Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ Επεισόδια: 908

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Δημιουργός

Touch A Life Foundation

Κατηγορία

Arts

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

10 Ιουλ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

కృతజ్ఞత' చూబిస్తే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా ? 02.07.2024

ఉన్నదానితో సంతృప్తి పడితే ఆనందం గా ఉంటారు అంటారు. కానీ అలా ఉన్న దానితో తృప్తి పడితే ప్రగతి సాధ్యం కాదు కదా ! ఈ రెండింటి కి సయోధ్య కుదరటం ఎలా ? ఈ పోడ్కాస్ట్ వింటే ఆ చిక్కు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. Host : Geetha #TALRadioTelugu #Satisfaction #Gratitude #SelfAcceptance #TouchALife #TALRadio #TALPodcast

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే? ఇలా చేసి చూడండి! | ఓ మంచి మాట- 16 28.06.2024

మనలో సానుకూలమైన దృక్పధం ఉంటే సరిపోదు. మన చుట్టూ కూడా అలాంటి వాతావరణం ఉండాలి. లేకపోతే తెలియని చిరాకు మనసు ఆవహిస్తుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అనుమానమా! ఒకసారి దుమ్ముకొట్టుకుపోయి, ఇరుకుగా ఉన్న గదిలో ఉండే మానసిక స్థితికీ… గాలీవెలుతురూ పుష్కలంగా ప్రవహిస్తూ, అందంగా తీర్చిదిద్దిన గదిలో ఉండే స్థితికీ బేరీజు వేసుకుని చూడండి. తేడా ఉంటుంది కదా! ఇలాగే మన ఇంట్లో ఉండే రకరకాల పరిస్థితులను సరిచేసుకోవడం వల...

మన దృక్పథం నాయకత్వ శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది? | Smart To Wise - 4 27.06.2024

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిగతంగా రాణించాలన్నా, జట్టును నడిపించాలన్నా, స్టార్టప్ ను విజయవంతం చేయాలన్నా… నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అలాగని ఒక పుస్తకం సాయంతోనో, ఎవరి సూచన ద్వారానో నాయకత్వంలో రాణించలేం. మన దృక్పథం ఎలాంటిదో గమనించాలి. దానికి ఎలాంటి నాయకత్వ శైలి సరిపోతుందో తెలుసుకోవాలి. దశాబ్దాలుగా వందలాది CEOలకు మేనేజ్మెంట్ మెళకువలు అందించిన ప్రసాద్కైప గారు… ఈ విషయమై చాలా ఆసక్తికరమైన విషయాల్ని...

అక్షరంతో అనుబంధం పెద్దల పరిచయం… తీర్చిదిద్దాయి! ద్విభాష్యం రాజేశ్వరరావు | మన రచయితలు - 59 27.06.2024

టాల్ మన రచయితలు శీర్షికలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త ద్విభాష్యం రాజేశ్వరరావుగారితో జరిగిన ముఖాముఖి ఇది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు అలుపెరగకుండా, తన కలం వాడి తగ్గకుండా రాస్తున్న రచయిత ఆయన. 400లకు పైగా కథలు వాటిలో ప్రతి కథా, మనసును హత్తుకునేదే. స్వయంగా ఒక మంచి రచయిత కావడమే తన ప్రత్యేకత కాదు. నాటి మేటి రచయితల పరిచయం, మార్గదర్శకత్వం అందుకున్న అదృష్టశాలి. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఆయన నుంచే విందాం. Dwibhas...

ఆదర్శ్ బాలికల ఆశ్రమం ఇక్కడి పిల్లలంతా మా కూతుళ్లే! | స్ఫూర్తి కిరణాలు 24.06.2024

రామనాధంగారు ఎన్నో కష్టాలు పడి ఎదిగారు. తన కష్టం, జీవితం పట్ల నిరాశను కలిగించలేదు సరికదా… మరెవ్వరూ అలాంటి ఇబ్బందులు పడకూడదు అనిపించింది. అందుకే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రయాణం చేయసాగారు. క్రమంగా తనే ఆదర్శ బాలికల ఆశ్రమం పేరుతో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి… ఎంతోమంది బాలికలకు అండగా నిలుస్తున్నారు. వారికి వసతి, ఆహారం మాత్రమే కాకుండా… ఆరోగ్యం, చదువు విషయంలో కూడా కంటికిరెప్పలా కాచుకుంటున్నారు. వారికి అండగ...

Negative Thoughts చిరాకు పెడుతున్నాయా ? ఇలా చేసి చూడండి | ఓ మంచి మాట - 15 21.06.2024

చాలామందిలో నైపుణ్యానికి కొదవ ఉండదు. వ్యక్తిత్వానికి తిరుగు ఉండదు. కానీ విజయం వారికి ఆమడదూరంలో ఉంటుంది. కారణం! అడుగు ముందుకు వేయాలంటే భయం. పోరాడే ముందే పరాజయం గురించి ఆందోళన. వెరసి… ఏళ్లు గడుస్తున్నా ఏమీ సాధించలేకపోతారు. ఈ విషవలయంలో చిక్కుకుపోతారు. క్రమంగా బలహీనపడిపోతారు. మరి ఈ నెగెటివ్ ఆలోచనలను ఎదుర్కొనేదెలా? అందుకు చాలా మార్గాలే ఉన్నాయంటున్నారు భారతిగారు. ట్యాపింగ్ టెక్నిక్స్ లాంటి పరిష్కారాలతో వ...

వికీపీడియాతో ఓ అనూహ్యమైన బంధం | పవన్ సంతోష్ | మన రచయితలు - 58 20.06.2024

పవన్ సంతోష్ గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. సాహిత్యంతో తన పరిచయం. అది భాష, రచనల వైపుగా మళ్లించిన తీరు గురించి విన్నాం. ఈ ఎపిసోడ్లో వికీపీడియాతో తన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పవన్ వ్యక్తిగత పరిచయం కాదు. వికీపీడియా లాంటి సంస్థతో ఎలాంటి సానుకూల ప్రభావాన్ని అందుకోవచ్చో చెప్పే మాటలివి. అంతేకాదు! డిజిటల్ యుగంలో మాతృభాషలు ఎందుకని వెనకబడుతున్నాయో, వాటి కోసం మన వంతుగా ఏం చేయవచ...

మీ స్వభావం బట్టి మీ లీడర్షిప్ స్టైల్ తెలుసుకోవచ్చు | Smart To Wise - 3 20.06.2024

అందరూ ఒకేలా ఆలోచించరు. అంతా తమ ఆలోచనలను ఒకేలా ఆచరణలో ఉంచరు. ఒకొక్కరిదీ ఒకో శైలి. ఆ శైలికి అనుగుణంగా మన నాయకత్వ లక్షణాలను గ్రహించాలి అంటారు ప్రసాద్ కైపగారు. అలా కాకుండా మరో నాయకుడిని అనుకరించడమో, తనది కాని స్వభావంతో రాణించే ప్రయత్నం చేయడమో అంత సానుకూలమైన ఫలితాలను అందించకపోవచ్చు. ప్రసాద్ కైప, తన సుదీర్ఘ అనుభవంలో అటు కార్పొరేట్ రంగం మీదా, ఇటు భారతీయ ఆలోచనా విధానం మీదా కొంత సాధికారత అందుకున్నారు. ఆ ఎర...

ఆవిష్కరించే ప్రయత్నం మీ దృక్పధాన్నే మార్చేస్తుంది! | స్ఫూర్తి కిరణాలు 17.06.2024

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ గురించి, ఆ సంస్థ బాధ్యులలో ఒకరైన సోహెల్ ఖాన్ గారితో జరిగిన సంభాషణలో ఇది రెండో భాగం. మనలో ఎవరికైనా సరే, ఓ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన వచ్చినప్పుడు… TSIC ని ఎలా సంప్రదించాలి, వారు మనల్ని ఎలా ప్రోత్సహిస్తారు? ఆవిష్కరించే దృక్పధం ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? లాంటి ఆసక్తికరమైన విషయాల మీద వారి అనుభవపూర్వకమైన జవాబులు వినవచ్చు. This is the second part of interview...

పిప్పి పన్ను ...రాకుండా జాగ్రత్తలు - వచ్చాక చికిత్స | DenTAL Care - 13 17.06.2024

మన హోస్ట్ జయశ్రీ మరియు డాక్టర్ హరీష్ టెన్నేటి కలిసి పిప్పి పన్ను సమస్య పై మనకు అర్థవంతమైన పాడ్కాస్ట్ ని అందిస్తున్నారు. దంత ఆరోగ్యంపై లోతుగా పరిశీలిస్తూ, పిప్పి పన్ను రావటానికి కారణాలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాలను వివరించుతున్నారు. నిరోధక చర్యల నుండి చికిత్సా విధానాల వరకు, నిపుణుల మార్గదర్శకంతో నోటి సంరక్షణ వివరాలను తెల్సుకోండి. Our host, Jayasree and Dr. Harish Tenneti team up for an insi...

విజయాన్ని వాయిదా వేస్తున్నారా | Getting Rid of PROCRASTINATION | ఓ మంచి మాట - 14 14.06.2024

వస్తువులు వాయిదా పద్ధతిలో దొరుకుతాయి కానీ… విజయం కాదు. విజయం కోసం నిరంతరం కృషి చేయాల్సిందే. కానీ చాలామంది భయం వల్లో, అపనమ్మకంతోనో చేయాల్సిన పనిని వాయిదా వేస్తూ ఉంటారు. ఇంటి బిల్లుల దగ్గర్నుంచీ, చదువు వరకు ప్రతిదాన్నీ మర్నాటికి బదలాయిస్తుంటారు. దానివల్ల ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఈ విషవలయాన్ని బద్దలుకొట్టినప్పుడే అనుకున్నది చేయగలుగుతాం, సాధించగలుగుతాం. చూసేవారికి ఈ వాయిదా వేసే అలవాటు బద్ధకంగానో,...

ఇంగ్లిష్ రాకపోతే నిరక్షరాస్యులేనా? | పవన్ సంతోష్ సూరంపూడి | మన రచయితలు - 57 13.06.2024

పవన్ సంతోష్, సాహిత్యాభిమానులకు సుపరిచితమే. తన రచనల ద్వారా వికీపీడియా వ్యాప్తి కోసం చేస్తున్న కృషి ద్వారా ఏదో ఒక సమయంలో తన అక్షరం మనకు కనిపించే ఉంటుంది. Centre for Internet and Societyలో స్థానిక భాషలకు డిజిటల్ రూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్న పవన్… తన సాహిత్యాభిలాష ఎలా మొదలైంది, పద్యం నుంచి అనువాదం వరకు వేర్వేరు రచనా ప్రక్రియల పట్ల తన ఆలోచన ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకోబోతున్నా...

మీ నాయకత్వ పద్ధతిని గుర్తించటం ఎలా ? | Smart To Wise - 2 13.06.2024

నాయకుడంటే… జట్టును పర్యవేక్షించేవాడు మాత్రమే కాదు. ముందుండి నడిపించాలి. వెన్నంటి ప్రోత్సహించాలి. వైఫల్యాలలో బాధ్యతను, విజయాలలో ఉదారతను చూపించాలి. అలాంటప్పుడే ఓ సంస్థనైనా, కుటుంబాన్నైనా గెలిపించగలడు. వ్యక్తిగతంగానూ విజయం సాధించగలడు. అయితే ఇక్కడో సవాలు ఉంది. నాయకులలోనూ రకరకాల వ్యక్తులు ఉంటారు. వారి తీరును బట్టి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! తన జీవతంలో వందలాది CEOలకు దిశానిర్దేశం చేస...

ప్రేమించే మనసు మీదయితే లోకమంతా ఆనందమే ! 10.06.2024

సంతోషం, సంతృప్తి, మనశ్శాంతి... ఈ మూడూ ఉన్న జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మరి దాన్ని సాధించడం ఎలా! చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం ఎలా! మెదడుకు సంబంధించిన ఆలోచన, మనసులో భాగమైన ప్రేమల మధ్య సమన్వయం సాధించడం ఎలా! ఓ రెండు నిమిషాల పాడ్‌ కాస్టులో ఇన్ని వివరాలూ చెప్పేస్తే ఎలా ఉంటుంది. మరెందుకాలస్యం... మీరే వినండి! Happiness, satisfaction and peace are the requirements of a content li...

ప్రతి మనిషీ ఓ ఆవిష్కర్త కావాలి | స్ఫూర్తి కిరణాలు 10.06.2024

ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారంగా ఓ ఆవిష్కరణ ఉంటే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి ఏదో ఒకటి కనుగొంటారు కూడా. కానీ దాన్ని ముందుకు తీసుకు వెళ్లేదెలా! తన జీవనోపాధిగా మార్చుకునేదెలా! అన్న విషయం మీద అంతులేని అయోమయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన ఈ విషయంలోనే అద్భుతాలు చేస్తోంది. ఒక ఆలోచన విజయవంతమైన ఫలితాన్ని అందుకునేలా ఆవిష్కర్తలకు... ముఖ్యంగా గ్రామీణ, విద...

ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56 06.06.2024

ఊరి పేర్లు అనగానే గుర్తుకు వచ్చే వాండ్రంగి కొండలరావుగారితో జరుగుతున్న ముఖాముఖిలో రెండవ భాగమిది. ఈ పేర్ల వెనుక ఉన్న ఆయన ప్రయాణంలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నంతో పాటుగా… పొందూరు ఖద్దరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కబుర్లు కూడా పంచుకుంటున్నారు. ఊరి పేర్లు కాలగర్భంలో కలిసిపోకుండా, ఎవరు ఎలాంటి ప్రయత్నం చేయవచ్చో చెబుతున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాలతో పాటు… కొన్ని ఊరి పేర్ల వెనుక ఉన్న అబ్బురపరిచే కారణా...

“నా అనుభవాన్ని అంతటిని ఒక పుస్తకంగా రాశాను” - ప్రసాద్ కైప | Smart To Wise- 1 06.06.2024

ప్రసాద్ కైప ప్రతిష్టాత్మక ఐఐటిలో ఉన్నత చదువు తర్వాత అమెరికాలో యాపిల్ సంస్థలో చేరారు. ఆ సంస్థ ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. ఉద్యోగిగా, వ్యవస్థాపకునిగా… సిలికాన్ వ్యాలీలో ఉన్న పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. సాంకేతిక విప్లవానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందరో సామాన్యులు విజేతలుగా ఎదిగారు. అసమాన్యులు పరాజితులయ్యారు. ఓ వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సంస్థను స్థాపించడం గొప్ప కాదనీ… దాన...

జ్ఞానదంతం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా? | DenTAL Care - 12 03.06.2024

జ్ఞానదంతాలు వస్తే తప్ప జ్ఞానం రాదేమో అని చాలామంది సరదాగా అంటుంటారు. బోలెడన్ని సందర్భాల్లో ఈ రెండు అంశాలకి సంబంధం ఉన్నట్టుగానే వింటుంటాము. కానీ అది ఏ మాత్రము నిజం కాదని ఖచ్చితంగా చెప్పేసారు మన డాక్టర్ హరీష్ గారు. జ్ఞానదంతాలు, వాటివల్ల వచ్చే ఇబ్బందులు, వాటికి తగిన చికిత్సలు అన్నిటి గురించి తెలుసుకుందాము ఈ వారం డెంటల్ కేర్ సంచికలో! కేవలం మీ TALRadio లో! It is often playfully said that people don'...

ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13 31.05.2024

ఆహారం కేవలం ఆకలి తీరే మార్గం కాదు. బలాన్ని అందించడమే దాని ఉపయోగం కాదు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మీదా, మనసు మీదా ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆన్ లైన్ ఆర్డర్లు ఓ అలవాటుగా మారుతున్న నేటి కాలంలో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. ఓ సౌలభ్యంగానో, సౌకర్యంగానూ ఉన్న ఈ అలవాటు వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాదు. ఒక రోజును మొదలుపెట్టడం న...

ప్రతి ఊరి పేరూ… చరిత్ర చెప్పే కబురు | వాండ్రంగి కొండలరావు | మన రచయితలు - 55 30.05.2024

కాకి అనే ఊరి పేరు వినిపిస్తే… కాస్త హాస్యంగా తోస్తుంది. కానీ దాని వెనకాల ఓ ఆశ్చర్యకరమైన కథ ఉందని తెలిస్తే. దీర్ఘాసి లాంటి ఊరి పేర్ల వెనక గొప్ప చరిత్ర కనిపిస్తే! మనం గమనించాలే కానీ ప్రతీ ఊరి పేరూ ఓ కథ చెబుతుంది. ప్రతి గ్రామనామం వెనకా అబ్బురపరిచే విశేషమేదో ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వాతావరణం, జీవనశైలి, పశుపక్ష్యాదులు… ఇలా ఓ ఊరి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. వీటిని పరిశోధించి, గ్రంథస్తం...

సమాజంతో స్నేహం ...సేవతో సంతోషం ! - మల్లికార్జున్ | స్ఫూర్తి కిరణాలు 27.05.2024

మల్లికార్జున్… కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి స్వచ్ఛంద సేవ చేసేవారు. చదువు అయిపోయినా, కెరీర్ మొదలైనా… ఇతరులకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తిని మర్చిపోలేదు. SERUDS పేరుతో కర్నూలులో వృద్ధులు, పిల్లలు, మహిళలు… ఇలా అన్ని రంగాలవారికీ అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే కాదు, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలాగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు అయిదు వేల కుటుంబాలు ఈ సం...

Tongue thrusting అంటే ఏమిటి ? | DenTAL Care - 11 25.05.2024

Tongue thrusting అనే సమస్య అసలు మనకి ఉందని కూడా చాలామందికి తెలియదు. ఐతే ఈ సమస్య వల్ల ఇంకా బోలెడన్ని నోటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మరింత వివరంగా తెలుసుకుందాం Dr. హరీష్ తెన్నేటి గారి నుండి, ఈ వారం సంచికలో! Tongue thrusting is an oral issue that most of us fine even know we are experiencing this. This may lead to many more oral and other health problems if left untreated. Know more about Tongue thrus...

వ్యక్తిగత శుభ్రతతో మానసిక ఆరోగ్యం | ఓ మంచి మాట - 12 24.05.2024

చాలా మురికిగా దుర్గంధభూరితంగా ఉన్న గదిలోకి మీరు అడుగుపెట్టారే అనుకోండి… అక్కడ మీకు ప్రశాంతత దక్కుతుందా. చింపిరి జుట్టుతో, నోటి దుర్వాసనతో ఉన్న వ్యక్తిని మొదటిసారి కలిశారే అనుకోండి… తన మీద మీకు సదభిప్రాయం కలుగుతుందా! స్పష్టంగా లేదనే జవాబు చెబుతాం కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, మన మనసు మీద తెలియకుండానే ప్రభావం చూపిస్తాయి. పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ఆహ్లాదం కలిగిస్తాడు. ఇది డబ్బుకో, స్తోమతకో సం...

పద్దతిగా వండితే ..ఆహారం ఔషధమే ! Know Your Plate - 38 24.05.2024

మన పెద్దలు ఆహారాన్ని ఔషధంగా భావించేవారు. అంతే నిబద్ధతతో వంట చేసే పద్ధతి ఉండేది. కానీ కాలం మారిపోయింది. మనం వాడే నూనెలు, వేయించే తీరు, పాత్రలు… అన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చేశాయి. దీని వల్ల ఔషధం సంగతి పక్కన పెడితే, మనం తినే ఆహారమే అనేక అనారోగ్యాలకు దారి తీస్తోందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మనం తినే పదార్థాలలోని పోషకాలు ఒంటికి అందేలా, పద్ధతిగా ఎలా వండాలో చెబుతున్నారు ప్రముఖ పోషకాహ...

వ్యాకరణం… పెంచుకోవల్సిన నైపుణ్యం! | Dr. దేవులపల్లి పద్మజ Part -2 | మన రచయితలు - 54 23.05.2024

మన రచయితలు సిరీస్లో భాగంగా మనం దేవులపల్లి పద్మజగారితో మాట్లాడుతున్నాం. కథ, కవిత్వం, సమీక్ష, గేయం, వ్యాసం… ఇలా అన్ని సాహితీ ప్రక్రియల్లో ప్రేవశం ఉన్న పద్మజగారు మంచి ఉపాధ్యాయురాలు కూడా. అందుకే ఈ వారం అటు భాష, ఇటు సాహిత్యం రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది టాల్. చాలామందికి నిస్సారంగా అనిపించే వ్యాకరణం వల్ల అసలు ఉపయోగం ఉందా, తను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి...

Άκου το podcast TALRadio Telugu στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS