TALRadio Telugu

Touch A Life Foundation

Arts TE 908 episodes

Episodes

ఒక జ్ఞాపకం .. ఒక ఆలోచన .. ఇప్పుడు ఎన్నో జీవితాల్లో వెలుగు నింపుతోంది ! | CHARCHA With Real Leader - 10 10.07.2026

ఒక జ్ఞాపకం… ఒక ఆలోచనగా మారింది...ఆ ఆలోచనే ఇప్పుడు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది!తండ్రిని కోల్పోయిన తర్వాత తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయిన సమయంలో... ఆయన జ్ఞాపకార్థం ఒక అనాథాశ్రమానికి వెళ్లారు నీలేష్ గారు. అక్కడి పిల్లల చిరునవ్వులు, వాళ్లతో గడిపిన కొన్ని క్షణాలు ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. జీవితంలో ఎదురైన బాధను తనలోనే ఉంచుకోకుండా... మరొకరి జీవితంలో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నారు. అదే...

ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు 09.07.2026

చెత్తను చూస్తే సమస్య కనిపిస్తుంది...వేరు చేస్తేనే పరిష్కారం తెలుస్తుంది!అంటూ... పర్యావరణ పరిరక్షణ కోసం క్లీన్-అప్ డ్రైవ్స్, జీరో-వేస్ట్ కార్యక్రమాలు, ఎకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న VISVA Sustainable Foundation వ్యవస్థాపకులు వినయ్ గారు ఈ వారం మన 'స్ఫూర్తి కిరణాలు' పాడ్కాస్ట్ లో!అసలు చెత్తను వేరు చేయడం ఎందుకు అంత ముఖ్యం? చిన్న చిన్న అలవాట్లు పర్యావరణంపై ఎలాంటి ప...

ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4 09.07.2026

న్యూజిలాండ్‌లో తొలి తెలుగు పుస్తకం…అక్కడి తెలుగు సాహిత్యానికి సరికొత్త గుర్తింపు…సతీష్ కుమార్ గొల్లపూడి గారు!విదేశాల్లో ఉంటూనే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆయన. కవిత్వాన్ని తన భావాలకు వేదికగా చేసుకుని, సాహితీ వర్షిత, న్యూజిలాండ్ నానీలు, జీవితం గీసిన చిత్రాలు, ప్రవాస ప్రతిబింబాలు వంటి రచనలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.న్యూజిలాండ్‌ నుంచి తొలి తెలుగు పుస్తకాన్ని ప్రచురిం...

స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9 07.07.2026

కొన్ని పెయింటింగ్స్... చూడగానే నచ్చుతాయి.మరికొన్ని పెయింటింగ్స్... చూసిన తర్వాత మనల్ని మార్చేస్తాయి!అలాంటి ఆలోచింపజేసే స్ట్రీట్ ఆర్ట్‌తో పిల్లల భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాజంలో అవగాహన కల్పిస్తూ... కళను సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చారు… స్వాతి & విజయ్ గార్లు!పిల్లలు భిక్షాటన చేస్తున్న దాని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి? మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలా పెద్ద సమస్యలక...

పిల్లల మాటలు ఆలస్యం.. నిజాలు అపోహలు! | Dr. Vishnupriya | Health Talk 06.07.2026

పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం చేస్తున్నారా?అది కేవలం Speech Delayనా... లేక Autismకి సంకేతమా?చాలా మంది తల్లిదండ్రులను అయోమయంలో పడేసే ఈ ప్రశ్నలకు మంచి సమాధానాలు ఈ పాడ్కాస్ట్ మీకోసం.Speech Delay, Autism మధ్య తేడా ఏమిటి? పిల్లలను ఎప్పుడు డాక్టర్‌కు చూపించాలి? మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం వల్ల మాటలు ఆలస్యమవుతాయా? Speech Therapy గురించి ఉన్న అపోహలు ఏమిటి? ADHD, Tongue Tie వంటి ఎన్నో అంశాలపై విలువైన సమాచారం...

పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8 03.07.2026

వీరి ATM... డబ్బు ఇవ్వదు… కానీ, కడుపు నిండా అన్నం పెడుతుంది!కరోనా సమయంలో వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న వేళ...ఎంతమందికైనా, ఎప్పుడైనా, ఎంతైనా ఆహారం అందించేలా "Rice ATM" అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు… రామదాస్ పట్టి గారు!ఈ Rice ATM ద్వారా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంతో పాటు... ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం…...

