Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Touch A Life Foundation
Categorie
Website van de podcast
Nieuwste aflevering
8 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
నేను చదవాలనుకున్న వాటినే కథలుగా రాశాను! | Ramesh Karthik Naik | CHARCHA With Real Leader - 14 24.07.2026 31:58
"నేను చదవాలనుకున్న పుస్తకం ఎక్కడా కనిపించలేదు… అందుకే దాన్ని నేనే రాశాను…" అంటూ బంజారా సంస్కృతిని, జీవన విధానాన్ని తన రచనల ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.. రమేశ్ కార్తీక్ నాయక్! తమ ప్రజల జీవితం, సంస్కృతి గురించి చెప్పే కథలు చాలా తక్కువగా కనిపించడంతో... వాటిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రచనలు చేయడం ప్రారంభించారు. తండాల్లోని జీవితం, అక్కడి మనుషులు, వారి అనుభవాలను తన కథల ద్వారా పాఠకులకు...
Rich Mindset Vs Poor Mindset | Smart Money Mindset Telugu - 2 23.07.2026 11:18
ఒకే జీతం, ఒకే ఉద్యోగం... అయినా కొందరు ధనవంతులు అవుతారు, మరికొందరు అదే స్థాయిలో ఉండిపోతారు.. ఎందుకు? అదృష్టమా? తెలివితేటలా? లేక ఇంకేదైనా కారణమా? ఈ ప్రశ్నకు సమాధానం వారి ఆలోచనా విధానంలోనే ఉంటుందట! మనలో చాలామంది చేసే చిన్న చిన్న ఆర్థిక పొరపాట్లు ఏమిటి? కొందరు అవకాశాలను చూసి ముందుకు వెళ్తే, మరికొందరు వెనుకడుగు వేస్తుంటారు.. ఎందుకు? ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో వి...
రచయిత రాసే ప్రతి పదం సమాజ శ్రేయస్సును ఆశించాలి! | మన రచయితలు | Dr. Vivekananda Murthy | Season - 2 | Episode - 6 23.07.2026 30:20
వైద్యుడిగా ప్రాణాలు కాపాడుతున్నారు… రచయితగా మనసులను తాకుతున్నారు… విదేశాల్లో ఉంటూ కూడా తెలుగు భాషకు జీవితాన్నే అంకితం చేశారు… డా. వివేకానంద మూర్తి గారు! పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ వరకు సాగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వైద్యుడిగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకుంటూనే, రచయితగా, నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. యూకేలో స్థ...
ముఖంపై తెల్లమచ్చలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 106 22.07.2026 31:10
చర్మంపై తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయా? ముఖం, మెడ, చేతులు వంటి భాగాల్లో ఏర్పడే ఈ మచ్చలు చాలామందిలో ఆందోళనను కలిగిస్తుంటాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఫంగల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపాలు, చర్మ గాయాలు, జన్యుపరమైన కారణాలు లేదా విటిలిగో వంటి సమస్యలతో వీటికి సంబంధం ఉందా? ఆయుర్వేదం ప్రకారం... మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కోపం, భయం వంటి అంశాలు కూడా దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి తెల్ల మచ్చ...
పేదరికం నుండి పేద విద్యార్థులకు తోడుగా... | Maheshwaram Lakesh | CHARCHA With Real Leader - 13 21.07.2026 19:14
ఒకప్పుడు రోజూవారి కూలీ కోసం పనిచేసిన ఓ విద్యార్థి... ఇప్పుడు వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు! పేదరికం, కుటుంబ కష్టాలు, చదువుకోడానికి చేసిన పోరాటం... ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన మహేశ్వరం లకేష్ గారు, ఇప్పుడు Manu's HHOC ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి తోడుగా నిలుస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలు తనలోని సేవా గుణాన్ని ఎలా పెంచాయి? చదువు జీవితాన్ని ఎలా మార్...
చిన్నప్పుడు చుట్టాలు వస్తే చాలా సంతోషంగా ఉండేది! | మా ఊరు - 78 20.07.2026 28:24
అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు... వేసవి సెలవుల సందడి... చిన్నప్పుడు గడిపిన ఆ రోజులు ఎప్పటికీ ప్రత్యేకమే! అంటూ… ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో స్వరూప గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. విశాఖపట్నంలో జన్మించి, మహారాష్ట్రలో పెరిగి, హైదరాబాద్‌లో చదువుకుని, తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె... చిన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మల ఊరిలో గడిపిన రోజులు, ఆ అనుభవాలు తన జీవితంపై చూపిన ప్రభావం, అప్పట...
తల్లిదండ్రులు - పిల్లలు... మధ్య దూరం ఎందుకు? | Shazia Parveen | Health Talk 20.07.2026 28:52
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినడం లేదు? కుటుంబాల మధ్య దూరాలు ఎందుకు పెరుగుతున్నాయి? Generation Gap నిజంగానే సమస్యా... లేక ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే కారణమా? ప్రముఖ Psychologist, Global Trainer, Researcher షాజియా పర్వీన్ గారు ఈ అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్తూ… సమస్యల గురించి బాధపడటం కంటే వాటికి పరిష్కారాలు వెతకాలని, పిల్లలకు...
సేవతోనే జీవితానికి సార్థకత | CHARCHA With Real Leader | Namratha Datta 18.07.2026 47:42
కెరీర్ గ్రోత్‌తో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందాలంటే ఏం చెయ్యాలి? 28 ఏళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేసిన నమ్రతా దత్తా గారు, ఉద్యోగ జీవితంలో వచ్చిన ఒత్తిడి, టెన్షన్ మధ్య ధ్యాన్ ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేశారు. ఆ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, తన ఆలోచనలు మరియు జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలను ఈ పాడ్కాస్ట్‌లో మనతో పంచ...
"ఆమె" కు అండగా సయోధ్య హోమ్ | CHARCHA With Real Leader - 12 17.07.2026 26:54
"ఇక నా జీవితం ఇంతే" అని అనుకున్న ఎంతోమంది మహిళలకు... "ఇంకా జీవితం ఉంది" అనే నమ్మకాన్ని అందిస్తోంది ‘సయోధ్య హోమ్’…! గృహహింస, కుటుంబ సమస్యలు, అవమానాలు.. ఇలాంటి ఎన్నో కష్టాలతో జీవితంపై నమ్మకం కోల్పోతున్న మహిళలకు అండగా నిలుస్తూ... మళ్లీ ధైర్యంగా జీవించేలా చేస్తోంది… 2010 నుంచి ఎంతో మంది మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ… ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర...
ఒక్క అడుగు... మీ ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది! | Smart Money Mindset Telugu - 1 16.07.2026 14:52
సంపాదన అంటే కేవలం డబ్బు చేతికి రావడం మాత్రమే కాదు... "నేను కూడా చేయగలను" అనే ధైర్యం రావడం, మన అవసరాలకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలగడం…! ఈరోజుల్లో చాలామంది మహిళలు, గృహిణులు, కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు తమ సమయాన్ని, శ్రమను అందరి కోసం కేటాయిస్తుంటారు. కానీ తమ సొంత ఆదాయం గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక ఆగిపోతారు. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ S...
సమాజ సేవతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది! | స్ఫూర్తి కిరణాలు | Arun Daniel | Youngistaan Foundation 16.07.2026 22:34
యువతలో సేవాభావం పెరిగితే… సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని నమ్మిన వ్యక్తి... అరుణ్ డేనియల్ గారు! ఆ ఆలోచనతోనే Youngistaan Foundationను ప్రారంభించి, వేలాది మంది యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. విద్య, మహిళా సాధికారత, ఆకలి నివారణ, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో ఆయన టీం సేవలందిస్తోంది. అసలు ఈ సేవా ప్రయాణం ఎలా మొదలైంది? Youngistaan అనే పేరు వె...
మనసుని తాకే రోజూవారీ కథలు... దీప్తి ముచ్చట్లు | మన రచయితలు | Season - 2 | Episode - 5 16.07.2026 37:13
మధురవాణి... విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయితలకు ఒక వేదిక... ఆ వేదిక వెనుక ఉన్న రచయిత్రి... దీప్తి పెండ్యాల గారు! ఐటీ రంగంలో పనిచేస్తూనే రచనా రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తూ, మనోవైరి, బతుకుతోవలు, నడిచే దారుల్లో, ముసుగు వంటి రచనలతో ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేస్తున్నారు. ప్రవాస జీవితాన్ని, వ్యక్తిగత అనుభవాలను, తన చుట్టూ ఉన్న మనుషుల కథలను రచనలుగా మలుచుకుంటూ 'దీప్తి ముచ్చట్లు' పేరుతో ఆమె సాగించి...
మంగు మచ్చలను మాయం చేసే ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 105 15.07.2026 29:26
ముఖంపై నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడం లేదా? ఎన్ని క్రీములు వాడినా, ఎన్ని ట్రీట్‌మెంట్లు చేయించుకున్నా కొందరిలో ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్ వల్ల అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ఎండలో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు దీనిపై ఎంత ప్రభావం చూపుతాయి? పిగ్మెంటేషన్‌ను తగ్గించుకోవడానికి...
బాలకార్మికుడి నుండి బాలల భవిష్యత్తుకి భరోసాగా! | CHARCHA With Real Leader - 11 14.07.2026 25:54
చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ మోయాల్సిన చేతులు... కుటుంబం కోసం బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది! చిన్న వయసులోనే బాల కార్మికుడిగా పనిచేసిన సంతోష్ గారు... తాను అనుభవించిన కష్టాలు మరో చిన్నారికి రాకూడదనే సంకల్పంతో People Helping Children సంస్థను స్థాపించారు. ఇప్పుడు వేలాది మంది వాలంటీర్లతో కలిసి బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఎంతో మంది చిన్నారుల జీవితా...
మా పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండు ఉమ్మడి కుటుంబాలే! | మా ఊరు - 77 13.07.2026 29:24
కలలు లక్ష్యాన్ని నిర్మిస్తాయి.. కష్టం దానికి మార్గాన్ని చూపుతుంది... పట్టుదల విజయాన్ని సొంతం చేస్తుంది! అంటూ… ఎన్నో తన జీవిత అనుభవాలను, వారి ఊరి ముచ్చట్లను మనతో పంచుకున్నారు ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లీనా గారు! హైదరాబాద్‌లోని ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగి, చిన్నప్పుడే ETV స్టూడియోలో అడుగుపెట్టి, యాంకరింగ్, డబ్బింగ్, రేడియో జాకీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె మీ...
20-20-20 రూల్ తో మీ కళ్ళు సేఫ్! | Dr. Anjani Pratap | Health Talk 13.07.2026 22:14
మీ కళ్లను పరీక్ష చేయించుకుని ఎన్ని రోజులైంది? ప్రస్తుత రోజుల్లో మనం ప్రతిరోజూ ఎక్కువ సమయం మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్లతోనే గడుపుతున్నాం. కాబట్టి.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. పిల్లల్లో పెరుగుతున్న మయోపియా, Screen Time ప్రభావం, Cataract, LASIK Surgery, కంటి ఆరోగ్యానికి అవసరమైన జాగ్రత్తలు, 20-20-20 Rule ప్రాముఖ్యత వంటి ఎన్నో కీలక విషయాలను ఈ Health Talks పాడ్కాస్ట్ లో మనతో పంచుకున...
ఒక జ్ఞాపకం .. ఒక ఆలోచన .. ఇప్పుడు ఎన్నో జీవితాల్లో వెలుగు నింపుతోంది ! | CHARCHA With Real Leader - 10 10.07.2026 26:14
ఒక జ్ఞాపకం… ఒక ఆలోచనగా మారింది... ఆ ఆలోచనే ఇప్పుడు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది! తండ్రిని కోల్పోయిన తర్వాత తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయిన సమయంలో... ఆయన జ్ఞాపకార్థం ఒక అనాథాశ్రమానికి వెళ్లారు నీలేష్ గారు. అక్కడి పిల్లల చిరునవ్వులు, వాళ్లతో గడిపిన కొన్ని క్షణాలు ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. జీవితంలో ఎదురైన బాధను తనలోనే ఉంచుకోకుండా... మరొకరి జీవితంలో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నారు. అద...
ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు 09.07.2026 21:22
చెత్తను చూస్తే సమస్య కనిపిస్తుంది... వేరు చేస్తేనే పరిష్కారం తెలుస్తుంది! అంటూ... పర్యావరణ పరిరక్షణ కోసం క్లీన్-అప్ డ్రైవ్స్, జీరో-వేస్ట్ కార్యక్రమాలు, ఎకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న VISVA Sustainable Foundation వ్యవస్థాపకులు వినయ్ గారు ఈ వారం మన 'స్ఫూర్తి కిరణాలు' పాడ్కాస్ట్ లో! అసలు చెత్తను వేరు చేయడం ఎందుకు అంత ముఖ్యం? చిన్న చిన్న అలవాట్లు పర్యావరణంపై ఎలాంట...
ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4 09.07.2026 33:21
న్యూజిలాండ్‌లో తొలి తెలుగు పుస్తకం… అక్కడి తెలుగు సాహిత్యానికి సరికొత్త గుర్తింపు… సతీష్ కుమార్ గొల్లపూడి గారు! విదేశాల్లో ఉంటూనే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆయన. కవిత్వాన్ని తన భావాలకు వేదికగా చేసుకుని, సాహితీ వర్షిత, న్యూజిలాండ్ నానీలు, జీవితం గీసిన చిత్రాలు, ప్రవాస ప్రతిబింబాలు వంటి రచనలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. న్యూజిలాండ్ నుంచి తొలి తెలుగు పుస్తకాన్ని ప్రచ...
స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9 07.07.2026 22:10
కొన్ని పెయింటింగ్స్... చూడగానే నచ్చుతాయి. మరికొన్ని పెయింటింగ్స్... చూసిన తర్వాత మనల్ని మార్చేస్తాయి! అలాంటి ఆలోచింపజేసే స్ట్రీట్ ఆర్ట్‌తో పిల్లల భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాజంలో అవగాహన కల్పిస్తూ... కళను సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చారు… స్వాతి & విజయ్ గార్లు! పిల్లలు భిక్షాటన చేస్తున్న దాని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి? మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలా పెద్ద సమస్...
పిల్లల మాటలు ఆలస్యం.. నిజాలు అపోహలు! | Dr. Vishnupriya | Health Talk 06.07.2026 17:36
పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం చేస్తున్నారా?అది కేవలం Speech Delayనా... లేక Autismకి సంకేతమా? చాలా మంది తల్లిదండ్రులను అయోమయంలో పడేసే ఈ ప్రశ్నలకు మంచి సమాధానాలు ఈ పాడ్కాస్ట్ మీకోసం. Speech Delay, Autism మధ్య తేడా ఏమిటి? పిల్లలను ఎప్పుడు డాక్టర్‌కు చూపించాలి? మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం వల్ల మాటలు ఆలస్యమవుతాయా? Speech Therapy గురించి ఉన్న అపోహలు ఏమిటి? ADHD, Tongue Tie వంటి ఎన్నో అంశాలపై విలువైన సమాచార...
పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8 03.07.2026 29:42
వీరి ATM... డబ్బు ఇవ్వదు… కానీ, కడుపు నిండా అన్నం పెడుతుంది! కరోనా సమయంలో వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న వేళ... ఎంతమందికైనా, ఎప్పుడైనా, ఎంతైనా ఆహారం అందించేలా "Rice ATM" అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు… రామదాస్ పట్టి గారు! ఈ Rice ATM ద్వారా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంతో పాటు... ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడ...
తూర్పు తీరంలో తెలుగు రేఖలు | మన రచయితలు | Season - 2 | Episode - 3 02.07.2026 36:32
ఉద్యోగం ఆయనకు ఉపాధి కల్పించింది... తెలుగు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది! ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లినా... తెలుగు భాషను మాత్రం ఎప్పుడూ వదల్లేదు మల్లికేశ్వర రావు గారు. న్యూజిలాండ్‌లో మొదలైన ఆయన రచనా ప్రయాణం... ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ చేరువైంది. ఉద్యోగం చేస్తూనే... తెలుగులో కథలు రాయడం, కవితలు రాయడం, పత్రికలు నిర్వహించడం, వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ రూపంలో...
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7 30.06.2026 30:52
"సేవ చేయడం... ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత!" ఈ ఒక్క విషయాన్ని నమ్ముకొని తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేశారు కృష్ణమోహన్ గారు! పిల్లలు తమకు నచ్చిన కెరీర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? యువత సేవా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి? సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే అసలు మనమేం చేయాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలని, జీవితంలో...
"ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta 30.06.2026 39:14
ఆనందంగా ఉండటమే అసలైన విజయం.. రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటే జీవితం కూడా ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది… అంటూ ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు ఈ వారం విజేత కార్యక్రమంలో Anweshi గారు! హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె... నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకొని, భారతీయ సాంస్కృతిక కళలపై మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత IT రంగంలో ఉద్యోగం కోసం UK, Europe వెళ్లినా... తన మూలాలను మాత్రం...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds