Sri Bharadwaj
తెలుగు నుడి - Telugu Nudi
తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్
Author
Sri Bharadwaj
Category
Podcast website
Latest episode
Oct 19, 2025
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
అమ్మలగన్న అమ్మ.. 24.10.2020 8:52
ఈ భాగంలో లో పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతం లోని అమ్మవారిని స్తుతిస్తూ వర్ణించిన పద్యాలను పరిచయం చేసుకోవచ్చు.
గాలి పల్లకిలో యెంకి పాటలా..!! 19.10.2020 8:33
ఈ భాగంలో నండూరి సుబ్బారావు గారు భావించిన తెలుగు దంపతుల ప్రణయ పాటల తోట " యెంకి పాటలు " పరిచయం చేసుకోవచ్చు. ఈ పాటలు స్వచ్ఛం...మాటలు స్వచ్ఛం.. నాయుడు బావ, యెంకి ల ప్రేమ స్వచ్ఛం.. వినండి.. ఆనందించండి...
గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020) 18.10.2020 1:22
గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020)
అర్జునుడు నిదురోవని రేయి..!! 11.10.2020 12:58
చేమకూర వేంకట కవి రచించిన ప్రబంధం " విజయ విలాసం " లో, అర్జునుడు చిత్రాంగద ని చూసి ముగ్ధుడై, ఆమె అందాన్ని ఒక చెట్టు కింద కూర్చొని ఆ వసంత రాత్రిని గడిపిన సమయంలో ఆయన మనఃస్థితి వినవచ్చు.
గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20) 11.10.2020 1:40
గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20)
నిక్కమైన మంచి - ఏనుగు లక్ష్మణ కవి - నీతి శతకం 07.10.2020 6:39
ఈ భాగంలో భర్తృహరి రచించిన నీతి శ్లోకాలను అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను మూల శ్లోకాలతో పాటు విందాము.
మన బారిష్టర్ గారు..!! 05.10.2020 13:19
ఈ భాగంలో " బారిష్టర్ పార్వతీశం " హాస్య కథ నుంచి ఒక చక్కని సన్నివేశం వింటాము. ఇది వ్రాసింది శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. విని హాయిగా తెలుగులో నవ్వుకోండి....
గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020) 04.10.2020 2:10
గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)
రాముడు చెప్పిన రామాయణం 03.10.2020 18:16
ఈ భాగంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకం " ఉత్తర రాఘవము " లోని సీతారామ లక్ష్మణుల నడుమ జరుగు సంభాషణ. విని ఆనందించండి.
ఎన్నాళ్ళు తిరిగేది? 29.09.2020 4:47
ఈ ప్రసరణలో , త్యాగరాజ స్వామి వారి కీర్తన ' ఎన్నాళ్ళు తిరిగేది ' లోని సారాంశాన్ని, అందులోని తెలుగు పదరత్నాలను విందాము
దీన విహంగ సందేశం 28.09.2020 12:46
ఈ భాగంలో ' నవయుగ కవి చక్రవర్తి ' గుఱ్ఱం జాషువా వారి ' గబ్బిలం ' ఇతివృత్తం తెలుసుకొని, అందులో కొన్ని పద్యాలు పరిచయం చేసుకుంటాము..
గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020) 27.09.2020 1:44
గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)
గత వారపు నెమరు - పరిచయం 27.09.2020 0:57
ఈ శీర్షికన వెలువడే ప్రసరణలలో , ఆ ముందు వారం లో విడుదల అయిన అంశాలు, వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొనే వీలు ఉంటుంది. ఇది తేదీల పరంగా అమర్చడం జరుగుతుంది.
మౌనంగా పలుకవా బాలూ 26.09.2020 3:41
ఈ భాగాన్ని 25-Sep-2020 న పుణ్యలోకాలకు తన గానామృతం పంచడానికి కదిలిన S.P.B, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలూ కి అంకితం చేస్తూ.. నా భావాలను పంచుకుంటున్నాను..
కృష్ణాతీరాన మట్టి మాటలు 24.09.2020 7:35
ఈ ప్రసరణ లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన ' కృష్ణాతీరం ' నవలలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుంటాం. విని ఆనందించండి.
' అగ్నిధార ' లో తెలుగు వెలుగులు 23.09.2020 6:15
' ప్రజాకవి ' దాశరథి కృష్ణమాచార్య తన జైలు జీవితం నుండి నెమరు వేసుకున్న కవితలు ' అగ్నిధార ' ఖండకావ్యం. అందులో ఉన్న ఒక కవిత ' జైల్లో ' . అదే ఈ భాగంలోని అంశం.ఇందు చెప్పబడిన భావములో ఏదైనా సవరణలు ఉంటే ప్రాజ్ఞులు rangabharath@gmail.com ద్వారా తెలుపగలరు.
బధిర బాధ 22.09.2020 6:09
ఈ భాగంలో, చిలకమర్తి వారి ' ప్రహసనములు ' లో ' బధిర చతుష్టయం ' నాటకం నుండి చిన్న సన్నివేశంలో సంభాషణని విందాము. మీకు ఈ భాగంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉంటే rangabharath@gmail.com కి విద్యుల్లేఖ వ్రాయగలరు Ref: Manasa publications వారి ప్రహసనములు
తెలుగు విద్యార్థీ 21.09.2020 4:27
ఈ భాగం లో మనం ఒక పద్యాన్ని చదువుకుందాం. ఇది కరుణశ్రీ గారి ' ఉదయశ్రీ ' లోనిది.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.