తూర్పు తీరంలో తెలుగు రేఖలు | మన రచయితలు | Season - 2 | Episode - 3 02.07.2026

ఉద్యోగం ఆయనకు ఉపాధి కల్పించింది... తెలుగు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది!ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లినా... తెలుగు భాషను మాత్రం ఎప్పుడూ వదల్లేదు మల్లికేశ్వర రావు గారు.న్యూజిలాండ్‌లో మొదలైన ఆయన రచనా ప్రయాణం... ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ చేరువైంది. ఉద్యోగం చేస్తూనే... తెలుగులో కథలు రాయడం, కవితలు రాయడం, పత్రికలు నిర్వహించడం, వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ రూపంలో సా...

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7 30.06.2026

"సేవ చేయడం... ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత!"ఈ ఒక్క విషయాన్ని నమ్ముకొని తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేశారు కృష్ణమోహన్ గారు!పిల్లలు తమకు నచ్చిన కెరీర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? యువత సేవా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి? సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే అసలు మనమేం చేయాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.సమాజానికి ఉపయోగపడే పని చేయాలని, జీవితంలో ఒక...

"ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta 30.06.2026

ఆనందంగా ఉండటమే అసలైన విజయం..రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటే జీవితం కూడా ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది…అంటూ ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు ఈ వారం విజేత కార్యక్రమంలో Anweshi గారు!హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె... నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకొని, భారతీయ సాంస్కృతిక కళలపై మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత IT రంగంలో ఉద్యోగం కోసం UK, Europe వెళ్లినా... తన మూలాలను మాత్రం ఎప...

వానాకాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త | Health Talk 29.06.2026

వానాకాలంలో... పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు పిల్లలను చాల త్వరగా ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను ఎలా పెంచాలి? వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… Dr. Vijay Krishna గారు!ప్రతి తల్లిదండ్రి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి!మిస్ అవ్వకండి!Ta...

ఎవరి కోసం ఎదురుచూడకుండా మనమే గెలవాలి! | CHARCHA With Real Leaders - 6 26.06.2026

“ఉద్యోగం పొందడం కోసం కాదు… ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి!”అనే ఆలోచనతో వేలాది మంది మహిళల్లో ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఆలోచనలను పెంచుతున్నారు డా. సౌమిని గారు! తన జీవితంలో ఎదురైన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు, సాధించిన విజయాలను ఈ పాడ్కాస్ట్ మనతో పంచుకున్నారు.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించడానికి ఏమి చేయాలి? గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలను ఎలా పెంచాలి? రైతులకు మరింత ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి? సొంతం...

ఎంత టెక్నాలజీ వచ్చినా పుస్తకం వదలొద్దు | మన రచయితలు | Season - 2 | Episode - 2 25.06.2026

సిడ్నీలో ఉంటూ ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ .. ప్రవృత్తి గా కథలు, కవితలు రాస్తూ  తెలుగు సాహిత్య సౌరభాలను వెదజల్లుతున్న ప్రముఖ రచయిత్రి విజయ గొల్లపూడి. కథలు, వ్యాసాలు, ప్రసంగాలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.ఎన్నో ప్రశంసలు, పురస్కారాలతో సాహిత్య సేవకు గుర్తింపు పొందారు.యద్దనపూడి సులోచనారాణి – వంశీ లేఖిని ప్రవాస భారతీయ సాహితీ పురస్కార గ్రహీత.ఈ వారం 'మన రచయితలు' పాడ్కా...

మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సహజంగా తగ్గించుకోండి! | ఆయుర్వేదం ఆరోగ్యం - 104 24.06.2026

ఎన్నో రకాల క్రీములు, మందులు వాడినా కూడా మొటిమల సమస్య తగ్గటం లేదా?టీనేజ్ లో వచ్చే మొటిమల వల్ల అందం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది! .. కానీ మొటిమలు తగ్గటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలావరకు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడతారు ..మొటిమలకు అసలు కారణాలేంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా సులభంగా ఇంట్లోనే సహజంగా మొటిమలని తగ్గిచ్చుకోవటం ఎలా ? లాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వారం ఆయుర్వేదం ఆర...

