DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)
సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.
Author
DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
Category
Podcast website
Latest episode
Sep 6, 2025
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
***పూజ్య గురుమాత ఆత్మానందమయి అమ్మగారి ప్రత్యేక లైవ్ కార్యక్రమం*** 06.09.2025 0:56
వినాయక చవితి సందర్బంగా , ఆగస్టు 27 వ తేదీ నుండి, 49 రోజుల పాటు పూజ్యా గురుమా ఆత్మా నందమయి అమ్మ గారి తో ప్రత్యక్షంగా ( స్పెషల్ లైవ్ - ద్వారా) సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసే అరుదైన అవకాశం. ఈ 49 రోజులు పాటు జరిగే ధ్యాన కార్యక్రమం ఎంతో విశేషమైనది. ప్రతి రోజు ఈ "స్పెషల్ లైవ్ మెడిటేషన్ " సెషన్ లో పాల్గొనడం ద్వారా, గురువులు అందించిన ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధ్యాన సాధన ద్వారా...
ఎపిసోడ్ - 54 - "శివ తత్వం-అర్ధనారీశ్వర తత్వం" 20.02.2025 4:45
పరమ శివుడి అర్ధనారీశ్వర దివ్య రూపం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి?? ఆ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు? సకల సృష్టికి ఆది దంపతులు అయిన శివ పార్వతుల నిజ తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర రూపం వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని ఆవిష్కరించే సంభాషణా సమాహారం ఈ వారం పాడ్కాస్ట్.
ఎపిసోడ్ - 53 - "శివ తత్వం- కైలాసం" 13.02.2025 6:21
కైలాసం మహా దేవుడైన పరమ శివుడి నివాసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పర్వత ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలని చూశారు. రెండు పర్యాయాలు ఈ పర్వతం పైకి విమానాలను పంపేందుకు ప్రయత్నం చేయగా, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కైలాసం పవిత్ర స్థలం. జగన్మాత పార్వతి, జగత్ పిత పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం కైలాసం. అయితే సుషుమ్న క్రియా యోగులు ధ్యానం ద్వారా కైలాస పర్వత దర్శనం చేసుకొవడం ఎలా..? అనే ఆసక్తికర విషయాల సమాహారమే...
ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం" 06.02.2025 4:11
దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు మొదట ఆవిర్భవించింది హాలాహలం. ఈ భయంకర విష ప్రభావం వల్ల లోకాలు నాశనం కావడం మొదలైంది. బ్రహ్మాది దేవతలు, రాక్షసులు “రక్షమాం” అంటూ శివుడిని శరణు వేడారు. ఆ కరుణా సింధువు గరళాన్ని మింగి విశ్వాన్ని రక్షించాడు. ఈ అద్భుత పురాణ కథలోని నిగూఢార్థాన్ని తెలియజేసే పాడ్కాస్ట్ ఈ వారం.
ఎపిసోడ్ - 51 - "శివ తత్వం- రుద్రాక్ష వైభవం" 30.01.2025 3:04
రుద్రాక్ష పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైనది. రుద్రాక్ష మాలలను శివుడు మొదలుకొని ఎందరో యోగులు ఆభరణంగా ధరిస్తారు. హిమవత్ పర్వత ప్రదేశంలో లభించే రుద్రాక్షలు సాధనకు ఎంతో ఉపకరిస్తాయి. రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష విశిష్టత ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.
ఎపిసోడ్ - 50 - "మహా మృత్యుంజయ మంత్రం" 23.01.2025 4:55
మహా మృత్యుంజయ మంత్రాన్ని మహా సంజీవని మంత్రం అంటారు. ఈ మహా మంత్ర నిగూఢార్థం, మంత్ర ఆవిర్భావం, మంత్ర విశేషం ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.
ఎపిసోడ్ - 49 - "పంచాక్షరీ మంత్రం" 15.01.2025 5:02
ఈ ఎపిసోడ్ లో శివ పంచాక్షరీ మంత్ర వైశిష్ట్యాన్ని గురించి, పంచాక్షరీ మంత్ర మహత్తు, ఓంకార బీజాక్షర మహిమ వంటి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం.
ఎపిసోడ్ - 48 - "శివ తత్వం - ఆది యోగి శివుడు" 08.01.2025 5:00
ఈ ఎపిసోడ్ లో ఆది యోగి అయిన శివుడిని ఆది గురువుగా, క్రియా యోగ దీక్షా గురువుగా దర్శిద్దాం. శివ తత్వంలోని అంతరార్థాన్ని అన్వేషిద్దాం. మీ ప్రశ్నలు, మీ విలువైన సలహాలు, సందేశాలు క్రింది ఈమెయిల్ కి పంపండి sushumnavani@divyababajikriyayoga.org
ఎపిసోడ్ - 47 - "యోగం - మార్గం" 18.12.2024 14:03
ఈ ఎపిసోడ్, ఆత్మను పరమాత్మలో లయం చేసే యోగం గురించి , దానికి సాధనంగా ఉపయోగపడే యోగా గురించి , యోగి యొక్క లక్షణాలను గురించి వివరిస్తుంది.
ఎపిసోడ్ - 46 - "గురు కృప - శిష్యుని కర్తవ్యం" 21.11.2024 18:04
ఈ ఎపిసోడ్, గురు శిష్య సంబంధాన్ని, గురువు , తన శిష్యులపై చూపించే అపారమైన కృపామృతాన్ని, గురువు పట్ల శిష్యుని కర్తవ్యాన్ని వివరిస్తుంది.
ఎపిసోడ్ - 45 - "సంకల్పం" 07.11.2024 18:26
ఈ ఎపిసోడ్, సంకల్పం యొక్క శక్తిని, విశ్వ శ్రేయస్సుకై చేసే సంకల్పాల ప్రయోజనాన్ని, ఏవిధమైన సత్సoకల్పాలు చేసుకోవాలి? వాటిని నెరవేర్చుకునేందుకు ఏ విధమైన సాధనను అలవరచుకోవాలి వంటి అంశాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 44 - "దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ - సేవా కార్యక్రమాలు" 24.10.2024 10:07
ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ యొక్క లక్ష్యాన్ని, వారి సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 43 - "విజయ దశమి" 10.10.2024 18:46
ఈ ఎపిసోడ్, విజయదశమి పండుగ ప్రత్యేకతను, నవ దుర్గల విశిష్టతను, మరియు శరన్నవరాత్రుల విశేషాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 42 - "సేవ - ప్రయోజనం" 19.09.2024 16:02
ఈ ఎపిసోడ్, సేవ అంటే ఏమిటి, ఏ భావంతో సేవ చేయాలి, వివిధ సేవా మార్గాలను మరియు సేవ చేయటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది.
ఎపిసోడ్ - 41 - "వినాయక చవితి" 05.09.2024 18:30
ఈ ఎపిసోడ్, వినాయక చవితి పండుగ యొక్క విశేషాలను, మరియు ఆధ్యాత్మిక భావనలను వివరిస్తుంది.
ఎపిసోడ్ - 40 - " శ్రీకృష్ణ జన్మాష్టమి" 22.08.2024 20:14
ఈ ఎపిసోడ్, శ్రీకృష్ణుని జననం మరియు బాలకృష్ణుని లీలలను గురించి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను గురించి వివరిస్తుంది.
ఎపిసోడ్ - 39 - "స్వేచ్ఛ - స్వాతంత్ర్యం" 14.08.2024 12:49
ఈ ఎపిసోడ్, దేశ స్వాతంత్రం మరియు వ్యక్తిగత స్వేచ్ఛతో పాటూ, ఆధ్యాత్మిక పరమైన ఆత్మ యొక్క స్వాతంత్రం గురించి వివరిస్తూ, ఆత్మ యొక్క స్వేచ్ఛకు అడ్డంకులుగా ఉన్న అంశాలను , వాటిని అధిగమించి ఆత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని పొందే మార్గాలను తెలియజేస్తుంది .
ఎపిసోడ్ - 38 - "సామూహిక ధ్యానం - ప్రయోజనాలు" 08.08.2024 18:39
ఈ ఎపిసోడ్, సామూహిక ధ్యానం అంటే ఏమిటి? ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనటం వలన కలిగే ప్రయోజనాలను, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న సామూహిక ధ్యాన కార్యక్రమాల వివరాలను, వాటి ఆవశ్యకతను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 37 - "గురు పౌర్ణమి" 01.08.2024 18:50
ఈ ఎపిసోడ్ గురుపౌర్ణమి విశిష్టతను, అమ్మ గారి చేతుల మీదుగా జరిగే హోమం యెుక్క వైశిష్ట్యంతో పాటూ, గురు పూజా మహోత్సవ కార్యక్రమ విశేషాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం" 30.05.2024 14:50
ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 35 - "పూజ్య గురువులు - శ్రీ భోగనాథ మహర్షి గారు" 23.05.2024 18:57
ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ భోగనాథ్ మహర్షి గారి జననం, ధ్యాన సాధన, నవ సిద్ధుల దర్శన భాగ్యం, వివిధ శాస్త్రాలలో భోగనాథ మహర్షుల వారి అపారమైన పరిజ్ఞానం, వంటి విశేషాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు" 16.05.2024 15:14
ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారి బాల్యం, వారి ఆధ్యాత్మిక ప్రయాణం, యోగ సాధన, గురుదేవులైన శ్రీ భోగనాధ్ మహర్షుల వారి దర్శనం, సుషుమ్న క్రియా యోగ సాధకులపై బాబాజీ వారి అనుగ్రహం వంటి అంశాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 33 - "ప్రత్యక్ష గురుమాత - పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారు" 09.05.2024 12:29
ఈ ఎపిసోడ్, పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారి బాల్యం, జీవిత విశేషాలను, పరమ గురువుల అనుగ్రహాన్ని, అమ్మగారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది.
ఎపిసోడ్ - 32 - పరమ గురువుల అనుగ్రహం - సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావం" 01.05.2024 14:48
ఈ ఎపిసోడ్, సుషుమ్న క్రియాయోగ ధ్యాన విధానాన్ని పరమ గురువులు రూపొందించడం వెనుక గల కారణాలను, ధ్యాన సాధన యెుక్క మహత్యాన్ని, షట్చక్రాల వివరణను, ధ్యానం లో సుషుమ్న క్రియాయోగుల అనుభవాలను, ధ్యాన సాధన తో పాటు ఆచరించవలసిన అంశాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 31 : "క్రియా యోగం - విస్తరణ" 24.04.2024 11:45
ఈ ఎపిసోడ్, క్రియాయోగ ఆవిర్భావాన్ని, యుగ యుగాన క్రియాయోగ విస్తరణ విధానాన్ని తెలియజేస్తుంది.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.