Harshaneeyam

Harshaneeyam

Arts EN ↓ 534 episodes

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Author

Harshaneeyam

Category

Arts

Podcast website

www.harshaneeyam.com

Latest episode

Jul 11, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన ! 02.04.2021

 నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'. ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం...

మందలపర్తి కిశోర్ గారి సమీక్ష - 'తోటి వేటగాళ్లు' కథపై 28.03.2021

తోటి వేటగాళ్లపై మందలపర్తి కిషోర్ గారి సమీక్ష This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'తోటి వేటగాళ్లు' కేఎన్వై పతంజలి గారి కథ! 28.03.2021

'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది. ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/patanjali-sahityam-1 తోటి వేటగాళ్లు కథపై శ్రీ మండలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు. తోటి వేటగాళ్ళు ! బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.  దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్...

'సచ్చి సాదించడం' - ఎండపల్లి భారతి గారు 20.03.2021

'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు. ............................................................................................................................................................................... మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముం...

Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ' 20.03.2021

ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు. ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi “టేపులో నీ పాట తీసే...

Part I - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ' 19.03.2021

మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే, అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప...

'ద్రణేవుడు' పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ 13.03.2021

హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా....

పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ? 07.03.2021

ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్...

హర్ష రాసిన ‘ఎండమావి’ – 'సారంగ' పత్రిక నుంచి! 06.03.2021

ఈ కథ ‘ ఎండమావి’ హర్ష రాసింది , సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. కథ చదవడానికి –  https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/ ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే – https://gaana.com/podcast/harshaneeyam-season-1 స్పాటిఫై యాప్ లో వినాలంటే – http://bit.ly/harshaneeyam  (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూ...

ఎండపల్లి భారతి గారి 'ఎదారి బతుకులు' పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష! 06.03.2021

ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు. ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు. 'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDj This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'నారింజ రంగు సిరా మరకలు' పార్ట్ II -కథా -సమీక్ష 27.02.2021

ఈ ఎపిసోడ్లో , 'నారింజ రంగు సిరా మరకలు ' కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'నారింజ రంగు సిరా మరకలు' - మహి బెజవాడ ! పార్ట్ - I 27.02.2021

రచయిత పరిచయం: వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక స...

వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ! 15.02.2021

ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట) 'పొగడ పూలు': గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు. రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి. యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు...

'నల్లగొండ కథలు' కథాసంకలనం పై కొన్ని అభిప్రాయాలు 21.01.2021

'నల్లగొండ కథలు' కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత 'మునికాంతపల్లి' విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి. 16.01.2021

ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం. 2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి హృద్యంగా మనకందించినవి. ఈ పుస్తక...

'మునికాంత పల్లి కథలు' - ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గార్ల అభిప్రాయం 15.01.2021

సొలోమోన్ విజయ కుమార్ గారి 'ముని కాంత పల్లి కథలు' వీటిపై , ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గారి అభిప్రాయాన్ని , హర్షణీయం అభ్యర్థించడం జరిగింది. తమ అభిప్రాయాన్ని అందజేసినందుకు , వారికి కృతజ్ఞతలు. ఇజియా గారూ ..Hearty Congrats... This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ' 14.01.2021

*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు. 'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది. ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగ...

రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం 13.01.2021

రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది. • ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు. **’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. –  http://amzn.to/3bFv5W2 . కథనం: చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప...

గ్యాపకాలు 03.01.2021

"భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు. లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వ...

'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ 20.12.2020

ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది. కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది. శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది. ఆర్వీచారి కరెంటు బిల్లు: లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్...

'ఇల్లు'! 06.12.2020

ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది. చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను అందులోకి చేర్చ...

'నా పేరు సొంబరా' - కథానేపధ్యం - మల్లిపురం జగదీష్ గారు. 02.12.2020

'నా పేరు సొంబరా' కథపై ముందుగా మిత్రుడు రవికాంత్ వ్యాఖ్య, తరువాత , రచయిత జగదీష్ గారి కథానేపధ్యంపై వివరణ వినండి. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

శ్రీరమణ గారి 'మిథునం' - ఫణి డొక్కా గారి స్వరాన! 02.12.2020

కథ పేరు 'మిథునం'. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ. సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు. ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది. ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు ఫణి...

'వడ దెబ్బ'! 28.11.2020

 కథ పేరు 'వడ దెబ్బ'. వడ దెబ్బ “వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు. గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు. ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు. "బండ వ...

'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు 27.11.2020

హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా' ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.) ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యా...

Listen to the Harshaneeyam podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.