Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episódios

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.harshaneeyam.com

Autor

Harshaneeyam

Categoria

Arts

Site do podcast

www.harshaneeyam.com

Último episódio

11 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

'అహింస' దాదా హయత్ గారి కథ! 14.02.2023

'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి - htt...

వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి 13.02.2023

'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) 'సొట్ట ఆదిగాడు': ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండ...

'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ 13.02.2023

“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”  ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లక...

Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు 13.02.2023

కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబు...

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు 13.02.2023

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు. బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం. ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి,...

సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'! 13.02.2023

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది. కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గార...

స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి 13.02.2023

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub ఉత్తర పొద్దు : మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు. ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన...

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం. 12.02.2023

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి - https://amzn.to/3EoRIMn Harshaneeyam on apple podcast https://apple.co/3K1vMdw This podcast uses th...

'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో 05.02.2023

ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది. ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్...

'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ 04.02.2023

మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచ...

'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం 22.01.2023

గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. 'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com...

'ఆట' - శ్రీసుధ గారు రాసిన 'డిస్టోపియా' నించి 20.01.2023

'ఆట' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన 'డిస్టోపియా' అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'దేవుడమ్మ మరో పది కథలు' - రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ 07.01.2023

ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం 'దేవుడమ్మ మరో పది కథలు' ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. 'లా' లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి - స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు. అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. - h...

'పార్వేట' రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ 30.12.2022

కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం - పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది. కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ము...

బతుకు సేద్యం నవలాపరిచయం 29.12.2022

బతుకు సేద్యం -  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు. This podcast uses the...

ఎండ గుర్తు - అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' కథా సంపుటంనించి 24.12.2022

'ఎండ గుర్తు' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కొత్త కథాసంపుటంలో నుంచి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథాసంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి. https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/gaali-poralu This podcast uses the following third-party se...

'చెఖోవ్ కథలు - 1' పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం 21.12.2022

'Father of Modern short story' అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 - 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న పాత్రికేయులు...

ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ 18.12.2022

గీతా రామస్వామి గారు ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి. వీరు  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో, పుస్తక ప్రచురణా రంగంలో పని చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా తన  అనుభవాలపై ఈ మధ్య వీరు  ఇంగ్లీష్ లో రాసిన  ‘Land, Guns, Caste, Woman: The Memoir of a Lapsed Revolutionary’ అనే పుస్తకం చాలా ఆదరణకు నోచుకుంది. ఈ ఇంటర్వ్యూలో  వామపక్ష ఉద్...

తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ 16.12.2022

కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 - 1520 సంవత్సరాలలో  పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్...

'మైరావణుడు' నవల - యువ రచయిత ప్రసాద్ సూరి తో పరిచయం 11.12.2022

రచయిత ప్రసాద్ సూరి రాసిన రెండో నవల 'మైరావణుడు'. మూడు తరాల, ఉత్తర కోస్తా ప్రాంత వాసుల జీవితాలను, వారి వలసలనూ స్పర్శిస్తూ, JNTU హైదరాబాద్ లో, ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధి, ఇరవై రెండేళ్ళ యువ రచయిత ఆసక్తికరంగా రాసిన నవల. ఇంటర్వ్యూలో తనను ప్రభావితం చేసిన రచయితల గురించి, వ్యక్తుల గురించి, ఈ నవల గురించి ప్రసాద్ వివరించారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://an...

హర్షణీయంలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు. 03.11.2022

హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం. గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది. దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము. ఆ...

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - రెండవ భాగం 02.11.2022

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధ...

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - మొదటి భాగం 01.11.2022

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధ...

శ్రీరమణీయం - నాలుగో భాగం : వారి కథా రచన 31.10.2022

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికాసంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు...

శ్రీరమణీయం - మూడో భాగం : బాపురమణ గార్లు 30.10.2022

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు...

Ouça o podcast Harshaneeyam no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos