Dasubhashitam
Kathalu. Kaburlu. (Dasubhashitam)
దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.--దాసుభాషితం తెలుగు వారి అభిమాన తెలుగు శ్రవణ యాప్. దీనికి అసంఖ్యాక రేటింగ్స్ రివ్యూస్ సాక్షి. దాసుభాషితం యాప్ లో చికాకు పెట్టే ప్రకటలను ఉండవు. జీవితంలో శ్రేయస్సును పెంచే సాహిత్య, కళలు, ఆధ్యాత్మిక విషయాలు తప్ప. ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తకాల యాప్ కూడా. దాసుభాషితం యాప్ ను ఇపుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. Apple App Store https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474Google Play Store https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam&pli=1
Visita il sito del podcast e sostieni chi lo crea: www.dasubhashitam.com
Autore
Dasubhashitam
Categoria
Sito del podcast
Ultimo episodio
1 ott 2024
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
8. 196 Yella Naati Telugu Pustakam 01.04.2024 6:37
Kathalu. Kburlu S03E08 మా బామ్మగారి అత్తగారు, మా తాతయ్య గారి చిన్నప్పుడే చనిపోయారు. ఆయన పెరిగింది అంతా వాళ్ళ బామ్మ చేతిలో. మా బామ్మ పెళ్ళయ్యే నాటికి తన అత్తగారి అత్తగారిదే ఇంటి పెత్తనం. ఆవిడకి విపరీతమైన మడి, ఆచారం. 'నిప్పులు కడిగి, వంట చేయడం' అనేది మనలో చాలామంది ఏదో సామెతగా విని ఉంటాం. కానీ, ఆవిడకి అది నిత్యకృత్యం. 'ఆ బొగ్గులు దేనితో తయారు చేశారో', 'అవి ఎండేటప్పుడు ఏ జంతువు ముట...
7. Telugu Veera Levara ! 26.03.2024 7:09
Kathalu. Kburlu S03E07 న్యూస్ లెటర్ లో చెప్పని కాకినాడ తెలుగు సదస్సు సంగతులు Big Boss House Tv లో చూసాము కాని. సాహితీ సదస్సుతో కూడిన Big boss house ని కాకినాడలోనే చూసాము అండి. ఎందుకు ఇలా అన్నాను అంటే మేము వెళ్ళాక ఉదయం నుంచి సాయంత్రం వరకూ రక, రకాల అంశాలపై స్పీచులు, పద్యాలు, పాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా 10 నిమిషాలకి, 20 నిమిషాలకి వక్త మారుతూ ఉన్నప్పుడు నాకు Big Boss లో వెనక నుంచి ఒక వాయిస్ ఓవర్ వస్త...
6. Pellante noorella ??? 26.03.2024 7:18
Kathalu. Kaburlu S03E07 మా అమ్మా, నాన్నగార్లు గొడవ పడ్డారు అంటే, నేను పోస్ట్ మ్యాన్ అవతారం ఎత్తాల్సిందే. 'మీ నాన్నగార్ని భోజనానికి రమ్మనవే', 'నాకు ఆకలిగా లేదు నేను తినను అని చెప్పు, ఎంత గొడవ జరిగినా అన్నం తినడానికి నేను మీ అమ్మని కాదు', 'కోపం పెళ్ళాం మీదైతే అన్నం ఏం చేసింది? అన్నాన్ని వద్దనకూడదు అని కూడా తెలీదు కానీ, నా మీద ఎగరడానికి మాత్రం తయారు. అన్నాన్ని వద్దు అంటే తిరిగి అన...
04. Feminisim Aaj kal 04.03.2024 8:19
Kathalu Kaburlu S03E04నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి 'గుండమ్మ కథ'. పంట్లాగూలు వేసుకుని, అచ్చమైన కృష్ణ యాసలో గుండక్కా.. అంటూ సరదాగా ఉండే ఎన్.టి.రామారావు, 'అలా కాదు ప్రియమైన నాన్నగారూ అనాలి' అంటూ మంచితనానికి చీరకట్టినట్టు ఉండే సావిత్రి, సగం నవ్వు, సగం చూపులతోనే నటించేసే నాగేశ్వరరావు, 'అమ్మా.. కాఫీ' అంటూ గారాలు పోయే జమున, 'పేడకళ్ళు ఎత్తుకునేవాడివి నీకెందుకోయ...
