Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episodes

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Author

Harshaneeyam

Category

Arts

Podcast website

www.harshaneeyam.com

Latest episode

Jul 11, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి! 05.04.2020

ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప...

ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి! 03.04.2020

నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం. వాళ్ళలో ఒక పిల్లవాడు బహు నేర్పరి అనుకుంటా, చిన్న పిల్ల లు వాడిని బతిమాలుతున్నారు, అన్నా మా పట...

నాకున్నూ, నా పిల్లలకున్నూ, ఓ రోజు జరిగిన సంభాషణ! 03.04.2020

నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు. ఒక రోజు చిన్నది వచ్చి , 'నాన్నా, నాకీ మధ్య అబ్బాయిలతో మాటలాడటం ఉత్సుకత గాను, అమ్మాయిలతో మాటలాడడం విసుగ్గాను వుంది. అమ్మాయిలు ప్రతి దానికి ముఖం మాడ్చుకుంటూ వున్నారు. అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ, మాట్లాడడాన...

నేను, నా మనవడూ! 02.04.2020

మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు. వాడు ఉదయాన్నే తాతా! కాఫీ తాగుతావా అంటూ వచ్చేసేవాడు. అప్పటి నుండి నేను ఆఫీసుకు వెళ్లే వరకూ నేను వాడితోనే ఆటలు. ఒక రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గ నాకటం మెదలు పె...

మా అమ్మ తప్పిపోయింది, నా చిన్నప్పుడు! 02.04.2020

అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏందిరా బాబూ అని చిన్ననాటి నుండి డౌట్ కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన...

మా లాటి ఎర్ర బస్సు జంటను, ఎక్కడన్నా కాంచారా! 02.04.2020

నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను. ట్రాఫిక్ వున్నా స్మూత్ గా కదులుతుంది ప్రయాణం, వెనక, ముందూ, పక్కల చూసుకుంటూ వెళ్తున్నా, ఎంతైనా కొత్త కదా. ఇంతలో సు...

మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు! 02.04.2020

అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా  కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని. దానిక...

క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే! 02.04.2020

నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఏదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి. మీ ఎదురుదాడికి తయారయిపోతూ, ఈ కింద కథను ప్రచురిస్తున్నా, కొంచెం గుండె గాభారాతో మరికొంచెం నా ఏభై కథల గమ్యానికి చేరాలన్న...

చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న 31.03.2020

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట...

మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా! 29.03.2020

మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే. మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ...

ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే! 28.03.2020

మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్...

అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా ! 28.03.2020

ఒరే హర్షాగా!  "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. "పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది...

మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు! 28.03.2020

మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్...

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె! 28.03.2020

ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ 31 వ తేదీ సాయంత్రం ఐదున్న...

స్పర్ధయ వర్ధతే విద్య! 27.03.2020

ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని. మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా చురుకుగా ఉ...

స్నేహనాథుడు మా రఘునాథుడు! 27.03.2020

మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది. నేను అదే పనిగా మా పెదపుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాల స్నేహితుల, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల స్నేహితుల, మా వాకాటి ఇంజనీరింగ్ స్నేహితుల గూర్చి రాస్తుంటే తాను నా రాతల్లోని యాంత్రికతను తట్టుకోలేక పై స...

ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం! 27.03.2020

మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు ము...

లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం! 27.03.2020

నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా తాత గారు కూడా అక్కడ ఫి...

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి! 27.03.2020

నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గాన...

మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు! 27.03.2020

నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది...

ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది! 27.03.2020

మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని. ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల...

గడ్డు కాలంలో నాతో నేను! 27.03.2020

ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని....

మా పంచింగ్ ఫలక్ నామ! 27.03.2020

నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది. బయట ఎక్కడా దొరకటంలా. కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు. అలా రోజూ ఎక్కిచ్చుకోలేక ఆ కస్టమర్ కి పని చేసే ఇంకో మా మేనేజర్ నా దగ్గర కొచ్చి,...

మా గిరిజక్క పిచ్చి చిట్టాలు! 27.03.2020

"మా నాయన పేరు మీ పేరు ఒకటే, సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను" అంది మా పక్కింటి గిరిజక్క , మా నాన్నతో.  " సరేనమ్మా నువ్వు ఆర్డర్ వేసింతర్వాత , కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా" అన్నారు నాన్న.  మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్ భార్య గిరిజక్క. ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు.  "ఏమే! మాధవీ, వాసవీ, ఇకనుంచీ...

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా! 27.03.2020

నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే...

Listen to the Harshaneeyam podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.