Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episodes

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Author

Harshaneeyam

Category

Arts

Podcast website

www.harshaneeyam.com

Latest episode

Jul 11, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

తాత రాత 04.08.2020

"చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు" ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో, డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల. క...

నేనెక్కాల్సిన బస్సు! 31.07.2020

"అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు" ? మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర . ఎండాకాలం . హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న. “ ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!" "లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా , నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస...

ప్రణవం ప్రణయం పరిణయం 31.07.2020

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది. ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపిం...

లీలా కాలనీ 26.07.2020

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది.. డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ. "మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ? "బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ? తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల...

పెద్దంతరం - చిన్నంతరం 26.07.2020

"కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!" "ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!" "కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!" "ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!" నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన చేయి పట్టు...

అర్థాంతర ప్రయాణాలు. 25.07.2020

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు. కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, "వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ". అలా ఓ నాలుగు చేతులు మారాక, "ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అను...

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు! 23.07.2020

  నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాల...

చిన్నీ వాళ్ళ చంద్రత్త! 19.07.2020

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న. "నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని. నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు....

దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే! 16.07.2020

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ...

పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ! 13.07.2020

మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది. అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, "మన జీవితాల్లో కథ నాయికా నాయకులు" అని ముచ్చట...

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా 'జాతక' కథ! 13.07.2020

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను. మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు. అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు. మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు. నేను రా...

నేను, నా ఉషాయణం! 09.07.2020

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే, పక్క వాళ్ళవి తోసేసి అయిన...

పాపం, మా సీన మావ! 07.07.2020

నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం. అలా వూరి మీద పడి తిరిగే మా సీన మామని కనపడ్డోళ్లంతా ఆపి, అబ్బయ్య నువ్వు మా బాబయ్య కొడుకువి కదా, ఎప్పుడొచ్చినావు అంటూ తెగ పలకరిచ్చే వాళ్ళు. ఊర్లో పడి తిరిగే నాకు యింత...

మా ఉలవపాళ్ళ స్వామి! 06.07.2020

నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగ...

నవ్వితే నవ్వండి 03.07.2020

హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం. ఈ శీర్షికన, మా ప్రథమ అతిధి గా విచ్చేసిన , శ్రీయుతులు బులుసు సుబ్రహ్మణ్యం గారి మా హార్దిక స్వా...

మనసున్న మారాజు! 30.06.2020

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్. మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండ...

మా విజయ్ - "అన్న" 28.06.2020

చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన. అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి. ఆయన్ని చివరి సారి నేను చూసింది నేను 10th క్లాస్ లో వున్నప్పుడు, ఇదే వూర్లో . నా ముందున్న ఫైల్ మీద రాసుంది ఆయన పేరు, సంజీవరావు అని. కావాలని ఒక రెండు గంటలనించి ఆయనని, నా గురించి వెయిట్ చేయిస్తున్నా. నవంబర్ నెల కావడంతో, పెన్షన్ తీసుకొనే సీనియర్ సిటిజన్స్, "లైఫ్ సర్టిఫికెట్' కోసం మా ఆఫీస్ కి వస్తారు,...

మా స్నేహ రమణీయం! 23.06.2020

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స...

తరలి రాద తనే వసంతం 21.06.2020

'తరలి రాద తనే వసంతం' అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది. నేను పాడుతుంటే ఇళయరాజా చేతులూపడం మానేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరసలో కూర్చుని తల తెగ ఊపేస్తున్నారు. ఇంతలో ఎక్కడో కోరస్ మధ్య లోంచి, మా ఆవిడ గొంతు, ఇంక పాడింది చాలు నిద్ర లోంచి లెమ్మని. కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ , ఆ పక్కనే ఆ రింగ్ టోన్ తో మ...

కలడు కలం డనెడు వాడు? 16.06.2020

తారీఖు నవంబర్ 7 , సంవత్సరం 1990 . నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం. వాళ్లలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా లో పని చేసిన , చేస్తున్న ఉపాధ్యాయులు. హాల్లో అంతా పండగ వాతావరణం. ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజా నాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్ర లోనే మొదటి సారి అయివుండవచ్చు. ఆ రోజు, మేమంతా 'మా రెడ్డి గారు' అని, ప్రేమగా పిల్చుకునే భక్త వత్సల రెడ్డి గారి షష్టి పూర...

ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్! 13.06.2020

ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే. ఆత్మకథ లేక స్వీయ చరిత్రను ఆంగ్లములో మొదటగా వ్రాసిన తెలుగువారు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు గారు. వారి జీవ యాత్రా చరిత్రలో భాగం గానే వారి కాశీ యాత్రను గురించి వ్రాశారు. దాదాపు అదే దశాబ్దం లోనే వారి బంధువైన, శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీ యాత్ర చరిత్రను లేఖలు రూపంలో తన చెన్నపట్నం స్నేహితులైన శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివ...

సన్నిధానం! 11.06.2020

ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ. లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు. ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు. క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం. వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట. అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ...

మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా! 10.06.2020

ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథ విని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా. మొదలుగా గుర్తు చేసుకోవాల్సింది కమ్యూనిజంకి అసలు సిసలు అర్థం చెప్పి జనాల సేవే, జనార్థన సేవ అనుకొని మ...

మా జి.వి.ఎస్ మాస్టారు గారు! 07.06.2020

జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు  మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త,  విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు. నాకున్న తెలుగు తెగులు ఆయన నుంచే తగులుకుంది అని నా అనుమానం. బడిలో విన్నది చాలక ఆయన గొంతు విందామని ఆయన దగ్గరకి ట్యూషన్ కూడా వెళ్ళే...

మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు! 06.06.2020

చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని. వెంటనే మా అన్న, "నాకు గులాబీ జామున్ కావాలి", అనే వాడు.  మా అక్క పాపం కొంచెం తక్కువ ఆశ కలది అయ్యి, "నాకు మినప వడలు మరియు పులుసు అన్నం కావాలి", అనే కోరిక వెలి బుచ్చెడిది. మరి నేను తక్కువ తిన్నానా, "ఊహు! నాకు  ఖచ్చితం గా సుకీ లు కావాలి" అనే వాడి...

Listen to the Harshaneeyam podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.