3. Kaashiki Poyadu Rama Hari 27.02.2024 8:05
Kathalu Kaburlu S03E03 కాశీ, పూరీ, షిర్డి ఒకొక్కరికి ఒక్కో ఆధ్యాత్మిక అనుభవాలను ఇస్తాయి. మరి ఉత్తర పడమర తూర్పు భారత దేశాలలో రామ్ దర్శించిన క్షేత్రాల యాత్రానుభవాలు గురించి వినండి. ఇదే పాడ్కాస్ట్ మీరు యాప్ లో కూడా వినవచ్చు. బ్లాగ్ లో కూడా చదవచ్చు. ఇవే లింకులు. Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3 Blog: https://www.dasubhashitam.com/blog/kaashiki-poyadu-rama-hari యాత్...
2. Saluri Variki Kopamosthe 10.02.2024 4:43
Kathalu Kaburlu S03E02 'ఫిదా' సినిమాలో 'హేయ్ పిల్లగాడా' పాట మొదటిసారి విన్నప్పుడు భలే తమాషాగా అనిపించింది నాకు. ఆ పాటలో వచ్చే Interlude 'మల్లీశ్వరి' సినిమాలోని 'పరుగులు తీయాలి' పాటలోనిదే. అసలే మల్లీశ్వరి సినిమా పాటల పిచ్చిదాన్ని నేను. ఇక ఈ పాట కూడా నా faviourates లోకి చేరిపోయింది. ఆ పాటను అలా ఉపయోగించుకోవడం శేఖర్ కమ్ముల సాలూరి వారికి ఇచ్చిన tributeలాగా అనిపించింది....
1. Cinema Pata Yela Record Chestharante 02.02.2024 7:44
Kathalu Kaburlu S03E01 అలనాటి సంగీత విశేషాలు తెలుసుకోడానికి, ఆనాడు సినిమా సంగీతానికి ఎలా దర్శకత్వం వహించారో ఈ కథలు కబుర్లలో వినండి. ఈ కథలు కబుర్లని ఇక్కడ బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/cinima-pata-yela-record-chestharante ఈ కథలు కబుర్లని ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
50. Ramudu Ichhina Chanuvu 30.01.2024 7:35
Kathalu Kaburlu S02E50పంతులమ్మ సినిమాలో 'మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ' అనే పాటకు తనదైన శైలిలో మూడో చరణం రాసి శ్రీరాముడికి సమర్పించుకున్నారు కిరణ్ గారు. ఈ వారం విడుదలైన న్యూస్ లెటర్ లో ఆ పాటకి తన విశ్లేషణతో పాటు, తాను రాసుకున్న 3వ చరణం ఉన్నాయి. కిరణ్ గారి మిత్రులు శ్రీ రవిశంకర్ గారు పాడిన ఆడియో లింకు ఇస్తున్నాం. విని, ఆనందించండి.కిరణ్ గారి స్నేహితులు రవిశంకర్ గారు పాడిన పాట లింక్http...
49. Missamma Re-release 24.01.2024 7:39
Kathalu Kaburlu S02E49 తెలుగు సినీ చరిత్ర ప్రారంభం అయిన కొత్తలో విడుదల అయిన సినిమాలు ఆ కాలాన్ని స్వర్ణ యుగం చేశాయి. ఆ సినిమాలపైన అలోక్ నంద ప్రసాద్ గారు రాసిన ప్రత్యేక వ్యాసాల కథలూ కబుర్లు పై వీడియోలో వినండి. ఇక్కడ చదవండి. https://www.dasubhashitam.com/blog/missamma-re-release --- శ్రవణ పుస్తకం లింక్ : https://www.dasubhashitam.com/ab-title/pc-vande-cine-mataram-1
48. Vallu Sivudi Gudiki Velthe Snanam Chestaaru..!? 24.01.2024 6:49
Kathalu Kaburlu S02E48 ఈ నెల జరిగిన ప్రసంగంలో చంద్రమోహన్ గారు తరుప్పావై గురించి అద్వైతం, విశిష్టాద్వైతం, శ్రీ వైష్ణవం పుట్టుక గురించి, భక్తి ఉద్యమం గురించి ఏం చెప్పారో ఈ కథలు కబుర్లలో వినండి. చంద్ర మోహన్ గారి పూర్తి ప్రసంగం ఈ యూట్యూబ్ వీడియోలో చూడండి. https://www.youtube.com/watch?v=a0TZTdua-Nc --- https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2 https://www.dasubhashitam.com/blog/hari-...
47. Hari Avatharamule Akhila Devathalu 06.01.2024 3:19
Kathalu Kaburlu S02E47 భక్తి - శక్తి నోలాన్ తీసిన Batman Begins సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. If you make yourself more than just a man, if you devote yourself to an ideal, you become something else entirely. Which is "A Legend mr Wayne" చరిత్ర చూసుకుంటే ధ్రువుడి, ప్రహ్లాదుడు, గోదా దేవి, ఆళ్వార్లు, నాథముని, రామానుజులు, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు ఇలా చెప్పుకుంటూ వెళితే లిస్ట్ చాలా ఉంటుంది...
46. Kotta Dasubhashitam App Vidudala 30.12.2023 5:34
Kathalu Kaburlu S02E46 మాది కంచుమర్రు అని అత్తిలి మండలంలో ఉన్న ఒక గ్రామం. ఎనిమిదేళ్ళ వయసు వరకూ నా బాల్యం అంతా ఆ ఊరిలోనే గడిచింది. పెంకుటిల్లు, వీధి అరుగులు, ఇంటి ఎదురుగా కాలువ, కాలువ గట్టు అంతా చెట్లు, ఇంటి ముందు కూడా రకరకాల మొక్కలు.. ఇలా కథల్లో వర్ణించే పల్లెటూరు వాతావరణంలో పెరిగాను నేను. అందుకే కథల్లో వచ్చే ఇలాంటి వర్ణనలను త్వరగా పట్టుకోగలను. ఆ ప్రదేశాలకు క్షణంలో చేరుకోగలను. నా ఈ చిన్ని జీవితంలో...
45. Mee Illante Meeku Ishtamena ? 23.12.2023 5:30
Kathalu Kaburlu S02E45 మొగుడు వదిలేసిన ఆడది నోముకి ముత్తైదువగా ఎలా పనికొస్తుంది? ఇలాగే పెంకిగా ఉండి ఉంటుంది, అందుకే మొగుడొదిలేశాడు. దానికి తప్ప పిల్లలు మరెవరికీ లేరు మరి, రెక్కల కింద కోడిపిల్లల్ని దాచుకునే కోడిపెట్టలాగా ఎలా పెంచుతోందో చూడు. హవ్వ, ఇద్దరు పిల్లలుండగా మళ్ళీ పెళ్ళేమిటో. మొగ దిక్కు లేని సంసారం ఇలాగే ఏడుస్తుంది. ఎంత పెళ్ళి చేస్తే మాత్రం, మొగుడొదిలేశాడని ఇలా పుట్టింటి మీద పడి తినడమే? ఇలా...
44. Paga? Karuna? Deniki Votu ? 14.12.2023 4:10
Kathalu Kaburlu S02E44 ఈ వారం విడుదలైన విశ్లేషణ ‘ది ఇన్ స్పెక్టర్’ అనే నవల గురించి. యూదుల ఊచకోత నాకు తెలిసినప్పటి నుంచి చాలా సెన్సిటివ్ విషయం.ఒక జాతిని, అంత దారుణంగా హింసించడం నాకు అర్ధం కాలేదు. అసలు అందులో లాజిక్ ఏంటి? వాళ్ళకన్నా నీ జాతి గొప్పది అని నువ్వు భావించినంత మాత్రాన అది అయిపోతుంది? ఒక వేళ నీది గొప్ప జాతి అయితే, చిన్న జాతిని నువ్వు కాలరాయచ్చు అని ఏ దేవుడైనా పర్మిషన్ ఇచ్చాడా? ఇలా పోతుంటాయి...
