Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Autore
Touch A Life Foundation
Categoria
Sito del podcast
Ultimo episodio
10 lug 2026
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
ప్రతి రచనకు ఓ ప్రయోజనం ఉండాలి! తలుపూరు వెంకట రామకృష్ణ - Part 1 | మన రచయితలు - 29 31.08.2023 28:43
బాలసాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు… విజ్ఞానం కూడా. బాలసాహిత్యం పిల్లలకు మాత్రమే కాదు… పిల్లల గురించి ఆలోచించే, వారి పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిదీ కూడా! ఈ విషయం తెలిసినవారు కాబట్టే తలుపూరు వెంకట రామకృష్ణ అరుదైన బాలసాహిత్యాన్ని సృజిస్తున్నారు. కథలు, వైజ్ఞానిక వ్యాసాలు, గేయాల ద్వారా తన అనుకున్న ప్రయోజనాన్ని సాధిస్తున్నారు. సాహిత్యం పట్ల నిబద్ధత, స్పష్టమైన అభిప్రాయాలు ఉన్న తలుపూరి రామకృష్ణగారితో ఈ...
Inspiring Journey of Rajesh Dadu - Dadu’s Sweets | LifeMantra - 19 30.08.2023 14:40
దాదూస్ ఇప్పుడు ఓ సుపరిచితమైన పేరు. మరీ ముఖ్యంగా తెలుగువారికి తెలిసిన ప్రముఖ స్వీట్ షాప్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఓ చిన్న దుకాణంగా మొదలైన దాదూస్, కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎదిగిన వైనం వినితీరాల్సిందే. దాన్ని ఈ స్థాయికి తెచ్చిన రాజేష్ దాదు గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Exactly three decades ago, Dadu's made a humble beginning in a 800 sq. ft. small shop. Today, Dadu's is a foo...
సంతోషం పంచుకుంటే పెరుగుతుంది 29.08.2023 4:19
బాధను పంచుకుంటే సగం అవుతుందని అంటారు. కానీ సంతోషం మాత్రం తప్పకుండా రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని చెప్పే ఓ చిన్న కథ ఇది. కొందరు దీన్ని విని ఉండవచ్చు. కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే కథ. తెలియనివారిని ఆశ్చర్యపరిచే గాథ. నమ్మడం. ఈ కథను విన్నాక మనం ఇతరులతో ప్రవర్తించే తీరు మారుతుంది, జీవితాన్ని చూసే పద్ధతి మారుతుంది. A grief in our heart would be reduced, if we share it with others and gets consoled. H...
చిన్నారుల కోసం పెద్ద మనసు | స్త్రీశక్తి 28.08.2023 35:37
ఏదో ఒక రంగంలో ఎలాగొలా ఉపాధి అనే పరిమితులను మహిళలు ఎప్పుడో దాటేశారు. రాణించేందుకు అనూహ్యమైన రంగాలెన్నింటినో ఎంచుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే హిమబిందు. చిన్నారుల ఆలనాపాలనా, శిక్షణ కోసం బిజీ బీ అనే సంస్థను స్థాపించారు. బిందుగారి ఆసక్తిదాయకమైన ప్రయాణం ఈ వారం స్త్రీశక్తిలో విందాం. Women aren’t now just satisfied with financial success and stability. They are stepping into unexpected and challenging ar...
Know How Your Gut’s Feeling! | Know Your Plate - 14 25.08.2023 25:34
జీర్ణాశయానిది మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకశక్తికి అండగా నిలుస్తుంది. ఆహారంలోని పోషకాలను తీసుకుని, శరీరానికి అందించడంలోనూ దానికి ముఖ్యపాత్రే. ఇక జీర్ణాశయంలో పేగులదే కీలకమైన భాగం. మనకు ఆరోగ్యాన్ని అందించే ఆ పేగులను సురక్షితంగా ఉంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద చాలా అమూల్యమైన సలహాలు అందిస్తున్నారు. Digestive system plays a key part in our heal...
అక్షరాన్ని తొడుక్కుని అడుగులు ముందుకేస్తున్నా! | తగుళ్ల గోపాల్ | మన రచయితలు - 28 24.08.2023 39:18
కష్టం ఎదురైతే కొందరు అమ్మను తల్చుకుంటారు. కొందరు అమ్మలాంటి అక్షరంలో కూడా సాంత్వన పొందుతారు. అలాంటి ఓ అరుదైన వ్యక్తి తగుళ్ల గోపాల్. తను చూసిన జీవితాన్ని, ఎదుర్కొన్న అనుభవాలను కవితగా మార్చిన అనువాదకుడు. తన వాక్యాలతో నేరుగా మన గుండెల్లోకి దూసుకుపోగలడు. అందుకే కేంద్ర సాహిత్య అకాడెమీ లాంటి అవార్డులతో పాటు అంతులేని అభిమానాన్ని పొందారు. ఈసారి మన రచయితలు కార్యక్రమంలో తనతో ముఖాముఖి. Tagulla Gopal come from...
అందరికీ రక్షణ అర్హులకు ఉపాధి.. రవీంద్ర కిషోర్ సిన్హా 23.08.2023 10:53
రవీంద్ర కిషోర్ ఓ అరుదైన వ్యాపారవేత్త. రక్షణ అవసరమయ్యేవారికి రక్షణ. ఉపాధి కావల్సినవారికి ఉపాధి అందిస్తూ… తన SIS సంస్థ ద్వారా అనూహ్యమైన విజయాన్ని సాధించారు. మన దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ తన సత్తా చాటారు. ఇంతకీ తనకు ఈ ఉపాయం ఎలా వచ్చింది, దాన్ని ఎలా అమలు చేశారు, ఏపాటి విజయం సాధించారు… లాంటి ఎన్నో అరుదైన విషయాలు ఈ పాడ్ కాస్టులో వినండి! Ravindra Kishore Sinha is an unique busin...
ఈ లేడీ డిటెక్టివ్… మహా యాక్టివ్ 21.08.2023 4:16
మహిళలు అడుగుపెట్టలేని రంగం అంటూ ఏదీ లేదు ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. చాలా రంగాల్లో, వారు రాణించాలంటే అంతులేని అడ్డంకులు. ఒక మహిళను వేల డిటెక్టివ్ గా ఊహించడం అంటే దాదాపుగా అసాధ్యం. ఇలాంటి నేపధ్యంలో, రజని పండిట్ వేల కేసులను ఛేదించారు. ఈ విశిష్టమైన వ్యక్తి ప్రయాణం విని తీరాల్సిందే. Women have now proved that they could enter any field and be successful. However there were tim...
మానసిక ఆరోగ్యానికి ఆహార ఔషధం | Know Your Plate - 13 18.08.2023 25:16
వినడానకి కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ ఆహారానికీ మన మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వేల సంవత్సరాలుగా మన పెద్దలు చెబుతున్న మాట ఇదే. ఇదే విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేస్తోంది ఆధునిక విజ్ఞానం. ఆ విషయం పట్ల అవగాహన పెంచుకుంటే, శారీరిక ఆరోగ్యంతో పాటు సంతోషం కూడా మన సొంతం అవుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గారి మాటల్లో ఆ విశేషాలు విందాం! Eating nutritionally dense food...
మానవత్వాన్ని చాటే ఓ అయిదు కథలు 18.08.2023 5:11
హీరో అంటే ఆరడుగుల ఆజానుబాహుడు మాత్రమే కాదు… నిండు మనసున్నవాడు కూడా నాయకుడే. ఒక్క దెబ్బతో వందల మందిని మట్టికరిపించేవాడు మాత్రమే కాదు, తన సాయంతో సాటి మనిషి కన్నీటిని తుడిచే దయామయుడు కూడా. అలాంటివాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. కాకపోతే వాళ్ల గురించి పెద్దగా ప్రచారం జరగకపోవచ్చు. ఈమధ్యాకాలంలో కనిపించిన ఇలాంటి అరుదైన వ్యక్తుల కథలను సేకరించింది టాల్. వారి స్పూర్తిదాయకమైన కథనాలను ఈ పాడ్ కాస్టులో వినండి....
ఇంకా రాయాల్సింది చాలా ఉంది | రమేశ్ కార్తిక్ నాయక్ | మన రచయితలు - 27 17.08.2023 30:29
రమేశ్ కార్తిక్ నాయక్… వయసులో చిన్నవాడే. కానీ తన రచనలు అద్భుతాలు చేస్తున్నాయి. బడుగు జీవుల బతుకును నేరుగా అక్షరాల్లో నింపే తన కథలు, కవితలు పాఠకుల, విమర్శకుల మనసు గెలుచుకుంటున్నాయి. తన ఇంటర్వ్యూ మొదటిభాగంలో తనను రచనల వైపు నడిపించిన నేపధ్యం గురించి చెప్పారు. ఈ భాగంలో తన లక్ష్యం గురించీ, తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఎన్నో విలువైన విషయాలు పంచుకోబోతున్నారు. వినండి! Ramesh Karthik Nayak known for hi...
సైరీ చాహల్ - Turning Women Into SHEROES 16.08.2023 13:36
కష్టపడటం, లక్ష్యాన్ని చేరుకోవడం, పదిమందికీ ఆదర్శంగా నిలవడం… అన్నీ గొప్ప విషయాలే. కానీ ఇతరులకు కూడా మార్గదర్శకం కావడం అంతకంటే అద్భుతమైన అంశం. అలాంటి వ్యక్తే సైరీ చాహల్. మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే SHEROES తన సృష్టే! మహిళ మని, మిలాన్ ఫౌండేషన్ లాంటి మరెన్నో సంస్థ ద్వారా స్త్రీ సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఈ అరుదైన వ్యక్తి గురించి స్ఫూర్తిదాయకమైన కథనం. It’s good to work hard, re...
పిల్లలు ఓటమిని తట్టుకోవాలంటే! 15.08.2023 5:00
ఆట అయినా, పోటీ అయినా… జీవితంలో ఏ సందర్భం అయినా గెలుపు ఓటములు సహజం. ఇంట్లో పిల్లలు ఓడిపోతే, వాళ్లను ఎలా సంభాళించాలో చాలామందికి తెలియదు. పిల్లలను ఓదార్చాలా, లేకపోతే న్యాయనిర్ణేతలదే తప్పు అని చెప్పాలా, ఇంకా బాగా పోటీ చేయాలని ప్రోత్సహించాలా, ప్రదర్శన బాగోలేదని తిట్టాలా! ఇవేవీ కూడా ఆప్షన్స్ కావు అంటున్నారు నిపుణులు. మరి వారు చెబుతున్న మాట ఏమిటి? Failure and success are the two sides of a coin called li...
నవ్వుల డాక్టర్ Harish Bhuvan 14.08.2023 4:19
జోకర్ ని చూడని వాళ్లు, చూసి నవ్వని వాళ్లు ఎవరూ ఉండరేమో. ఆ నవ్విన కాసేపు, మన బాధల్ని మర్చిపోతాం. నవ్వు పైకి కనిపించే ఉద్వేగం మాత్రమే కాదు. నవ్వుతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. సానుకూలమైన హార్మోన్లు విడుదల అవుతాయి. మానసిక చింత కరిగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే… నవ్వు ఓ సర్వనివారిణి. అందుకే థెరాపెటిక్ క్లౌనింగ్కి ఆదరణ పెరుగుతోంది. ఆ థెరాపెటిక్ క్లౌనింగ్ ఏమిటో, దాన్ని ఆచరిస్తూ అద్భుతాలు సాధిస్తున్న వ్యక్త...
50 ఏళ్లలో 12 సినిమాలు. అన్నీ అద్భుతాలే| అడూర్ గోపాలకృష్ణన్ | సాహితీ స్రవంతి-40 12.08.2023 20:58
కమర్షియల్ హంగులకు దూరంగా… వాస్తవ జీవితాన్ని చూపించే సమాంతర సినిమా అనగానే కొన్ని పేర్లు గుర్తుకువస్తాయి. అలాంటి భారతీయ దర్శకులు జాబితలో అడూర్ గోపాలకృష్ణన్ తప్పకుండా ఉంటారు. సత్యజిత్ రే, మృణాల్ సేన్లకు దీటుగా అడూర్ అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. 16 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారంటే, తన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే సహా ఆయన పొందిన పురస్కారాలు అటుంచితే… వాటికి అర్హత సాధించిన...
గుజ్జుబెన్ కథ వింటే చాలు… కష్టంలో కొండంత ధైర్యం వచ్చేస్తుంది! 11.08.2023 3:25
జీవితం అంటే కష్టసుఖాల సమాహారం. కానీ కొందరు కష్టం రాగానే కుంగిపోతారు. తమకే ఎందుకిలా జరిగిందని నిరాశలో మునిగిపోతారు. ఇంకొందరు మాత్రం ఆ కష్టానికి రాటుదేలి… ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. అందుకు ఉదాహరణే ఊర్మిళ జమునాదాస్… అందరూ ప్రేమగా పిలుచుకునే గుజ్జుబెన్. 77 ఏళ్ల గుజ్జు బెన్ చూడని కష్టం లేదు. వాటిని దాటడంలో, ఇతరులకు ఓదార్పుగా నిలవడంలో, సరికొత్త లక్ష్యాన్ని చేరుకోవడంలో తనకు తానే సాటి. ఇంతకీ తన కథే...
Heal Your Hypertension | Know Your Plate 12 11.08.2023 28:00
రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటూ ఉంటారు. దాన్ని ఓ అసౌకర్యంగా మాత్రమే భావించి అశ్రద్ధ చేస్తే, గుండె సహా ప్రతీ అవయవం మీదా దాడి చేస్తుంది. వయసు, జన్యవులతో పాటుగా రక్తపోటు సహజంగా రావచ్చు. కానీ కంప్యూటర్, టీవీల నుంచి పెద్దగా కదలని సెడెంటరీ లైఫ్ స్టైల్, పోషకాలు లేని ఆహారం లాంటి ఇతరత్రా అంశాలే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే ఈసారి నో యువర్ ప్లేట్ లో రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఆహారంల...
అక్షరం నా జీవితాన్ని తీర్చిదిద్దింది! | రమేష్ కార్తిక్ నాయక్ (మొదటి భాగం) | మన రచయితలు - 26 10.08.2023 26:18
రమేశ్ కార్తిక్ నాయక్. ఎవరన్నా తనను అభిమానిస్తే, దాన్ని గుండెల్లో దాచుకునేవాడు. అలా ఓ మిత్రుడి పేరునే తన పేరుగా మార్చేసుకున్నాడు. అక్షరం కూడా అలాగే తన పట్ల అభిమానాన్ని చూపింది. కానీ దాన్ని గుండెలో దాచుకుంటూ ఊరికనే ఉండలేదు. ఓ కథగా మారింది, కవితలా సాగింది… బల్దేర్ బండి లాంటి రచనలతో రమేశ్ ను లోకం ముందు గర్వంగా నిలబెట్టింది. టాల్ రేడియో మన రచయితలు కార్యక్రమంలో భాగంగా ఈ యువ రచయితతో మాట్లాడదాం. Ramesh Ka...
పేదరికాన్ని ఓడించి… యుద్ధాన్ని దాటి… విజేతగా ఎదిగిన కథ! 09.08.2023 12:29
కియా! కార్ల ప్రపంచంలో తనదైన గుర్తింపు ఉన్న బ్రాండ్. ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది ఓ సాధారణ వ్యక్తి అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఓ వ్యక్తి విజయం అతని నేపధ్యం, పరిస్థితులను బట్టి కాక, తన సాధన వల్లే ఖాయం అవుతుందని కియా చరిత్ర స్పష్టం చేస్తుంది. తన 18వ ఏట జపానులో ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లిన ‘కిం చుల్ హో’ తన కొరియా దేశానిఇక తిరిగి వెళ్లి… ఇప్పుడు మనం చెప్పుకొంటున్న సామ్రాజ్య...
ఆనందంగా ఉండాలి అంటే, ఈ చిన్న సీక్రెట్ తెలియాలి 08.08.2023 2:44
ఆనందం… మనిషి అంతిమ లక్ష్యం. అది లేని రోజున, ఏ స్థాయికి చేరినా, ఎంత సాధించినా ఉపయోగం లేదు. ఆనందం మనకు ఎలా చేరువ అవుతుంది అనేందుకు చాలా మంది నిపుణులు ఎన్నో ఉపాయాలే చెబుతున్నారు. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. ఇది చాలా తేలికైందే, కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ విషయం ఓ పరిశోధనలో కూడా రుజువైంది. ఇంతకీ ఏమిటది. మీరే వినండి! The ultimate goal of humans is to be happy. Despair won’t fulfill...
అనయా చేసిన అద్భుతం వింటారా! 07.08.2023 3:52
ఆడవాళ్లు ఇప్పుడు అన్ని రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. సమనత్వాన్ని రుజువు చేస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో వారి ఆర్ధిక వ్యవహారాలు, వాళ్ల చేతుల్లోఉండవు. ఇంట్లో భర్త లేదా పిల్లలే వాటిని గమనించుకోవడం చూడవచ్చు. నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. బెంగళూరుకు చెందిన అనయా 17 ఏళ్ల వయసులోనే ఇందుకో ఉపాయం కనుగొన్నారు. మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీ సాధించడంలో అద్...
అపరిచిత దేశంలో… అమ్మభాషను పొదివిపట్టుకుని | ప్రవాసి - 2 07.08.2023 37:30
గల్ఫ్ దేశాలలోని ప్రముఖ తెలుగు సమాఖ్యలలో ఒకటి ఆంధ్ర కళావేదిక. దాదాపు దశాబ్ద కాలంగా, ఖతార్ దేశంలో ఉంటున్న తెలుగువారిని ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు, మన సంస్కృతీ, సంప్రదాయాలను విదేశంలో పరిరక్షించుకునేందుకు, భావి తరాలకు భాషను పరిచయం చేసేందుకు… అన్నింటికీ మించి, అక్కడి తెలుగువారు ఏ కష్టంలో ఉన్నా సరే ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తోందీ సంస్థ. ఈ సంస్థ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల గారితో మాట్లాడి, అక్కడ పరిస్థి...
కవుల కోసం పాటుపడిన IAS- అశోక్ వాజపేయి | సాహితీ స్రవంతి - 39 05.08.2023 22:33
అశోక్ వాజపేయి… ఓ అరుదైన కవి. సివిల్ సర్వీస్ ఉద్యోగిగా బాధ్యతల్లో తలమునకలై ఉన్నా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. లలిత కళా అకాడెమీ చైర్మన్, సాంస్కృతి కార్యదర్శిలాంటి పదవులతో … రచయితలు, కళాకారులను ప్రోత్సహించారు. కళల కోసం భరత్ భవన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేశారు. ఇదంతా ఒకవైపు అయితే… కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని సైతం అందుకున్న ఆయన రచనలు మరోవైపు. ఈ విశిష్టమైన వ్యక్తి గురిం...
బ్యాటరీ బాయ్ గురించి విన్నారా! 04.08.2023 3:36
ఓ చిన్న ప్రశ్న. మన ఇంట్లో ఇప్పటికిప్పుడు వెతికితే ఎన్ని బ్యాటరీలు ఉండవచ్చు. రిమోట్ల దగ్గర నుంచి బొమ్మల వరకూ వంద వరకూ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వీటి అవసరం తీరిపోయాక, నిస్సందేహంగా చెత్తకుప్పలో పడేస్తాం. దానివల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని వినే ఉంటాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి సందర్భమే ఎదురైంది ఓ కుర్రవాడికి. మరి తను ఏం చేశాడో తెలియాలంటే ఈ కథ వినాల్సిందే! Every year millions o...
జోలపాటతోనే బాలసాహిత్యం మొదలవుతుంది | నారంశెట్టి (రెండో భాగం) | మన రచయితలు - 25 03.08.2023 39:14
ప్రముఖ బాలసాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారితో టాల్ రేడియో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. ఈ వారం సాహిత్యం… మరీ ముఖ్యంగా బాలసాహిత్యం గురించి తన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. బాలసాహిత్యం అంటే కేవలం నీతి కథలేనా. దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. వేటిని అనుసరించి మంచి సాహిత్యాన్ని సృష్టించవచ్చు…. ఒక ఒక వర్క్ షాప్ ని తలపించేలా చాలా విలువైన సూచనలు అందించారు. వాటితో పాటుగా సాహితీవేత్తగా తన...
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici