DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

Religion TE ↓ 55 episodes

సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.

Author

DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION

Category

Religion

Podcast website

podcasters.spotify.com

Latest episode

Sep 6, 2025

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

ఎపిసోడ్ - 30 - "ధ్యానం - ఆవశ్యకత" 18.04.2024

ఈ ఎపిసోడ్, మానవ జీవితంలో ధ్యానం యొక్క విలువను వివరిస్తూ, ధ్యాన ప్రయోజనాలను, ధ్యాని లక్షణాలను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 29 : " శ్రీరామ నవమి " 11.04.2024

ఈ ఎపిసోడ్,  శ్రీరామనవమి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ, రామ తత్వాన్ని,  రామ నామ మహిమను , శ్రీరాముని గుణగణాలను వివరిస్తుంది

ఎపిసోడ్ - 28 : " ఉగాది " - తెలుగు వారి నూతన సంవత్సర వేడుక " 04.04.2024

ఈ ఎపిసోడ్, ఉగాది పండుగ విశిష్టతను, సృష్టి ప్రారంభమైన బ్రహ్మ కల్పం యొక్క విశేషాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 27 - " క్లేశాలు " - నాల్గవ భాగం (అభినివేశ) 28.03.2024

ఈ ఎపిసోడ్, పతంజలి యోగ సూత్రాలలో తెలుపబడిన పంచ క్లేశాలలో చివరిదైన " అభినివేశ " గురించి, దాని యొక్క ప్రభావం గురించి, ఈ క్లేశాన్ని అధిగమించే మార్గాలను గురించి, తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 26 - " క్లేశాలు" - మూడవ భాగం (రాగ ద్వేషాలు) 21.03.2024

ఈ ఎపిసోడ్, పతంజలి యోగ సూత్రాలలో తెలుపబడిన క్లేశాలలో భాగమైన రాగ ద్వేషాలను గురించి, వాటి లక్షణాలను గురించి, ఈ రాగద్వేషాల వలన కలగే దుష్ప్రభావాలను గురించి, వీటిని అధిగమించే మార్గాలను గురించి తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 25 - " క్లేశాలు - రెండవ భాగం (అస్మిత) " 13.03.2024

ఈ ఎపిసోడ్, పతంజలి యోగ సూత్రాలలో తెలుపబడిన క్లేశాలలో రెండవదైన అస్మిత గురించి, దాని యొక్క లక్షణాలను గురించి, దాని వలన కలిగే దుష్ప్రభావాలను గురించి, ఈ అస్మితను అధిగమించే మార్గాలను గురించి తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 24 - " క్లేశాలు - మొదటి భాగం" 06.03.2024

ఈ ఎపిసోడ్, యోగ సూత్రాలలో తెలుపబడిన క్లేశాలను గురించి, అందులో భాగమైన 'అవిద్య' ను గురించి తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 23 " మహా శివరాత్రి " 28.02.2024

ఈ ఎపిసోడ్, సుషుమ్న శివ సిద్ధి కార్యక్రమం గురించి, మహా శివరాత్రి పర్వదినం యొక్క ప్రాముఖ్యతను గురించి, శివ తత్వం యొక్క విశిష్టతను గరించి, గత సంవత్సరం మహా శివరాత్రి నాడు మన పూజ్య గురువులు శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు మనకందించిన దివ్య సందేశాన్ని గురించి తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 22 " వైరాగ్యం " 22.02.2024

ఈ ఎపిసోడ్ వైరాగ్యం అంటే ఏమిటి ? పూజ్య గురువుల అనుగ్రహంతో, తాత్కాలికమైన వైరాగ్యాలను ఏ విధంగా మన నుండి తొలగించుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలియజేసే అంతర్వైరాగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి వంటి అంశాలకు తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 21 - " రథ సప్తమి " 15.02.2024

ఈ ఎపిసోడ్ అత్యంత పుణ్యాన్ని ప్రసాదించే మాఘమాసం యొక్క ప్రత్యేకతను, రథసప్తమి పండుగ యొక్క విశేషాలను, సూర్య భగవానుని విశిష్టతను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 20 - " కర్మ సిద్ధాంతం - రెండవ భాగం " 08.02.2024

ఈ ఎపిసోడ్ కర్మలను ఏ విధంగా నిర్వర్తించాలనే విషయాలను గురించి, కర్మ ఫల త్యాగం మరియు నిష్కామ కర్మలను గురించి, కర్మ బంధనాల నుండి బయటపడే మార్గాలను గురించి తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 19 - " కర్మ సిద్ధాంతం - మొదటి భాగం " 01.02.2024

ఈ ఎపిసోడ్ కర్మనూ, కర్మ సిద్ధాంతాన్ని, కర్మతో మనకు గల సంబంధాన్ని, సంచిత, ప్రారబ్ద, ఆగామి కర్మలను, కర్మ ఫలాల ప్రభావాలను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 18 - "అభ్యాసం - పరిపూర్ణత" 25.01.2024

ఈ ఎపిసోడ్ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని పొందటానికి, మన అభ్యాసం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని సవివరముగా తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 17 - "అరిషడ్వర్గం - నాల్గవ భాగం" 18.01.2024

ఈ ఎపిసోడ్ అరిషడ్వర్గంలో చివరివైన మద, మాత్సర్యాల యొక్క లక్షణాలను, వాటి ఫలితాలను, సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన మరియు ఆత్మ పరిశీలనల ద్వారా మనం వాటిని ఏ విధంగా నియంత్రించగలము వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 16 - "మకర సంక్రాంతి" 11.01.2024

ఈ ఎపిసోడ్ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను, వానిలో దాగి ఉన్న భౌతిక , ధార్మిక, ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 15 - " అరిషడ్వర్గం - మూడవ భాగం" 04.01.2024

ఈ ఎపిసోడ్ అరిషడ్వర్గంలో లోభం మరియు మొహం గురించి, వాటి లక్షణాలను, ఫలితాలను, వాటిని మన నుండి సంపూర్ణంగా తొలగించుకునే మార్గాలను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 14 : " క్రిస్టమస్ మరియు సంవత్సరాంతపు ఆత్మ విచారణ" 31.12.2023

ఈ ఎపిసోడ్ క్రిస్టమస్ మరియు జీసస్ యొక్క విశిష్టతను తెలియజేస్తోంది. సంవత్సరాంతపు ఆత్మ విచారణ ఏ విధంగా చేసుకోవాలి? ఏ ఏ అంశాలను పరిశీలించుకోవాలి? ఏ విధమైన ప్రణాళికలను అమలు చేసుకోవాలి వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 13 : " గీతా జయంతి " 21.12.2023

ఈ ఎపిసోడ్ "గీతా జయంతి" జరుపుకునే వైశిష్ఠ్యాన్ని , భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 12 : "అరిషడ్వర్గం - క్రోధం " (రెండవ భాగం) 13.12.2023

ఈ ఎపిసోడ్ అరిషడ్వర్గంలో రెండవ అంతర్గత శత్రువైన "క్రోధం", దాని యొక్క లక్షణాలు, ఫలితాలు, దానిని మనం ఏ విధంగా అధీనంలో ఉంచుకోవాలి, అలా అధీనంలో ఉంచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 11 - ఆత్మ విచారణ - అరిషడ్వర్గం - మొదటి భాగం 07.12.2023

ఈ ఎపిసోడ్ ఆత్మ విచారణ అంటే ఏమిటి? ఏ ఏ విషయాలను మనం విచారణ చేయాలి? అరిషడ్వర్గం వివరణ , కామం యొక్క ప్రభావం, ఫలితాలు మరియు కామాన్ని ఏ విధంగా జయించాలి వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 10 : "సాత్వికాహారం" 30.11.2023

ఈ ఎపిసోడ్ సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలను గురించిన వివరణను అందిస్తుంది. ఆహారం యొక్క ప్రాధాన్యతను మరియు ప్రభావాన్ని తెలియజేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 9 - "కార్తీక పౌర్ణమి" 22.11.2023

ఈ ఎపిసోడ్ పౌర్ణమి యొక్క విశిష్టత, మనలోని పంచభూతాలను సమతుల్యం చేసుకునే విధానం, పరమ గురువుల జన్మదినం - అమ్మగారి సందేశం వంటి అంశాలను చర్చిస్తుంది.

ఎపిసోడ్ - 8 - కార్తీక మాస విశిష్టత - ఏకాదశి 16.11.2023

ఈ ఎపిసోడ్ కార్తిక మాస విశిష్టత మరియు విశేష పర్వదినాలను గురించి, ఏకాదశి వృత్తాంతం గురించి భౌతిక, ఆథ్యాత్మిక విషయాలను వివరిస్తుంది.

ఎపిసోడ్ - 7 - దీపావళి 09.11.2023

ఈ ఎపిసోడ్ "దీపావళి" పండుగ యొక్క విశిష్టతను మరియు ఆధ్యాత్మిక భావాలను తెలియజేస్తుంది.

ఎపిసోడ్ - 6 - ఓం శాంతి శాంతి శాంతి: 02.11.2023

ఈ ఎపిసోడ్ "మంత్రం" అంటే ఏమిటి? 'శాంతి' మంత్రం వివరణ, ఓం శాంతి శాంతి శాంతి: అని 'శాంతి' పదాన్ని మూడుసార్లు ఎందుకు ఉచ్చరిస్తారో తెలియజేస్తుంది.

Listen to the SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.