Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

" నిట్ట నిలువుగా ఇట్టే ఎగిరే ఎయిర్ టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !" 27.11.2019

కధా వచనం శ్రోతలకు విజ్ఞాన విషయాలు అంద చేత లో అంశంగా ఎగిరే ఎయిర్ టాక్సీలు వచ్చేస్తున్నాయని శుభ సమాచారం !.

" డా. బి.ఆర్.అంబేద్కర్ గారు, రాజ్యాంగ సభ ,అధ్యక్ష హోదాలోచేసిన ప్రసంగం " తెలుగు సేత ఎన్. వేణుగోపాల్, 26.11.2019

డా. అంబేద్కర్ గారి చారిత్రక ఉపన్యాసము ను, వీక్షణం ,ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ గారు , తెలుగు లో అనువదించి న దానిని కధా వచనం శ్రోతలకు వినిపిస్తున్న ది కానమోకు,

" మధ్య యుగా ల భారత చరిత్ర విదేశీ దండ యాత్రల చరిత్ర అయితే నేటి భారత చరిత్ర కాలుష్య దండయాత్ర చరిత్ర " 26.11.2019

సుప్రీంకోర్టు దేశ రాజధాని లో కాలుష్యం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది . ప్రజలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు !. ప్రజలను " గ్యాస్ ఛాంబర్ లో ఉంచి చనిపోయేలా చేస్తారా ! కాలుష్యం కారణంగా ప్రజల జీవిత కాలం కుంచించుకు పోతుంది !

" నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం " ఈనాడు ఎడిటోరియల్ . 26.11.2019

70 వసంతాలు నిండిన భారత రాజ్యాంగం . భారత ప్రజలమైన మేము.... అంటూ రాసుకున్న రాజ్యాంగానికి సిసలైన ప్రభువులు ప్రజలే !.

" మామిడి చెట్టు " అనే కధ , రా.వి. శాస్త్రి రాశారు. 25.11.2019

రా. వి. శాస్త్రి ,వృత్తిరీత్యా న్యాయవాది. కధల్లో కూడా న్యాయవాదే !. నేటిసమాజంలో నిత్యమూ పై తరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన ,హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకునే ,పెద్దమనిషి పెద్ద మనసున్న వాడు ఈ రా. వి.శాస్త్రి !.

" పార్వతీ పరిణయం " అనే ఈ కధ ను కొడవటిగంటి కుటుంబరావు వ్రాశారు. 25.11.2019

సమాజంలో అగ్రవర్ణానికి చెందిన స్త్రీ కి నిమ్న జాతి యువకునితో వర్ణాంతర వివాహం జరిగితే నష్ట పోయేది నిమ్న జాతి యువకు డే నని తెలియచెప్పే కధ , కుటుంబరావు గారు వ్రాసిన " పార్వతీ పరిణయం" అనే కధ !.

" నాన్న .... నేనొచ్చేస్తా.... ! " కధ , రచయిత్రి ఈశ్వరి . 24.11.2019

నాటి తరం స్త్రీ కి నేటి తరం మహిళకి ఉన్న తేడా , ఈ కథలో తల్లీ ,కూతుళ్ళయిన సావిత్రి ,సుధ ,లు ,ఆ నాటి ఉత్తరాలు కూతురు సుధ కు ఎలా కనువిప్పు కలిగించిందో వినేవాళ్లకు బాగా అర్థమై హమ్మయ్యా అనిపించక పోదు!.

" కుటుంబ బంధాలను పటిష్టం చేసుకుందాం !" చంద్ర ప్రతాప్ . 24.11.2019

" మంచి గురించి మందిలో చెప్పు , చెడుగురించి చెవిలో మాత్రమే చెప్పు ! ".

" కమ్మ తెమ్మెర " అనే కధ ను మధు రాంతకం రాజారాం ,గారు వ్రాశారు. 23.11.2019

శ్రీ మధు రాంతకం రాజా రాం కధలు పెద్దమనిషి తరహాగా కుదురుగా కమ్మగా ఉంటాయి. వీరి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. .ఈ కధ " కమ్మ తెమ్మెర " లో పెళ్లికుమారుని పై జాలిపడి పెళ్ళి కూతురు తెచ్చి శాలువా కప్పిన వైనం శ్రోతలకు గిలిగింతలు పెట్టి మధురాను భూతులను నెమరుకు తెస్తుంది !.

" దోష గుణం " అనే ఈ కథను గుడి పాటి వెంకటా చలం గారు వ్రాశారు. 22.11.2019

చలం ఒక ఉప్పెన !. మూఢా చారాలతో క్రుళ్ళిపోయిన సంఘానికి చలం కధలు కత్తిపోట్లు. ఈ యన కధలు చదివితే ఆడవాళ్ళు చెడిపోతారని ఆయన పుస్తకాలను తగులబెట్టారు .సంప్రదాయాలు, నీతులు, నియమాలు అన్నిటి మీద చలం ధ్వజం మెత్తాడు. ఈ" దోష గుణం " కథలో సెక్స్ కారణంగా స్త్రీ గురయ్యే చిత్ర హింసను చలం శక్తివంతంగా లోకానికి చాటి చెప్పడం జరిగింది.

" దేశ వ్యాపిత 30 కంపెనీలు బ్యాంకు ఋణాలు తీసుకుని 1 కోటి 61 లక్షలు ఎగ వేసిన ఘనా పాఠీలు" . 22.11.2019

" ది .వైర్ " అనే ఒక ప్రజా సంబంధవ్యవహారాల సంస్థ , సమాచార హక్కు చట్టం క్రింద సేకరించిన సమాచారం మూలంగా 30 కంపెనీలు , బ్యాంకుల అప్పులును ఎన్ని కోట్లలో ఎగ గొట్టింది వెలుగు చూసినది.

" జీవ పరిణామం " గురించి ప్రొ. రామచంద్రయ్య గారి వివరణ. 22.11.2019

కోతి నుండి మనిషి పరిణామం చెందాడు. అనే అనుమానాయుత సందేహాన్ని ప్రొ. రామచంద్రయ్య గారు వివరించిన అంశాన్ని వినడం చేద్దాం!.

" పడవ ప్రయాణం " పాలగుమ్మి పద్మ రాజు గారి కధ. 21.11.2019

పడవ ప్రయాణం కధ లో తనను హింసించే పురుషుడిపట్ల ఒకరకం స్త్రీకి ఉండే వ్యామోహ పూరిత మనస్తత్వం ఎంత విచిత్రమైనదో ద్యోతక మవుతుంది. ఈ కధ పద్మరాజు గారు పడవ టాపుమీద పడుకుని నీటిలో తెలిపోతున్నట్లు గా చెబుతున్నట్లు ఉంటుంది వింటున్న వాళ్లకు !.

""డాబా ఇల్లు " అనే ఈ కధ కు రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ . 21.11.2019

ప్రతి మధ్యతరగతి మహిళకు తెలిసిసిన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ . ఈ "డాబా ఇల్లు " కధ లో గతిలేక అమ్ముకున్న డాబా ఇంటి మీద విడదీయ లేని మమకారాన్ని పెంచుకున్న ,విషాద మూర్తులైన ఒక బడుగు జంట వాస్తవ జీవిత చిత్రణ ఇది!.

" తస్మాత్ జాగ్రత్త ! ఈ తరం ఐ.టి. ఉద్యోగులకు హెచ్చరిక !." 20.11.2019

కొత్త టెక్నాలజీ లను నేర్చుకోవాలి !. ఐటి నిపుణుల మెడ పై కత్తి వేలాడుతుంది !. యువకులు తస్మాత్ జాగ్రత్త !.

" మన అమ్మమ్మ మ్మ ఇల్లు ఎక్కడ అనుకుంటున్నారు !?." వినండి మరి!. 20.11.2019

బోట్స్వానా లో మై టో జినో మిక్ వంశ వృక్షం ఆనవాళ్ళు ను సిడ్నీ యూనివర్సిటీ రీసెర్చ్ బృందం కనిపెట్టారోచ్ !.

" అసంతృప్తి - ఆత్మ తృప్తి " గోపాలుని రఘుపతిరావు. 20.11.2019

నిశ్చలానంద హేతువు ఆత్మ తృప్తి . శుద్ధ బుద్ధ మైన మనసును పట్టి పీడించే అదృశ్య దుష్ట శక్తి అసంతృప్తి.

" నిత్య నూతనంగా నవతరం విద్య " డా. టి .సిద్దయ్య , మాజీ రిజిస్ట్రార్ , ఎస్.వి.యూనివర్సిటీ. 20.11.2019

నిరంతర అభ్యాసమే ఆలంబన. నాలుగవ పారిశ్రామిక విప్లవం నేడు నడుస్తోంది. కృత్రిమ మేధ, ఆగమెంటెడ్ రియాలిటీ , వర్చువల్ రియాలిటీ లు విద్యా బోధనా భ్యాసాలను మార్చేస్తాయి.

" అంతే గా ! అంతేగా ! " అనే కధ ను డి.సూరి బాబు వ్రాశారు. 17.11.2019

ఈ కథలో ఉష అనే కొత్త కోడలు , తనకు వరుసకు అక్క అయ్యే మమత ఇంట ,చూచిన పరిస్థితిని ,ఆకళింపు చేసుకుని ,తన అత్తింట ఏవిధంగా తనను తాను మలుచుకుంది ......

" మలి సంధ్య వెలుగులు " ఐక్యరాజ్య సమితి నివేదిక . 17.11.2019

ఈనాడు దినపత్రిక , ప్రత్యేక సమాచార నివేదిక ఆధారంగా , ప్రపంచం లో వృద్ధ జనాభా పెరుగుతున్న తీరు ను , పరిశీలిద్దాం !.

నవంబర్ 19 " ప్రపంచ పురుషుల దినోత్సవం " సందర్భంగా కధా వచనం శ్రోతల శుభాకాంక్షలు !. 16.11.2019

" ప్రపంచ పురుషుల దినోత్సవం " వెనుక చరిత్ర , పురుషుల ప్రత్యేకత లను తెలిపే అంశాలు .

" ఇదీ అసలు చదువు !" అని డా. దామెర వేంకట సూర్యారావు , వివరించిన విషయం. 07.11.2019

భారతీయ విద్యా విధానం ఆలోచన , అవగాహన.

" బ్రహ్మపుత్ర పై చైనా ప్రాజెక్టులు " రచన డెచన్ ఫాల్మో , 05.11.2019

నదీ జలాలను అతిగా వినియోగించడం, నది పర్యావరణ వ్యవస్థను దెబ్బదీయడమే !. బ్రహ్మపుత్ర నది పై చైనా దేశపు దురాక్రమణ నే !.

" శాస్త్రీయత తోనే నాగరికత అభివృధ్ధి " రచన ప్రొ. సి.సి.రాజేంద్రన్ , 05.11.2019

శాస్త్రీయ భావ జాలం, మత విశ్వాసం , అనేవి రెండు విభిన్న సమాంతర మార్గాలు . హేతు బద్ధ మైన ప్రశ్నలను శాస్త్రం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది!.

" డెం ఝీ కారం ... జ్వర భద్రం !. " అని డా . ఎం.వి.రావు , ఫిజిషియన్ ,గారి వ్యాసము ను వినిపిస్తూ ... 05.11.2019

ఇప్పుడు ఎవరి నోట విన్నా డెంగీ ... డెంగీ .... డెంగీ ! దీని మీద అవగాహన పెంపొందించు కొని, ఎలాటి జాగ్రత్తలు , చికిత్స , తీసుకోవాలి ,అనే అంశం పై కధా వచనం శ్రోతలకు చైతన్యం కలిగిస్తూ ..కానమోకు.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.