Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
నష్టాల ఊబి నుంచి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వరకు! 11.07.2023 13:51
చాలా కొద్ది సమయంలోనే మార్కెట్లో తనకంటూ ఒక బ్రాండ్ పేర్పరుచుకున్న పేరు మిల్కీ మిస్ట్. సంస్థగా విజయం సాధించడమే కాకుండా, తన మీద ఆధారపడిన వందలాది ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు మీద నమ్మకం కల్పిస్తోంది మిల్కీ మిస్ట్. ఈ రోజు ఘనంగా చాటుకునే ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయినా… లోకాన్ని చదివిన విజేత కథ ఇది. నష్టాల్లో కూరుకుపోతున్న తన తండ్రి వ్యాపారాన్ని భుజానికెత...
స్పందిస్తే మార్పు సాధ్యమే | HELP AP | Spurthi Kiranalu 10.07.2023 34:47
ఓ 30 ఏళ్ల క్రితం సంగతి. జర్నలిస్టుగా సమాజంలో ఉన్న కష్టాలను, సమస్యలను లోకానికి చాటే ప్రయత్నం చేసేవారు రామ్మోహన్ రావుగారు. సమస్యలను చాటడంతో తన బాధ్యత తీరిపోతుందని తనకు అనిపించలేదు. తన వంతుగా ఏదన్నా చేయాలని అనిపించింది. వెంటనే మిత్రులతో కలిసి హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు, పిల్లలకు చేయూత అందించడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. దశాబ్దాల తరబడి ఆ సేవను విడవకుండా వందల జీ...
కథకు ప్రాణం పోసిన దర్శకుడు బిమల్ రాయ్ | Sahithi Sravanthi - 35 10.07.2023 26:10
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సినిమా స్థిరపడేందుకు దోహదపడిన దర్శకులలో ఒకరు బిమల్ రాయ్. మంచి కథలు, సామాజిక స్పృహ ఉన్న ఇతివృత్తాలతో తను రూపొందించిన చిత్రాలను ఇప్పటికీ మనం తల్చుకుంటున్నాం. టాగూర్ రచన ఆధారంగా దో బీఘా జమీన్, శరత్ చంద్ర రచనను వెండి తెర మీద చూపించిన పరిణీత, దిలీప్ కుమారును సూపర్ స్టార్ గా మార్చిన దేవదాస్… అన్నీ బిమల్ రాయ్ దర్శకత్వం వహించినవే. తన గురించి మరిన్ని అరుదైన వివరాలు...
థైరాయిడ్ ఉన్నప్పుడు తీసుకోవల్సిన ఆహారం! | Know Your Plate - 9 07.07.2023 22:46
మన శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఏర్పడే హైపోథైరాయిడ్ సమస్య గురించి ఈమధ్య కాలంలో అవగాహన పెరిగింది. పరీక్షలు చేయించుకోవడం, మందులు వాడటంతో దీన్ని ఎలాగూ ఎదుర్కోవచ్చు. వాటితో పాటు మన ఆహారం కూడా థైరాయిడ్ మీద ప్రభావాన్ని చూపిస్తుందని గ్రహించాలి. మరి ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎలాంటి పోషకాలు తీసుకోవాలి. ఈ విషయమై ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రతగారు మనకు కొన్ని విలువైన సూచనలు అందించబ...
బంధంలో అవమానం, తిరస్కారం ఎదురైతే! | Smart To Wise - 8 06.07.2023 34:04
మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచీ ఒకో బంధం తారసపడుతుంది. కొన్ని బలపడతాయి. కొన్ని తనతో కలిసి నడుస్తాయి. తన బాధలో ఓదార్పుతో, సంతోషంలో భాగంగా, కష్టంలో ఆసరాగా ఉండే అవే బంధాలు… ఒకోసారి తనను కలచివేస్తాయి. బంధంలో ఎదురయ్యే అవమానం, తిరస్కారంతో మనసు తల్లడిల్లిపోవాల్సిందే. ఇలాంటి సందర్భాన్ని ఎలా స్వీకరించాలో చెబుతున్నారు ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైపగారు. ఇందుకోసం మన ప్రాచీన జ్ఞానాన్ని కూడా విశ్లేషించబో...
సాహిత్యం సమాజానికి అండగా ఉండాలి | కె.ఎన్.మల్లీశ్వరి (మొదటి భాగం) | మన రచయితలు - 21 06.07.2023 25:16
తెలుగునాట విశిష్టమైన రచయితలను పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరిగారిని పలకరించింది టాల్ రేడియో. డాక్టరేట్ పొందిన పరిశోధకురాలిగా, లాడ్లీ మీడియా బహుమతి అందుకున్న జర్నలిస్టుగా, ఉపాధ్యాయురాలిగా, సామాజిక సమస్యల మీద నినదించే ఉద్యమకారిణిగా, సాహిత్యంలో నిత్య విద్యార్థినిగా… అన్నింటికీ మించి మంచి రచయిత్రిగా మల్లీశ్వరిగారు తెలుగు పాఠకులకు సుపరిచితమే. తన ఆసక్తికరమైన మాటలు ఇవి… He...
సడలని లక్ష్యం, సరికొత్త దారి… Jeff Bezos 04.07.2023 13:32
అమెజాన్ ఇప్పుడు ఇంటింటి పేరు. ఆ సంస్థను స్థాపించిన జెఫ్ బెజోస్… ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కానీ ఈ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. ఒక సినిమాలో ఉన్నన్ని మలుపులు తన జీవితంలో ఉన్నాయి. పేదరికం, కుటుంబ కలహాలు, పరాజయాలు… వీటన్నింటినీ దాటి తన ఎదుగుదల సాగింది. తను అమెజాన్ గెలుపుతో ఆగిపోలేదు. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నాలూ చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తప్పక వినండి… T...
సంస్కృతిని చాటాలని ప్రయత్నిస్తున్నాం | Pravasi - Epi 1 03.07.2023 30:19
విదేశాల్లో ఉంటూ తెలుగు భాష, సంస్కృతి కోసం పాటుపడే వ్యక్తులు సంస్థలను శ్రోతలకు పరిచయం చేసే సరికొత్త కార్యక్రమం ప్రవాసి. ఈ సిరీస్ లో భాగంగా ద హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటిగారితో టాల్ మాట్లాడింది. ఆ దేశానికి చేరుకున్న తెలుగువారికి అండగా నిలబడుతూ, అనేక కార్యక్రమాలతో తెలుగువారిని ఒక తాటి మీదకు తెస్తూ, కొత్త తరానికి తెలుగును పరిచయం చేస్తూ… మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతున...
బాలింతల ఆరోగ్యం కోసం పసిపిల్లల పాల కోసం… ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 8 30.06.2023 23:12
ఆహారాన్ని ఓ ఔషధంగా భావించేవారు మన పెద్దలు. కారణం లేకపోలేదు. అది మన ఆకలిని తీర్చడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే మన శరీర స్థితిని బట్టి, తీసుకునే ఆహారంలోనూ మార్పులు సూచిస్తూ ఉంటారు నిపుణులు. మరీ ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చేవారు తమ ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అందుకే ఈవారం నో యువర్ ప్లేట్ లో భాగంగా ఇదే విషయం మీద తెలుసుకు...
కోపం, భయం, బాధ… అన్నింటి మధ్య జీవితాన్ని ప్రేమించడం ఎలా! | Smart To Wise - 7 29.06.2023 29:38
ప్రశాంతంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. నిజమే! కానీ రకరకాల సమస్యలు, ఆ స్థితిని ఇబ్బంది పెడతాయి. ఒకరి ప్రవర్తనకి కోపం, మరొకరి స్వార్థానికి బాధ... ఇలా ఎన్నో ఉద్వేగాలు మనసును అల్లకల్లోలంగా మార్చేస్తాయి. వీటిని తట్టుకుని మన నిజ స్థితి అయిన సంతోషాన్ని అందుకోవడం ఎలా. మీరే వినండి... ప్రముఖ మేనేజ్మెంట్ గురు ప్రసాద్ కైప గారి మాటల్లో. Serenity is our basic nature. However, there are many threats to it. Hurt by...
విలక్షణ సాహితీవేత్త - వాడ్రేవు వీరలక్ష్మిదేవి - రెండో భాగం | Mana Rachayitalu - 20 29.06.2023 34:56
వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారితో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. ఒకవైపు రచయిత్రిగా, మరోవైపు అధ్యాపకురాలిగా తనదైన ప్రభావం చూపిస్తూనే... సమకాలీన సాహిత్యాన్నీ, సాహితీ వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్న తన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నమిది. Here is the second part of the conversation with renowned writer Vadrevu Veeralakshmi Devi sharing her experiences about her literary journey and thoughts about...
సంకెళ్లను బద్దలుకొట్టిన సిక్సర్… మిథాలీ రాజ్ 27.06.2023 11:28
అది 1999. మహిళలకు ప్రత్యేక క్రికెట్ ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సందర్భం. అలాంటి సమయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించి… లోకం దృష్టిని ఆకర్షించారు మిథాలీ. ఎంతోమంది బాలికలకు ఆ క్రీడలో అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. రన్ ఛేజింగ్ అంత ఆసక్తికరంగా ఉంటుంది తన జీవితం. మీరే వినండి. In times when Women Cricket was considered a mere formality, Mithali is the one...
పండంటి బిడ్డ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - Epi 7 23.06.2023 26:48
ఆహారం శక్తిని అందించే ఇంధనం మాత్రమే కాదు… ఆరోగ్యానికి పెట్టుబడి. అందుకే పోషకాహార నిపుణులు కేవలం బలాన్ని అందించే ఆహారాన్ని మాత్రమే సూచించరు. మన జీవనశైలి, శారీరిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. అలాంటి ఓ ప్రత్యేకమైన స్థితి గర్భధారణ. ప్రెగ్నెన్సీ ముందు, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డకు ఆస్కారం ఉంటుందో ఈవారం నో యువర్ ప్లేట్ కార్యక్రమంలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆ...
ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలా! | Smart To Wise - Episode 6 22.06.2023 36:55
చదరంగం ఆడుతూ అందులో పావుగా మారిపోతే కష్టమే. జీవితం కూడా అంతే. రకరకాల సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ… వాటిమధ్య మన ఉనికిని కోల్పోతూ ఉంటాం. ఎన్ని ఒడిదుడుకుల మధ్య అయినా ప్రశాంతంగా ఉండటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ విషయంలో అనుభవజ్ఞులైనవారి మాటలు తప్పకుండా ఉపయోగపడతాయి. అందుకే ఈ వారం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రసాద్ కైప గారిని ఈ విషయమై అడిగి చూశాం. తన సుదీర్ఘ అనుభవంతో పాటు… ప్రాచీన విజ్ఞానం చె...
విలక్షణ సాహితీవేత్త డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి (Part 1) | మన రచయితలు - 19 22.06.2023 30:31
డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి. సాహితీ వాతావరణంలో పెరిగారు. అక్షరం పట్ల ఆసక్తితో, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వేలమందికి ప్రాచీన, ఆధునిక సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించారు. ఓ రచయిత్రిగానూ… అద్భుతమైన రచనలెన్నో చేశారు. విశ్లేషకురాలిగానూ తనదైన ముద్ర అందుకున్నారు. ఈ విశిష్టమైన సాహితీవేత్తతో ఈ వారం మన రచయితల శీర్షికన సంభాషణ! Veeralakshmidevi Vadrevu is known for her extensive knowledge in ancient as w...
ఎదుగుదలే నిజమైన జవాబు… అని నిరూపించే కథ! 20.06.2023 3:15
గమ్యం ఒకసారి రహదారిలా సాఫీగా సాగిపోతుంది. మరోసారి ముళ్లబాటగా మారి సవాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో ముందుగా సాగుతుండగానే… మనల్ని నిరుత్సాహపరిచే మాటలూ వినిపిస్తాయి. రెచ్చగొడుతూనో, లోకువచేస్తూనో… దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాయి. ఆగి… జవాబులు చెప్పడం మొదలుపెడితే, ప్రయాణం అర్థంతరమే. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఈ చిన్న కథ వింటే తెలిసిపోతుంది. Script & Voice: Geetha Here is the story of a crow that challe...
లోకాన్ని కాపాడే సైంటిస్ట్… విష్ణు రెడ్డి | The Asteroid Hunter 19.06.2023 13:56
ఆకాశంలోకి చూసే పిల్లలు… తాము పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతామని అనుకుంటారు. రోజులు గడిచేకొద్దీ చూపులు నేల మీదకి వచ్చేసి... అసలు ఆకాశం వంక చూసే తీరికే ఉండదు. రకరకాల పోటీలు మొదలవుతాయి. ఎన్నో వృత్తులు ఆకర్షిస్తాయి. కానీ ఓ కుర్రాడు మాత్రం తన చిన్ననాటి కలను మర్చిపోలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, అంతరిక్షం మీద ఆసక్తిని వదులుకోలేదు. ఆస్టరాయిడ్స్ మీద పరిశోధనలు చేస్తూ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అతనే విష్ణురెడ...
ఓ పని విజయవంతంగా పూర్తిచేయడం ఎలా! 16.06.2023 3:23
పని ఆరంభించకుండానే… ఏవైనా అడ్డంకులు వస్తాయేమో అని చెప్పి ఊరకుండిపోయేవారు కొందరు. పని చేయాలి అనే లక్ష్యంతో మొదలైనప్పటికీ, ఏదన్నా ఆటంకం ఎదురవగానే దాన్ని వదిలేసేవారు కొందరు. తుదికంటూ లక్ష్యం కోసం శ్రమించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటివారి గురించి చెప్పే ఓ చిన్న కథ ఇది. కథ చిన్నదే కానీ ఎప్పటికీ మర్చిలేం. ఓసారి మీరే విని చూడండి. Many have goals but only few succeed in reaching them. Here is an i...
పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? లంచ్ బాక్సులో ఏం పెట్టాలి? 16.06.2023 29:33
పిల్లల ఆహారం పెద్ద సమస్యే. వాళ్ల అవసరానికి తగినంత శక్తి అందాలి. ఎదుగుదలకు సాయపడే పోషకాలు ఉండాలి. జంక్ ఫుడ్స్ దూరంగా ఉంచాలి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా… అది వారి మీద శాశ్వతమైన ప్రభావం చూపిస్తుంది. ఇక వారి లంచ్ బాక్సులో ఏం ఉండాలనేది మరో సమస్య. ఇలాంటి విషయాలన్నింటినీ ప్రముఖ పోషకాహార నిపుణురాల ఆశ్రితగారి ముందు ఉంచింది టాల్ రేడియో. దానికి చాలా ఆసక్తికరమైన, పాటించదగిన జవాబులు వచ్చాయి. అవేంటో మీరే వినండ...
What Is A Perfect Life? How To Achieve It? Smart To Wise - 5 15.06.2023 37:43
పరిపూర్ణమైన జీవితం అనే మాట చాలాసార్లు వింటూ ఉంటాం. ఇంతకీ పరిపూర్ణమైన జీవితం అంటే ఏమిటి? అది సాధించడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఈ విషయమై మన పెద్దలు చెబుతున్న మాటేమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో సాగిన ఎపిసోడ్ ఇది. ఈ విశ్లేషణ మనకు అందిస్తున్న ప్రసాద్ కైప, ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు మాత్రమే కాదు… భారతీయ ప్రాచీన విజ్ఞానం పట్ల ఆసక్తితో లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. We keep hearing about the wor...
మన మనసుకి ప్రపంచానికి మధ్య ఒక ఫిల్టర్ ఉండాలి 15.06.2023 3:09
నిరంతరం మన మనసు, మన భావోద్వేగాలు అదుపులో ఉండాలి అంటే కష్టమే కాదు అసాధ్యం కూడా! రకరకాల సమస్యలు, కష్టాలు తొలుస్తూ ఉంటాయి. ప్రశ్నిస్తుంటాయి. మరి ఆ చిరాకునంతా మన చుట్టూ ఉండేవారి మీద ప్రదర్శిస్తే? ఇతరులను బాధపెట్టడమే కాదు, బంధాలను కూడా పోగొట్టుకున్నవారం అవుతాము. కష్టంగా తోచే ఈ స్థితికి చాలా సులువైన పరిష్కారాలు చెబుతున్నారు నిపుణులు. అవేంటో వినేయండి మరి! Script And Voice: Rama Iragavarapu Our Daily live...
కల నిజం చేసుకోవడం ఎలా | Falguni Nayar Story | life Mantra - 16 14.06.2023 9:41
ఫల్గుణి నాయర్… అందరిలా ఓ మంచి కంపెనీలో చేరి, కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి అద్భుతమైన కెరీర్ నిర్మించుకున్నారు. కానీ తన చిన్ననాటి కల మాత్రం ఓ కలతగా మిగలిపోయింది. కాస్మెటిక్స్ పట్ల తనకి ఉన్న ఆసక్తి నిలువనీయలేదు. రిటైర్మెంట్ దగ్గరపడుతున్న సమయంలో ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నైకా పేరుతో కంపెనీ ప్రారంభించి వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వయసు, కుటుంబం, సమయం, డబ్బు… లాంటి పరిమితులన్నీ మ...
మనవారి కష్టం చూసి జాలి పడద్దు… వాళ్ళని నిలబెట్టాలి! 13.06.2023 3:11
సాటి మనిషి కష్టం చూసి… జాలిపడటం సహజం. ఆ జాలితో మనవంతుగా సాయపడటం మానవత్వమే. కానీ కొందరు మరో అడుగు ముందుకు వేస్తారు. ఆ కష్టాన్ని దీటుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతారు. నేనున్నాననే భరోసా కల్పిస్తూ, బతుకుపోరులో అడుగు ముందుకు వేయిస్తారు. అలాంటి ఓ తల్లి కథ ఇది. కథ చిన్నదే! కానీ అది అందించే స్ఫూర్తి జీవితాంతం మనతో నిలిచిపోతుంది. కావాలంటే మీరే వినండి! It’s great to be sympathetic about the problems people f...
పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి | Know Your Plate 5 09.06.2023 25:34
పిల్లలే మన జీవితం. వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలనేదే మన ప్రయత్నం. అందుకు అనుగుణంగానే ఆహారం అందించాలి అనుకుంటాం. కానీ ఇది సాధ్యమవుతోందా అంటే అనుమానమే. పిల్లలు తినే తీరు మారుతోంది, శరీర శ్రమ ఉండటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి... ఇన్ని సవాళ్ల మధ్య వాళ్ల ఎదుగుదలకు సాయపడేలా సమతుల ఆహారాన్ని అందించడం ఎలా! అన్న అనుమానానికి జవాబే ఈ ఎపిసోడ్. Kids are our world and our effort is to turn them more healthi...
సాహిత్యమే శ్వాసగా సాగిన జీవితం | Life Embedded With Literature - Part 2 | Mana Rchayitalu - 18 08.06.2023 42:08
Anil Atluri is known for his passion for books. Coming from a family which has been associated with literature and activism… Anil has made his own mark in literary world. As a publisher, writer, analyst, content provider, translator… he has excelled in every field that he came across. Here is the second part of the interesting conversation with this unique writer. Host: KL Surya
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.