ఉద్యోగ బాధ్యత ఒకవైపు .. సామాజిక బాధ్యత మరో వైపు | Charcha With Real Leaders - 05 23.06.2026

ఉద్యోగం జీవితానికి… సేవ సమాజానికి..."అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఆదిత్య కృష్ణ గారు!ఒకవైపు Infosysలో IT Engineer‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే...మరోవైపు Volunteer Leader‌గా వేలాది మందికి అండగా నిలుస్తున్నారు.గత మూడేళ్లలో స్నేహితులతో కలిసి దాదాపు 34,000 మందికి సహాయం చేశారు...2026లో Infosys ప్రతిష్టాత్మక AFE Awardను సొంతం చేసుకున్నారు."మనిషి సంపాదించేది డబ్బు మాత్రమే కాదు...మనసుల...

నాన్న కాబోతున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకొండి ! | Health Talk with Dr.Shilpi Reddy 22.06.2026

నాన్న కావాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!Pregnancy టైంలో తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి!భార్య ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం నుంచి…ఆమెకు emotional support ఇవ్వడం వరకు…కాబోయే ప్రతి తండ్రి ఈ విషయాలు తెలుసుకోవాలి!పురుషుల lifestyle ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఆ టైమ్ లో భర్త భార్యతో ఎలా ఉండాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఇలా ఎన్నో ఉపయోగకరమై...

నాన్నకు ప్రేమతో... | CHARCHA With Real Leaders - 4 | Fathers Day Special 19.06.2026

నాన్న కోసం దాచిన డబ్బు... ఈరోజు ఎంతో మంది పిల్లలకు ఉపయోగపడుతుంది! తన మొదటి జీతంతో నాన్న కోరిక తీర్చాలనుకుంది ఓ కూతురు...ఆ కల నెరవేరేలోపే తండ్రిని కోల్పోయింది!కానీ ఆ బాధలోనే ఆగిపోకుండా...నాన్న కలలను సేవగా మార్చి, ఆయన పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.ఈరోజు ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లల చదువులకు అండగా నిలుస్తూ...చేసే ప్రతి మంచిపనిలో, ప్రతి చిన్నారి చిరు నవ్వులో తన నాన్నను చూసుకుంటుంది!ఇది కేవల...

హాస్యం... సందేశం.. ఇదే ఈయన రచనల ప్రత్యేకం | మన రచయితలు | Season - 2 | Episode - 1 18.06.2026

ఇంజెక్షన్‌తో ఇచ్చే 'అనస్తేషియా' గురించి అందరికీ తెలుసు... కానీ మాటలతో ఇచ్చే అనస్తేషియా గురించి మీకు తెలుసా?ఈ డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ మాత్రమే కాదు... సమాజాన్ని కదిలించే కలం కూడా ఉంటుంది!అనస్తేషియా అన్న పదాన్ని కూడా కవితాత్మకంగా మార్చి, ‘సమ్మోహన వైద్య శాస్త్రం’ అని పేరు పెట్టిన విలక్షణ రచయిత.. డా. మూర్తి జొన్నలగడ్డ గారు!చిన్నప్పటి నుంచి పుస్తకాలనే ఆట వస్తువులుగా మార్చుకున్న ఆయన ప్రయాణం ఎం...

ఆరోగ్యానికి తోడు, కుటుంబానికి అండ | Special Interview | Dyadic Health 18.06.2026

"మన ఆరోగ్యం మనపైనే కాదు... మన చుట్టూ ఉన్న బంధాలపై కూడా ఆధారపడి ఉంటుంది!"ఇది ఒక డాక్టర్ చెప్పిన మాట కాదు... 25 ఏళ్లకు పైగా ఐటీ రంగంలో ఉంటూ, AT&T, Freddie Mac వంటి గ్లోబల్ కంపెనీల్లో పనిచేసిన ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ శ్రీధర్ నాగులవంచ గారు గుర్తించిన నిజం!"మనుషులు మందులతో కోలుకుంటున్నారు సరే... కానీ బంధాల వల్ల ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు?" అన్న ఒకే ఒక్క ప్రశ్న ఆయనను వెంటాడి...

ఆయుర్వేదంతో చర్మ సౌందర్యం | ఆయుర్వేదం ఆరోగ్యం - 103 17.06.2026

“సరైన నిద్ర, మంచి ఆహారం ఉంటే చాలు.. మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!”మన ఆహారం, జీవనశైలి, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలు చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సహజమైన పద్ధతుల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి… అంటూ ఇలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.చర్మ సమస్యలు రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆయుర్వేదం సూచించే చర్...

పేపర్లో వార్త చదివి.. జీవితాలు మారుస్తున్న వ్యక్తి! | CHARCHA With Real Leaders - 3 16.06.2026

ప్రతిరోజూ పేపర్‌లో ఎన్నో వార్తలు వస్తుంటాయి... కానీ వాటిలోని సమస్యను చూసి వెంటనే స్పందించే మనుషులు చాలా అరుదు!అలాంటి అరుదైన సమాజ సేవకుడే రఘు అరికపూడి గారు!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో... సామాజిక సేవకులు రఘు అరికపూడి గారి ప్రయాణం వారి మాటల్లోనే మీకోసం!ఉద్యోగం చేస్తూనే తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయ...

కృష్ణమ్మ, దుర్గమ్మ, బెజవాడ ఎక్కడ ఉన్నా గుర్తొస్తాయి! | మా ఊరు - 76 15.06.2026

“చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి...మనం మన ఊరికి ఎంత దూరంలో ఉన్నామన మనసు మాత్రం మన ఊర్లోనే ఉంటుంది!”అంటూ... ఈ వారం 'మా ఊరు' పాడ్కాస్ట్ లో... విజయవాడకు చెందిన తార శాలిని గారు తమ ఊర్లో గడిపిన ఎన్నో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు.సత్యనారాయణపురం వీధులు, స్కూల్ రోజులు, నలుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి గడిపిన అందమైన క్షణాలు, తల్లిదండ్రులు నేర్పిన విలువలు, అప్పటి విజయవాడ సంస్కృత...

ఒక్క క్లిక్.. లక్షల డోనర్లు.. ఎన్నో ప్రాణాలు.. | స్ఫూర్తి కిరణాలు | World Blood Donor Day Special 15.06.2026

“ఒక్కసారి రక్తదానం చేస్తే... కొన్ని వందల జీవితాలను కాపాడినవాళ్ళం అవుతాం!”సరైన సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటాయి… అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తమ రక్తాన్ని దానం చేసి, వారి ప్రాణాలను కాపాడుతుంటారు. అలాంటి ఎంతో మందిని ఒక దగ్గరకు చేర్చి, అవసరమైన వారికి రక్తం అందేలా చూస్తోంది Friends2Support సంస్థ!World Blood Donor Day సందర్భంగా ఆ సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను మనతో పంచ...

చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన జీవితం | Dr. Pradeep Vajja | TALHealth Talks 15.06.2026

“అలవాట్లు చిన్నవే అయినా… అవే ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి!”ప్రస్తుతం మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సమయానికి తినకపోవడం, తరచుగా జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి ఎక్కువ కావడం ఈ అలవాట్లన్నీ నెమ్మదిగా మన శరీరంలో డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ వంటి సమస్యలకు కారణమవుతాయి.కానీ ఈ బిజీ లైఫ్‌లో కూడా ఆరోగ్యంగా, ఎక్కువకాలం ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? అనారోగ్య లక్షణాలను ముందుగానే ఎలా గుర్తించాలి? ఆ...

Height కాదు ఆత్మ విశ్వాసమే నా గుర్తింపు! | CHARCHA with Real Leaders - 2 12.06.2026

కొంతమంది పరిస్థితులను చూసి, వెనకడుగు వేస్తారు...మరి కొంతమంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుంటారు!సరిగ్గా ఇలానే ఆలోచించి, సమస్యలు మనల్ని ఆపలేవు... మనపై మనకు ఉన్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది… అంటూ ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… కల్యాణి గారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో......

బిజీలైఫ్ ని హెల్తీ లైఫ్ గా మార్చుకోండిలా! | TALHealth Talk 12.06.2026

రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని… ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం మర్చిపోతున్నారా?సమయానికి తినకపోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం మీ రోజువారీ అలావాటుగా మారిందా?అయితే ఇది మీ కోసమే!ప్రస్తుతం మన జీవనశైలి చాలా మెకానికల్‌గా మారిపోయింది. సమయానికి ఆహారం తినకపోవడం, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.కానీ ఈ బిజీ లైఫ్‌లో కూడ...

About the podcast

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.Tune in for positivity, purpose, and the power of human stories.

Author

Touch A Life Foundation

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Language

TE

Episodes

908

Latest episode

10 jul. 2026

Listen to the TALRadio Telugu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up

Download het op Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.