తెలుగు సుస్వరాల రస ఝరి.........
Swara Madhuri
ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..
Author
తెలుగు సుస్వరాల రస ఝరి.........
Category
Podcast website
Latest episode
Apr 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
యుద్ధంలో సామాన్యుడి ఓటమి 10.04.2026 8:55
బాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు.. ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే, అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే, తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేలినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పడే.
మీరు స్టారా? -5 స్టారా ?? ఇది వింటే మీకే తెలుస్తుంది.... 05.01.2025 12:33
ఎన్నింటికో మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఉంటాం. ఫుడ్ డెలివరీ బాయ్ కి ఇస్తాం , ఏదైనా ప్రోడక్ట్ కొంటె దానికి ఇస్తాం,లేదంటే ఎదో ఒక సర్వీస్ నచ్చితే ఇస్తూ ఉంటాం. మరి మీకు మీరుగా ,మీ జీవితానికి మీరిచ్చుకునే రేటింగ్ ఎంతా.... ఒక్కసారి ఆలోచించండి.
ఎన్నికలు బాబోయ్ ఎన్నికలు 03.05.2024 17:43
ఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు.
అనుభవమే అన్ని నేర్పిస్తుంది..... 18.02.2024 3:18
ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.
ప్రశాంతత ఎప్పుడు మనకీ???? 17.02.2024 5:13
మానసిక ప్రశాంతత కోసం ప్రతీ ఒక్కరం ప్రాకులాడుతోనే వుంటాం..కానీ మానసిక ప్రశాంతత ఎంతో విచిత్రమైనది.... ఒకసారి విందాం రండి...
చెరగని యశస్వి -కళా తపస్వి 08.02.2023 10:07
తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలు...
ఎప్పటికీ అంతు పట్టని మోనాలిసా .... అసలు ఎవరబ్బా ...???? 06.10.2022 4:55
ఈ రోజుకి కూడా మోనాలిసా ఎవరో తెలియదు? అంటే లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పటికీ ఒక రహస్యం. మోనాలిసా లియోనార్డో తప్ప మరెవరో కాదని ఒక థియోరి చెబుతోంది.
పాటల వెన్నెల సిరివెన్నెల 03.12.2021 9:23
తెలుగు సినీ సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టించిన సిరివెన్నల కలం ఇంకిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి గళం చెంతకే కలం వెళ్ళిపోయింది.
అద్భుతమైన లైఫ్ ఇలా సాధ్యం!!!! 30.07.2021 5:37
జీవితంలో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది..
అబద్ధం విపరీతంగా భయపెడుతుంది..తప్పక వినాల్సిందే...... 03.07.2021 5:51
జనాలు ముడుచుకుపోతున్నారు… లోపల్లోపలికి.. భయాల మధ్య, అభద్రతల మధ్యా!! అన్నీ తమకే జరిగిపోతాయేమో అనేసుకుంటున్నారు..
జీవితానికి ఆశ - వెలుగు 26.06.2021 9:14
ఈరోజు మన మనస్సుల్లో ప్రశాంతత కావాలంటే తెలివైన బుర్రల కన్నా సుతిమెత్తని మనసులు చాలా అవసరం.
బిర్యాని--జీవితం --మధ్యలో మసాలా 11.06.2021 6:55
మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి పారేసి.. వాటిని కడుపులోనూ, బ్రెయిన్‌లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం మనకు ఇంకా ఇష్టం...
“ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారో..” 06.06.2021 3:09
మన లైఫ్ చచ్చేంత వరకూ మన చేతుల్లోనే ఉండాలి. మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్. కర్త, కర్మ, క్రియా అన్నీ మనమే అవ్వాలి. నువ్వెలా ఉండాలో డిసైడ్ చేసే స్వేచ్ఛ ఇంకొకడికి ఇవ్వకు. ఆడేసుకుంటారు.
బాధలలోనే వుంటాం ఎప్పుడూ..ఎందుకో తెలుసా ????? 30.05.2021 4:05
జీవితం ఉన్నది సంతోషంగా గడపడానికి. మనం రోజూ చేసే ప్రతీ పనీ సంతోషంగా కూడుకున్నదీ.. సమస్యల్లా మనం ఆ పనుల్లో బాధని మాత్రమే ఐడెంటిఫై అవుతున్నాం.. అందుకే మనకిన్ని బాధలు.
నిజంగా మనం ముసలి వాళ్ళతో సమానమా?? 18.05.2021 6:47
మనిషి సగం వయస్సు లోనే జీవశ్చవంలా మారిపోతున్న వైనం. ఎందుకు అలా జరుగుతోంది. ..ఆలోచించారా ???
శ్రుష్టిలో అమ్మ ప్రేమ మాత్రం ఒకటే మనిషైనా -జంతువైనా 10.05.2021 13:12
ప్రపంచంలో అన్నింటికన్నా.. తల్లి ప్రేమ గొప్పదని ఎవరిని అడిగినా చెబుతున్నారు...ఈ శ్రుష్టి లో గొప్పది తల్లి ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రేమను మించిన ప్రేమ మనకు దొరికే అవకాశం ఉండదు. అది జంతువు అయినా మనిషి అయినా సరే తల్లి ప్రేమ అంత గొప్పది
పరుగులు పెట్టే జీవితాలు - నిశ్చలంగా వుండే జీవనాలు 30.04.2021 5:49
పరుగులు పెట్టే జీవితంలో మనం ఏమి పొందుతున్నమో లెక్కలు వేసుకుంటూ వున్నాం కానీ ఏమీ కోల్పోతున్నాం అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం.... వినండి మరి..
కాలం - ఖర్మ 20.03.2021 2:57
కాలం, ఖర్మఎంత గొప్పవి కదా...ఖర్మ నా బ్రతుకు ఇలా ఎందుకు అని ఆలోచిస్తూ నిస్సహాయ పడినప్పుడల్లా, కాలం మనకు ఏదో ఒక రూపంలో అవకాశాలు చూపిస్తూనే ఉంటుంది.
అందరూ మన టైమ్ ని ఎలా వృధా చేస్తారంటే......... 17.02.2021 4:58
ఒక మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సమయాన్ని హైజాక్ చేయడం కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
పండుగలు -ప్రకృతి 13.01.2021 12:30
సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దల పండుగ. పంటల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీర ను కట్టుకుని, బంతి చేమంతులను జడలో తురుముకుని, రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడే కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవు...
ఎన్ని ఉన్న మనిషి సంతోషం తన చుట్టూనే... 28.11.2020 4:00
పుష్కలంగా అన్నీ దొరుకుతూన్న రోజుల్లో, మనం, వాటిని అనుభవించడానికి , ప్రతీ రోజూ చిరాకు పడేవాళ్ళం. “ అబ్బ ప్రతీ రోజూ ఇవేనా.. “ అని. ఆరోజుల్లో ఉండీ అనుభవించలేదు, ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు. అందుకేనేమో “ చేసికున్నవాడికి చేసుకున్నంతా.. “ అంటారు.
మూడు తరాలు ఒక సందేశాత్మక కధ 21.11.2020 7:11
మనిషి ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఇప్పుడది ఏ దిశగా సాగుతోంది? తెలుసుకోవడానికి మానవ పరిణామ చరిత్ర అంతా తవ్వక్కర్లేదు! ఓ మూడు తరాల అనుభూతులను, అనుభవాలనూ పరిశీలిస్తే చాలు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని వాడుకో అని అంతర్లీనంగా సందేశమిచ్చే సమాజం అనేది ఒకతరం అయితే , మనుషుల్ని వాడుకుని.. వస్తువుల్ని ప్రేమించే సంస్కృతి అనేది ఇంకో తరం, వస్తువుల్ని ప్రేమించి వస్తువుల్నే వాడుకోవటం మా తరం &...
"విషం "ఒక మంచి కధ 24.08.2020 4:32
కధలంటే ఇష్టం లేనిది ఎవరికి ? మరి మీకోసం ఓ మంచికధ తెచ్చాను , వినేయ్యండి మరి.............
భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 15.08.2020 21:20
శ్రోతలకు,స్నేహితులకు , శ్రేయోభిలాషులకు భారత స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు ...స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 74 ఏళ్లు. మనదో గొప్ప నాగరికత, ఎన్నో ఆక్రమణలకు, దండయాత్రలకు గురయ్యి.. ఎంతో పోరాటం.. త్యాగంతో మనం 74 ఏళ్ళ క్రితం స్వాతంత్రాన్ని సాధించాం. ఈ 74 ఏళ్లలో ఎన్నో చెప్పుకోదగ్గ విషయాలు జరిగాయి. కానీ అదే సమయంలో ఎన్నో విషయాలను సరి చేయాలి. మనం Space Research లో ముందుకు దూసుకుపోతున్నాం.. వాణిజ్య వ్యాపారాలు కూ...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.