Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episódios

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.harshaneeyam.com

Autor

Harshaneeyam

Categoria

Arts

Site do podcast

www.harshaneeyam.com

Último episódio

11 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

పి.రామకృష్ణ గారి కథ - 'దయ్యం' 21.11.2020

 'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా. ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటో...

'నేతి గారెలు' కథ , కథానేపధ్యం - ఆచార్య కొలకలూరి ఇనాక్ 21.11.2020

హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఆచార్య ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం. సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి. కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వ...

మా బస్సు భాగోతాలు 14.11.2020

"ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?" "ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా" అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు.  "మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని" అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత...

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’ 01.11.2020

హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది. తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్త...

సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన 31.10.2020

హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన. ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది. ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు. తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , బాధ్యతలు నిర్వహించారు. గత మూడు దశాబ్దా...

కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి ' 30.10.2020

"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి . హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'. ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చే...

రావిశాస్త్రి గారి 'వర్షం' 25.10.2020

హర్షణీయానికి స్వాగతం. “ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది. తన రచనల...

'గోమెజ్ ఎప్పుడొస్తాడో' 24.10.2020

'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాద...

జన జీవన స్రవంతి 23.10.2020

జన జీవన స్రవంతి : చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే.   దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు .  చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా.  అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది.   ఎంసెట్...

శ్రీరమణ గారు - బంగారు మురుగు 18.10.2020

తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు. బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది. ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం. ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు....

దొంగ - తిలక్ గారి రచన 17.10.2020

తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి '  అమృతం కురిసిన రాత్రి  ' ఉత్తమ కవితాసంపుటిగా  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్...

'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి. 10.10.2020

తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష , సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్దహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిల...

హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి ఇంటర్వ్యూ పై అభిప్రాయాలు 01.10.2020

డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను ఆడియో ద్వారా మీరు వినవచ్చు. ఇంటర్వ్యూ లింక్ ని కూడా ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇదే పేజీలో...

హర్షణీయంలో పెద్దిభొట్ల వారి 'ఇంగువ'! 27.09.2020

https://harshaneeyam.in/2020/09/27/peddibhotla/ హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా....

'ఓ హెన్రీ స్టోరీ' - వెంకట్ శిద్ధారెడ్డి గారి 'సోల్ సర్కస్' కథాసంకలనం లోంచి! 22.09.2020

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది. వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్ట...

సుప్రసిద్ధ సినీ దర్శకులు 'వంశీ' గారి కథ 'ఏకాదశి చంద్రుడు' 20.09.2020

హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, 'ఏకాదశి చంద్రుడు' అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది. (ఈ కథ ఆడియో పై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి https://harshaneeyam.in/2020/09/20/ekadasi/) కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా. నేను చూసిన...

మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు! 20.09.2020

"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు. "తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు. "నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి" "చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ సైన్యాధ...

'వంశీ' గారి 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్' 19.09.2020

ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది. (ఈ కథపై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి. https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/) ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయ...

సాబువ్వ 14.09.2020

సాబువ్వ మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది. "కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే.. నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండు...

అమ్మూరు 14.09.2020

1976 వ సంవత్సరం - చిన్నా : " అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ.  " అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ.  "అమ్మా ! ఈ రోజు స్కూల...

డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి 'కాకులు గ్రద్దలు' కథ సంక్షిప్త రూపంలో 11.09.2020

'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు' కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు. ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక. కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ నరేంద్ర గారి కథ శిల్పవిశిష్టతను మ...

బెల్లం టీ 14.08.2020

A Story by Sri. Murali from his Blog 'Nemali Kannu" http://nemalikannu.blogspot.com/2009/12/blog-post_17.html yikKeWfiPocxqEy9L858 This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

ఓ అన్నార్థి గోల! 12.08.2020

రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా" "ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ" "ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో" "నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు" "అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను" "సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ" "రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అన...

పిల్లల్ని కనాలంటే? 09.08.2020

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-) 80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్ల...

అతిథి దేవోభవ! 08.08.2020

కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం.. ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ " ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!! పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా.. దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మ...

Ouça o podcast Harshaneeyam no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos