Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Autor

Raajh Shekhar

Categoria

Education

Site do podcast

podcasters.spotify.com

Último episódio

29 de fev de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

డబ్బు ఇచ్చే ప్రేమ, గుర్తింపు కావాలా? 21.05.2021

ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ప్రేమ గుర్తింపు వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న వారి ప్రేమ అభిమానాన్ని మనం గుర్తించకుండా, డబ్బుతో వచ్చే బూటకపు ప్రేమల కోసం పరిగెత్తడం మూర్ఖత్వం కదూ?

డబ్బు ఇచ్చే స్వాతంత్ర్యం కావాలా? 20.05.2021

ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ స్వాతంత్ర్యం వస్తుందనే భ్రమలో ఇప్పుడు ఉన్న డబ్బు ఇచ్చే స్వాత్రంత్ర్యం ని కూడా అనుభూతి చెందకుండా ఎప్పుడో అనుభవిస్తామనే భ్రమలో జీవిస్తాము. 

పగతీర్చుకోవాలా? 19.05.2021

మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు బాగా సంపాదించి అవతలి వారికి మనమేంటో నిరూపించుకునే ప్రయత్నంలో మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాము.

డబ్బు పవర్ కావాలా? 18.05.2021

మనం ఏ స్థాయి సంపాదన,డబ్బు కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఉంటే శక్తివంతులమవుతామనే భ్రమలో డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము.

డబ్బు ఎందుకు కావాలి? 17.05.2021

మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, మనం డబ్బు ఎందుకు కావాలని కోరుకుంటున్నామో అది మనకు అందుబాటులో లేని విషయంగానూ, అది అందుకునే ప్రయత్నం పోరాటం గానూ కనిపిస్తుంది.

డబ్బు సరిపోవట్లేదా? 16.05.2021

మనం ఏ స్థాయి సంపాదన కలిగి ఉన్నామనే దానితో సంబంధం లేకుండా, ఉన్న స్థాయిలో డబ్బు నిర్వహణ సరిగా చేయగలిగినపుడే మనం మరింత డబ్బు సంపాదన పొందగలుగుతాము.

unhappy మనీ 15.05.2021

మనం స్వీకరించేటపుడు మన బాధాకరమయిన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు వారి బాధవల్ల కలిగే భావాల సమాహారమే unhappyమనీ 

Happy మనీ 14.05.2021

మనం స్వీకరించేటపుడు మన సంతోషమైన భావాలు, ఇచ్చేవారు ఇచ్చేటపుడు సంతోషం కలిగే భావాల సమాహారమే Happy మనీ 

మీది ఏ మనీ? 13.05.2021

మనీ లో రెండు రకాలు. Happy మనీ, Unhappy మనీ. మీ దగ్గర ఉన్నది ఏ రకం?

వ్యూహాత్మకంగా నేర్చుకోవడం 12.05.2021

మన జీవితంలో ఉన్న అతి ముఖ్యమయిన భాగాలను గుర్తించి, వాటి మధ్య సమతుల్యం పాటిస్తూ వ్యూహాత్మకంగా నేర్చుకోవడం అన్నిటికంటే ఉత్తమమయిన విధానం

ఎన్నుకుని నేర్చుకోవడం 11.05.2021

మనకు కావలసిన విషయాలు ముందుగానే గుర్తించి, వాటి లోనే పూర్తి ఏకాగ్రతతో క్రమం తప్పకుండా, డబ్బు, శ్రమ,సమయం కేటాయించి నేర్చుకుంటూ ఉండటం.

నేను ఇంకా నేర్చుకునేది లేదు. 10.05.2021

సగం పని ఏదయినా ప్రమాదకారి. గొప్ప గొప్ప వాళ్ళు ఇంకా వాళ్ళు నేర్చుకోవలసినది ఉంది అని గుర్తించి నేర్చుకుంటూ ఉంటే, మనం సగం కూడా నేర్చుకోకుండా మనకు అంతా వచ్చేసింది అనుకోవడం మహా మూర్ఖత్వం.

నేను అన్నీ నేర్చుకుంటాను 09.05.2021

నేర్చుకోవాలని మనం ప్రయాణం మొదలు పెడితే, మహా సముద్రమంత విజ్ఞానం ఉంది. మనం అంతా నేర్చుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యం అయ్యే పని కాదు. అసలు మనం నేర్చుకోవడం వెనుక మన ఉద్దేశ్యం నేర్చుకున్న దానిని మన జీవితంలో మన నైపుణ్యాలలో భాగంగా చేసుకుని, మన జీవితం లో అభివృధ్ధి సాధించడం. నేర్చుకోవడంలోనే బిజీ అయిపోతే ఇక అమలు చేసేదెపుడు.

నేను నేర్చుకోను 08.05.2021

నేను నేర్చుకోను అన్నానంటే, నేను ఎదగకపోవడానికి రెడీ అయ్యానన్న మాట. నేటి పోటీ ప్రపంచంలో ఎదగట్లేదు అంటే, నేను వెనక్కి వెళుతున్నానన్నమాట.

Learning Stages 07.05.2021

నేర్చుకోవడంలో వివిధ స్థితులు. మీరు ఇందులో ఎక్కడ ఇరుక్కుని ఉన్నారు?

రెండవకరోనా కాలంలో జాగ్రత్తలు 06.05.2021

మొదటి కరోనా కంటే, రెండవ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. తీసుకోవాల్సిన కనీస ఆర్ధిక జాగ్రత్తలు.

Financial Blue Print ఎందుకు? 05.05.2021

నేటి ప్రపంచంలో ప్రతి వారూ వారి వారి కారణాల దృష్ట్యా మన కష్టార్జితాన్ని, వారి అధీనంలో లేక వారు కోరుకున్న చోట పెట్టుబడిగా పెట్టాలని వారి వారి మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటారు. నేడు మార్కెట్లో ఉన్న ఏ ఒక్క మార్గం మన అన్ని ఆర్ధిక అవసరాలను, భవిష్యత్తు భద్రతను ఇవ్వలేదు. మన జీవితం మన డబ్బు కాపాడుకోవడం మన బాధ్యత.

మీ విలువ ఎలా పోతుంది? 05.05.2021

మనకు తెలియకుండా, మూడవ వ్యక్తి ముందు మనం మన వ్యక్తి ని తేలికగా మాట్లాడితే, విన్న వ్యక్తి మన మనిషిని తేలికగా చూడటంతో మొదలు పెడతాడు. చుట్టు తిరిగి మనల్ని కూడా తేలికగా చూస్తాడు. ఇతరుల ముందు మన క్లోజ్ మనుష్యుల గురించి మాట్లాడేటపుడు, మాటలు జాగ్రత్తగా వాడండి.

బౌన్స్ బ్యాక్ లో మూడవ & ముఖ్యమైన అడుగు. 04.05.2021

అంతకు ముందు ఉన్న స్థాయిని మరిచిపోయి తిరిగి మొదలు పెట్టడం మనకు, మనను చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. సిగ్గు, బిడియం, పరువు, మర్యాద లాంటి భావాల జోలికి పోకుండా, తిరిగి లేవడానికి ఏది అవసరమయితే అది చేయడానికి, అంతకుముందు ఉన్న స్థితిని మరిచిపోయి ఆలోచించగలగాలి. అప్పుడే మార్గం సులువవుతుంది.

బౌన్స్ బ్యాక్ లో రెండవ అడుగు 03.05.2021

నేను మళ్ళీ ఇంతకు ముందు ఉన్న స్థానానికి తిరిగి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడం రెండవ అడుగు. ఇది దాటితే కానీ మనం ముందుకు పోలేము.

బౌన్స్ బ్యాక్ లో మొదటి అడుగు 02.05.2021

నేను ఓడిపోయాను అని ఒప్పుగోగలగడమే మొదటి అడుగు. ఇది దాటితే కానీ మనం ముందుకు పోలేము.

పడిపోయారా? ఓడిపోయారా? 01.05.2021

పడితే ఓడి పోయినట్లు కాదు, తిరిగి లేవడానికి సిధ్ధ పడకపోతే అప్పుడు ఓడిపోయినట్లు

ఇది మీకు తెలుసా? 30.04.2021

నిన్న రాత్రి మనతో పాటుగా నిద్ర పోయిన వారిలో దాదాపు 30 వేల మంది ఈ రోజు మనతో పాటు నిద్ర లేవలేదు. అంటె మనకు దైవం ఈ రోజుని ఏదో ఒక ప్రయోజనాన్ని (మనకైనా ఇతరులకైనా) కలిగించమని ఇచ్చినట్లు భావించగలిగితే జీవితమే సార్ధకమవుతుంది.

మీ ఆర్ధిక ఎదుగుదల ఆగిందని గమనించారా? 29.04.2021

నైపుణ్యపు ఎదుగుదల ఆగిందంటే ఆర్ధిక ఎదుగుదల ఆగిందన్నమాటే. ఆర్ధిక ఎదుగుదలను మనం నియంత్రించాలంటే, మన నైపుణ్యపు ఎదుగుదలను నియంత్రించాలి. ఇది ఎంత పెరిగితే సంపాదన అంత పెరుగుతుంది. ఇంతకీ మీరు ఎక్కడ ఆగిపోయారు?

స్వీయ విధ్వంసం 28.04.2021

ఎంతటి అద్భుతమైన సందర్భలోనైనా ఏడవడానికి ఒక కారణం వెతుక్కోగల నైపుణ్యం మీకు ఉందా? అందులో కొందరు వరల్డ్ చాంపియన్స్.

Ouça o podcast Daily Money Dose By Money Guru Raajh Shekhar no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos