Naveen Chenna
నవీన కవిత
మొదలైంది కవితా ప్రవాహం. అది వెలుతుంది చాలా దూరం. వీలైతే వినండి. నచ్చితే ప్రోత్సహించండి.
Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: hubhopper.com
Autor
Naveen Chenna
Categorie
Site-ul podcastului
Cel mai nou episod
16 iun. 2024
Unde asculți?
Podcasturi în aplicație Replaio Radio În curândPodcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor
Episoade
ఆ నలుగురు 16.06.2024 1:18
ఆత్మ పరిశీలన అలవాటు లేని మనుషులు అడవిలో తిరిగే జంతువులు అవతలి వారు అచ్చం తమలాగే ప్రవర్తిస్తే తట్టుకోలేరు అది తమ ప్రతిబింబమే అని గుర్తించలేరు మనో వైకల్యంతో బాధపడే మనుషులు తాము సుఖ పడరు తమ వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు చేసేవన్నీ పనికి మాలిన పనులు నచ్చ చెప్పినా వినరు ఎంత తిట్టినా మారరు మందలో గొర్రెల లాంటి మనుషులు ఒకడు చెప్పేది విని ఊగిపోవడం తప్ప తమకు తాముగా ఆలోచించడం చేతకాని సన్నాసులు తమకి తెలివి లేద...
నేనింతే 22.05.2024 2:01
బ్రతిమిలాడటం, బలవంత పెట్టడం నా పద్దతి కాదు అలిగి సాధించుకోవల్సిన అగత్యమూ లేదు పై పై నవ్వులు, పలకరింపులు నాతో కాదు నా ఖర్చులకు నేను సంపాదించుకున్నంత కాలం ఇంకొకడి ముందు తగ్గి బ్రతకాల్సిన ఖర్మ నాకేం పట్టలేదు నాకు పనికొచ్చేది ఒక పసివాడు చెప్పినా వింటాను నాకు పనికిరానిది ఆ పరమాత్ముడు చెప్పినా సరే పట్టించుకోను నాకేం కావాలో తెలుసుకోగల జ్ఞానం, నాకొక వరం వద్దు అనుకున్నది విడిచిపెట్టే వివేకం, నా బలం తెలివి,...
బానిస 24.03.2024 1:08
ఆశలకు ఉరి వేసి చంపే అవసరాలు ఊరికి దూరంగా వెలివేసే ఉద్యోగాలు కళాశాల నుండి బయటపడగానే కష్టాలు షురూ! ఏం చేస్తున్నావ్, ఎంత సంపాదిస్తున్నవ్? చదువు పూర్తయి సరిగ్గా నెల తిరగకుండానే ఎదురయ్యే ప్రశ్నలు నిదానంగా ఆలోచించుకునే అవకాశం సరైన పనిని ఎంచుకునే స్వతంత్రం ఈ రెండూ ఎండమావులే చాలా మందికి బాధ్యతలు అనే సంకెళ్లు తగిలించి లాగేస్తారు కిందికి మనసు నలిగిపోతున్నా పనికి ఇస్త్రీ చొక్కా వేయాల్సిందే కలలు కరిగిపోతున్నా...
చిత్తు కాగితాలు 28.02.2024 3:22
సంఘర్షణ - యాతన - తపన
గమనం 31.12.2023 1:09
ఏ రోజుకారోజు ఏ మార్పూ లేదని ఏడుస్తూనే ఉంటాం తీరా ఒకరోజు, ఏడాది అప్పుడే అయిపోయిందా? అని తీరికగా ఆశ్చర్యపోతాం! కాలాన్ని కొలవడానికి గడియారాన్ని వాడుతున్నామా, గడియారం చూస్తూనే కాలాన్ని గడిపేస్తున్నామా మనం? పారే నీటికి అంటదు మలినం దూకే జలపాతానికి లేదు భయం అలసట తెలుసా వీచే గాలికి అలుపన్నది ఉందా ఎగిరే అలకి రగిలే మంటకు పట్టదు చెద నాటిన చోటే పాతుకు పోయే చెట్టుకి కూడా పైకి ఎదగాలనే ఆశ సహజం కదా! గడిచిన సమయం ఎ...
అలంకారం 12.12.2023 1:03
ఏదో ఒక దశలో మనం ఇంకొకరి జీవితాన్ని ప్రభావితం చేయగలం ఆ సమయంలో మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం కాగలదు ఆ వ్యక్తి జీవితంలో ఒక కీలక మలుపుకి కారణం ఒకరి అవసరాన్ని అవకాశంగా నిస్సహాయ స్థితిని తమకు అనుకూలంగా వాడుకుని జనాలతో ఆడుకోవడానికి అలవాటు పడ్డ మనుషులున్న సమాజంలో ఉన్నాం మనం అడవిని కాల్చే మంటలో దారిని చూపించే దీపంలో ఉన్నది ఒకటే అగ్ని కణం శక్తి ఉన్నంత మాత్రాన ఉండదు అందరికీ సాయం చేసే గుణం పేరు కోసమో పుణ్యం క...
ఆయుధం 11.11.2023 1:05
పరులకి నువ్వొక పరికరం తాము అనుకున్నది సాధించే క్రమంలో నువ్వొక సాధనం ఒకరి ఆటలో నువ్వు పావుగా మారటం తాను గెలవడానికి నిన్ను ఆయుధంగా వాడటం అన్నీ తెలిసి కూడా ఏమీ అనలేం సగటు ఉద్యోగికి ఇది సర్వ సాధారణం గాడిదలా భారం మోస్తూ చెప్పిందానికల్లా తలాడిస్తూ నీ శక్తిని ఇంకెవరికో ధారబోస్తూ పొట్టనింపుకోవడమే కదా నీ ఉద్యోగం చచ్చే వరకు బ్రతుకుని ఇలా నెట్టుకు పోవడం మూర్ఖత్వం పని చేసే శ్రామికుడివి నువ్వైతే ఆ ఫలితం అను...
సూరీడు 10.10.2023 0:58
"సాయం"కాలం ఎక్కడికీ పారిపోడు మబ్బుల మాటున మాయమూ కాడు కనబడటం లేదని, లేడని కాదు స్వచ్ఛమైన మనషి, ఎప్పుడూ స్వయం ప్రకాశితుడు తాను వెలుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్లకి వెలుగునిచ్చే "సూరీడు" ఏ పేరునీ ఆశించిక ప్రకాశించే సూరీడు కనుకే ప్రజలూ కీర్తించరు ఉచితంగా దొరికే దానికి విలువ ఇవ్వరు కానీ కనబడిన ప్రతి రాయికీ మొక్కుతారు కనబడని దేవుడికి మొక్కులు చెల్లిస్తారు దీపం చుట్టూ తిరిగే పురుగులు దిక్కుమాలిన గ్రహాలు తమ...
ఇంతేనోయ్ జీవితం 28.08.2023 1:09
నచ్చిందేదో చేస్తూ పోవటం వచ్చిందేదో స్వీకరించటం నీతో వచ్చిన వాళ్లకి తలా ఇంతా పంచటం ఉన్నంతలో సంతోషంగా బ్రతికేయటం రోజూ ఏదో ప్రయత్నించటం ఏదేమైనా ఎదుర్కోవటం బాధను భారంగా భావించకపోవటం నీ బ్రతుకులో అది ఒక భాగమని అంగీకరించటం ఇప్పుడు నువ్వున్న స్థితినుండి ఇంకొంత ఉన్నతంగా మారేందుకు ఉపయోగపడే మార్గం భయాలు ఉన్నా ముందడుగు వేయటం భరోసా లేకున్నా అనుకున్నది చేయటం బంధాలలో బందీగా మారకపోవటం ఇదే కదా వీరుల లక్షణం ఏం చేస...
మనం 29.06.2023 1:56
మతం, కులం మద్యం, రాజకీయం పుస్తకం, సాహిత్యం పత్రికా, చలనచిత్రం ఇలా ఇంకెన్నో వ్యాపకాలు బాధ నుండి, భయం నుండీ మనల్ని బయటపడేసే సాధనాలు సమస్యను ఎదుర్కోవటం కాదు మన ప్రాధాన్యం తప్పించుకునే మార్గం వెతకటమే మన ధ్యేయం ఏ బాధా దానంతట అది పోదు ఆ స్థానంలో ఇంకేదో వచ్చి చేరితే తప్ప మనకి నచ్చిందే చేస్తాం నమ్మిందే ఆచరిస్తాం దాన్ని ఎవడైనా వ్యతిరేకిస్తే వాడి అంతు చూస్తాం అవతలి వాడి వాదన వినేందుకు అస్సలు సిద్దంగా ఉండం ద...
గొంగళి పురుగు 11.06.2023 1:04
మనిషొక యంత్రం మనసొక తెల్ల కాగితం గొంగళి పురుగులా మొదలైంది నీ ప్రయాణం సీతాకోకలా మారాలా చేతకాదని వదిలేయాలా అనేది నీ సామర్థ్యం దేహాన్ని ఎలా వాడుకుంటావో దాహాన్ని ఎలా తీర్చుకుంటావో ఎన్ని రంగులు పులుముకుంటవో ఇక నీ ఇష్టం పాకినంత కాలం ఎవరూ పట్టించుకోరు ఎగరగానే నీ వెనక వస్తారు ఎదిగితే మావాడే అని చెప్పుకుంటారు బెల్లం చుట్టూ మూగే ఈగలు ఈ జనాలు నీతో పని లేకుంటే పట్టెడు మెతుకులు కూడా పెట్టరు ఆశలు చంపుకోకు అనుకు...
మధురం 25.04.2023 1:53
ఒకే ఆత్మను రెండు ముక్కలుగా విడదీశాడు ఆ దేవుడు ఆడ,మగ అనే పేర్లు పెట్టి తలో దిక్కున విసిరేశాడు కలుసుకోవాలనే తపనను మనసులో రగిలించాడు ఆ ఇరు హృదయాల ప్రయాణం చూసే పై వాడికి కాలక్షేపం మన మనిషి ఎదురవగానే కలిగే ఆకర్షణ అసంకల్పితం అది విధి లిఖితం, అలౌకికం, అద్భుతం మన ప్రమేయం లేకుండా మరొకరి మీద కలిగే భావం మాటలకందని మధురానుభవం మనసుని మనసుతో ముడివేసే దారం మనిషి మనుగడకు ఆధారం అందితే వరం అందకపోతే కలవరం అనుభూతి చ...
విరహం 31.12.2022 1:00
నా కలల ప్రపంచానికి రాణివి నువ్వు వలపు వనంలో విరిసిన పువ్వు నీ నవ్వు నేను వెలకట్టలేని నీ ప్రేమని నాకు కానుకగా ఇవ్వు పడిపోతున్నా నవ్వుతున్న నీ ప్రేమలోన వద్దని నన్ను దూరంగా నెడుతున్నా నేనున్నా నీ గుండెలోన తళుకుమనే తారవు నువ్వు మెరుపులీను నీ చిరునవ్వు మసక తెరల మాటున నువ్వు మనసైన మనిషిని దరి చేరనియ్యవు కోరిన కాంతవు నువ్వు దూరమైపోయావు ఏకాంతానికి నన్ను అంకితమిచ్చావు ఏ కాంతీ లేని చీకట్లోకి తోసేశావు కూసింత...
మౌనం 05.11.2022 1:17
నాకు నచ్చేలా ఉన్న నిన్ను నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను కానీ నా ప్రేమను నీకు చెప్పే పరిస్థితుల్లో నేను లేను చెప్పి నీ స్నేహాన్ని వదులుకొలేను సూటిగా చూస్తే నీకు ఎక్కడ తెలిసిపోతుందో అని నేరుగా నీ కళ్ళలోకి కూడా చూడలేను నా మనసొక మాయావి జాలీ దయా లేవు దానికి వద్దని వారించినా పదే పదే నన్ను నెడుతుంది నీకేసి ఆశ పడటం అది దక్కలేదని బాధపడటం నీ వల్ల అనుభవించే బాధ కూడా ఒక సుఖం నిన్ను నవ్వించడం నా బాధ్యత నువ్వు ఏ...
జ్ఞాపకం 20.08.2022 1:06
నిన్ను చూడాలని రోజూ నీతో మాట్లాడాలని ఏదో వెర్రి కోరిక నాలోన కుదరదని తెలిసినా వినదు కదా మనసు నిన్ను ప్రేమించడం తప్ప దానికి ఇంకేం తెలుసు కలిసి నడిచిన వారందరూ చివరకి ఒకే తీరం చేరరు అని తెలిసికునేలోపేవదిలి వెళ్లిపోయావు నన్ను మనసంతా నింపుకున్నా నిన్ను అంత సులువుగా ఎలా మర్చిపోగలను మనసులో ఉన్న బాధను ఎవరితో పంచుకోలేను మనసులో దాచుకొని మామూలుగా ఉండలేను ఇంత వేదనకు గురిచేసినా నిన్ను దూషించలేను కోరి వలచిన...
తపన 10.08.2022 1:10
రవికి ఉదయించడం, నదికి ప్రవహించడం జాబిలికి వెన్నెలను పంచడం, కవికి రాయటం ప్రత్యేకంగా ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు నా రచనలు అందరికీ చేరాలి అన్న అభిలాష తప్పితే ప్రతి ఒక్కరికీ నచ్చాలి అన్న అత్యాశ లేదు రెక్కలు విప్పి ఎగరాలని ఆ చుక్కల చెంతకు చేరాలని వెండితెరపై వెలగాలని నా కథలను కంచికి చేర్చాలని కలలు కంటున్నా కునుకు రాకున్నా అడుగులు తడబడుతున్నా నెమ్మదిగానైనా నా దారిలో నే వెళ్తున్నా కాలం నాతో కలిసి రాకున్...
నీదీ నాదీ ఒకే కథ 23.07.2022 1:07
మనసు మరీ మారాం చేస్తుంది ఎందుకో ఇలా?? రోజు రోజుకీ మారిపోతుంది చంటి పాపలా ఎక్కడ లేనివన్నీ గుర్తుకొస్తాయి సరిగ్గా పడుకునే వేళకి లాలించి బుజ్జగించి నిద్రపోయేలోపు మారిపోతోంది తేదీ నచ్చిన పనికి డబ్బులు రాక డబ్బులొచ్చే పని నచ్చక మునుపటిలా దేన్నీ ఆస్వాదించలేకపోతున్నా ఉన్న ఈ ఒక్క ఉద్యోగం వదులుకోలేక ఆశ పడ్డది అందుకోలేక ఇలా సగం సగం బ్రతుకుతున్న అనుకున్నంత తేలిక కాదు తలరాతను ఎదుర్కోవడం నచ్చినా నచ్చకపోయినా లా...
బోడ మల్లన్న 18.07.2022 1:09
ముత్యమంత నవ్వుకే మురిసిపోతావు కాస్త చనువిస్తే కరిగిపోతావు మాట కలిపిన వారంతా మన వాళ్ళు అనుకుంటావు తెలివిలేని నరుడా నిన్ను తేలికగా వాడుకుంటారు ఏరు దాటించిన తరువాత బోడమల్లన్నవు నువ్వు నువ్వు అనుకున్నది జరగనినాడు ఆశపడింది దక్కని నాడు నా అనుకున్న వారు నీతో ప్రవర్తించే తీరు గమనిస్తే చాలు అంతకు మించి అవసరం లేదు నీకు ఏ వ్యక్తిత్వ వికాస పాఠాలు నీ గమ్యానికి చేరనివ్వకుండా అడ్డుపడేది ఏదైనా నీకు శత్రువే అది భయ...
విజాతి ధృవాలు 13.07.2022 1:05
మన అభిరుచులు వేరు అభిప్రాయాలు కలవలేదు ఇద్దరి నమ్మకాలకు అసలు పొంతనే లేదు మన మధ్య జరిగిన గొడవలకు లెక్కే లేదు అయినా మనం విడిపోలేదు విజాతి ధృవాలను కలిపి ఉంచే అయస్కాంత క్షేత్రంలా పనిచేస్తుందేమో మన మధ్య ఏదో బలం ఏ జన్మలో ముడిపడిన బంధమో ఈ జన్మలో అయ్యాం ప్రేమికులం అనుకోకుండా కలిసాం మనం చూస్తుండగానే ఒక్కటై పోయాం కలలా ఉంది ఇన్నాళ్లు గడిపిన కాలం తొలిసారి నిన్ను చూసిన క్షణం నా మదిలో పదిలం కలకాలం మన చేతికున్న వ...
నాతో నేను 05.07.2022 0:59
నాతో నేను నిజాయితీగా ఉంటే చాలు అక్కర్లేదు నాకే మంచి పేరు నచ్చింది చేస్తూ ఇలా బ్రతికేస్తే చాలు నన్ను నేను కోల్పోయి కోరుకోను ఏ సన్మానాలు నా కలల ప్రపంచంలో విహరించే స్వేచ్ఛ ఉంటే చాలు అక్కర్లేదు నాకే కీర్తి కిరీటాలు ఒక మూసలో బ్రతికేయడం నా వల్ల కాదు ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు ఈ జనాలు మాటకు విలువనిచ్చే మనిషిని నేను కాకిలాగా రోజంతా వాగలేను ఏరి కోరి ఎవ్వరి మనసు నొప్పించలేను నా పెదవి దాటిన మాటకు నేను బానిసను...
ధూళి రేణువులు 14.06.2022 1:13
మాట మీద నిలబడలేని వాడు మనిషికాదంటారు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనుకున్ననాడు మనసు మార్చుకోవడంలో తప్పులేదు మాట మీద నిలబడి మూటకట్టుకొని పోయేదేమీ లేదు ఇక్కడ ఎవరూ దేవుళ్లు కారు రేపేం జరుగుతుందో ఊహించలేరు పరిస్థితులకు తగ్గట్టు మారే తీరు తప్పంటే ఎలా మాష్టారు?? మంచైనా చెడైనా మొఖం మీదే చెప్పాలంటారు సరే అని ఉన్నదున్నట్టు మాట్లాడితే దున్నపోతులా మీద పడిపోతారు మనుషులు కదా మాటంటే పడలేరు మంచి అనిపించుకోవ...
నువ్వు నేను ప్రేమ 21.05.2022 1:51
నింగివి నువ్వు నేలను నేను దూరంగా ఉంటే కలిసిపోయినట్టే ఉంటాం దగ్గరయ్యేకొద్దీ పెరుగుతుంది మన ఇద్దరి మధ్యన దూరం జాబిలి నువ్వు సూరీడు నేను ఒకేచోట ఇరువరం ఎప్పుడూ కలిసిలేం నన్ను చూడగానే అవుతావు నువు మాయం మంచువు నువ్వు మంటను నేను దగ్గరకు రానీయవు నన్నెప్పుడూ కరిగిపోతావేమో అని భయమేమో నీకు నా ప్రేమలో తీరం నీవు అలను నేను నిన్ను తాకాలనే తపనతో ఎగిసిపడుతున్నా నీ కోపం చూసి మళ్లీ వెనక్కి వస్తున్న అంటీ ముట్టనట్టే ఉ...
మూర్ఖ 10.05.2022 1:10
అమావాస్య రోజున వెన్నెల కోసం ఎదురుచూసేవు కాల రాత్రిలో జాబిలి తోడు కోరేవు చుక్కలెన్ని ఉన్నా చాలవా నీకు?? హద్దులన్నవి లేవు నీ కోరికలకు నడి ఎడారిలో నీవు నదుల జాడలు వెతికేవు మండుటెండలో సైతం నీ నడకను ఆపవు ఒయాసిస్సులో నీరు సరిపోదా నీకు? ఎండమావుల వెనక ఎందుకు పరిగెడతావు?? ముసురుకమ్మినవేళ ముడుచుకొని పడుకుంటావు గ్రహణమేమో అని నీ గది దాటి బయటకి రావు తొలకరి చినుకలకి పరవశించి ఆడేను నెమలి వరదొస్తే బురదవుతుందనే ని...
నిజాలు 22.03.2022 1:41
కొన్ని నిజాలు నీటిలోని చేపలు మనోసంద్రాన మాత్రమే మనగలవు బయటికొస్తే బ్రతకలేవు కొన్ని అభిప్రాయాలు మూగ జీవులు ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోరు వెల్లడించని మాటలు వ్యక్తపరచని భావాలు మనసుని స్థిరంగా ఉండనీయవు కాలిలో ముల్లులా కంటిలో నలుసులా అంత సులువుగా బయటికి రావు నవ్వుతూ మాట్లాడే వారందరూ నీ వారు కాదు నీకు తెలిసిన వారిలో సగం మంది మహానటులు నిన్ను తనలా ఎప్పటికీ భావించరు వింటున్నారు కదా అని చెప్పకు నీ బాధలు ప...
మనసు 22.03.2022 1:39
చెప్తే వినదు ఆపితే ఆగదు నిద్ర పోనివ్వదు నిన్ను నీలా ఉండనివ్వదు మహా చిలిపిదీ మనసు మనిషంటే దానికి అలుసు దక్కని దానికోసం దుఃఖమెందుకు అంటే అస్సలు ఒప్పుకోదు చూసిన ప్రతీది కావాలంటుంది నచ్చిందల్లా తెచ్చివ్వమంటుంది మహాముదురు ఈ మనసు మనిషిని వాడుకోవటం దానికి బాగా తెలుసు మంచీ చెడులని ఎంచదు కట్టుబాట్లను కానదు తీరం చేరేదాక ఆగదు తీరా చేరాక సేద తీరదు పసిపాపలాంటిదీ మనసు పాపం పుణ్యం తెలియదు పరులు సుఖపడుతుంటే చూసి...
Podcasturi asemănătoare
Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice