Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" నేటి తరానికి గోరా గారి జీవిత పరిచయం -మొదటి భాగం " - కానమోకు కధా వచనం 30.04.2020 8:38
గోపరాజు రామచంద్ర రావు , గోరా గా తన పేరు మార్చుకుని , గోరా అంటే నాస్తికుడు, నాస్తికత్వానికి ప్రతీక, స్ఫూర్తి, ఆచరణ వాది అని నేటి తరానికి తెలియచేసే ప్రయత్నమే ఇది!.
" అబ్రహం టి.కోవూరు జీవిత చరిత్ర 3 వ భాగం " - కానమోకు కథావచనం !. 28.04.2020 15:46
అబ్రహం టి. కోవూరు , జీవితం గురించి ,జి.లవణం గారు వ్రాసిన రచన ఆధారంగా వరుసగా 1, 2, 3, భాగాలుగా , కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపించడం ,ఒక బాధ్యతగా భావించి వినిపించడం జరిగింది. శ్రోతలు హర్షిస్తారని ఆసిస్తూ మీ - కానమోకు.
" అబ్రహం టి. కోవూరు ,జీవిత చరిత్ర 2 వ భాగం" - కానమోకు కథావచనం!. 28.04.2020 55:05
డా. ఏ .టి.కోవూరు గారి జీవిత చరిత్ర దాదాపు 3 భాగాలుగా , విని పించడంలో జి.లవణం గారి రచన తోడ్పడినది.
" అబ్రహం టి. కోవూర్ - జీవిత చరిత్ర మొదటిభాగం" - రచన జి.లవణం , కానమోకుకథా వచనం. 28.04.2020 35:05
ప్రఖ్యాత హేతువాద , నాస్తికుడు అబ్రహం టి.కోవూరు , గారి జీవిత చరిత్రను , జి.లవణం గారు వ్రాయగా , కానమోకు కధా వచనం ,ద్వారా వినిపిస్తూ.....
" వెంటిలేటర్ చికిత్స - కరోనా వైరస్ తిరగ బెడుతుందా!?" -కానమోకు కధా వచనం !. 28.04.2020 15:35
వెంటిలేటర్ ఊపిరి పోస్తుంది గానీ, ఆ వెంటి లెటర్ పై ఉండి బతికొచ్చిన వారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి!. అలాగే ఈ కరోనా వ్యాధి తిరగబెటు తుందా! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశోధనాంశాలు ఏం చెబుతున్నాయి!? .ఈ పరిజ్ఞానాన్ని మోహనవచనం హిత బాండం ద్వారా విని అవగాహన పెంపొందించుకుందాం!.
" నర తోట లోన మనిషి కాలు మోపాల " కవిత , కానమోకు!. 26.04.2020 3:54
రోజూ కవితలు - రామోజీ ఫౌండేషన్ ,పోటీ
" క్యూబా దేశ వైద్యులకు ప్రపంచ మానవాళి జేజేలు !". కానమోకు కథావచనం!. 26.04.2020 20:47
చే గువేరా , ఆదర్శం క్యూబా వైద్యులకు స్ఫూర్తి నిస్తే , ఫిడెల్ క్యా స్ట్రో , వైద్య సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నిప్రాంతాలకు సమానంగా అందేలా చూడ టమే గాక ప్రతిఒక్కరి కి వైద్య సేవలు పొందటం వారి ప్రాధమిక హక్కుగా , రూపొందించి , వైద్యం అంత ఉచితంగా కల్పించడమే గాక , వైద్య విద్య ను సైతం ఉచితంగా అందిస్తున్న దేశం క్యూబా !. "ఆర్మీ ఆఫ్ వైట్ కోట్స్" గా వైద్యులను తయారు చేశారు క్యాస్ట్రో . విదేశీ విద్యార్థ...
" కరోనా - మానవ శరీరంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో!?". - కానమోకు కధా వచనం . 25.04.2020 13:21
కరోనా వైరస్ ఎక్కడెక్కడ మానవ శరీరంలో ప్రభావం చూపిస్తుందో!?. అనే విషయాన్ని పరిజ్ఞా న హిత బాండం ద్వారా ,తెలుసుకుంటూ, ఈ సందర్భంలో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మానవులను కాపాడటానికి సైనికుల్లాగా ప్రపంచ వ్యాపితంగా సేవలు అందిస్తున్నారో ! వారికోసం రామోజీ ఫౌండేషన్ , కరోనా పై కదనం , రోజూ కవితలపై పోటీ లో కంచరాన భుజంగ రావు , వ్రాసిన కవిత " దూది పువ్వు" వైద్యులకు అంకితంగా వ్రాయబడిన దానికి మొదటి బహుమతి ర...
" వైరస్ లు - చరిత్ర " కానమోకు కధా వచనం !. 23.04.2020 12:18
మనిషి కంటే ముందే పుట్టిన వైరస్ లు వాటి చరిత్రను అవగాహన నిమిత్తం వినిపిస్తున్న కానమోకు కధా వచనం !.
" వలస కూలీ కి ఎంత కష్టం !? ".- కానమోకు కధా వచనం. 23.04.2020 8:41
ఇప్పటివరకు మరణాలే రోజూ వారి కృత్యాలుగా చూసిన దేశాలను అడగండి ..... పోయింది పేదలు మాత్రమే కాదని ఆ చావులు సాక్ష్యాలిస్తాయి !. ఆర్ధిక వ్యవస్థ లు మనుషులకోసం ! .మనుషులే మిగలని నాడు ఆ ఆర్ధిక వ్యవస్థలు ఎవరికోసం !?. " గుక్క పట్టి ఏడుస్తున్న దేశం" అని తగుళ్ళ గోపాల్ తన కవితలో విలపిస్తూ, వలస కూలీ కి ఎంత కష్టం !? అది కనబ డటం లేదా అని అంజలి .జి , ఆవేదన వ్యక్తం చేస్తే , వీటిని కానమోకు కథావచనం ద్వారా వినిపిస్తూ.....
" మొదట మనం మానవులం!, పౌరులం! ఆ తర్వాతే ఉద్యోగులం " - కానమోకు కథావచనం. 22.04.2020 34:59
1990 మే ,మాసంలో " ఉద్యోగ క్రాంతి " 10 వ వార్షికోత్సవ సభలో కా. వరవర రావు గారు చేసిన ప్రసంగ వ్యాసం " మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం" అన్న దాన్ని నేడు 2020 మే మాసం కి 40 ఏళ్ళు ను "ఉద్యోగక్రాంతి " పూర్తి చేసుకునే సమయాన గుర్తు చేసుకుంటూ, ఆ ప్రసంగ ఉపన్యాసాన్ని మీ కానమోకు చదివి విని పిస్తూ....
" ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే " - కానమోకు కధా వచనం !. 21.04.2020 7:12
ఏప్రిల్ 21 భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం . పౌరసేవల సార ధుల కు గౌరవ వందనాలు ! ఎస్.ఆర్.శంక రన్ , బి.డి.శర్మ ,వంటి గౌరవనీయ పౌర సేవల అధికారుల , సేవలను భారత పౌరులు ఆ జన్మాo తం ఋణపడి స్మరించుకు నే సందర్భం ఈ రోజు. అలాగే " నునుపెక్కిన కొండలు" అనే కవిత ద్వారా ప్రవాస భారతీయులు ఆత్మ రొదనను నల్లు రమేష్ , వ్రాసి రామోజీ ఫౌండేషన్ వారి ప్రధమ బహుమతిని పొందిన ఆ, కవితను జోడించి ,ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే ,విశిష...
" కరోనా పుట్టుక పై ఎన్నెన్నో ఊహా ను లు !". కానమోకు కథావచనం. 20.04.2020 17:43
వివాదాల సుడిలో చైనా ప్రయోగ శాల, వాస్తవాలను చైనా తొక్కి పెట్టింది అంటు విమర్శల నేపథ్యం లో కానమోకు కధా వచానం, మరియు మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం ద్వారా ,సమాచా రాన్ని వినిపిస్తూ.....
" మీ కోసం ! " అనే కధ ను చివుకుల హరి ప్రియ వ్రాయగా , కానమోకు కథావచనం లో...మీకోసం. 19.04.2020 20:05
పుట్టు మూగ వాడైన తండ్రికి మొక్కలే భాష , అమ్మే మాట . ఈ రెంటిలో ఏది దూరమైనా ఆయన తట్టుకోలేడని తెలిసిన సంతానం బహుకరించిన 'వాన ప్రస్థం ' ,'మీ కోసం' కధ లో ను, అదే మాదిరి " " మానవుడి నై అవతరిస్తా " అనే కవిత , తో మీ కానమోకు కథావచనం శ్రోతలకు , చివుకుల హరిప్రియ, హెచ్ .రవీంద్ర ,ల కధ, కవిత, లను వినిపిస్తూ.....
" కోవిడ్-19 , రాజకీ యార్థిక పరిచయం " కానమోకు కధా వచనం !. 18.04.2020 49:59
మనీష్ ఆజాద్ చే విరచిత హిందీ వ్యాసాన్ని ఎన్.వేణుగోపాల్ ,కోవిడ్ 19 రాజకీయార్థిక పరిచయం గా తెనిగిస్తే ,మీ కానమోకు ,కథావచనం శ్రోతలకు వినిపిస్తూ...
" నేటి సీతాయణం " వెంకటగిరి లో ఆధునిక సీత !. " చెన్న మనేని వారి కోడలు జర్మనీ మహిళా వైద్య నిపుణురాలు 17.04.2020 10:33
" నేటి సీతాయణం " నెల్లూరు జిల్లా వెంకటగిరి మహిళా సీత దైతే , చెన్నమనేని వారి కోడలు జర్మన్ మహిళ ,వైద్య నిపుణురాలు గా భారత దేశానికి కరోనా విషయంగా ఇస్తున్న అనుభవ సూచనలు ఏమిటంటే " త్రిబుల్ T " Trace, Test, Treatment , పాటించి కరోనాను ఎదిరించ వచ్చు అని చెప్పగా ,ఆ వివరాలను మీ కానమోకు వినిపిస్తూ.....
" పేద యాత్ర " అనే కవిత , " వలస జీవి నడక యాతన " అనే పరిజ్ఞా న హిత బాండం , - కానమోకు కధా వచనం!. 17.04.2020 7:40
" పేద యాత్ర " అనే కవితను డా. కనకమేడల దేవేంద్ర , వ్రాయగా రామోజీ ఫౌండేషన్ ప్రధమ బహుమతి నివ్వగా, " వలస జీవి నడక యాతన" అనే సమాచారాన్ని మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం ద్వారా మీ కానమోకు కథావచనం విని పిస్తూ.....
" 131 వ జయంతి చార్లీ చాప్లిన్ కి , రెడ్ శాల్యూట్స్ " కానమోకు కధా వచనం!. 16.04.2020 11:42
మహా మానవతా వాది సర్ చార్లీ చాప్లిన్ కి 131 వ జయంతి సందర్భంగా , కానమోకు కథావచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా, నివాళులతో గూడిన ,ఆ కమ్యూనిస్టు కు రెడ్ సెల్యూట్ , చేస్తూ ,ఆయన జీవితాన్ని స్ఫురణకు తెచ్చుకుంటు మీ కానమోకు ....
" భయం -అవగాహన " కానమోకు కధా వచనం ! 16.04.2020 4:59
భయపడుతూ జీవించడమంటే అనేక సార్లు మరణించడమే !.భయాన్ని వదిలిన నాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదం గా ఆనందం గాను గడపగలం! అని కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తూ....
" విదేశాల్లోని భారత సంతతి ఆందోళన పై శ్రద్ధ "- కానమోకు కదావచం !. 15.04.2020 7:57
కరోనా నుంచి రక్షణ ఎలా?. అని భారత సంతతి గురించిన ఆందోళన మనకు ఉంది. దానిగురించి టి.పి. శ్రీనివాసన్ , పలు దేశాల్లో మాజీ రాయబారి గా పనిచేసి న ట్టి , ఆయన అనుభవ సూచనలు ను, వినిపిస్తూ మీ కానమోకు....
" కరోనా కొమ్ముల్ని వంచి 4 దేశాలు ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి!" -కానమోకు కధా వచనం . 14.04.2020 13:44
కరోనా పై పోరులో, జర్మనీ, తైవాన్ ,న్యూజిల్యాండ్, గీస్ , దేశాలు నేడు ప్రపంచంలోని పలు దేశాలకు ఆదర్శం గా నిలిచాయి!. ఆ వివరాలు ను కానమోకు కధా వచన ద్వారా వినండి!.
" పరి జ్ఞాన హిత బాండం - విశేషాల మాలిక " కానమోకు కధా వచనం!. 13.04.2020 20:06
కరోనా కరాళ మృత్యు హేల !. వేళ లో , మోహనవచనం పరిజ్ఞా న హిత బాండం , ద్వారా కాన మోకు కధా వచనం శ్రోతలకు ,విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి వినిపిస్తున్న అంశాలు ఇవి.....
" మలయ సమీరం " కధా రచయిత , మోహన్. కానమోకు కధా వచనం !. 12.04.2020 24:53
" సమీర ఈజ్ ద బెస్ట్ టీచర్ హు టీచేస్ ఫ్రమ్ ద హార్ట్ , నాట్ ఫ్రమ్ ద బుక్స్ " అని ఆమె గురించి వినడమే గాని , ప్రత్యక్షంగా చూచిన లావణ్య , సమీర ఎంతటి ఉన్నత వ్యక్తో అని అర్ధం చేసుకున్న తర్వాత మనసులో నే సమీర కు రెస్పెక్ట్ సెల్యూట్ చేసింది!..... "మలయ సమీరం " అనే ఈ కధ ను మీరు కానమోకు కధా వచనం లో వింటే తెలుస్తుంది సుమా !.
" సారీ ( Severe Accute Respiratory Ill ness) కానమోకు కధా వచనం 11.04.2020 6:12
ఎలాటి జాతీయ, అంతర్జాతీయ, ప్రయాణాలు చేయక పోయినా, కరోనా బాధితుల తో సంబంధం లేకపోయినా ఈ కరోనా బారీన పడుతున్నారట! సారీ ( Severe Accute Respiratory Ill ness) అట జాగ్రత్త సుమా!.
" 193వ జయంతి మహాత్మా జ్యోతీ రావు పూలే మహాశయుడి కి జోహార్లు ! జేజేలు!" కానమోకు కధా వచనం. 11.04.2020 14:19
మహాత్మా జ్యోతీ రావు పూలే ను ఆయన 193 వ జన్మ దినోత్సవం ఏప్రిల్ 11 న, స్మరించుకుంటు, ఆయన జీవిత విశేషాలను ,కానమోకు కధా వచనం, మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం శ్రోతలకు వినిపిస్తూ......
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS