Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 970 episodi

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Touch A Life Foundation

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

1 ott 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

యోగ నిద్ర వలన కలిగే ప్రయోజనాలు | ఓ మంచి మాట - 19 19.07.2024

ఆరోగ్యానికి ఆహరం లాగానే నిద్ర కూడా ఎంతో ముఖ్యం అని అందరికి తెలిసినా , బాగా నిర్లక్ష్యం చేసే విషయం కూడా అదే. నిద్ర వలన మన శరీరానికి జరిగే లాభాలు ఏంటో తెలుసుకుంటూనే, మంచి ప్రయోజనాలని ఇచ్చే యోగ నిద్ర గురించి తెలుసుకోవచ్చు ఈ వారం పోడ్కాస్ట్ లో. Despite knowing that sleep is as essential as food for health, it is often neglected. This week's podcast explores the benefits of sleep for the body and d...

రచన అనేది ఒక సామాజిక బాధ్యత! | కె.గీత | మన రచయితలు - 62 18.07.2024

ప్రముఖ రచయిత్రి కె.గీత గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. గీతగారి పేరు వినగానే చాలామందికి నెచ్చెలి అంతర్జాల పత్రిక గుర్తుకు వస్తుంది. ఈ పత్రిక వెనకాల ఉన్న లక్ష్యం గురించీ, దాని ప్రయాణం గురించీ మనతో పంచుకుంటున్నారు గీతగారు. అంతేకాదు. తెలుగు రచయితల కోసం నడుపుతున్న వెబ్ సైట్ గురించీ, సాహితీ వేదికలతో తన అనుబంధం గురించి చెప్పబోతున్నారు. తన గీతామాధవి మూవీస్, పాటలు, రేడియో షోస్.. ఇలా ఎన్నో విషయా...

విజయవంతమైన లీడర్ గా ఎదగాలి అంటే మైండ్ ఫుల్ గా ఉండటం ప్రాక్టీస్ చేయాలి | Smart To Wise - 7 18.07.2024

ఆశించే ఫలితానికి తగ్గట్టు మన శ్రద్ద ఉంటే కోరుకున్న ఫలితాలు రావటం ఏమంత కష్టం కాదు అంటున్నారు ప్రసాద్ కైప గారు. అందుకు కొన్ని టూల్స్ , టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు ఈ ఎపిసోడ్ లో. మరి విని మైండ్ ఫుల్ గా ఉంటూ మీ లీడర్షిప్ జర్నీ లో మంచి ఫలితాలు పొందండి. Prasad Kaipa emphasizes that focused effort leads to desired outcomes, offering tools and techniques to achieve mindfulness and success in leadershi...

మధ్యప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థతో కలిసి నేరాలను అరికడుతున్న వసుధ దీదీలు 17.07.2024

పెరిగే జనాభాతో పాటు, నేరాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం పోలీసులు మాత్రమే వాటిని అరికట్టాలి అంటే కష్టమే. ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకుంటే మార్పు సాధ్యం అవుతుంది. అలా మధ్య ప్రదేశ్ లో చేసిన ప్రయోగం ఎలాంటి ఫలితాలని ఇచ్చిందో వినండి. With the rising population, crime rates are also increasing. It's difficult for the police alone to curb them. Public participation is essential for change. Listen to t...

మనమీద మనకి నమ్మకం ఉంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు | ఓ మంచి మాట - 18 12.07.2024

మనం మన చుట్టూ వున్నవారిని నమ్ముతాం, మనం వాడే గాడ్జెట్స్ ని నమ్ముతాం. కానీ మన మీద , మన శక్తి సామర్ధ్యాల మీద మనకి ఎప్పుడూ అపనమ్మకమే. ఎందుకని ? ఆ అపనమ్మకం మన దారిలో అడ్డంకి గా మారకుండా చూసుకోవటం ఎలా ? ఈ వారం భారతి గారు అందించే ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం. We trust the people around us and the gadgets we use, but we often doubt ourselves and our capabilities. Learn how to overcome this self-doubt in...

మన నార్త్ స్టార్ ని - ఎలా గుర్తించాలి, ప్రయోజనాలు ఏమిటి? | Smart To Wise - 6 11.07.2024

ఉద్యోగం లో మంచి నాయకుడిగా ఎదగాలి అంటే, మనం చేసే పని లో నైపుణ్యం తో పాటు, వ్యక్తి గా, బృంద నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. అలాగే, మన లోని ఏ లక్షణాలు మన నాయకత్వానికి అడ్డుగా వుంటాయో తెలుసుకుని వాటిని వదులుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. అంటే ఒక విధంగా మంచి నాయకుడిగా ఎదగటానికి ఎవరిని వారు ట్రైన్ చేసుకోవాలి. స్మార్ట్ టూ వైస్ రేడియో షో లో అలా ఎదగాలి అనుకునే వారికి ప్రసాద్ కైప గారు ఇచ్చే సలహాల...

ప్రారంభంతో పాటూ కొనసాగింపు ముఖ్యం! | కె.గీత Part - 1 | మన రచయితలు - 61 11.07.2024

కె.గీత రచయిత్రిగా తెలుగు పాఠకులకు పరిచయమే! కథ, కవిత్వం, వ్లాగ్, వ్యాసం… ఎలాంటి రచనలో అయినా తనదైన ముద్రతో పాఠకులను మెప్పించగలరు. భాష పట్ల తనకు ఉన్న అనురక్తితో అందులోనే ఉన్నత చదువు అందుకున్నా… అదే కెరీర్ కావడం మరో విశేషం. ఒకవైపు కెరీర్, మరోవైపు రచనలతో పాటుగా సాహితీ వేదికల్లో చురుగ్గా పాల్గొనే గీతగారు మంచి గాయని, లఘుచిత్ర నిర్మాత, నెచ్చెలి అంతర్జాల పత్రిక సంస్థాపకులు కూడా! ఇన్ని విశేషాలున్న తన సాహితీ...

రైల్ పోలీస్ స్కూల్ - పోలీస్ లే టీచర్స్ ఇక్కడ.. 08.07.2024

సాధారణం గా పోలీస్ లని చూస్తే పిల్లలు భయపడతారు కదా!కానీ రైల్ పోలీస్ స్కూల్ లో పిల్లలకి మాత్రం పోలీస్ లు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే వాళ్లే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. ఏ ఆధారం లేని పిల్లలకి మంచి చదువు నేర్పించి వాళ్ళ భవిష్యత్తు ని తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్న బీహార్ లోని ముజఫర్ పూర్ రైల్ పోలీస్ స్కూల్ గురించి ఈ పోడ్కాస్ట్ లో వినచ్చు. Host : K L Surya #TALRadioTelugu #RailPoliceSchool #Bihar #Poli...

బాడీ షేమింగ్ కి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది | O Manchi Mata - 17 05.07.2024

రంగు, రూపులు గురించి మాట్లాడుతూ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇప్పటికీ ఉంది. అది ఎదుటివాళ్ళ మనసులకి చేసే గాయం గురించి ఆలోచించకుండా, చాలా తేలికగా అనేస్తుంటారు చాలా మంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ఎదుటివాళ్ళ తో ఖచ్చితం గా చెప్పటం లాంటివి చేస్తూనే, ఆ మాటలు మన మీద ప్రభావం చూబించకుండా ఓ కిటుకు చెబుతున్నారు భారతి గారు ఈ వారం పోడ్కాస్ట్ లో. అదేంటో వినేయండి. Discussing colors and appearances can still hu...

"నా కథ ఓ జీవితాన్ని నిలబెట్టింది" ద్విభాష్యం రాజేశ్వర రావు | మన రచయితలు - Epi 60 04.07.2024

ఒక రచన, పాఠకుడి ఆలోచనల మీద ప్రభావం చూబిస్తే , దాని లక్ష్యం నెరవేరినట్టే. అలా పాఠకుడి నాడి తెలిసిన రచనలు చేసిన ద్విభాష్యం రాజేశ్వర రావు గారి తో సంభాషణ జరిపింది టాల్ రేడియో. ఈ పోడ్కాస్ట్ లో ఆ సంభాషణ వినండి. A piece of writing achieves its goal when it influences the reader's thoughts. TALRadio conducted a conversation with Dvibhashyam Rajeshwara Rao Garu, who has crafted writings that resonate d...

ఉన్నత ఆశయాలతోనే విజయం | Prasad Kaipa | Smart To Wise - Epi 5 04.07.2024

ఉద్యోగ బాధ్యత లలో ఒక లీడర్ స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, టీం ని లీడ్ చేయాలి అంటే అందుకు ముందు, ఎవరి స్వభావాన్ని వారు అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవటానికి విజేతలు గా నిలిచిన లీడర్స్ ని ఉదహరిస్తూ ప్రముఖ మేనేజిమెంట్ అండ్ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప చెప్పే సూత్రాలు ఏంటో తెలుసుకోండి ఈ పోడ్కాస్ట్ లో. To lead a team and make the right decisions at a leadership level in job responsibilities, one...

దేవరాజ్ ఒక సామాన్యుడు, కానీ అతను చేసే సేవ సామాన్య మైనది కాదు 03.07.2024

మనం సేవ చేయాలి అంటే, అంత స్థోమత మాకు లేదు అనుకుంటాం. కానీ మనసుండాలే కానీ డబ్బుతో సంబంధం లేకుండా పక్క మనిషి కి మన కి వీలయినంత సేవ చేయచ్చు అని నిరూపించే వ్యక్తులు ఎందరో ఉంటారు. మన మధ్య తిరిగే అతి సామాన్యులు వాళ్ళు. కానీ చేసే సేవ మాత్రం సామాన్యమైనది కాదు. దేవరాజ్ అలాంటి ఒక సామాన్యుడే. అతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ? తెలియాలంటే ఈ పోడ్కాస్ట్ వినండి. Many believe they lack the capacity to serve...

కృతజ్ఞత' చూబిస్తే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా ? 02.07.2024

ఉన్నదానితో సంతృప్తి పడితే ఆనందం గా ఉంటారు అంటారు. కానీ అలా ఉన్న దానితో తృప్తి పడితే ప్రగతి సాధ్యం కాదు కదా ! ఈ రెండింటి కి సయోధ్య కుదరటం ఎలా ? ఈ పోడ్కాస్ట్ వింటే ఆ చిక్కు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. Host : Geetha #TALRadioTelugu #Satisfaction #Gratitude #SelfAcceptance #TouchALife #TALRadio #TALPodcast

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే? ఇలా చేసి చూడండి! | ఓ మంచి మాట- 16 28.06.2024

మనలో సానుకూలమైన దృక్పధం ఉంటే సరిపోదు. మన చుట్టూ కూడా అలాంటి వాతావరణం ఉండాలి. లేకపోతే తెలియని చిరాకు మనసు ఆవహిస్తుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అనుమానమా! ఒకసారి దుమ్ముకొట్టుకుపోయి, ఇరుకుగా ఉన్న గదిలో ఉండే మానసిక స్థితికీ… గాలీవెలుతురూ పుష్కలంగా ప్రవహిస్తూ, అందంగా తీర్చిదిద్దిన గదిలో ఉండే స్థితికీ బేరీజు వేసుకుని చూడండి. తేడా ఉంటుంది కదా! ఇలాగే మన ఇంట్లో ఉండే రకరకాల పరిస్థితులను సరిచేసుకోవడం వల...

మన దృక్పథం నాయకత్వ శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది? | Smart To Wise - 4 27.06.2024

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిగతంగా రాణించాలన్నా, జట్టును నడిపించాలన్నా, స్టార్టప్ ను విజయవంతం చేయాలన్నా… నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అలాగని ఒక పుస్తకం సాయంతోనో, ఎవరి సూచన ద్వారానో నాయకత్వంలో రాణించలేం. మన దృక్పథం ఎలాంటిదో గమనించాలి. దానికి ఎలాంటి నాయకత్వ శైలి సరిపోతుందో తెలుసుకోవాలి. దశాబ్దాలుగా వందలాది CEOలకు మేనేజ్మెంట్ మెళకువలు అందించిన ప్రసాద్కైప గారు… ఈ విషయమై చాలా ఆసక్తికరమైన విషయాల్ని...

అక్షరంతో అనుబంధం పెద్దల పరిచయం… తీర్చిదిద్దాయి! ద్విభాష్యం రాజేశ్వరరావు | మన రచయితలు - 59 27.06.2024

టాల్ మన రచయితలు శీర్షికలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త ద్విభాష్యం రాజేశ్వరరావుగారితో జరిగిన ముఖాముఖి ఇది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు అలుపెరగకుండా, తన కలం వాడి తగ్గకుండా రాస్తున్న రచయిత ఆయన. 400లకు పైగా కథలు వాటిలో ప్రతి కథా, మనసును హత్తుకునేదే. స్వయంగా ఒక మంచి రచయిత కావడమే తన ప్రత్యేకత కాదు. నాటి మేటి రచయితల పరిచయం, మార్గదర్శకత్వం అందుకున్న అదృష్టశాలి. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఆయన నుంచే విందాం. Dwibhas...

ఆదర్శ్ బాలికల ఆశ్రమం ఇక్కడి పిల్లలంతా మా కూతుళ్లే! | స్ఫూర్తి కిరణాలు 24.06.2024

రామనాధంగారు ఎన్నో కష్టాలు పడి ఎదిగారు. తన కష్టం, జీవితం పట్ల నిరాశను కలిగించలేదు సరికదా… మరెవ్వరూ అలాంటి ఇబ్బందులు పడకూడదు అనిపించింది. అందుకే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రయాణం చేయసాగారు. క్రమంగా తనే ఆదర్శ బాలికల ఆశ్రమం పేరుతో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి… ఎంతోమంది బాలికలకు అండగా నిలుస్తున్నారు. వారికి వసతి, ఆహారం మాత్రమే కాకుండా… ఆరోగ్యం, చదువు విషయంలో కూడా కంటికిరెప్పలా కాచుకుంటున్నారు. వారికి అండగ...

Negative Thoughts చిరాకు పెడుతున్నాయా ? ఇలా చేసి చూడండి | ఓ మంచి మాట - 15 21.06.2024

చాలామందిలో నైపుణ్యానికి కొదవ ఉండదు. వ్యక్తిత్వానికి తిరుగు ఉండదు. కానీ విజయం వారికి ఆమడదూరంలో ఉంటుంది. కారణం! అడుగు ముందుకు వేయాలంటే భయం. పోరాడే ముందే పరాజయం గురించి ఆందోళన. వెరసి… ఏళ్లు గడుస్తున్నా ఏమీ సాధించలేకపోతారు. ఈ విషవలయంలో చిక్కుకుపోతారు. క్రమంగా బలహీనపడిపోతారు. మరి ఈ నెగెటివ్ ఆలోచనలను ఎదుర్కొనేదెలా? అందుకు చాలా మార్గాలే ఉన్నాయంటున్నారు భారతిగారు. ట్యాపింగ్ టెక్నిక్స్ లాంటి పరిష్కారాలతో వ...

వికీపీడియాతో ఓ అనూహ్యమైన బంధం | పవన్ సంతోష్ | మన రచయితలు - 58 20.06.2024

పవన్ సంతోష్ గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. సాహిత్యంతో తన పరిచయం. అది భాష, రచనల వైపుగా మళ్లించిన తీరు గురించి విన్నాం. ఈ ఎపిసోడ్లో వికీపీడియాతో తన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పవన్ వ్యక్తిగత పరిచయం కాదు. వికీపీడియా లాంటి సంస్థతో ఎలాంటి సానుకూల ప్రభావాన్ని అందుకోవచ్చో చెప్పే మాటలివి. అంతేకాదు! డిజిటల్ యుగంలో మాతృభాషలు ఎందుకని వెనకబడుతున్నాయో, వాటి కోసం మన వంతుగా ఏం చేయవచ...

మీ స్వభావం బట్టి మీ లీడర్షిప్ స్టైల్ తెలుసుకోవచ్చు | Smart To Wise - 3 20.06.2024

అందరూ ఒకేలా ఆలోచించరు. అంతా తమ ఆలోచనలను ఒకేలా ఆచరణలో ఉంచరు. ఒకొక్కరిదీ ఒకో శైలి. ఆ శైలికి అనుగుణంగా మన నాయకత్వ లక్షణాలను గ్రహించాలి అంటారు ప్రసాద్ కైపగారు. అలా కాకుండా మరో నాయకుడిని అనుకరించడమో, తనది కాని స్వభావంతో రాణించే ప్రయత్నం చేయడమో అంత సానుకూలమైన ఫలితాలను అందించకపోవచ్చు. ప్రసాద్ కైప, తన సుదీర్ఘ అనుభవంలో అటు కార్పొరేట్ రంగం మీదా, ఇటు భారతీయ ఆలోచనా విధానం మీదా కొంత సాధికారత అందుకున్నారు. ఆ ఎర...

ఆవిష్కరించే ప్రయత్నం మీ దృక్పధాన్నే మార్చేస్తుంది! | స్ఫూర్తి కిరణాలు 17.06.2024

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ గురించి, ఆ సంస్థ బాధ్యులలో ఒకరైన సోహెల్ ఖాన్ గారితో జరిగిన సంభాషణలో ఇది రెండో భాగం. మనలో ఎవరికైనా సరే, ఓ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన వచ్చినప్పుడు… TSIC ని ఎలా సంప్రదించాలి, వారు మనల్ని ఎలా ప్రోత్సహిస్తారు? ఆవిష్కరించే దృక్పధం ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? లాంటి ఆసక్తికరమైన విషయాల మీద వారి అనుభవపూర్వకమైన జవాబులు వినవచ్చు. This is the second part of interview...

పిప్పి పన్ను ...రాకుండా జాగ్రత్తలు - వచ్చాక చికిత్స | DenTAL Care - 13 17.06.2024

మన హోస్ట్ జయశ్రీ మరియు డాక్టర్ హరీష్ టెన్నేటి కలిసి పిప్పి పన్ను సమస్య పై మనకు అర్థవంతమైన పాడ్కాస్ట్ ని అందిస్తున్నారు. దంత ఆరోగ్యంపై లోతుగా పరిశీలిస్తూ, పిప్పి పన్ను రావటానికి కారణాలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాలను వివరించుతున్నారు. నిరోధక చర్యల నుండి చికిత్సా విధానాల వరకు, నిపుణుల మార్గదర్శకంతో నోటి సంరక్షణ వివరాలను తెల్సుకోండి. Our host, Jayasree and Dr. Harish Tenneti team up for an insi...

విజయాన్ని వాయిదా వేస్తున్నారా | Getting Rid of PROCRASTINATION | ఓ మంచి మాట - 14 14.06.2024

వస్తువులు వాయిదా పద్ధతిలో దొరుకుతాయి కానీ… విజయం కాదు. విజయం కోసం నిరంతరం కృషి చేయాల్సిందే. కానీ చాలామంది భయం వల్లో, అపనమ్మకంతోనో చేయాల్సిన పనిని వాయిదా వేస్తూ ఉంటారు. ఇంటి బిల్లుల దగ్గర్నుంచీ, చదువు వరకు ప్రతిదాన్నీ మర్నాటికి బదలాయిస్తుంటారు. దానివల్ల ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఈ విషవలయాన్ని బద్దలుకొట్టినప్పుడే అనుకున్నది చేయగలుగుతాం, సాధించగలుగుతాం. చూసేవారికి ఈ వాయిదా వేసే అలవాటు బద్ధకంగానో,...

ఇంగ్లిష్ రాకపోతే నిరక్షరాస్యులేనా? | పవన్ సంతోష్ సూరంపూడి | మన రచయితలు - 57 13.06.2024

పవన్ సంతోష్, సాహిత్యాభిమానులకు సుపరిచితమే. తన రచనల ద్వారా వికీపీడియా వ్యాప్తి కోసం చేస్తున్న కృషి ద్వారా ఏదో ఒక సమయంలో తన అక్షరం మనకు కనిపించే ఉంటుంది. Centre for Internet and Societyలో స్థానిక భాషలకు డిజిటల్ రూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్న పవన్… తన సాహిత్యాభిలాష ఎలా మొదలైంది, పద్యం నుంచి అనువాదం వరకు వేర్వేరు రచనా ప్రక్రియల పట్ల తన ఆలోచన ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకోబోతున్నా...

మీ నాయకత్వ పద్ధతిని గుర్తించటం ఎలా ? | Smart To Wise - 2 13.06.2024

నాయకుడంటే… జట్టును పర్యవేక్షించేవాడు మాత్రమే కాదు. ముందుండి నడిపించాలి. వెన్నంటి ప్రోత్సహించాలి. వైఫల్యాలలో బాధ్యతను, విజయాలలో ఉదారతను చూపించాలి. అలాంటప్పుడే ఓ సంస్థనైనా, కుటుంబాన్నైనా గెలిపించగలడు. వ్యక్తిగతంగానూ విజయం సాధించగలడు. అయితే ఇక్కడో సవాలు ఉంది. నాయకులలోనూ రకరకాల వ్యక్తులు ఉంటారు. వారి తీరును బట్టి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! తన జీవతంలో వందలాది CEOలకు దిశానిర్దేశం చేస...

Ascolta il podcast TALRadio Telugu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici