Touch A Life Foundation

TALRadio Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Touch A Life Foundation

Categorie

Arts

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

8 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula 08.10.2026

రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది! Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప...

సంగీతం గెలిపించిన జీవితం | అంతరంగాలు - 08 06.10.2026

సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది! చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ...

విశాఖపట్టణం లో మా స్కూల్ చాలా బావుంటుంది ! | మా ఊరు - 83 05.10.2026

మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి! అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్‌లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావర...

చిన్న పిల్లల బోన్ హెల్త్ - తప్పక తెలుసుకోవలిసిన విషయాలు ! | Health Talk 05.10.2026

పిల్లల ఎముకల విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం! పిల్లల ఎముకలు పెద్దవాళ్ల ఎముకలకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అవి ఎదుగుదల దశలో ఉండటంతో గాయాలను తట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆడుకునే సమయంలో పడిపోవడం, చేతులకు గాయాలు అవ్వడం, ఫ్రాక్చర్ లాంటి సందర్భాల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం అవసరం. ముఖ్యంగా పిల్లలను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని లాగడం వల్ల వచ్చే సమస్యల...

24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11 01.10.2026

జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి...

అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4 01.10.2026

10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు.. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు! చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వా...

చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు 01.10.2026

హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే? ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pedi...

గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07 29.09.2026

గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. క...

అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10 24.09.2026

లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగ...

మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6 22.09.2026

‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపై...

సెలవులు రాగానే ఊరికి వెళ్ళడం చాలా బాగుండేది! | Mr. Shakeel Basha | మా ఊరు - 82 21.09.2026

ఎన్ని సంవత్సరాలు గడిచినా… మన ఊరికి వెళ్లినప్పుడు కలిగే ఆ ఆనందం మాత్రం అస్సలు మారదు! చిన్నప్పుడు నాన్నతో కలిసి ఊరికి వెళ్లిన రోజులు, బస్సులు మారుతూ ప్రయాణం చేసిన సందర్భాలు, కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన జ్ఞాపకాలు… ఇప్పటికీ మన మనసులో అలాగే ఉంటాయి అంటూ… తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. శకీల్ బాషా గారు! ఊరికి వెళ్లాలంటే అప్పట్లో బస్సులు మారి, కొంత ద...

మీరు కూడా ధనవంతులు కావచ్చు! | Smart Money Mindset Telugu - 9 17.09.2026

డబ్బు సంపాదించడానికి.. మనం ఎంత కష్టపడుతున్నామన్నది కాదు..మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే చాలా ముఖ్యం! మనలో చాలామందికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలా డబ్బు సంపాదించాలి, జీవితంలో ముందుకు వెళ్లాలి, మనకు నచ్చిన పనిని చేయాలి అని అనుకుంటుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ఆలోచనలు, మనపై మనకున్న నమ్మకం, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఎంత ముఖ్యమో చాలాసార్లు ఆలోచించం. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి...

బతుకు నేర్పిన పాఠాలు... కలం చెప్పిన కథలు! | అట్టెం దత్తయ్య | మన రచయితలు | Season - 2 | Episode - 13 17.09.2026

చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో.. కర్ర పట్టుకుని మేకలను కాసేవారు! కానీ.. చదువుకోవాలనే పట్టుదల మాత్రం ఆయనను అక్కడే ఆగనివ్వలేదు! కామారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన డా. అట్టెం దత్తయ్య గారు చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు గొర్రెల కాపరిగా ఉంటూ.. అడవిలో గొర్రెలను కాస్తూనే పుస్తకాలు చదివారు. ఒక స్నేహితుడు వేసిన కొన్ని ప్రశ్నలు ఆయన జీవితాన్నే మార...

యూత్ పవర్ తో సేవకు కొత్త దారి! | Youth For Seva | స్ఫూర్తి కిరణాలు 17.09.2026

కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తాం… ఉద్యోగం కోసం సమయాన్ని కేటాయిస్తాం… మరి సమాజం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? అని ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా పని, బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా.. మన దగ్గర ఉన్న సమయం, నైపుణ్యం, అనుభవంతో సమాజానికి ఏదో ఒకటి చేయవచ్చని నిరూపిస్తోంది… ‘Youth for Seva’! 2007లో ప్రారంభమైన Youth for Seva.. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 46 నగరాల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, జీవనోపాధి వంటి రంగా...

వృద్ధుల హక్కులకు తోడుగా.. | Ramachandraiah | అంతరంగాలు - 5 15.09.2026

ఒక మంచి ఆలోచన… ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు! వృద్ధులకు అండగా నిలవాలి.. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.. సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి.. అని ఎప్పుడూ ఆలోచిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు… Telangana senior citizens confederation అధ్యక్షులు రామచంద్రయ్య గారు! సీనియర్ సిటిజన్ల కోసం ఆయన చేస్తున్న సేవలు ఎంతోమందికి అండగా నిలిచాయి. కరోనా సమయంలోనూ పేద కుటుంబాలకు సహాయం చేయడంతో పాటు...

ఒక్క క్షణం ఆగి … ఎవరితో అయినా మాట్లాడండి! | Kolavennu Naga Gaytri | Suicide Prevention Month Special | Health Talk 14.09.2026

మనసులో ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పాలో అర్థం కావట్లేదా? ఎవరైనా తమ సమస్యలను మీతో పంచుకుంటున్నపుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడి, నిరాశ, సంబంధాల్లో వచ్చే మార్పులు, చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిళ్లు… ఇవన్నీ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇలా రోజురోజుకీ మనలో నిండిపోతున్న భావాలను బయటకు చెప్పకుండా ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు అంటున్నారు...

కెరీర్ లో గ్రోత్ కోసం గోల్డెన్ రూల్స్! | Smart Money Mindset Telugu - 8 10.09.2026

ఉద్యోగం ఉంది.. జీతం వస్తోంది.. అయినా మనం అనుకున్న స్థాయికి చేరగలుగుతున్నామా? చాలామంది తమ కెరీర్‌లో ఎదుగుదల రాకపోతే.. బాస్‌ను, కంపెనీని లేదా ఉద్యోగాన్ని కారణంగా చెబుతుంటారు. కానీ మన కెరీర్ దిశను మార్చేది ఎవరు? మనమే! మన స్కిల్స్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, నెట్‌వర్క్.. వీటిపై మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటూ.. కెరీర్‌లో మొదటి 5–7 ఏళ్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఉద...

పేదల కంటికి వెలుగు! | Retinova Foundation | స్ఫూర్తి కిరణాలు 10.09.2026

కంటి చూపు తగ్గుతున్నా.. చాలామంది వెంటనే కంటి పరీక్ష చేయించుకోరు! అవగాహన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటం, సరైన అవకాశాలు ఉండకపోవడం.. ఇలా ఎన్నో కారణాలతో ఎంతో మంది సరైన సమయంలో చికిత్స పొందలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో.. 2019లో కంటి పరీక్షలతో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది… Retinova Foundation! ఈ సంస్థ కంటి సమస్యల...

మట్టి మనుషుల జీవితాలే ఈయన కథల్లో కనిపిస్తాయి! | Sheelam Bhadraiah | మన రచయితలు | Season - 2 | Episode - 12 10.09.2026

చిన్నప్పటి నుంచే తెలుగు పుస్తకాల మధ్య పెరిగారు… ఆ పుస్తకాలే ఆయనలో సాహిత్యంపై ప్రేమను పెంచాయి! సూర్యాపేట జిల్లా, అన్నారం గ్రామానికి చెందిన శీలం భద్రయ్య గారు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. కానీ.. తెలుగు భాషపై ఉన్న ప్రేమతో కథలు, కవితలు, నవలలు రాస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు జరిగిన ఓ వ్యాసరచన పోటీ.. ఆయనలోని రచయితను బయటకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి...

మన శరీరానికి సరిపడా ప్రోటీన్ తీసుకుంటున్నామా? | Nutrition Week Special 08.09.2026

ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కి వెళ్లేవాళ్ల కోసం మాత్రమే అనుకుంటున్నారా? నిజానికి మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ చాలా ముఖ్యమైంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం, మన వయసు, జీవనశైలికి అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నింటి గురించి ప్రముఖ Nutritionist ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ఆరోగ్యకరమైన Meal Plate ఎలా ఉండాలి? రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను ఎల...

ఓవర్ థింకింగ్, నెగెటివ్ ఆలోచనలు, భయం... ఇక లేనట్టే! | Sirisha Meda | Special Interview 07.09.2026

మన మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది… ఆ ఆలోచనకు మనమే భయాన్ని జోడిస్తాం… ఆ తర్వాత అదే ఆలోచనను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ… మనమే Overthinkingలోకి వెళ్లిపోతుంటాం! అయితే… ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ భయపడాల్సిందేనా? Negative Thoughts‌ను ఎలా ఎదుర్కోవాలి? Overthinking‌ను తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మన ఆలోచనలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు? ఇందుకు ఉపయోగపడే ఒక ఆసక్తికరమైన విధానం NLP – Neuro-Linguistic Program...

బాహ్య ఆరోగ్యం - భాష ఆరోగ్యం | Dr. G. V. Poornachand | అంతరంగాలు - 4 07.09.2026

మన ఆహారం… మన భాష… మన సంస్కృతి! వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటూ… ఈ వారం “అంతరంగాలు” కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఆహార చరిత్ర పరిశోధకుడు డా. జి.వి. పూర్ణచంద్ గారు మన ఆహార సంస్కృతి గురించి, మారుతున్న ఆహారపు అలవాట్ల గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు. మన పూర్వీకుల ఆహారంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయి? తెలుగు భా...

డబ్బును ఆకర్షించడానికి జపనీస్ టెక్నిక్స్! | Smart Money Mindset Telugu - 7 03.09.2026

డబ్బు సంపాదించేటప్పుడు సంతోషంగా ఉండాలి… ఖర్చు చేసేటప్పుడు కృతజ్ఞతగా ఉండాలి! - ఇదే జపనీస్ Happy Money ఫిలాసఫీ! ఎంత సంపాదించినా సరిపోకపోవడం, డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం, మనీ విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురవడం… ఇలా మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మన ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటూ…డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించడం, ఖర్చు చేసేటప్పుడు కూడా కృతజ్...

చదువుతో పాటు సేవ... క్యాన్సర్ బాధితులకు అండగా విద్యార్థులు! | Sreenidhi Cancer Foundation | స్ఫూర్తి కిరణాలు 03.09.2026

చదువు, కాలేజ్, అసైన్‌మెంట్స్, పరీక్షలు… ఇలా విద్యార్థి జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉన్నా, సమాజం కోసం కూడా ఏదైనా చేయాలని ఆలోచించారు కొంత మంది విద్యార్థులు. ఆ ఆలోచనే.. 2016లో Sreenidhi Cancer Foundationగా మారింది. అప్పటి నుంచి క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలుస్తూ, యువతను సేవా కార్యక్రమాల్లో భాగం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు…! బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్స్‌, స్టెమ్‌ సెల్‌ డొనేషన్‌, క్యాన్సర...

చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు! | Ramya Deepika | మా ఊరు - 81 31.08.2026

మన ఊరు మారొచ్చు… మనం దూరంగా వెళ్లొచ్చు… కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి! అలాంటి మధురమైన జ్ఞాపకాలతో పాటు… ఎన్నో విజయాలు, బాధ్యతలు, అనుభవాలతో సాగిన తన జీవిత ప్రయాణాన్ని ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు రమ్య దీపిక గారు. గుంటూరులో మొదలైన బాల్యం, స్నేహితులతో కలిసి పెరిగిన రోజులు, చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత… మొదటిసారి తన కుటుంబంలో ఉద్యోగం చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్...

Luister naar de podcast TALRadio Telugu in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds