భయపడితే అనాలోచితంగా రియాక్ట్ అవుతాం!. దాని మీద మన నియంత్రణ ఉండదు భయపడకుండా ఉండగలిగితే ఆలోచించి స్పందిస్తాం. చేసే పనిమీద మనకి పూర్తి నియంత్రణ ఉంటుంది!- ఇదే "కాక్రోచ్ థియరీ" అని సుందర్ పిచాయ్ వెల్లడించాడు. అదేదో వినండి కానమోకు కధా వచనం లో.......
" చే గు వె రా - ఒక విప్లవ కేతనం " - కానమోకు కధా వచనం !. 14.06.2020 8:20
చే గు వేరా , సిగార్ తో ఉన్న బొమ్మ నేడు మార్కెట్ సరుకై , యువకుల టీ షర్ట్ ల పైన, ఝం అంటూ రై రై మంటూ ఉరుకులు పెట్టించే బైక్ లపై ఒక మానియా ఫిగర్ లా నేటి యువత స్టిక్కర్ లు వేసుకుని తిరిగే ఆకతాయి లకు ఫ్యాషన్ ఫిగర్ కాదు . చే గు వే రా ఒక విప్లవ కేతనం ! . 39 ఏళ్ళ స్వల్ప జీవితమైనా విప్లవానికి ప్రతీక ఆ మహా గెరిల్లా పోరాట యోధుడు , సామ్రాజ్య వాద దేశాల వెన్నులో వణుకు పుట్టించిన అమర వీరుడు .ఆయన జీవిత విప్లవ వెలు...
" సూర్యోదయం " -అనే కధ ను వి.కె. చైతన్య , వ్రాయగా కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తూ..... 14.06.2020 24:44
ఆడ పిల్లలకు ఆడంబరం గా ఉండే సంబంధాలనే చూస్తారేగాని తల్లి దండ్రులు , ఆ ఎదిగిన ఆడ పిల్లల మనస్సు లును చూసే ప్రయత్నాలు ఎందరు తల్లిదండ్రులు చేస్తారు!?. అలా ఎందుకు చేయలేక పోతున్నామనె గిల్టీఫీలింగ్ ను ఈ కధ "సూర్యోదయం" విన్న తరువాత అనిపిస్తుంది ఏమో వినండి కానమోకు కధా వచనం ద్వారా .....
" ఆ ధ్యాత్మికత " - జావేద్ అఖ్తర్ గారి ప్రసంగ పాఠం. కానమోకు కథావచనం !. 13.06.2020 34:30
జావేద్ అఖ్తర్ ,ప్రఖ్యాత హిందీ , ఉర్దూ ,కవి .అభ్యుదయ రచయిత. నాస్తికుడు. ఈ యన ఇటీవల " ఇండియా టు డే పత్రిక " నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తగా "ఆధ్యాత్మికత " అనే అంశాన్ని తన ప్రసంగంగా చేసిన పాఠాన్ని మీ కానమోకు కధా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం నిమిత్తం వినిపిస్తూ....
" అమ్మ పెట్టా పెట్టదు ! అడక్కు తినా తిన నీయదు- అనే భారతీయ తత్వం" - కానమోకు కధా వచనం . 11.06.2020 25:27
" ప్రపంచీకరణ అనే గొంగళి నేసి పరచి , దానిలో ని బొచ్చు గుచ్చు కుంటుంద నే బాధ వ్యర్ధమే !" . అలాగే " చదువదగు నెవ్వరు వ్రాసిన , తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞా న హిత బాండం మవును పో మహిలో మోహన వచనమై !". అన్న రీతిగా ఈ " అమ్మ పెట్టా పెట్టదు - అడుక్కు తినా తిన నీయదు " , " అనుభవ సారాలు" , " మంచి ఆహారం అంటే ఏవి!?" , అనే వాటిని వినిపిస్తూ మీ కానమోకు కధా వచనం లో......
"ప్రొ. హెచ్ .నరసింహయ్య - విజ్ఞాన సాగరుడు శత జయంతి " - కానమోకు కధా వచనం! 08.06.2020 18:54
ప్రపంచ సాగర దినోత్సవం వేళ విజ్ఞానసాగరుడు ప్రొ. హెచ్.నరసింహయ్య గారి శత జయంతి ని గూడా పురస్కరించు కుని ,ఆయన జీవిత విశేషాలను కానమోకు కధా వచనం మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం కు 290 వ అంశంగా ,మీ కానమోకు వినిపిస్తున్న.....
" సర్దు బాటు " అనే నేటి తరాని కి ఈచిన్న కథ, రచయిత్రి పద్మావతి చలంచర్ల . - కానమోకు కధా వచనం!. 07.06.2020 15:30
న్యూక్లియర్ కుటుంబాలు నేడు వచ్చి బంధాలు దూరమవుతున్నాయి అని, నేటి తరం పిల్లల్నే ఎందుకు బాధ్యులు చేయాలి? .సర్దుకుపోలేని ,ఇమడలేని ,రాజీ పడని పాత తరంను ఎందుకు వేలెత్తి చూపడం లేదు. ఈ న్యూక్లియర్ కుటుంబాలకు పాత తరం గూడా బాధ్యులుగా? . మార్పును అంగీకరించక పోతే స్వీక రించకపోతే మనిషి ఎదుగుదల లేనట్లే !.. అంటూ వినిపిస్తూ మీ కానమోకు - "సర్దుబాటు " కధ ద్వారా...
" నాస్తిక , మార్క్స్ ఇష్టుడు మన ఆరో రుద్రుడు - అతడే ఆరుద్ర " - కానమోకు కధా వచనం !. 04.06.2020 18:18
జూన్ 4 అనగానే ఆరుద్ర వర్ధంతి గుర్తుకు వస్తుంది. ఆరుద్ర అంటే ఆరో "రుద్రుడు" , నాస్తిక మార్క్స్ ఇష్టుడు . ఆరుద్ర గురించి ఆచారం షణ్ముఖ చారి విరచిత జీవిత విశేషాలను కానమోకు కధా వచనం ద్వారా మీ కానమోకు వినిపిస్తూ....
1. " కవి సముద్రుడు - వర వరవరుడు " - కె.జి , 2. "నువు మా కవివి "- ఏ. వి. / - కానమోకు కధా వచనం !. 03.06.2020 6:01
"కవి సముద్రుడు - వరవరుడు " అని కరిముల్లా ఘంటసాల , " నువు మా కవివి " అని, అను పమ్ , ఎన్.వేణు, కవితలు ను వరవరరావు గురించి వ్రాయగా ,వినిపిస్తూ మీ కానమోకు కథావచనం !.
" కార్మిక వర్గం - సమాజం , 2వ భాగం " రచయిత పి. ప్రసాద్ . కానమోకు కధా వచనం . 03.06.2020 31:07
కార్మిక వర్గం -సమాజం , అనే అంశం 2వ భాగాన్ని వినే ముందు , విప్లవ కవి వరవరరావు , గురించి అను పమ్ ,వ్రాసిన హిందీ కవితను, తెలుగు లో ఎన్.వేణు , వ్రాసిన దానిని మన నైతిక బాధ్యత గా వినాలి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos