Touch A Life Foundation

TALRadio Telugu

Arts TE ↓ 979 Folgen

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

Besuch unbedingt die Website des Podcasts und unterstütze die Macher: podcasters.spotify.com

Autor

Touch A Life Foundation

Kategorie

Arts

Podcast-Website

podcasters.spotify.com

Neueste Folge

15. Okt 2026

Wo hören?

Podcasts in der App Replaio Radio Bald verfügbar

Podcasts kommen bald in die App. Installiere sie jetzt und erlebe als Erster einen ganz neuen Blick auf Podcasts

Bei Google Play herunterladen Kostenlos installieren Android fast 10 Mio. Downloads · Bewertung 4,8 iOS bald

Folgen

"మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66 23.03.2026

మన ఊరి పేరు వినగానే మనలో ఏదో తెలియని ఒకరకమైన ఆనందం కలుగుతుంది కదా! చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు, స్కూల్‌కి వెళ్లిన రోజులు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. అందుకే.. ప్రస్తుతం సియాటెల్ లో ఉంటున్నా, మన సంస్కృతిని మర్చిపోకుండా అక్కడి వారికి మన 'కోలాటం' నేర్పిస్తూ తెలుగుతనాన్ని చాటుతున్నారు Isha Dance Academy కి చెందిన కీర్తి లక్ష్మీ గారు. విదేశీ పక్షుల సందడితో కళకళలాడే పులికాట్...

"అందరికీ హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పటమే మా లక్ష్యం" - కిషోర్ | Special interview 23.03.2026

బైక్ రైడింగ్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కు వెళ్లడం మాత్రమే కాదు. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. మరి మనం బైక్ నడుపుతున్నపుడు ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా హెల్మెట్ ఎంచుకునేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? అసలైన సేఫ్టీ హెల్మెట్ అంటే ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్నెస్ డే' సందర్భంగా 'బైకర్స్ ఆఫ్ హైదరాబాద్' క్లబ్ కెప్టెన్ కిశోర్ గారు ఈ ప్రత్యేక...

"ఒకే రాత్రిలో నిర్మించిన పెద్ద కోనేరు మా ఊరి ప్రత్యేకత" - అనీల కామసాని | మా ఊరు - 65 16.03.2026

మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి స్థాయిలో ఉన్నా పుట్టి పెరిగిన ఊరు ఇచ్చే ఆత్మీయత ఎక్కడా దొరకదు. పుంగనూరు గ్రామం గురించి, అక్కడి ప్యాలెస్ లో తాను చదువుకున్న రోజుల గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనీల కామసాని గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు.  ఆమె బాల్య స్మృతుల గురించి, ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ తమ సొంత ఊరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. తప్పకుండా చూడ...

కాలేజ్ నుండి కార్పొరేట్ ప్రపంచంలోకి... ఎలా సిద్ధమవ్వాలి? | Special Interview with Key Run 16.03.2026

క్యాంపస్ లైఫ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ నుంచి కెరీర్ అనే బాధ్యతాయుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతి విద్యార్థిలోనూ ఎన్నో సందేహాలు, భయాలు ఉండటం సహజం. మరి స్టూడెంట్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీగా మారే క్రమంలో మనలో ఎలాంటి మార్పులు రావాలి? కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ కెరీర్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ Key Run గారు ఈ ప్రత్యేక ఇంటర్వ...

మొదటి 'నెలసరి' - శారీరక మార్పులు , ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 96 11.03.2026

అమ్మాయిల జీవితంలో మొదటి నెలసరి అనేది ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు పిల్లలను కొంత ఆందోళనకు గురిచేయడం సహజం. అసలు ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదం సూచించే ఆహార నియమాలు ఏంటి? ఎదుగుతున్న అమ్మాయిలకు ఈ సమయంలో తోడుగా ఉంటూ, వారిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి? వంటి ఎన్నో సందేహాలకు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చక్కని పరిష్కారాలను...

"తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 64 | Part - 2 09.03.2026

సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన ఎన్నో జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు గత వారం మనతో పంచుకున్నారు కదా! ఈ వారం తన పెళ్లి కబుర్లు, అమెరికాకు వెళ్లిన నాటి ముచ్చట్లు వంటి విషయాలను పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి “మా ఊరు” పాడ్కాస్ట్ ను.. అస్సలు మిస్ అవ్వకండి! From running a small shop i...

వీధి పిల్లలకు విద్యా వెలుగులనిస్తున్న ఇద్దరు మహిళలు | Special Interview 09.03.2026

చదువు మాత్రమే మన పరిస్థితులను మార్చగలదు. మన కలలను నిజం చేయగలదు.. అని బలంగా నమ్మిన సంస్థ ‘చోటు కి ఎడ్యుకేషన్’. ఒక చిన్న వీధిలో అతి తక్కువ ఖర్చుతో ఓ గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పుడు వంద మంది దాకా నిరుపేద పిల్లలకు పాఠాలు చెప్తోంది. మరి ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? భవిష్యత్తులో నిరుపేద పిల్లల కోసం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? వంటి ఎన్నో విషయాలను ఆ సంస్థ కో -...

మోనోపాజ్ పై అవగాహన ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 95 04.03.2026

మోనోపాజ్.. ఇది ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక సహజమైన మార్పు. కానీ, ఈ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చాలామందిని అయోమయానికి గురిచేస్తాయి. అసలు ఈ దశను ఆరోగ్యంగా, ప్రశాంతంగా దాటడం ఎలా? ఆయుర్వేదం ఈ మోనోపాజ్ గురించి ఏం చెబుతోంది? మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఈ హార్మోన్ల మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను ఎలా తగ్గిస్తాయి? వంటి ఎన్నో విలువైన...

"తండ్రి బాటలో నాణ్యత.. తన బాటలో నాయకత్వం…" - ప్రసాద్ అంగులూరి | మా ఊరు - 63 02.03.2026

సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు ఈ వారం "మా ఊరు" పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! From running a small shop in his hometown and having fun with childhood friends to becoming a City Council Member in Bothell,...

"అడుగు ముందుకేస్తే సేవ చేయాలనే తపన దానికదే పెరుగుతుంది" - మహేష్ తలారి | Special Interview 26.02.2026

ఈ రోజుల్లో సిటీలో అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ స్థలం దొరకదు, అటువంటిది.. పెద్ద పెద్ద నగరాల్లో అతి తక్కువ స్థలంలోనే దట్టమైన అడవులను సృష్టించడం సాధ్యమేనా? అంటే కచ్చితంగా సాధ్యమనే అంటున్నారు.. మహేష్ తలారి గారు. ఒక మొక్క అడవిగా మారే కాలాన్ని పది రెట్లు వేగవంతం చేసే 'జపనీస్ రహస్యం' గురించి, 50,000కు పైగా మొక్కలు నాటి, మన దేశీ వృక్ష జాతులతో గ్రీన్ రివల్యూషన్ ను సృష్టించడం గురించి.. ఎన్నో కబుర్లన...

పరుగెత్తే ప్రతి అడుగు బాలికల చదువుకి భరోసా 20.02.2026

బాలికలకు నాణ్యమైన విద్య, వైద్యం, ప్రోత్సాహం అందిస్తే.. సమాజంలో గొప్పగా రాణించగలరని భావించి.. వారికి అండగా నిలబడడానికి సేవా భారతి సంస్థ ప్రతి సంవత్సరం “Run For A Girl Child” ను నిర్వహిస్తుందని మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మార్చ్ 1st న గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమాన్ని గురించి, సేవా భారతి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ జయప్రద దేవి గారు, వాలంటీర్ శిరీష గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు..!...

స్క్రీన్ టైమ్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు, డిజిటల్ డీటాక్స్ తో ప్రయోజనాలు | Ayurvedam - Arogyam - 94 18.02.2026

పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్లు స్క్రీన్‌ లకే పరిమితమైపోతున్నాయి. దీనివల్ల కలిగే ఒత్తిడి, నిద్రలేమి మనల్ని మెల్లగా అనారోగ్యం వైపు నెట్టేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ డిజిటల్ ప్రపంచం నుండి కాస్త బ్రేక్ తీసుకుంటే.. అంటే 'డిజిటల్ డీటాక్స్' పాటిస్తే మన లైఫ్ ఎంత బాగుంటుంది? అసలు దీన్ని ఎలా మొదలుపెట్టాలి? మన రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని...

"పిల్లల భద్రత అందరి బాధ్యత" - పడాల సూర్యప్రసాద్ | Special Interview 12.02.2026

పిల్లలకు సరైన వయసు లో ,సరైన విషయాలను , సరైన విధంగా , చెప్పాలి అంటున్నారు పడాల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్య ప్రసాద్ గారు.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ మరియు మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ పడాల ఛారిటబుల్ ట్రస్ట్ .. ఇవాళ మన టాల్ రేడియో లో పడాల సూర్య ప్రసాద్ గారు పిల్లల భద్రత గురించి , వారికి వారి శరీరం గ...

Holistic Lifestyle అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 93 11.02.2026

మనం తినే ఆహారం, మన ఆలోచనలు, మన నిద్ర.. ఇవన్నీ కలిస్తేనే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్'. కానీ, చాలామందికి అసలు ఈ సంపూర్ణ జీవనశైలిని ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అందుకే, అసలు ఆయుర్వేదం ఈ హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ గురించి ఏం చెబుతుంది? దీనివల్ల మనకి కలిగే లాభాలేంటి? రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి ఎన్నో విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎప...

"కొత్త టెక్నాలజీతో ఎలాంటి క్యాన్సర్ అయినా నయమవుతుంది" - డా. మల్లిక్ సింగరాజు | Special Interview 05.02.2026

క్యాన్సర్... ఈ పేరు వినగానే ఒక తెలియని భయం, ఆందోళన మనల్ని చుట్టుముడతాయి. కానీ సరైన సమయంలో గుర్తించి, సరైన ట్రీట్మెంట్ అందిస్తే దాన్ని ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదు! సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింగరాజు గారు. ఒకవైపు సీనియర్ కన్సల్టెంట్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు 'సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్' ద్వారా వే...

ఆధునిక సమాజం లో ఆయుర్వేదం పై ఉన్న అపోహలు, నిజానిజాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 92 04.02.2026

ఆయుర్వేదం అనగానే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన మైండ్‌లో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అపోహలు వస్తూ ఉంటాయి. అసలు ఈ మోడ్రన్ బిజీ లైఫ్‌కి ఆయుర్వేదం సెట్ అవుతుందా లేదా? అనే అంశంపై చర్చిస్తూ ఆయుర్వేదం ఉపయోగాల గురించి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మిస్ అవ్వకండి.. ఇప్పుడే వినేయండి! When we hear the word Ayurveda , many questions and misconcept...

"పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview 02.02.2026

పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్...

"మా ఊరి గంగమ్మ జాతర ఇప్పుడు వరల్డ్ ఫేమస్" - భార్గవి రెడ్డి 27.01.2026

ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వారం వారం తిరుమల కొండను ఎక్కిన ఆ అనుభూతులు, ఊరి గుడుల మధ్య గడిపిన తీపి జ్ఞాపకాలు, మనసులో నిలిచిపోయిన మరెన్నో ముచ్చట్లు... వీటన్నింటితో పాటు తిరుపతి లో అత్యంత వైభవంగా జరిగే 'తాతయ్యగుంట గంగమ్మ జాతర' విశేషాలను ఈ ‘మా ఊరు’ ఎపిసోడ్ లో మనతో పంచుకుంటున్నారు తిరుపతికి చెందిన భార్గవి రెడ్డి గారు! ఆ జాతర వెనుక ఉన్న కథ ఏంటి, అక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయి, తన ఊరితో తనకున్న అను...

"మాట్లాడటం మొదలు పెడదాం" - అనూష భరద్వాజ్ | స్ఫూర్తి కిరణాలు 25.01.2026

ప్రతి అమ్మాయి తన కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను సాధించాలనే గొప్ప లక్ష్యంతో వేలాది మంది గ్రామీణ బాలికల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు 'VOICE 4 Girls' ఫౌండర్ అనూష గారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అడ్డుకుంటూ, లైంగిక ఆరోగ్యం మరియు లైఫ్ స్కిల్స్‌పై అవగాహన కల్పిస్తూ వారు చేస్తున్న ఎన్నో పనుల గురించి, బాలికా సాధికారత కోసం ఆ సంస్థ సాగిస్తున్న అద్భుత ప్రయాణం గుర...

"వైకల్యం ఉన్న పిల్లలకు సానుభూతి కాదు సపోర్ట్ ఇవ్వాలి" - మాధవీలత | Special Interview 22.01.2026

గత 25 ఏళ్లుగా ఎంతో మంది దివ్యాంగ పిల్లలకు అమ్మగా మారి అండగా నిలుస్తూ, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు ఆశాజ్యోతి డైరెక్టర్ మాధవిలత గారు. కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా, వారికి ఫిజియోథెరపీ, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ సమాజంలో గౌరవంగా బతికేలా ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ చేస్తున్న ఈ సేవలు, పిల్లల విజయగాథల గురించి మాధవిలత గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి! For the past 25...

నేటి యువత ఆయుర్వేదం వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? | Ayurvedam Arogyam - 91 21.01.2026

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరిగినా, దాన్ని ఆదరిస్తూనే… ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే సమస్యలకు సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుక్కుంటూ యువత ఆయుర్వేదం వైపు ఆసక్తి చూపుతోంది. అసలు ఆయుర్వేదంలో యువతను అంతగా ఆకర్షిస్తున్న అంశాలు ఏమిటి? రోజూ వారి జీవితంలో ఆయుర్వేదాన్ని పాటించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వొచ్చు? వంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా....

"సమస్య ఉన్న ప్రతి మహిళకి నేను తోడుంటా" - విజయలక్ష్మి | Special Interview 20.01.2026

ఎల్లప్పుడూ మహిళల ఆరోగ్యం కోసం, వారి సంక్షేమం కోసం ఆలోచిస్తూ.. మహిళల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి విజయలక్ష్మి గారు. చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలదని, సమస్యలను తీర్చగలదని నమ్మి, పెళ్లి అయినా తర్వాత LLB చదివి లాయర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈమె.. మహిళలు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గుర...

"ఆర్గాన్ డొనేషన్ కోసం మాట్లాడడానికి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు" - లలిత రఘురామ్ | Special Interview 19.01.2026

అవయవ దానం గురించి మన సమాజంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అపోహలూ! కానీ వాటన్నింటికీ సరైన సమాధానం చెబుతూ, ప్రాణదానం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ లలిత రఘురామ్ గారు. మనం తీసుకునే నిర్ణయం ఎంత ముఖ్యమైనదో… మనం వెళ్ళిపోతూ కూడా ఇంకొకరి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో వంటి విషయాలను, అలాగే అవయవ దానం గురించి మోహన్ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలను, వారి కార్యక్రమాలను గురించి ఈ ప...

"You 2.0: 2026లో మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండిలా" - బి. కృష్ణ భరత్ | Special Interview 16.01.2026

ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే మనం, ఒక్కోసారి మనల్ని మనం గెలవడం మర్చిపోతుంటాం. ఈ కొత్త ఏడాదిలో క్యాలెండర్ తో పాటు మన ఆలోచనలను కూడా మార్చుకుని, 'థ్యాంక్ ఫుల్ నెస్, డిజిటల్ డిటాక్స్, అంతరంగ ప్రయాణం' వంటి సూత్రాలతో మనలోని You 2.0 వర్షన్ ను ఆవిష్కరించుకోడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బి. కృష్ణభరత్ గారు ఎన్నో మంచి విషయాలను, సూచనలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పక వినండి… అస్సలు మిస్...

Lipi.Game: సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక సాంకేతికత | Special Interview with Sagar Anisinga Raju 12.01.2026

పురాణాలు, ఇతిహాసాల గురించి చెప్పే వీడియో గేమ్స్ వస్తే ఎలా ఉంటుంది? మొబైల్ చేతిలో ఉంటే ఫైటింగ్స్, కార్ రేసింగ్‌లే కాకుండా.. మన కళ్ళ ముందు మహాభారత, రామాయణ ఘట్టాలు ఆవిష్కృతమైతే? ఆటలు ఆడుతూనే ప్రాచీన విజ్ఞానాన్ని నేర్చుకోగలిగితే ఎంత బావుంటుందో కదా! ఇదిగో సరిగ్గా ఇలాంటి వినూత్న ఆలోచనతోనే పుట్టింది 'లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్'. వీడియో గేమ్స్ ద్వారా కేవలం వినోదం మాత్రమే కాకుండా, పిల్లలలకి భాష...

Höre den Podcast TALRadio Telugu in Replaio

Radio und Podcasts in einer App - kostenlos und ohne Anmeldung. Installiere sie noch heute und verpasse den Start nicht

Bei Google Play herunterladen

Replaio ist kein Herausgeber von Podcasts; die Namen der Sendungen, Cover und Audioinhalte gehören ihren Autoren und werden über öffentliche RSS-Feeds verbreitet