Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

నాకేమవుతోంది ఎపిసోడ్ 19 | Nakemavuthondi Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 22.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  నాకేమవుతోంది..? ఎపిసోడ్ 19 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గదిలోకి వెళ్లాక ప్రియను ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆమెకు ఎదురుగా తను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక స్టూల్ ఉంచాడు. తనతో తెచ్చుకున్న మ్యూజిక్ ప్లేయర్ని ఆ స్టూల్ పై ఉంచాడు. వెలుతురు అడ్జస్ట్ చేయడానికి వీలున్న ఒక బల్బ్ ని కూడా ఆ టేబుల్ పై...

Anuvanuvuna Jwalinchina O hrudayana | అణువణువున జ్వలించిన ఓ హృదయాన | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 16.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆమె జీవితంలో మాటలతో చెప్పనలవి కాని పాత్ర వహించిన కాలేజీ మేట్ పవన్ కుమార్ కారాగార ఏకరూప దుస్తులలో చెట్లకు నీళ్లు- పైపులతో పిచకారీ చేస్తూ ఎదురవుతాడు. నిజం చెప్పాలంటే— ఆమె పవన్ కుమార్ ని ప్రేమించిందని చెప్పడం కంటే మనసా...

ప్రేమ చేజారితే 12 | Prema Chejarithe 12 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 15.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 12 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) కుమార్ వచ్చి ఎంతో భావోద్వేగంతో ఇలా మాట్లాడసాగాడు. "అందరికీ నమస్కారాలు... ఈ ప్రాజెక్టును మేము పదిమంది స్నేహితులము కలిసి చేసాము, ఇంకా కొనసాగుతూనే వుంది. మేము మొదట ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలనుకుంది మా వ్యక్తిగత ప్రయోజనం కొర...

ప్రేమ చేజారితే 11 | Prema Chejarithe 11 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 15.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే - ధారావాహిక పదకొండవ భాగం రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) 'ఇంతకీ కుమార్ వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్టు ఏదో తెలుసా?!?' అని అడిగాడు నితిన్. ఎవరూ, ఏమీ పలక లేదు... మళ్ళీ నితినే... మీకు ఆ ప్రాజెక్టు గురించిన అంచనా లేదనిపిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు యొక్క విశేషతను మీరు అర్థం చేస్...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 | Garudashram - Episode 14 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 14.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ తరువాత ప్రణవి మళ్ళీ మొదలు పెట్టింది. "యువరానర్! భావన తన హత్యకు ముందు వ్రాసిన డైరీ ఇది. ఇందులో ఆమె ఏం జరిగిందో అంతా వ్రాసింది. మల్హోత్రా అనే ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె దగ్గరికి వచ్చి, మిసైల్స్ కి సంబంధించిన డ్రాయింగులు కావాలని అడిగ...

మమతల మధువు ఎపిసోడ్ 13 | Mamathala Madhuvu Episode 13 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 14.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి మమతల మధువు ఎపిసోడ్ 13 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సమయం పుదయం ఎనిమిది గంటల ప్రాంతం. ప్రేమ వేగంగా ఆదిత్య యింటిలో ప్రవేశించింది."అత్తయ్యా!... అత్తయ్యా!...”పూజ ముగించి హారతి యివ్వబోతువున్న గౌరి ప్రేమ కంఠం విని..."పూజగదిలోకి రా!...” పిలిచింది.ప్రేమ పూజగదిలోకి ప్రవేశించింది. గౌరి కర్పూర హారతిని యి...

నాకేమవుతోంది ఎపిసోడ్ 18 | Nakemavuthondi Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 13.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది..? ఎపిసోడ్ 18 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తన ఇంటికి వచ్చిన ఉదయ్ ని సాదరంగా ఆహ్వానించాడు డిటెక్టివ్ పురంధర్. అతని భుజం పై చేయవేసి తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. గది బయటే ఆగిన ప్రవల్లిక ను చూసి "నువ్వు కూడా రావచ్చమ్మా" అన్నారాయన. వెంటనే ప్రవల్లిక కూడా తండ్రి గదిలోకి ప్రవేశించింది. "కాఫీ రెడీగా ఉంచాను....

మమతల మధువు ఎపిసోడ్ 12 | Mamathala Madhuvu Episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 11.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 12 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ధనుంజయరావు బెంగుళూరు చేరారు. హాస్టల్కు వెళ్ళి ప్రేమను కలిశారు. హాస్టల్ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పి.. ప్రేమతో నెల్లూరికి బయలుదేరాడు. కార్లో వారు నెల్లూరు చేరేటప్పటికి సమయం రాత్రి ఎనిమిదిగంటలు.ప్రేమ మౌనంగా తన గదికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొన...

ప్రేమ చేజారితే 10 | Prema Chejarithe 10 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 11.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 10 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) నితిన్, కుమార్తో కలిసి కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తూ ఇలా మాట్లాడసాగాడు, " నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనే నిన్ను ఇక్కడికి పిలిచాను. అదేమంటే, ఇప్పుడు మీ ప్రాజెక్టులో మా ప్రమేయముండే అసలైన ఘట్టం మొదలయ్యింది, ఇంతకాలం ఈ ప్రాజెక్ట...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 | Garudashram - Episode 13 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 11.04.2023

గరుడాస్త్రం - ఎపిసోడ్ 13 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రణవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టింది.“మీ పేరు”? “హారిక” “ఏం చేస్తుంటారు”... "నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను.” “ఈ నెల 10వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చూసారో చెప్పగలరా?” “ఆ రోజు రాత్రి 8 గంటలకు నేను ఆఫీసు నుంచి...

మనసంతానువ్వే 3 | Manasantha Nuvve 3 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 11.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  మనసంతా నువ్వే 3 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏయ్ కానిస్టేబుల్! ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. మీరంతా పైనకు వెళ్ళండి. దొరికవాళ్ళను దొరికినట్టు పట్టుకోండి, " అంటూ పరుగున సీత ఉన్న బంగళాలోకి వెళ్ళాడు. అటువైపు తిరిగివున్న సీతను చూసి, "చేతులు పైకెత్తు. కదిల...

మమతల మధువు ఎపిసోడ్ 11 | Mamathala Madhuvu Episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 10.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 11 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కొద్ది రోజులుగా ఎంతో ప్రశాంతంగా వున్న గోపాల్ మనస్సులో... బెంగుళూరు రెస్టారెంట్లో ఆనంద్ ప్రేమలను చూచినప్పటి నుంచీ కలవరం మొదలయింది. వారిరువురికీ పరిచయం ఎలా కలిగింది?... వారిది కేవలం స్నేహమేనా!... లేక ప్రేమనా?... ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే... తన పరి...

మమతల మధువు ఎపిసోడ్ 10 | Mamathala Madhuvu Episode 10 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 09.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 10 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గోపాల్ తనలో జరుగుతున్న సంఘర్షణకు... ముగింపు కలగాలని నిర్ణయించుకొని ఆ గతరాత్రి గౌరి నిదురించిన తర్వాత.. యింట్లోని ఆఫీస్ గదిలోనికి వెళ్ళి... తను ఏ పరిస్థితుల్లో శాంతిని వివాహం చేసికొన్నది... వారిరువురి పరిచయాన్ని గురించి వివరంగా వ్రాసి... తను చేసిన ఆ నే...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 | Garudashram - Episode 12 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 09.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి గరుడాస్త్రం - ఎపిసోడ్ 12 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ మర్నాడు సీఐడీ ఒక ప్రకటన చేస్తూ భావన హత్య కేసులో పురోగతి సాధించామని, హంతకుల వేట కొనసాగుతోందనీ రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకటన చూసి శ్రీహర్ష ప్రణవి ఆశ్చర్యపోయారు. హారిక ఫోన్ చెయ్యగానే ఇన్ స్పెక్టర్ రవీంద్ర స...

కలసి ఉంటే కలదు సుఖము 3 | Kalasi Unte Kaladu Sukhamu 3 | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 08.04.2023

కలసి ఉంటే కలదు సుఖము 3 రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ పెద్ద కథ 3/3 “ఏమత్తా, మాకు అన్నం పెట్టేదుందా, లేదా?” అనేవాడు వీళ్ళ పనులు చూసి రామసుబ్బారావు.“రాముడూ, ఈ నాలుగు రోజులూ అందరికీ ఇక్కడే భోజనాలు, ” అనేది సుభద్రమ్మ. “హైమా, మరి మాకు టిఫన్ అయినా చేసి పెడతావా?” అన్నాడు రామసుబ్బారావు. “అలాగే..చేస్తాను” అన్నది హనుమావతి. హనుమావతి పేరును పెళ్ళిలో రామసుబ్బారావు వాళ్ళు హైమావతి అని మార్చుకున్నారు. ఒకాదివారం...

మనసంతానువ్వే 2 | Manasantha Nuvve 2 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 08.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసంతా నువ్వే 2 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)“ఛీ... అంటే ఆ నల్లటివాడే నా మొగుడు అంటావు, నేను చచ్చినా వాడిని చేసుకోను. మీరు బలవంతంగా నన్ను ఒప్పించారంటే, మీకెవ్వరికి కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను, ” అంది బెదిరిస్తూ. “అయ్యో అవేం మాటలే తల్లి, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటు...

ధర్మో రక్షతి రక్షితః | Dharmo Rakshathi Rakshithaha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 06.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ధర్మో రక్షతి రక్షితః రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు. స్వర్గాలు చూపిస్తానని చెప్పదు. భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలు ఉంటాయి. గీత చదివాక సవాళ్ళుంటాయి. గీత చదివాకసంక్షోభాలుంటాయి. అయితే ఆ సంక్షోభాలని, ఆ సవాళ్ళనీ ఎదురుకోవడానికి సరిపడా ధ...

కలసి ఉంటే కలదు సుఖము 2 | Kalasi Unte Kaladu Sukhamu 2 | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 06.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలసి ఉంటే కలదు సుఖము 2 రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ పెద్ద కథ 2/3 “కొంచెమే లేమ్మా, ”అన్నాడు చిన్నవాడు అజయ్. ఆ తరువాత రోజు పెద్ద రోట్లో చింతకాయలు, పసుపు ఉప్పు మెంతులు వేసి దంచి, చింత తొక్కు రెడీ చేశారు. దంచడానికి ఇద్దరు చెంచువాళ్ళు వచ్చారు. రాజ్యమ్మ, కుమారి తోస్తూ ఉంటే, వాళ్ళు దంచారు. ఆ పచ్చడిని పెద్ద పెద్ద జాడీలకు ఎత్తి పెట్టారు....

మనో నేత్రం | Mano Nethram | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 06.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనో నేత్రం రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “రాఘవా !” పిలిచారు తండ్రి రామమూర్తి.. కొడుకు గొంతు సవరింపు విని..“రండి..” కోడలు కాత్యాయని ఆహ్వానం.. తన పతిదేవుడు రాఘవయ్యను చూచి..రాఘవ వరండాలో ప్రవేశించాడు.కుడివైపున వున్న అరుగుపై వాలుకుర్చీలో రామమూర్తిగారు వున్నారు. వారికి చూపు పోయింది. వయస్సు డెబ్బై ఎనిమిది.ఐదే...

నాకేమవుతోంది ఎపిసోడ్ 17 | Nakemavuthondi Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 06.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 17 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "అలాగే ప్రియా..నేను వెంటనే బయలుదేరుతాను.ఎసిపి ప్రతాప్ గారి అన్న కొడుకు ఉదయ్, తరుణ్ కి స్నేహితుడు. నాకు కూడా బాగా తెలుసు. డాక్టర్ శ్రీనివాస్ గారికి అభ్యంతరం లేకుంటే అతన్ని కూడా తీసుకొని వస్తాను. ఒకసారి వారిని కనుక్కో" అంది ప్రవల్లిక.ప్రియ, శ్రీనివాస్ తో విషయం చెప్...

తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రు పప్ప | Turrupappa Turrupappa Ehehe Turrupappa | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 05.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తుర్రుపప్ప తుర్రుపప్ప ఎహెహె తుర్రు పప్ప రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖరచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ ఊరు పేరు మహారాజ గోపాలపురం. బాగా డబ్బు ఉన్న చాలామంది ఆ ఊర్లో ఉన్నారు. పచ్చని వరిచేలు, ప్రతి ఇంటి దొడ్డి ప్రాంతంలో పాలు సమృద్ధిగా ఇచ్చే ఆవులు, గేదెలు, ఊరంతా కళకళ లాడే పూలమొక్కలు. ఎక్కడపడితే అక్కడ ఏపుగా...

మనసంతానువ్వే 1 | Manasantha Nuvve 1 | Telugu Web Series | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 05.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి మనసంతానువ్వే 1 రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మనసంతా నువ్వే పెద్ద కథ 1/3 “సీతా … ఎక్కడున్నావే, స్కూల్ టైయమయితుంది తొందరగా రావే” అంటూ కేకవేసింది సీత తల్లి కామాక్షి. “అత్తా … సీత పెరటిలో నందినితో ఆడుకుంటుంది, వస్తుందిలే అత్తా నేనువెళ్ళి పిలుచుకొని వస్తాను,” చెబుతూనే పరుగెత్...

మమతల మధువు ఎపిసోడ్ 9 | Mamathala Madhuvu Episode 9 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 05.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 9 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రి గౌరి... గోపాల్తో తనకు భవానికీ... మధ్యన జరిగిన సంభాషణను గురించి తెలియజేసింది. ప్రేమకు ఆదిత్య మీద వున్న చిన్ననాటి అభిమానం యిప్పుడు లేదని తెల్చింది.అంతా విన్న గోపాల్ కి ... తన చెల్లెలు ఆదిత్యకు ప్రేమ పేరిట వ్రాసిన లేఖల వల్ల ఆమె అభిప్రాయం తేటతెల్ల...

గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 | Garudashram - Episode 11 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 05.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 11 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రంతా ప్రణవి శ్రీహర్షకి బెయిల్ వస్తుందో రాదో అన్న ఉత్కంఠతో గడిపింది. బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆమె తండ్రి కరుణాకరం కోర్టులోనే ఆమెకి ధైర్యం చెప్పినా ఆమెకు నమ్మకం కుదరటం లేదు.. ఉదయం లేస్తునే ఆమెకు పిడుగు లాంటి వార్త తెలిసింది. క్రిత...

చిన్నాన్న | Chinnanna | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 04.04.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చిన్నాన్న రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏరా శేఖర్ బాగున్నావా?” పుస్తకం చదువుకుంటున్న నేను తల ఎత్తి చూసేసరికి ఎదురుగా చిన్నాన్న. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు చిన్నాన్న. లోపలనుంచి నాన్నా, అమ్మా వచ్చారు. “ఏరా శివా, ఇదేనా రావడం?” నాన్న ఆప్యాయంగా చిన్నాన్న భుజం మీద చేయివేసి...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.