43. Ammammaki Kooda Ardham Ayye AI Talk 06.12.2023 4:38
Kathalu Kaburlu S02E43 మా బామ్మ 1936 లో పుట్టారు. ఎలిజబెత్ 2 రాణి కంటే పదేళ్ళు చిన్న. ఆవిడ లాగే రెండవ ప్రపంచ యుద్దం చూసారు, స్వాతంత్ర్య పోరాటాలు చూసారు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు చూసారు. చాలా చారిత్రక విషయాలకి సాక్షిగా ఉన్నారు. ఇలా ఎన్నో చూసిన మా బామ్మ తన 87 ఏళ్ల జీవితంలో వస్తున్న టెక్నాలజీకి ఆశ్చర్యపోతూ, కొన్నిటిని Adopt చేసుకుంటూ, కొన్నిటితో Keep up అవుతూ కొన్నిటిలో వెనకపడిపోతూ వచ్చారు. దీపాల వెలుగ...
42. Inumulo Hrudayam Moluchunaa..?! 02.12.2023 5:31
Kathalu Kaburlu S02E42 తెలుగు వికీపీడియాలో activeగా రాసేటప్పుడు నేను ఇష్టంగా చేసే పని translations. ఆంగ్ల వికీలో ఉండే వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసేదాన్ని. అయితే, మాకు అప్పట్లో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే Google translated articles. తమ tool ను మెరుగుపరచుకోవడం కోసం, దానికి తెలుగు నేర్పడం కోసం గూగుల్ సంస్థ వారు తెలుగు వికీని దారుణంగా వాడుకున్నారు. వచ్చీ రాని భాషలో ఉడకీ ఉడకని వ్యాసాలని నేరుగా ప్ర...
41. Manatho Manam Matladukovadam Yela ?. 28.11.2023 6:22
kathalu kaburlu S02E41 మెలుకువ ఉన్నంతసేపూ నా మెదడు ఏదో ఒక పనిలో ఉంటుంది. ఇంటిపని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, ఏదైనా పుస్తకం చదవడం కావచ్చు, ఏమీ లేకపోతే instagram reels, youtube shorts, interviews, series ఇలా క్షణం తీరికలేకుండా నా మెదడుని ఏదో దాని వెనుక పరిగెట్టించడమే అలవాటు. కుదురుగా కూర్చోనిచ్చి, నిశ్చలంగా ఆలోచిస్తే గతంలోకో, భవిష్యత్ లోకో జారుకుంటోంది. అందుకే అతి entertainment తో దాని నోరు మూయించడం...
40. Anukunnamani Jaragavu Anni. 17.11.2023 4:28
Kathalu. Kaburlu. S02E40 "ఈ నవల చలం గారికి నచ్చలేదు. కానీ నాకు నచ్చింది. మొదటిసారి చదివనప్పుడు ఉన్నంత ఉత్సాహం రెండోసారి చదివినప్పుడు లేకపోయినా, తప్పిపోయిన పాత మిత్రుణ్ణి చూసినప్పుడు కలిగినంత ఆనందం కలిగింది ఈ పుస్తకం చూసినప్పుడు" అని చెప్పుకున్నారు ఈ నవలా పరిచయంలో మాలతీ చందూర్ గారు.ఇంతకీ చలం గారికి ఈ నవల ఎందుకు నచ్చి ఉండదు? స్త్రీ స్వేచ్ఛను తీవ్రంగా కాంక్షించే చలం గారికి, ఒక అమ్మాయి తన జీ...
39. Parenting Oka Kala 09.11.2023 6:06
kathalu kaburlu S02E39 పిఅల్లరి పిల్లలు విపరీతమైన తెలివిగలవాళ్లు (కథ) ఒకప్పుడు భాగ్యనగరంలో ఒక గురువు ఉండేవాడు. అతను వైద్యుడు, చాలా జ్ఞానవంతుడు, మనస్తత్వ శాస్త్రం లో చాలా అనుభవజ్ఞుడు. ఆ ఊర్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అతని దగ్గరకు వచ్చేవారు. ఒక రోజు, ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి తన పిల్లలు ఇద్దరు చాలా అల్లరి చేస్తున్నారని, ఎన్నిసార్లు మార్చడానికి ప్రయత్నించినా మారడం లేదని, ఎంత కొట్టినా, తిట్టినా, చె...
38. Oka Yadartha Ghatana 09.11.2023 4:17
kathalu kaburlu S02E38 మనం మంచి, చెడూ చెప్పుకుంటూ, విలవలు నేర్పుకుంటూ, క్రమశిక్షణ, స్వేచ్ఛ అన్నీ సమపాళ్ళలో ఇస్తూ పిల్లల్ని పెంచుకుంటున్నా, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, ఒక్కోసారి రెండు వైపుల grand parents వాళ్ళని influence చేయడం అనేది paranting లో అతిపెద్ద ఎదురుదెబ్బ. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళని ఎలా పెంచాలా అని ఎన్నో ఆలోచనలు ఎదుర్కుంటున్న వాళ్ళకు ఈ శనివారం జరిగిన ప్రసంగం బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రస...
37. Mahila Sadhikaratha 25.10.2023 8:59
Kathalu Kaburlu S02E37 యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణా సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అంటుంది చండీ సప్తశతి. అందరి బుద్ధి రూపంలోనూ, మరపు రూపంలోనూ, నిద్ర రూపంలోనూ, ఆకలి రూపంలోనూ, శక్తి రూపంలోనూ, ప్రతీ తల్లి రూపంలోనూ ఉన్నది ఆ అమ్మవారే అని చెప్తుంది ఈ వేద భాగం. కానీ అలా చూడడం అంత సులభమా? ప్రతివారిలోనూ పరమాత్మను చూడడం సాధ్యమా? కష్టమే, కానీ ప్రయత్నించినవారు పొందిన శాంతి, సాధించినవారు పొ...
35. Ye Paata Ne Paadanu 20.10.2023 5:19
Kathalu Kaburlu S02E35 Trapped Energy మన కూటమిలో ఈ వారం ప్రసంగం పై చర్చ చాలా బాగా జరిగింది. ప్రత్యక్ష ప్రసంగం తర్వాత కూడా యూట్యూబ్ లో విడుదలయిన వీడియో చూసి, తర్వాత నళినీకాంత్ గారిని ప్రశంసించడం మా దాసుభాషితం సభ్యులకి ఎంతో ఆనందం కలిగించింది. అందుకు ఆయన అర్హులు. అయితే ఇక్కడ నళినీకాంత్ గారు మితభాషి అని, కాదు కాదు అమితభాషి అంటుంటే నాకు ఒక పుస్తకంలో చదివిన Trapped Energy అనే విషయం గుర్తుకు వచ్చింది. ఈ...
34. Cinee Saraswathakshara Saradhulu 06.10.2023 5:39
Kathalu Kaburlu S02E34 ఎన్నో సినిమా పాటలు మన ధృక్పధం, ఆలోచనాధోరణి, అనుభూతులు, ఊహలు ఇలా లెక్కలేనన్నిటిని శాసించాయి, ఊతాన్నిచ్చాయి. ఒకలా చెప్పాలంటే కొన్ని పాటలు మనకు ఊహల రెక్కలు ఇచ్చి, ఇష్టమొచ్చినన్ని ప్రదేశాలు తిప్పుతాయి. అలా పాటలు పంచిన కలల్లో కొన్ని నిజమౌతాయి. కొన్ని అవుతాయన్న నమ్మకం కలిగిస్తాయి. కొన్ని అవ్వడం అసాధ్యమని తెలిపోతుంది. Bottom line ఏమిటంటే, మనం చాలాసార్లు అనాలోచితంగా చేసే చాలా పనులకు...
33. Sisurvetti Pasurvetti 28.09.2023 5:27
Kathalu Kaburlu S02E33 నా దృష్టిలో పాటంటే సాహిత్యం. అది లేకపోతే ఎంతటి సంగీతమైనా రాణించదని నా నిశ్చితాభిప్రాయం. పైగా నేను సంగీతాన్ని పెద్దగా ఆస్వాదించలేను అని కూడా అనుకునేదాన్ని. ఒకపక్కనేమో మా నాన్నగారు ఏదైనా సినిమా పాట విని 'అబ్బా, మోహనరాగంలో ఎంత బాగా ఉంది ఈ పాట. చూడు మేలుకొలుపు పాట కాబట్టీ ఈ music director భూపాలంలో చేశారు పాటని అదీ రసజ్ఞత అంటే' అంటూ చెప్పేస్తారు. ఆయన ఏనాడూ సా పా సా కూడా న...
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici